ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో కొత్త, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ నెల 31వ తేదీన, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్న, నిమ్మగడ్డ రమేష్ కుమార్, పదవీ విరమణ చేస్తున్న తరుణంలో, కొత్త ఎన్నికల కమీషనర్ నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి, నిన్న సాయంత్రం, ఈ రోజు ఉదయం, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఆదిత్యనాద్ దాస్ వద్ద, ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మొత్తం మూడు పేర్లు ప్రతిపాదించారు. ఈ పేర్లను, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ పేర్లను పరిశీలించిన అనంతరం, ఒక ఫైల్ తయారు చేసి, ఆ ఫైల్ ని, రాష్ట్ర గవర్నర్ కు పంపాల్సి ఉంటుంది. ఆ ముగ్గిరిలో ఒకరి పేరుని రాష్ట్ర గవర్నర్ ఎంపిక చేస్తారు. ఈ ముగ్గురికీ సంబంధించి కూడా 65 ఏళ్ళ లోపు ఉన్న వారు, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ లో చీఫ్ సెక్రటరీ లేదా, ప్రినిసిపల్ సెక్రటరీ స్థాయిలో పని చేసిన అధికారులను ఎంపిక చేస్తారు. ఈ ముగ్గిరి పేర్లలో, రాష్ట్ర గవర్నర్ కు పంపించిన అనంతరం, అందులో ఒక పేరుని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించే అవకాసం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పేరునే, దాదాపుగా, రాష్ట్ర గవర్నర్ కూడా ఫైనల్ చేసే అవకాసం ఉంది.

kanakaraj 23032021 2

ఇందులో ప్రధానంగా, మాజీ ప్రాధాన కార్యదర్శి, ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఉన్న నీలం సాహనీ పేరు దాదాపుగా ఖరారు అవుతుందని అంటున్నారు. దాదాపుగా ఆమె పేరు ఖరారు అవుతుందనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతంది. ప్రస్తుతం ఆమె పదవీ విరమణ చేసిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహదారుగా వ్యవహరిస్తున్నారు. ఆమె పేరుని పరిగణలోకి తీసుకుంటారని చెప్తున్నారు. ఇక మరో ఇద్దరి పేర్లుగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో జస్టిస్ కనకరాజ్ పేరు లేకపోవటంతో, అందరూ షాక్ అయ్యారు. నిమ్మగడ్డను తీసి, గతంలో కనకరాజ్ ను పెట్టిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్లో కోర్టు జోక్యంతో, మళ్ళీ నిమ్మగడ్డ వచ్చారు. అయితే కనకరాజ్ ను చెన్నై నుంచి తీసుకుని వచ్చి, ఇక్కడ పెట్టటం, ఆయన రెంట్ కూడా చెల్లించలేదనే ఆరోపణలు రావటం, ఇప్పుడు ఆయన్ను కనీసం పరిగణలోకి తీసుకోక పోవటం పై, అందరూ షాక్ అయ్యారు. దీని పై వైసీపీ ఎంపీ రఘురామరాజు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా ఉన్న నిమ్మగడ్డ రామేశ్ కుమార్, రాష్ట్ర గవర్నర్ కు రాసిన లేఖలు, బయటకు లీక్ కావటం పై, నిమ్మగడ్డ రమేష్ కుమార్, శనివారం రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పై కేంద్ర దర్యాప్తు సంస్థల్లో, ముఖ్యంగా సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్ కార్యాలయానికి, రాజ్యంగబద్ధ సంస్థకు అధిపతిగా ఉన్న తాను రాసిన లేఖను బయటకు లీక్ చేయటం అనేది, హక్కులకు విరుద్ధం అని, ఇటువంటి చర్యలు మంచిది కాదని, ఆయన పిటీషన్ లో తెలిపారు. పైగా తాను రాసిన లేఖను, హైకోర్టులో దాఖలు అయిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో, ఒక పిటీషనర్ తన పిల్ లో పేర్కొన్నారని, ఈ లేఖలు ఎలా లీక్ అయ్యయో, తెలుసుకోవాలని ప్రశ్నించారు. దీని పై వెంటనే, తగిన విచారణ జరిపించాలని ఆయన కోరారు. దీంట్లో ప్రతివాదులుగా రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్సా సత్యన్నారయణతో పాటుగా, గవర్నర్ కార్యదర్శిని కూడా ప్రతి వాదులుగా చేర్చారు. దీంతో హైకోర్టు ఈ అంశం పై విచారణ జరిగిపింది. అయితే ఆ బెంచ్ జడ్జి నాట్ బిఫోర్ మీ అని తప్పుకోవటంతో, ఈ పిటీషన్ మరో బెంచ్ ముందుకు వచ్చింది. ఈ రోజు ఈ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశం పై ఎలక్షన్ కమిషన్ తరుపున న్యాయవాదులు, తమ పిటీషన్ లోని అంశాలు హైకోర్టుకు చెప్పారు.

