ప్రకాశం జిల్లాలో పింఛను డబ్బు మొత్తం దొంగనోట్లు ఇచ్చిన వాలంటీర్ గుర్తున్నాడా? ఈ దొంగనోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే డౌట్ కూడా లేటెస్ట్ గా కర్ణాటక పోలీసుల అరెస్టుతో తేలిపోయింది. వైసీపీ పెద్దలకి బాగా కావాల్సిన వైసీపీ మహిళానేత రసపుత్ర రజని వద్ద లక్షల్లో దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు పోలీసులు. క్రిమినల్ హిస్టరీ షీట్ ఉన్న రజనీకి వెన్నుదన్నుగా వైసీపీ కీలక నేతలు నిలుస్తున్నారు. గతంలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో రజనీ ప్రధాన సూత్రధారి. బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీసులు రజనీతోపాటు మరి కొందరిని అరెస్ట్ చేసి రూ. 44 లక్షల విలువైన దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ కీలకనేతగా పెద్దల ఆశీస్సులతో చెలామణి అవుతోన్న రజనీని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా నియమించారు. మోసాలే వృత్తిగా రజనీ చాలా ఎత్తుకు ఎదిగింది. ఆమె వెనుక బడానేతలు ఉండడంతో నోట్లు ముద్రించి ఏపీలో సర్కులేట్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. రజనీ అరెస్టుపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయస్థానాలలో పోరాడుతామని, తప్పుచేయకపోతే అండగా ఉంటామని ప్రకటించారు.
news
డీజీపీ అలా... ఎస్పీ ఇలా... లోకేష్ పాదయాత్ర షరతుల పై, టిడిపి అసహనం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించనున్న యువగళం పాదయాత్రకు నాన్చి..నాన్చి అయిష్టంగా అనుమతులు ఇచ్చిన పోలీసులు మొత్తంగా 14 షరతులు పెట్టారు. ఇవన్నీ కూడా పాదయాత్రని అడ్డుకునే ఆంక్షలేనని టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి. ఖాకీలు పెట్టిన ఈ షరతులు అన్నీ పాటించడం అసాధ్యం. అంటే పాదయాత్ర జరగకూడదనే ఆలోచనతోనే ఇటువంటి ఆంక్షలు పెట్టారని డిజిపి స్టేట్మెంట్తోనూ తేటతెల్లం అయ్యింది. డిజిపి పేరుతో విడుదలైన ప్రకటన మేరకు మొత్తం పాదయాత్రలో పాల్గొనే జనాలు సంఖ్య, వారి వివరాలు, వాహనాలు ఒకటేమిటి సర్వం అడిగారు. అప్పుడే యువగళం ముందుకు సాగకుండా ఉండే ఎత్తుగడ అని అర్థమైంది. చిత్తూరు ఎస్పీ 14 షరతులతో ఇచ్చిన అనుమతి చూసినా నారా లోకేష్ పాదయాత్రకి అనుమతి ఇవ్వడం ఇష్టంలేదని చెప్పకనే చెబుతున్నట్టున్నాయి షరతులు. ఏ రోడ్డుపైనా సభ పెట్టకూడదు, మూడు రోజులకోసారి అనుమతి తీసుకోవాలి. సాయంత్రం 5 గంటలకే క్లోజ్ చేయాలని..ఇవి 14 షరతులలో కొన్ని మాత్రమే. అన్నీ పాటించాల్సి వస్తే, పాదయాత్ర జరగనే జరగదు. టిడిపి కూడా ఏపీలో ఏ పాదయాత్రకీ లేని అనుమతులు, షరతులు నారా లోకేష్‌కి మాత్రమే ఎందుకంటూ ప్రశ్నిస్తోంది. పాదయాత్ర బరాబర్ చేసి తీరుతామని ప్రకటించింది.
