krishna pushkaralu 2 07062016

ఇంద్రకీలాద్రి అని పేరు ఆ కొండకి రావడాన్ని గురించి ఒక కధ చెబుతారు.అతి ప్రాచీనకాలంలో ఇంద్రకీలుడనే పర్వతరాజు వుండేవాడు. ఆయన ఏదో ఘోరమైన పాపం చేశాడు. ఇంద్రుడాగ్రహించి, వజ్రాయి ుధంతో అతని హృదయాన్ని చేధించాడు. ఆ దెబ్బకి రాజు గుండెలో మంటరేగింది. ఆ భాధనలకీలను పశమి ంప జేసుకొవడానికి శతవిధాల ప్రయత్నించాడు. కాని లాభం లేకపోయింది. చివరకు గత్యంతరంలేక జగనా తను పర్వతరాజ పుత్రిని ప్రార్ధించాడు. చల్లనితల్లి కనికరించింది. ఆ కొండ కొమ్మమీదికి వచ్చింది.పర్వత రాజు బాధ శమించింది. నాటి నుంచి దుర్గాదేవికి ఇంద్రకీలాద్రి శిఖరం నివాసమందిరమయ్యింది. నాటినుంచి ఈ కృష్ణాతీరం ఆర్ష ధర్మానికి మళ్ళీ అవాసమయ్యింది.

కనకదుర్గ అని పేరు రావడాన్ని గురించి కొన్ని కధలున్నాయి. నాగారునాచార్యుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి రసయోగాన్ని సాధించాట్ట. అంటే బంగారు చేయడం ఆయనకిక్కడ తెలిసింది గనుక అమ్మవారిని బంగారుతల్లి అని పిలిచి వుండవచ్చు. ఇదొక ఊహ. ఒక గొల్లవాడు గొర్రెల కాచుకుంటూ బ్రతికేవాడు దుర్గాదేవిని నమ్ముకొని కొండకు వచ్చేవాడు. ఒకనాడతనికి కొండమీద పచ్చని రాళ్ళు కనిపించాయి. అమాయకుడైన ఆ యాదవుడారాళ్లను ఊళ్ళోకి తీసుకువెళ్ళి పదిమందికి చూపించాడు. అవి బంగారు కణికలని వారు చెప్పారు. ఆ కొండమీద బంగారు రాళ్ళను పండించిన దుర్గాదేవిని కనకదుర్గ అని వారు చాటి భక్తితో పూజించారు.

మరొక గాధ
పల్లవ వంశీయుడైన మాధవవర్మ అనే రాజు విజయవాటిక రాజధానీ నగరంగా దేశాన్ని పరిపాలించా డు. ఆయన న్యాయంగా ప్రజలనేలాడు. ధర్మరక్షణ కోసం ప్రాణాలనైనా తృజించాలనే న్యాయమూర్తి. ఒక నాడు యునరాజ స్వేతమత్తాశ్వాలు పూన్చిన రధంమీద రాజవీధిలో వాహ్యాళికి బయలుదేరాడు. జనంతో కిక్కిరిసిన రాజవీధిలో రధం అతి వేగంగా నడిచింది.చింతకాయలమ్ముకోనే ఒక పేదరాసి పెద్దమ్మకొడుకు దారినిపోతుండగా అతనిమీదనుంచి రధం సాగి పొయింది. ఆ కుర్రవాడు అక్కడికక్కడే చనిపోయాడు.ఒక్కగా నొక్క కోడుకునూ యువరాజు చంపాడని ఆ ముసలమ్మరాజుగారితో ఫిర్యాదు చేసి, నేరస్తుని శిక్షించమని కోరి పుత్రశోకంతో ప్రాణాలు విడిచింది. ధర్మప్రభువైన మాధవవర్మ న్యాయాధికారుల నాదేశించాడు. "ప్రాణ మ్మ ప్రాణమ్మ బదులు కోరు" అని యువరాజునకు మరణశిక్ష విధించారు.వారి తీర్పును ఎదురించే ఆధికారం తనకున్నా న్యాయాన్ని తప్పని రాజు న్యాయాధికారుల నిర్ణయాన్ని ధ్రువపరిచాడు.ఆ మహారాజు యొక్క ధర్మగుణానికి దుర్గాదేవి సంతోషించి, విజయవాటికలో స్వర్ణవర్షం కురిపించింది. ఆ నాటినుంచి ఈ తల్లికి కనకదుర్గ అని పేరు వచ్చిందని ఒక గాధ ప్రచారంలో వుంది.

Advertisements

ఇంద్రకీలాద్రికి, కనకదుర్గమ్మకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? Last Updated: 06 July 2016