peddireddy 23032021 2

ఈ రోజు విచారణ సందర్భంగా, హైకోర్టు స్పందిస్తూ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మరో మంత్రి బొత్సా సత్యన్నారాయణకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు పై, వాళ్ళ వివరణ ఇవ్వాలని కోరారు. అదే విధంగా ప్రతి వాదులుగా పేర్కొన్న మిగతా వారికి కూడా నోటీసులు జారీ చేసారు. అయితే ఈ లేఖలు బయటకు విడుదల అయ్యాయని, దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ కూడా, ఈ రోజు తన పిటీషన్ లో, ఎన్నికల కమిషన్ జత చేసారు. ఇక గవర్నర్ సెక్రటరీ కూడా స్పందిస్తూ, గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి ప్రివిలేజ్ లెటర్స్ లీక్ అవ్వలేదని చెప్పారని, హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపు న్యాయవాది. వీటి అన్నిటి పై కూడా, మంత్రులు, ప్రతి వాదులు ఇచ్చే సమాధానం పై, ఈ పిటీషన్ పై తదుపరి విచారణ జరగనుంది. అయితే దీని పై మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి. తమకు ఆ లేఖలు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనే విషయం కోర్టుకు ఎలా చెప్తారు అనే విషయం ఇప్పుడు కోర్టులో తేలుతుంది.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. రఘురామకృష్ణంరాజుపై నమోదైన కేసులకు సంబంధించిన ఫిర్యాదిదార్ల వివరాలను అందించాలని పోలీసులను ఆదేశిస్తూ కేసు విచారణను వచ్చేనెల7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అప్పటి వరకు గత కొద్దిరోజుల క్రితం జారీచేసిన ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కుల, మత విద్వేషాలను రెచ్చకొట్టటం, ప్రయత్నించటం, కుల దూషణలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు, భీమవరం, పెను గొండ, ఆచంట తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తనపై ఉద్దేశపూర్వకంగా నమోదైన కేసులన్నిం టినీ కొట్టివేయాల్సిందిగా రఘురామకృష్ణంరాజు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లలో ఫిర్యాది దార్లకు సైతం నోటీసులు అందించాల్సి ఉందని సీనియర్ న్యాయవాది సత్యనారాయణ ప్రసాద్ కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు జోక్యం చేసుకుంటూ వాటిని పిటిషనర్ ద్వారా అందజేయాలని ప్రతిపాదించారు. ఎఆర్ లో పిటిషనర్ల అడ్రన్లు లేవని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది వివరించారు. దీంతో వారి అడ్రన్లను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణ వచ్చేనెల 7కి వాయిదా వేశారు.

