ఏపి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను మరో వివాదం చుట్టు ముట్టుకుంది. ఈఎస్ఐ కుంభకోణంలో 14వ నిందితుడైన కార్తీక్ మంత్రి గుమ్మనూరు కుమారిడికి బెంజి కార్ బహుమానం ఇవ్వడంలో అంతర్యం ఏమిటని మాజీ మంత్రి , తెదేపా నేత అయన్న పాత్రుడు బహిరంగంగా దుయ్యబట్టారు. ఈఎస్ఎ కుంభకోణంలో నిందితుడు కార్తీక్ మంత్రికి బినామీగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు వ్యాఖనించడం సంచలనం రేపుతుంది. ఇటీవలే మంత్రి స్వ గ్రామమైన గుమ్మనూరులో భారీగా పేకాట దందా నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి వాటిని బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా నగదుతో పాటు 35 కార్లు, 39 మందిని అరెస్టు చేశారు. కాగా మంత్రి ఇలాఖాలో పేకాట డంపు బహిర్గతం కావడంతో గుమ్మనూరు కుటుంబ సభ్యుల నేతృత్వంలోనే ఈ దందా జరుగుతుందని వివిధ రాజకీయ పార్టీలతో పాటు నేతలు దుయ్యబట్టారు. ఈ వివాదం మంత్రికి తలపోటుగా మారగా, ఇదే క్రమంలో ఇటాలీ భూముల కొనుగోలు వ్యవహారం ఆయనకు మరో తలపోటుగా మారింది. ఇలా ఇప్పటికే అనేక వివాదాలతో మంత్రి సతమతమవుతుండగా, తాజాగా మరో వివాదం చుట్టుముట్టింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయన్నపాత్రుడు మంత్రి గుమ్మనూరుపై ఊహించని అరోపణలు చేశారు.

ముఖ్యంగా ఈ ఎప్ స్కాంలో 14వ నిందితుడిగా ఉన్న కార్తీక్ అనే వ్యక్తి మంత్రి జయరాం కుమారుడికి బెంజికార్ బహుమతిగా ఇచ్చాడని అయ్యన్నపాత్రుడు విజయవాడలో సంచలన వ్యాఖలు చేయడం ప్రస్తుతం రాష్ట్రంలోనే ఇది హాట్ టాపిక్ గా మారింది. ఏ సంబంధంతో కార్తీక్ కారును కానుకగా ఇచ్చారో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఏ 14 అయిన కార్తీక్ మంత్రి జయరాంకు బినామీగా ఉన్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఈఎన్ఏ కుఱకోణంలో ఏ 14 నిందితుడైన కార్తీక్ గుమ్మనూరు కుమారుడు జన్మదినోత్సవం రోజున బెంజీ కారు బహుమతిగా ఇవ్వడం వీటిని మరింత బలపరుస్తుందన్నారు. డెలీవరి తీసుకున్న బెంజ్ జిఎల్‌ఎస్ 350 కారు కానుకగా ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే ఈ ఎన్ఏ కుంభకోణం మూలాలు వైకాపాకి చెందిన మంత్రి జయ రాం దగ్గర తేలుతాయన్నారు. ఈ విషయం మీద ఆలూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆలూరులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేస్ బుక్ లో తన కుమారుడు ఫోటో దిగిన బెంజీకారు తన కుమారిడిది కాదన్నారు.

వేరేవాళ్ల కారు ప్రక్క ఫోటో దిగారు అంతేనన్నారు. హెలిక్యాప్టర్ , ట్రైన్ వద్ద ఫోటో దిగితే అది మనదే అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. కారు తమదే అని రుజువుచేస్తే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం సవాల్ విసరడం గమనార్హం. అయితే మంత్రి చాలంజ్ పై ఈ రోజు అయ్యన్నపాత్రుడు స్పందించారు. మరిన్ని ఆధారాలు చూపిస్తూ ఈ రోజు మీడియా సమావేశం పెట్టారు. మంత్రి మాట్లాడుతూ, కేవలం ఆ కార్ డెలివరీ మాత్రమే తన కొడుకు తీసుకున్నాడని, తన కొడుకు ఫాన్స్ ఎవరో అడిగితే అలా చేసారని, ఆ కార్ తో మాకు సంబంధం లేదు అంటున్నారని, మరి ఆ కారు వేసుకుని, అన్ని చోట్లా తిరుగుతున్న ఈ వీడియోలు ఏమిటి, కారు పై ఎమ్మెల్యే స్టిక్కర్ ఏమిటి అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. దీనికి సంబంధించి, వీడియో, ఫోటోలు ప్రదర్శించారు.

విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం(దుర్గగుడి) రథంలో మూడు వెండి సింహాలు ఈ ఏడాది మార్చి తర్వాతనే మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. గత మార్చిలో లాక్ డౌన్ విధించిన సమయంలో వీటిని చోరీ చేసి ఉండొచ్చని పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క-రో-నా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి ఆఖరి వారంలో ఉగాది ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని రథం తదితర వస్తువులకు పాలిష్ పెట్టే కాంట్రాక్టరు వీటిని పరిశీలించినట్లు పోలీసు విచారణలో రూఢీ అయ్యింది. దుర్గగుడి అధికారుల ఫిర్యాదు మేరకు రథంలోని మూడు వెండి సింహాల మాయంపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నుంచి దర్యాప్తను ముమ్మరం చేశారు. విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం నేరపరిశోధన విభాగం (క్రైం) డీసీసీ కోటేశ్వరరావు మూడు సింహాలు మాయమైన రథాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులకు చేరింది. వెండి, బంగారు, ఇత్తడి తదితర వస్తువులకు పాలిష్ పెట్టేందుకు శ్రీ శర్వాని ఇండస్ట్రీస్ సంస్థకు నెలకు రూ.47 వేలకు కాంట్రాక్టు ఇచ్చారు. వీరి నుంచి వెంకట్ అనే వ్యక్తి సబ్ కాంట్రాక్టు తీసుకొని పాలిష్ పనులు చేపడుతున్నారు.

ఉగాది ఉత్సవాల్లో వెండి రథంఅవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పక్షం రోజుల ముందు రథం పరిశీలించిన వెంకట్ పాలిష్ వ్యవహారంపై ఆలయం గోల్డ్ అప్రెజర్ డీ. షమ్మీకి ఫోన్ చేసి చర్చించారు. పోలీసుల విచారణ సందర్భంగా షమ్మీ ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే సబ్ కాంట్రాక్టర్ వెంకటను విచారించేందుకు పోలీసు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుబాటులో లేకపోవడంతో పాటు మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో అతను వస్తే కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా క-రో-నా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఆలయాల్లోకి భక్తులను అనుమతించ లేదు. కేవలం అధికారులు, ఆలయ సిబ్బంది సమక్షంలోనే ఆలయాల్లో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. జూన్ 10వ తేదీ నుంచి మాత్రమే భక్తులకు అనుమతించినందున ఆ మధ్యలోనే వెండి సింహాలు చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగా దర్యాప్తు వేగాన్ని పెంచిన పోలీసులు తొందరలోనే నిందితులను గుర్తించి పట్టుకుంటామని చెపుతున్నారు. గత కొద్ది రోజులుగా గత ప్రభుత్వ హయాంలో కూడా చోరీకి గురై ఉండే అవకాశం ఉందని ప్రకటనలు చేసిన అధికార పార్టీ నేతలు మార్చి తర్వాతనే ఘటన చోటు చేసుకున్నట్లు నిర్ధారణ కావడంతో మిన్నుకుండిపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై రెండు సార్లు వ్యాట్ పెంచిన వైసీపీ ప్రభుత్వం, తాజాగా మరో రూపంలో బాదుతూ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఉన్న వ్యాట్, టాక్సులకి అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున, ప్రతి లీటర్ పెట్రోల్, అలాగే హైస్పీడ్ డీజిల్‌ మీద, ప్రతి లీటర్ కు రూపాయి పెంచుతూ, ఆదేశాలు ఇచ్చింది. ఇది సెస్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రతి డీలర్ నుంచి, ఈ మొత్తం వసూలు చేస్తారు. అయితే ఈ వసూలు చేసే సెస్ ని, రాష్ట్రంలో రోడ్డుల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారని ప్రభుత్వం చెప్తుంది. ఈ పెంచిన సెస్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వానికి 600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అంటే, ఈ 600 కోట్లు ప్రజల పై భారం అనమాట. అధికారంలోకి రాగానే, ప్రమాణ స్వీకర వేదిక పై నుంచి, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటికి రెండు సార్లు వ్యాట్ పెంచారు. దాని వాళ్ళ 2 రూపాయల వరకు లీటర్ కు అదనపు భారం పడుతుంది.

