వైద్యం... ఈ రోజుల్లో ఎంతో విలువైనది... ముఖ్యమైనది... అంతకు మించి ఖర్చు తో కూడుకున్నది. పాలు నుంచి ఆహారం వరకు అన్ని వస్తువుల్లో కలీలు, కలుషిత వాతావరణం నేపథ్యంలో ప్రాణాంతక వ్యాధులు ప్రజల్ని కకావికలం చేస్తున్నాయి.

మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు, ఏదన్నా జబ్బు చేస్తే, వణికిపోయే పరిస్థితులున్నాయి. అందుకు వైద్య ఖర్చులే ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వైద్య భరోసా పథకాలు కల్పించాక పేద ప్రజలు, ఉద్యోగులు. కొంతవరకు నిశ్చింతగా ఉన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్య భరోసా కార్డు వెంట తీసుకుని వెంటనే చూపించుకునేందుకు వెళ్లిపోతున్నారు. అదే మధ్యతరగతి కుటుంబాల విషయానికి వస్తే నగదు చేతిలో ఉంటేనే వైద్య భరోసా, లేదంటే వారి పరిస్థితి ఆందోళనకరమే.

అందరికీ వైద్యంలో భాగంగా ఎగువ తరగతి కుటుంబాలకు కూడా వైద్య భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరే రాష్ట్రంలో లేని విధంగా వారికి వైద్యపరమైన బీమా కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేటు బీమా పాలసీల పాటు ఇప్పటికే ప్రభుత్వం అమలుచేస్తున్న వైద్య బీమా పథకాలతో పోల్చితే ఆరోగ్య రక్ష పథకంలో ఎన్నో అదనపు ప్రయోజనాలున్నాయి. పథకంలో ఎందుకు చేరడం, ఎలా చేరాలి ? వైద్య భరోసా ఏంటి? అదనపు ప్రయోజనాలు ఏంటనే విషయాలు తెలుసుకుందాం

అసలు ఏంటి ఈ ఆరోగ్య రక్ష పధకం ?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం కోసం ప్రవేశపెట్టిన "డా. ఎన్.టి.ఆర్.వైద్య సేవ", "ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం", "పాత్రికేయుల ఆరోగ్య సంరక్షణా పథకం" తో పాటుగా ఆ మూడు పథకాలలో లబ్దిపొందలేని వారి కోసం ఆరోగ్య రక్షను ప్రవేశపెట్టారు.

ఆరోగ్య రక్ష పథకం ద్వారా సంవత్సరానికి మీ కుటుంబములోని పిల్లల నుండి పెద్దల వరకు ఒకొక్కరికి కేవలం రూ.1200/-మాత్రమే చెల్లించి దరఖాస్తు చేసుకొని హిల్త్ కార్డును పొందవచ్చు. హిల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరమునకు రూ.2 లక్షల వరకు వైద్య సహాయము పొందవచ్చు.

ప్రైవేటు బీమా పధకాలతో పోలిస్తే ఎన్నో ప్రయోజనాలు. ఇవి తప్పుకుండా తెలుసుకోండి....

