విశాఖ ఉక్కు పరిశ్రమను, వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, విశాఖలో మొదటి నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి వ్యతిరేకిస్తూ, ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బయట నుంచి కూడా మద్దతు లభిస్తుంది. నిన్న తెలంగాణా నుంచి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మల్యే సీతక్క కూడా, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి నారా రోహిత్, ఆర్పీ పట్నాయక్, చిరంజీవి కూడా మద్దతు పలికారు. నిన్న బీజేపీ ఎంపీ సుభ్రమణ్య స్వామి కూడా, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలుకుతామని చెప్పటం జరిగింది. క్రమంగా, రోజు రోజుకీ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు లభిస్తుంది. ఇక మరో వైపు, ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయటానికి, కార్మికలు, కార్మిక సంఘాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఉద్యమానికి బలం చేకూరుస్తూ, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ఇప్పుడు కీలకా నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సమ్మె నోటీస్ కూడా సర్వ్ చేసి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నట్టు చెప్పారు.

vizag 11032021 2

ముందుగా నిబంధనలు ప్రకారం 14 రోజులు ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం అని, ఈ నెల 25 తరువాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్ళవచ్చ అని కార్మికులు చెప్పారు. ఇండస్ట్రియల్ డిస్ప్యుట్ ఆక్ట్ 1947 సెక్షన్ 22 ప్రకారంగా, ఈ నోటీస్ ని సర్వ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పటం జరిగింది. ఇందులో ప్రధానంగా, వాళ్ళు అయుదు అంశాలకు ఇందులో పేర్కొనటం జరిగింది. ఇందులో ప్రధానంగా వంద శాతం ప్రైవేటీకరణకు ఆమోదిస్తూ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకొందో, దీన్ని వ్యతిరేకిస్తున్నాం, అలాగే, స్టీల్ ప్లాంట్ అమ్మకం పై వేసిన కమిటీ పైన, అలాగే పోస్కోతో చేసుకున్న ఒప్పందం పైన, స్టీల్ ప్లాంట్ భూములుకు సంబంధించి అమ్మకం పై, అలాగే ఇక్కడ భూములు ఇచ్చిన 8 వేల మంది రైతులకు ఉద్యోగులు ఇవ్వాలని, ఇలా ఈ డిమాండ్లు ముందు పెట్టారు. దీని పై యాజమాన్యం సరిగ్గా స్పందించకపోతే, 25 తరువాత ఏ క్షణంలో అయినా సమ్మెకు వెళ్తాం అని చెప్పి, కార్మికులు చెప్తున్నారు. దీంతో ఈ ఉద్యమానికి, రానున్న రోజుల్లో మరింత సపోర్ట్ లభించటంతో పాటుగా, ఉద్యమం మరింతగా ముందుకు వెళ్లనుంది.

తిరుమలశ్రీవారిని దర్శించుకున్న సుబ్రహ్మణ్యస్వామి సంచలనవ్యాఖ్యలు చేశారని,ప్రత్యేకవిమానంలో సుబ్రహ్మణ్య స్వామిని తిరుపతికితీసుకొచ్చి, ఆయనతో చెప్పించాల్సింది చెప్పించి, చంద్రబాబునాయుడిపై కేసులు వేయించాలని చూడటం, ఎందరో అవినీతిపరులకు శిక్షలుపడేలాచేసిన సుబ్రహ్మణ్యస్వామి, ఎవరోచెప్పింది విని లైన్ తప్పి మాట్లా డటం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. "తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన 16నెలలు జైల్లోఉండివచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అవినీతికి పరాకాష్టగా మారిపోయారు. ప్రత్యేక విమా నంలో తిరుమలకు వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి, జగన్ తో కలిసి వేడివేడి భోజనంచేసి, రహస్యమంతనాలు జరిపి, తిరిగి ఢిల్లీవెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యస్వామి అవినీతి గురించి మాట్లాడేముందు, ఆయన ప్రత్యేకవిమానం ఖర్చులు ఎవరు భరించారో ఆయనే చెప్పాలి. ఎవరితో కలిసి ఆయన వేడివేడి భోజనం చేశారో, ఆయన పెట్టారా? లేక సుబ్రహ్మణ్యస్వామే పెట్టుకున్నారా? ఇదివరకు సుబ్రహ్మణ్యస్వామి పై ప్రజలకు గౌరవముండేది. అవినీతిచక్రవర్తితో కలిసి ఆయన ఎప్పుడైతే భోజనాలుచేశారో, అప్పుడే ఆయనపైఉన్న గౌరవం పోయిం ది. దేవాదాయఆస్తులను ఎందుకు అమ్ముతున్నారని సుబ్రహ్మణ్యస్వామి జగన్ ను అడిగారా? పింక్ డైమండ్ ఏమైందని, రాష్ట్రంలో 165కుపైగా దేవాలయాలపై దాడులు ఎందుకు జరిగాయని సుబ్రహ్మణ్యస్వామి, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడా?