ఒక వేళ కేంద్రం రేట్లు తగ్గించినా, ప్రభుత్వం పెంచిన వ్యాట్ మాత్రం అలాగే ఉంటుంది. ఇక ఇప్పుడు దీనికి తోడు లీటర్ కు ఈ రూపాయి సెస్ అదనం. అంటే జగన్ మొహన్ రెడ్డి వచ్చిన తరువాత, ఇప్పటి వరకు ప్రజల పై మూడు రూపాయల వరకు అదనపు భారం పడుతుంది. రోజుకి రెండు లీటర్లు వాడే వారు ఉన్నా, నెలకు 180 రూపాయల వరకు అదనపు భారం, ఏడాదికి, రెండున్నర వేలు అధిక భారం. ఇక ఈ పెంపు భారం మనం వాడే వాహనాల పైనే కాదు, బస్సు చార్జీలు, అటో చార్జీలు పై పడుతుంది. రవాణా చార్జీలు అంటూ, మనం వాడే ప్రతి నిత్యవసర వస్తువు పైనా, భారం పడుతుంది. ఇలా అనేక నష్టాలు ఉంటాయి. అయితే ఇప్పుడు పెంచిన సెస్ రహదారుల అభివృద్ధి అంటున్నారని కానీ, ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ లో, కేంద్రం కూడా రహదారులు కోసం పెద్ద ఎత్తున డబ్బులు కేటాయిస్తుంది. మరి ప్రభుత్వం, ఈ పెంచిన సెస్ తో మరిన్ని రహదారులు అభివృద్ధి చేస్తుందా ? చూద్దాం

ఏపీకి సంబంధించిన ప్రధాన సమస్య అమరావతి అంశం పక్కదారి పట్టింది. ఈనెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో అమరావతి సమస్యను కేంద్ర ప్రభుత్వంతో పాటు, యావత్ భారతదేశానికి పార్లమెంటు సాక్షిగా మరోమారు తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు సిద్ధమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా 33వేల ఎకరాలు భూములిచ్చిన 28వేల మంది రైతులు దాదాపు 275 రోజులుగా చేస్తున్న పోరాటాలు, మరోప్రక్క వైసీపీ ప్రభుత్వం రైతులపై సాగిస్తున్న వేధింపు చర్యలు, శాసనమండలి రద్దు ప్రతిపాదనలు.. వివిధ అంశాల్లో అనుసరిస్తున్న నియంతృత్వ వైఖరి.. కోర్టుల్లో వరుస మొట్టికాయలను పార్ల మెంటు సాక్షిగా వెలుగులోకి తెచ్చి ఎండగట్టాలని టీడీపీ పార్లమెంటరీ సభ్యులు భేటీలో నిర్ణయించారు. అమరావతి జేఏసీ సైతం పార్లమెంటు సభ్యులందర్నీ కలసి మూడు రాజధానుల పేరుతో అమరావతిని ఖూనీ చేసి రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వివరించాలని నిర్ణయించింది.

కాని ఈ అంశాలేవీ పార్లమెంటులో ప్రస్తావనకు రాకముందే వైసీపీ వ్యూహాత్మకంగా వాటిని పక్కదారి పట్టించేలా అమరావతి రాజధాని పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్, పైబర్ గ్రిడ్ పేరుతో మరో కుంభకోణం జరిగిందని, వీటిపై సీబీఐచే విచారణ జరిపించాలంటూ ఉభయసభల్లో ప్రస్తావనకు తెచ్చింది. వీటితో పాటు గతంలో ఎన్నడూలేని విధంగా న్యాయవ్యవస్థ సైతం పక్షపాతంగా వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుందని, కేంద్రం జోక్యం చేసు కోవాలంటూ వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. వాస్తవానికి ఈ అంశాలపై గురువారం ఉభయసభల్లో మాట్లాడడానికి అవకాశం లేనప్పటికీ వైసీపీ ఎంపీలు వ్యూహాత్మకంగా ప్రస్తావించారు. అలాగే తర్వాత పార్లమెంటు వెలుపల సైతం అమరావతి భూకుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ ఎంపీలు ధర్నా చేశారు. రాజ్యసభలో కరోనా అంశంపై చర్చలో భాగంగా వచ్చిన అవకాశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. ఇలా మొత్తానికి అమరావతి విషయం ప్రస్తావనకు రాకుండా, మూడు ముక్కల రాజధాని గురించి పార్లమెంట్ లో ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు.

Advertisements

Latest Articles

Most Read