  • ప్రైవేటు బీమా కంపెనీల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది
  • ప్రైవేటు బీమాలో వయస్సు పరిమితులు కూడా ఉంటాయి. వైద్యని ధ్రువీకరణతోనే ప్రీమియంలోకి చేర్చకుంటారు
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య బీమా కల్పించాలంటే ప్రీమియం ఎంతో ఎక్కువగా ఉంటుంది.
  • ఆరోగ్యరక్ష పధకంలో ఇలాంటి ఆంక్షలు ఉండవు. వయస్సు, వ్యాధి తీవ్రత పరిగణనలోకి రావు
  • ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద కుటుంబమంతటికి ఏడాదికి రూ.2.5 లక్షల వైద్య బీమా ఉంటే ఆరోగ్య రక్షలో చేరిన ప్రతి వ్యక్తికి రూ.2 లక్షల వైద్య బీమా ఉంది.
  • ప్రైవేటు బీమా కంపెనీల్లో గుండె, కిడ్నీ సంభందిత వ్యాధులకు బీమా కల్పించవు. ఆరోగ్యరక్షలో ఆ వ్యాధులకు కూడా ధీమా ఉంది
  • రక్తపోటు, మధుమేహం వ్యాధులకు చికిత్స కూడా ఇందులో కవర్ అవుతుంది
  • ప్రైవేటు వైద్య బీమా సౌకర్యం వినియోగించుకోవాలంటే ఏడాదికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ ఆరోగ్యరక్షలో రూ.2 లక్షల నగదు ఖర్చయ్యే వరకు ఎన్నిసార్లయినా వైద్య సేవలు పొందవచ్చు
  • ఆరోగ్య రక్ష పధకంలో సభ్యులుగా ఉన్నవారు ఎటువంటి డబ్బు చెల్లించే అవసరం లేకుండా నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్షారణ పరీక్షలు, మందులు, వైద్యంతో పాటు భోజనం ఉచితంగా పొందవచ్చు.
  • డిశ్చార్జ్ అయ్యే సమయంలో 11 రోజులకు సరిపడా మందులను ఉచితంగా పొందవచ్చ మిగిలిన బీమా పధకాల్లో ఈ సౌకర్యం లేదు.
  • ఆసుపత్రి నుంచి వెళ్లిన అనంతరం కూడా 138 రకాల వ్యాధులకు ఏడాది పాటు మందులు పొందవచ్చు
  • ప్రైవేట్ వైద్య బీమాలో చేరితే ప్రీమియం చెల్లింపుల నుంచి కంపెనీతో సంప్రదింపులకు కొన్ని ఇబ్బందులున్నాయి. అదే ప్రభుత్వ బీమా పధకం కావడంతో మండలస్థాయిలో సంప్రదింపులు సులభంగా చేసుకోవచ్చు
  • మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రల వద్ద ఆరోగ్య రక్ష పధకంతో పాటు వాటి ప్రయోజనాలు, నెట్వర్కు ఆస్పత్రుల పూర్తి సమాచారం అందుబాటులో ఉంది.
  • జ్వరం నుంచి దీర్ఘకాలిక వ్యాధులకు శస్త్రచికిత్పల వరకు బీమా పరిధిలోకి వచ్చే నగదుతో అన్ని రకాల సేవలు పొందవచ్చు

    ఆరోగ్య రక్ష పథకంలో ఎలా చేరాలి ?
    ముందుగా పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదుచేసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోగలరు.
    ఈ క్రింద లింక్ క్లిక్ చెయ్యండి, పూర్తి వివరాలు ఉన్నాయి.

ఎన్.టి.ఆర్ ఆరోగ్య రక్ష హెల్త్ ఇన్సురన్స్ పధకంలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?

ఆరోగ్య రక్ష పథకంలో ఎప్పుడు లోపు చేరాలి ?
జవనరి 9 నుంచి ఆరోగ్య రక్షలో అర్హుల నమోదు ప్రారంభమైంది. ఫిబ్రవరి 28 వరకు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి పధకం అమల్లోకి వస్తుంది.

ఎన్ని హాస్పిటల్స్ లో ఆరోగ్య రక్ష పథకం పని చేస్తుంది ?
ఆరోగ్య రక్ష పథకం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 410 ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో అమల్లో ఉంటుంది. 1044 రకాల వ్యాధులకు చికిత్సను అందిస్తారు. సెమీ ప్రైవేట్ వార్డు(ఏసీ) వైద్యం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటుంది.

ఆరోగ్య రక్ష పథకం మీద సందేహాలు వస్తే ?
104 లేదా 8333817469 నెంబర్లలో సంప్రదించవచ్చు

Advertisements

Advertisements

Latest Articles

Most Read