సుబ్రహ్మణ్యస్వామి ఏదో రాజకీయప్రయోజనం ఆశించే జగన్ తోసమావేశమైనట్టు, జగన్ ఆయన్ని ప్రలోభపె ట్టినట్టు అనిపిస్తోంది. ఎందరో అవినీతిముఖ్యమంత్రులను గతంలో జైలుకు పంపిన సుబ్రహ్మణ్యస్వామి, నేడు ఈ విధం గా ప్రవర్తించడం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డిపై పోరాడుతోంది తెలుగుదేశంపార్టీ, ఆపార్టీ నేతలు మాత్రమేననే వాస్తవాన్ని సుబ్రహ్మణ్యస్వామి తెలుసుకోవాలి. రాష్ట్రంలోని ప్రసారమాధ్య మాలు, పత్రికలతోపాటు, జాతీయపత్రికలను చూస్తే, ఆయనకు వాస్తవాలు బోధపడతాయి. టీడీపీ మాట్లాడటం లేదని సుబ్రహ్మణ్యస్వామి చెప్పడం విడ్డూరానికే విడ్డూరం. ఆయన వ్యాఖ్యలుచూస్తుంటే, జగన్ తో లాలూచీ పడినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్యస్వామి తనపార్టీతో సంబంధంలేకుండా ప్రత్యేకవిమానంలోవచ్చిమరీ, జగన్మోహన్ రెడ్డితో సమావేశ మవ్వాల్సిన సందర్భం ఏమొచ్చింది? రాష్ట్రానికి హడావుడి గా వచ్చి, ఏదేదోచెప్పాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిం ది? చంద్రబాబునాయుడిపై గతంలో రాజశేఖర్ రెడ్డి అనేక ఆరోపణలుచేసి, లెక్కకు మిక్కిలి కేసులువేసి, భంగపడ్డాడనే వాస్తవాన్ని, ఇప్పుడు కేసులువేస్తానంటున్న సుబ్రహ్మణ్య స్వామి గ్రహించాలి. సుబ్రహ్మణ్యస్వామికి చేతనైతే, అవినీతి ని, అవినీతికిపాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. చంద్రబాబునాయుడిని, ప్రజలపక్షాన పోరాడుతున్న ఆయ న తీరుని ప్రశ్నించడం మానేస్తే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి తనవయసుని, అనుభవాన్ని గుర్తుంచుకొని తనకున్న గౌరవాన్ని కాపాడుకుంటే మంచిదని సూచిస్తున్నాను.

పోలవరంలో డయాఫ్రం వాల్ రామోజీరావు కట్టారని ఇరిగేషన్ మంత్రి మాట్లాడటం వింతగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బర్రెలు కాచేవారు కూడా ఇలా మాట్లాడరన్నారు. రామోజీరావు, చంద్రబాబు, రాధాకృష్ణ మీద కోపముందుకని ప్రశ్నించారు. . చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఒక రికార్డు స్థాయిలో 414 రోజుల్లో ఎల్ అండ్ టీ బావర్స్, జర్మనీ సంస్థలచే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మించడం జరిగిందన్నారు. ప్రపంచంలో ఇంతపెద్ద డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎక్కడా లేదు. దేశమే గర్వపడేలా నిర్మించాం. కెల్లార్ లండన్ బేసిస్ కంపెనీ కూడా అభినందించింది. జూన్ 2018లో జాతికి అంకితం చేశాం. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని గాలికొదిలేసింది. అసమర్థ, తెలివితక్కువ నాయకులు అధికారంలోకి రావడంతో ఇలా జరిగింది. జగన్ పోలవరం డ్యామ్ సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడి వారు జగన్ కు మా గురించి వివరించారు. స్పిల్ ఛానల్, అప్రోచ్ పనులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ డిజైన్స్ కు అనుగుణంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ అప్రువల్ జరిగింది. పనులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో 71 శాతం పనులు మేం పూర్తి చేశాం. కాఫర్ డ్యామ్ రెండు పక్కల పనులు పూర్తి చేయక వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. జగన్ మీడియా ముందుకు రాడు. రామోజీరావు, రాధాకృష్ణలను బూతులు మాట్లాడడానికి మాత్రం మీడియా ముందుకు వస్తారు.

సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం లెప్ట్ కెనాల్ పనులు ఆపేశారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు పక్కన పడేశారు. కేంద్రానికి ఉత్తరాలు రాయడంలో అర్థంలేదు. 22,500 ఎకరాలలో నిర్మితమై 52 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణం. అనిల్ కుమార్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డిలకు వెళ్లి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గేట్ వద్దకు వెళ్లి మాట్లాడే ధైర్యం లేదు. అక్కడికి వెళితే కార్మికులు బట్టలు ఊడదీసి కొడతారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. నేషనల్ హైవేలను దిగ్బంధనం చేస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దని లక్షలాది మంది మద్దతిస్తున్నారు. తాడేపల్లి ప్రాకారానికే ముఖ్యమంత్రి జగన్ పరిమితమయ్యారు. సీబీఐ అంటే జగన్ కు మహా భయం., విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని జగన్ కు మాట్లాడే ధైర్యం లేదు. ఎందుంటే ఈడి కేసులు వెంటాడుతున్నాయి. జైలు భయం, కటకటాలు గుర్తుకొస్తున్నాయి. కార్మికుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుంది. ఈ ఎన్నికల్లో మితిమీరిన దౌర్జన్యాలకు పాల్పడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై దాడి చేశారు. జవీ ఆంజనేయులు కారు మీద రాళ్లతో దాడి చేశారు. విజయవాడలో మహిళలపై దాడులు చేశారు. వీరి అక్రమాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని దేవినేని ఉమా వివరించారు.

తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా బీసి నేతలు టార్గెట్ గా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దమనకాండ కొనసాగుతూనే ఉంది. నిన్న మునిసిపల్ ఎన్నికల సందర్భంగా, అధికార పార్టీ నేతలు ఎలా రెచ్చిపోయారో, మీడియాలో, సోషల్ మీడియాలో వీడియోలుతో సహా బయట పడిన విషయం అందరం చూసాం. అయితే, అన్ని ఆధారాలు ఉన్నా, వారిని ఏమి చేయని పోలీసులు, ఈ రోజు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసారు. నిన్న ఎన్నికల సందర్భంగా పోలీస్ విధులకు ఆయన ఆటంకం కలిగించారని అభియోగం మోపారు. ఆయన్ను అరెస్ట్ చేసి, ముందుగా వైద్య పరీక్షలు జరిపి, జిల్లా కోర్టుకు తరలించారు. అయితే కొల్లు రవీంద్రని రిమాండ్ కు పంపించి, మళ్ళీ జైలు పాలు చేయాలని, అధికార పార్టీ పన్నిన కుట్రలు పని చేయలేదు. అయితే కోర్టులో, పోలీసులకు ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా కోర్టు జడ్జి స్పందిస్తూ, పోలీసులు ప్రొసీజర్ పాటించలేదని అభిప్రాయ పడ్డారు. దీంతో కొల్లు రవీంద్రకు బెయిల్ ఇస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. ఇదే సందర్భంలో, కొల్లు రవీంద్ర కూడా ఈ కేసు విషయం పై, పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఉదయం నుంచి కొల్లు రవీంద్ర అరెస్ట్ విషయం తెలిసిన తరువాత, మచిలీపట్నంలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తూ వచ్చింది.

kollu 11032021 2

కొల్లు రవీంద్ర అరెస్ట్ సమయంలో, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కొల్లు రవీంద్ర నివాసానికి రావటం, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసే సమయంలో, అక్రమ అరెస్ట్ అంటూ అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఈ అన్ని పరిణామాలు ఉదయం నుంచి జరిగాయి. ఇక ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కలిసి, కొల్లు రవీంద్ర అక్రమ అరెస్ట్ ను ఖండించారు. అయితే నిన్న పోలింగ్ జరుగుతున్న సమయంలో, ఒక బూతు దగ్గర, వైసీపీ, టిడిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపధ్యంలో, అక్కడకు వెళ్ళిన కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకోవటం, ఆ సమయంలో ఇరువిరి మధ్య తోపులాట జరిగి, పోలీసులు తోపులాటలో కొల్లు రవీంద్ర కింద పడిపోవటంతో, ఆయన పోలీసుల తీరుకు నిరసనగా, అక్కడే నేల పైన కూర్చుని నిరసన తెలిపారు. ఈ ఘటన పై, కొల్లు రవీంద్ర, పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అంటూ, ఈ రోజు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసారు. అయితే జిల్లా జడ్జి, అరెస్ట్ సమయంలో ప్రోసిజర్ పాటించలేదని, బెయిల్ మంజూరు చేసారు.

Advertisements

Latest Articles

Most Read