rrr 23032021 2

అయితే రఘురామరాజు పై, అసలు ఈ కేసు పెట్టింది ఎవరు అనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. దీంతో రఘురామరాజు తన స్టైల్ లో, హైకోర్టుకు వెళ్లి మొత్తం వివరాలు సేకరించారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు కేసు పెట్టారు, వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస ప్రతికి సంబంధం ఉందా అనే విషయాలు తెలుస్తాయి. ఇప్పటికే విజయసాయి రెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బా రెడ్డి మీద రఘురామ రాజు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తన పై వైసీపీ నేతలే కక్ష కట్టి ఇలా చేస్తున్నారని, ఇప్పటికే రఘురామరాజు ఆరోపిస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఈ ఆధారాలు ఆయనకు కీలకం కానున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ లో కూడా ఈ విషయం రఘురామరాజు లేవనెత్తారు. అలాగే ఇప్పటికే రాష్ట్రపతి కి కూడా ఈ విషయం పై రఘురామ రాజు ఫిర్యాదు చేసారు. ఒక ఎంపీగా, తన నియోజకవర్గానికి వెళ్ళటానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదని, అక్రమ కేసులు పెడుతున్నారని, ఈ విషయం జగన్ మోహన్ రెడ్డి కి చెప్దాం అంటే, ఆయన్ను రెండు రోజులు పాటు, ఫోనులో కలవాలని చూసినా, ఆయన అప్పాయింట్మెంట్ దొరకలేదని అన్నారు. మొత్తంగా, ఇప్పుడు హైకోర్టుకు వెళ్లిన రఘురామరాజు, ఏ రకంగా మళ్ళీ ఆయన నియోజకవర్గంలో అడుగు పెడతారో చూడాల్సి ఉంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల నిర్వహణకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ, పలువురు వేసిన పిటీషన్ల పై, నేడు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం అని, హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 30వ తారిఖుకు ఈ కేసు వాయిదా వేసింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు పంపిస్తూ, వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలని, హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే ఈ పిటీషన్ పై విచారణ సందర్భంగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలకు సంబంధించిన అంశం తమ వద్ద ఉందని, దానికి సంబంధించి ఆలోచన ముందుకు వెళ్తుందని చెప్పింది. అయితే ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు అనేది మాత్రం, ఎన్నికల కమిషన్ విచక్షణ పై ఆధారపడి ఉంటుంది, వాళ్ళే ఆ తేదీలు ఖరారు చేయాల్సి ఉంటుందని, ఎన్నికలు నిర్వహించాలి మేము ఆదేశించలేమని, దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం అని చెప్పి, హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణ మాత్రం, ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తూ, ప్రతివాదులు అందరూ కూడా కౌంటర్ దాఖలు చేయాలని, ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితిలో ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.

hc 23032021 2

ఇలా ఎన్నికలు పెట్టాలని మేము ఆదేశించలేమని, ఎన్నికల కమిషనే నిర్ణయంచాలని, హైకోర్టు చెప్పింది. అయితే ఈ నెల 31వ తేదీతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కలాం ముగుస్తుంది. అయితే ఈ లోపే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆయన పై ఒత్తిడి తెస్తుంది. అయితే కోర్టు నిర్ణయం ప్రకారమే తాము నడుచుకుంటాం అని నిమ్మగడ్డ ఇప్పటికే స్పష్టం చేసారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసి నామినేషన్ల సందర్భంలో జరిగిన బలవంతపు ఏకాగ్రీవాలు రద్దు చేయాలని, ఇప్పటికే పలువురు కోర్టుకు వెళ్ళారు. అది తేలే వరకు, ఎన్నికల షడ్యుల్ ఇవ్వటం కుదరదని, ఇప్పటికే పరోక్షంగా చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం, ఆయన పై ఒత్తిడి తెస్తుంది. ఆయన నుంచి ఎటువంటి సమాధానం లేకపోవటంతో, కొంత మంది కోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. అయితే హైకోర్టు మాత్రం, తాము ఆ ఆదేశాలు ఇవ్వలేమని చెప్తూ, కేసుని ఈ నెల 30కి వాయిదా వేసింది. అంటే ఇక నిమ్మగడ్డ ఉండగా, ఈ ఎన్నికలు జరిగే అవకాసం లేదు.

Advertisements

Latest Articles

Most Read