మరో సారి... మరో రోజు... మరో మొట్టికాయి... హైకోర్టు చేతిలో గతంలో ప్రభుత్వంలో పెద్దలకు మొట్టికాయలు పడేవి. ఇప్పుడు తమ చేతికి మట్టి అంటకుండా చేస్తూ ఉండటంతో, అధికారులు బలి అవుతున్నారు. ఈ మధ్య కాలంలో అనేక మంది ఐఏఎస్ అధికారులు కోర్టు ముందు దోషులుగా నిలబడటం, వారికి శిక్షలు పడటం, తరువాత వారు హైకోర్టుకు సారీ చెప్పటం, ఇవన్నీ రొటీన్ అయిపోయాయి. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. విశాఖ మర్రిపాలెంకు చెందిన వ్యాపారి లలితేష్‌కుమార్, హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు. తన స్థలాన్ని ఖాళీ చేయాలని అంటున్నారు అంటూ, పిటీషన్ వేసారు. ఈ విషయం పై చీఫ్ జస్టిస్ కు విన్నవించుకున్నారు. అయతే ఇదే స్థలం పై లీజు విషయంలో గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినా, అధికారులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ హైకోర్టు ఆగ్రహం చేస్తూ, ఈ పిటీషన్ కాకుండా, కోర్టు ధిక్కరణ పిటీషన్ వేయాలని, అధికారుల తప్పు తేలితే, తాము ఆ అధికారులను జైలుకు పంపుతాం అంటూ, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైసీపీ మూడు రాజ‌ధానులు నినాదం నాట‌క‌మ‌ని తేలిపోయింది. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అంటూ ఇప్ప‌టివ‌ర‌కూ చెప్పుకుంటూ వ‌చ్చినవ‌న్నీ డ్రామాలేన‌ని వైసీపీ పెద్ద‌ల ప్ర‌క‌ట‌న‌లే చెబుతున్నాయి. కోర్టులో కేసులున్నాయ‌ని, రాజ‌ధాని అంశంపై మాట్లాడితే కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కి వ‌స్తుంద‌నే భ‌యం లేకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవ‌లే ఢిల్లీలో ఓ స‌ద‌స్సులో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖే మా రాజ‌ధాని, నేను అక్క‌డికే షిఫ్ట్ అవుతున్నానంటూ ప్ర‌క‌టించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కోర్టుల దృష్టికి తీసుకెళ్లారు పిటిష‌న‌ర్లు. మ‌ళ్లీ ఆర్థిక‌శాఖా మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి కూడా విశాఖే మా రాజ‌ధాని అని చెప్ప‌క‌నే చెప్పారు. బెంగళూరు పారిశ్రామిక సదస్సులో మంత్రి బుగ్గన విశాఖ కేపిట‌ల్ గురించి ఇన్ డైరెక్టుగా మాట్లాడారు. మూడు రాజధానులు అనేది తప్పుగా కమ్యూనికేట్ అయింద‌ని వివ‌రించారు.  విశాఖ నుంచే మొత్తం పరిపాలన సాగుతుంద‌ని చెప్పుకొచ్చారు. పాలనా రాజధానిగా విశాఖనే సరిగ్గా సరిపోతుంద‌న్నారు.  మౌలిక వసతులు, మరింత అభివృద్ధి చెందే ప్రాంతం విశాఖ అని చెప్పుకొచ్చారు. పోర్టుసిటీ, కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరం విశాఖ అని మంత్రి వివ‌రించారు.  హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే కర్నూలులో ఉంచాలనుకుంటున్నామ‌ని చెప్ప‌డం ద్వారా మూడు రాజ‌ధానులు ఉండ‌నే ఉండ‌వ‌ని, క‌ర్నూలు న్యాయ‌రాజ‌ధాని అనేది కూడా ఉత్తుదేన‌ని బుగ్గ‌న తేల్చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ మూడు ప్రాంతాల్లో మూడు రాజ‌ధానుల పేరిట వైసీపీ గ‌ర్జించిందంతా నాట‌క‌మేన‌ని సీఎం, ఆర్థిక మంత్రి చెప్ప‌క‌నే చెప్పేశారు.

సునీల్ అనే పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఆ పేరులో వైబ్రేష‌న్ జ‌గ‌న్ చుట్టూనే తిరుగుతున్నాయి. సునీల్ పేరున్న వాళ్లు జ‌గ‌న్ రెడ్డికి అత్యంత ఆప్తులు అవుతున్నారు. ఆ త‌రువాత ఆయ‌న క్రైమ్ పార్ట‌న‌ర్స్ అవుతున్నార‌ని గ‌తం నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన సంఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యాక‌, ఆయ‌న కోసం చ‌ట్టాల‌ను చేతుల్లోకి తీసుకుని మ‌రీ అరెస్టు చేసిన ప్ర‌తీ ఒక్క‌రినీ క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ చేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న అప్ప‌టి సీఐడీ డిజి సునీల్ కుమార్ సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. లేటెస్ట్‌గా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ సీఎస్ కి లేఖ రాసింది. మ‌రో సునీల్ క‌థ పాత‌ది. ఎమ్మార్ కేసులో అరెస్టయి సునీల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. విజయసాయి రెడ్డి వైయస్ జగన్‌కు కుడి భుజ‌మైతే, సునీల్ రెడ్డి ఎడ‌మ భుజ‌మ‌ని చెబుతారు. జగన్ సంస్థలో ఉద్యోగిగా చేరి, ఆయ‌న‌తో క‌లిసి వ్యాపారాలు చేసే స్థాయికి ఎదిగాడు సునీల్ రెడ్డి. మ‌రో సునీల్ క‌థ చూద్దాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్‌ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ పేరులోనూ సునీల్ ఉంద‌ని గ‌మనించారా?వైసీపీ స‌ర్కారు అరాచ‌కత్వానికి ప‌రాకాష్ట‌గా నిలిచిన గంజాయి కేసు కారులో షికార్లు కొట్టిన డిఎస్పీ పేరు కూడా యాధృచ్చికంగా సునీల్ కావ‌డం గ‌మ‌నార్హం. సునీల్ అనే పేరుతో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఏవో వైబ్రేష‌న్స్ కొన‌సాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తమకు జీతాలు ఇవ్వటం లేదు అంటూ, కొన్ని ఉద్యోగ సంఘాలు, గవర్నర్ దగ్గరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. తమకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం లేదని, పెన్షన్లు సమయనికి ఇవ్వటం లేదని, ఇవి సమయానికి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి అంటూ, గవర్నర్ వద్దకు వెళ్లి, తరువాత మీడియాతో మాట్లాడారు కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఎన్నో మార్గాలు ఉండగా, గవర్నర్ దగ్గరకు ఎలా వెళ్తారు, మీడియాతో ఎలా మాట్లాడతారు అంటూ, కొన్ని నిబంధనలు సాకుగా చూపి, షోకాజ్ నోటీస్ జారీ చేసింది. మీ ఉద్యోగ సంఘాల గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ, ప్రశ్నించింది. దీని పైన ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే విషయం అంటూ, ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీస్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు. దీని పైన విచారణ జరిపిన హైకోర్టు, ఉద్యోగ సంఘాల రద్దు పై స్టే విధించింది. దీని పై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisements

Latest Articles

Most Read