సోషల్ మీడియాలో బాలయ్య, అక్కినేని కాంట్రవర్సీ బులుగు బ్యాచ్ సృష్టే ? కాపునాడు పేరుతో హంగామా
బాలయ్య అక్కినేనిని అగౌరవపరిచారంటూ సాగుతున్న కాంట్రవర్సీ పూర్తిగా బులుగు బ్యాచ్ సృష్టి అని స్పష్టమైంది. అక్కినేనిని తొక్కినేని అన్నారనుకుందాం. అక్కినేని కుటుంబం స్పందించాలి. కానీ విచిత్రంగా కాపునాడు నేతలు సీనులోకి వచ్చారు. బులుగు బ్యాచ్ సృష్టించిన ఈ కాంట్రవర్శీని చూస్తుంటే నువ్వునేను సినిమాలో కామెడీ సీను గుర్తొస్తుంది. సునీల్ ని క్లాసురూములో ఓ అమ్మాయి మూసుక్కూర్చోరా పూలచొక్కా అంటుంది. సునీల్ బెంచ్ పైకి ఎక్కి ఇక్కడెవరో నన్ను పూలచొక్కా మూసుక్కూర్చోరా అన్నారు. లెక్చరర్ వచ్చి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తాడు. సేమ్ ఇదే సీన్ క్రియేట్ చేసిబులుగు బ్యాచ్ నవ్వుల పాలవుతోంది. మామూలు సంభాషణలో ప్రాస కోసం ప్రయత్నించిన బాలయ్య ఆ రంగారావు అక్కినేని, తొక్కినేని గురించి మాట్లాడుకున్నామనే సంభాషణలో ఎవ్వరికీ ఏ తప్పూ కనపడటంలేదు. ఒకవేళ అక్కినేని కుటుంబం నాగేశ్వరరావుని అక్కినేని గారు అనలేదని, ఆయన పేరు తరువాత తొక్కినేని ఎవరంటూ ప్రశ్నించినా అర్థం ఉంది. అసలు సంబంధమేలేని కాపునాడు పేరుతో బులుగు బ్యాచ్ చేసిన కన్నింగ్ పాలిటిక్స్ నవ్వులపాలయ్యాయి. బాలయ్య రంగారావు అన్నందుకు లోకేష్ పాదయాత్ర ఆపేయాలట. ఇంకా నయం..బాలయ్యకి పిల్లనిచ్చిన ఎస్ఆర్ఎంటీ వాహనాలు ఆపేయాలని డిమాండ్ చేయలేదు.
వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపిన కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే బాబాయ్ ని చంపింది అబ్బాయ్లేనని ఇన్నాళ్లు వస్తున్న వార్తలు వాస్తవమేనని స్పష్టమైపోతుంది. ఈ నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్‌కి మారుపేరయిన బులుగు బ్యాచ్ క్యాంప్ అక్కినేని..గిక్కినేని వ్యవహారాన్ని బయటకు తెచ్చింది. వాస్తవంగా బాలయ్య ఓ రైటర్ గురించి చెబుతూ ``ఎప్పుడూ శాస్త్రాలు, డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని గురించి తొక్కినేని గురించి మాట్లాడుకుంటాం`` అని అన్నారు. ఇందులో తప్పేముంది. డబ్బూ గిబ్బూ, నేరం గీరం, అంటూ మాట్లాడేటప్పుడు ప్రాసలు వాడుతాం అదే విధంగా అక్కినేని గిక్కినేని అన్నారు. ఆ రంగారావు గారు అన్నారు. ఇందులో ఎవరిని ఏం అసభ్యంగా మాట్లాడారని...నిన్నటి నుంచీ బులుగు బ్యాచ్ పెయిడ్ మేథావులు, తెలుగు-సంస్కృతాన్ని పేకాట ఆడేపే పతివ్రతలు మీడియా ముందుకి వచ్చి ఒకటే రోదిస్తున్నారు. ఈ వివాదాన్ని చూశాక, బాలయ్య నోట తప్పు మాట రాకుండా వివాదం ఎలా అని చూస్తే...ఇదంతా వైసీపీ శకుని వ్యూహాల్లోంచి సృష్టించిన కాంట్రవర్సీ అని తేలిపోయింది.
కుల గొడవలు రేపాలని చూసిన బ్లూ బ్యాచ్ గూబ పగలుగొట్టిన ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు
గత రెండు రోజులుగా లేని సమస్యని సృష్టించి, కుల గొడవలు రేపాలని చూసిన బులుగు బ్యాచ్ సిగ్గు పడేలా ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు స్పందించారు. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి మనవళ్లు చిన్న, బాబాజీ మాట్లాడుతూ, "నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం." అని అన్నారు.