krishna pushkaralu 7 11072016

అనాదిగా ఆంధ్రప్రదేశంలో నాగారాధన ఉన్నదన్న విషయం అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశానికి నాగభూమి అనే పేరు కూడా ఉన్నది. ముఖ్యంగా నేటి దివితాలూకా ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇదే విస్తీర్ణంలో కృష్ణకు ఉత్తర దిక్కుగా ఉన్న ప్రాంతం కూడా కలుపుకొని ఉన్న ప్రదేశాన్నంతా ఒకప్పడు నాగభూమిగా వ్యవహరించే వారు. స్థలపురాణం - ఇంద్రాది దేవతల ప్రార్థన మేరకు లోపా ముద్రతో కలసి అగస్త్య మహర్షి వారణాసి నుండి అయిష్టంగానే బయలు దేరి మేరువుతో సంఘర్షించి లోకోపద్రవము కలిగిస్తూ ఆకాశంలోకి చొచ్చుకొని పోయి సూర్యగమనాన్ని నిరోదించి వింధ్య పర్వతాన్ని చూచి తాను దక్షిణ దేశ పుణ్య తీర్థ యాత్రలకు వెళుతున్నాను కనుక నీవు కొంచెం తగ్గి వుంటే దక్షిణ దేశంలోకి ప్రవేశిస్తాను. మరల నేను వచ్చేంత వరకు ఆ విధంగానే వండమనగా మునిశక్తికి బయపడి వింధ్య పర్వతం తలొగ్గింది.

లోపాముద్ర సహితుడై అగస్యుడు దక్షిణావనిలో ప్రవేశించి అక్కడే వుండిపోయాడు. వింధ్య పర్వతానికి శాశ్వతంగా గర్వభంగం చేశాడు. దక్షిణ దేశంలో శిష్యులతో , భర్తతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణానది తీరంలోని కుమారక్షేత్రానికి (మోపిదేవి) వచ్చారు. తన దివ్యదృష్టితో దాని మహత్యాన్ని గాంచారు. పాములు ముంగీసలు కలిసి ఉన్నాయి. ఒక చోట దివ్వ తేజస్సుతో ప్రకాశించే పుట్టను చూశారు. ఒకానొక అల్పదోష పరిహారము కోసం సుబ్రహ్మణ్యస్వామి ఉరగ రూపమును ధరించి ఇక్కడ ఒక శ్రేష్టమైన వల్మీకంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ అంశం గ్రహించి సుబ్రమణ్యస్వామిని కొలిచి తరించవలెనని అనుకున్నాడు. తాను దివ్వదృష్టితో చూచిన ఈ విషయాన్ని తన వారితో చెప్పాడు. పడగవలే ఉండే శివలింగాన్ని ఆ పుట్టపై ప్రతిష్టించాడు. నాగకుమార ద్వయం ఏకరూపమై నిలిచిన పుణ్యక్షేత్రం ఇది.

మొట్టమొదటగా ఈ స్వామిని అర్పించినది మహర్షి అగస్త్యుల వారు. అగ్రస్త్య మహర్షి చేత పూజింపబడిన సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహత్యాన్ని అవగతం చేసుకున్నదేవతలు, మునులు తమ శక్త్యాను సారం స్వామి వారికి అర్చన విధులు గావించేవారు. ప్రశాంతమైన ఈ పుణ్యభూమిలో మునులు తపస్సు చేసుకోసాగారు.ఈ కాలంలో పుట్టకు గుడిలేదు. భక్తుల సందడి లేదు. లౌకికపు వైభవం లేదు. దేవతాది గణం చేత పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగం కొన్నాళ్లు కాలగర్భంలో తన ఉనికిని విస్మరింపు చేసి పుట్టలోనే అంతర్గతంగా ఉంది.

పవిత్రమైన ఈ పుట్టకు దగ్గరలో కొంత మంది కుమ్మరులు నివాసం ఉండే వారు. వారిలో వీరారపు పర్వతాలు అనే వ్యక్తి మహాభక్తుడు. అతనికి స్వప్నంలో కుమారస్వామి కనపడి పుట్టలో నుండి లింగాన్ని తీసి ప్రతిష్టించమని ఆదేశించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని లింగ ప్రతిష్ట చేశాడు. తర్వాత తనకు తోచిన రీతిలో సుబ్రహ్మణ్యస్వామికి ప్రీతికరమైన వస్తువులను మృత్తికతో నేర్పుగా కాల్చి వాటిని శ్రీ స్వామి వారికి సమర్పిస్తూ ఉండేవాడు. గుర్రము , నంది, కోడి , గరుత్మంతుడు మొతలైన మట్టి విగ్రహాలు తయారు చేసి సమర్పించాడు. వాటిని ఈ నాటికి మన తరం కూడాచూడవచ్చు.

తర్వాతి కాలంలో దేవరకోట ప్రభుతువలు స్మామి వారి మహిమలు విని భక్తుల సహకారంతో ఆలయ మంతా పాదులు కట్టించి స్వామివారికి సేవలలో ఎలాంటి లోపాలు రాకుండా జాగ్రత్తగా తమ దేవాలయ పాలన గావించారు. ఇటీవల కాంలో మరల దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా దేవాదాయ శాఖ వారు తీర్చిదిద్దారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తూర్పు దిశగా ఉన్నది. గర్భగుడిలో ఆరు లేక ఏడు పాము చుల మీత (ఇదే పావనపట్టం) ఆశ్వరుటు (లింగం) ఉన్నాడు. ఈయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పావన పట్టం కింద అందరికి కనపడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంది. అర్చన అభిషేకాదులపుడు ఆ రంధ్రంలో పాలు పోస్తారు. ఆలయ ప్రదక్షణ మార్గంలో దక్షిణం వైపున ఉన్న పుట్ట నుండి గర్భగుడి లోకి లోపలి దారి ఉన్నట్లు భక్తుల విశ్వాసం. దేవతా సర్పం ఈ మార్గం గుండా పయనిస్తుంది. గర్భగుడిలో ఉన్న స్వామివారికి అత్యంత భక్తి శ్రద్దలతో అర్చకులు పూజా కార్యక్రమాలు , అభిషేకాలు చేస్తుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి భక్తులు అనేక విధాలుగా మొక్కుకుంటారు. చెవి పోగులు కుట్టిస్తారు. తలనీలాలు సమర్పిస్తారు. పొంగలి నివేదిస్తారు. కళ్యాణం జరిపిస్తారు. అన్న ప్రాసన , అక్షరాభ్యాసం , స్వామి వారి సన్నిధిలో జరిపించుకుంటారు. శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు , మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు , మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు , మహాన్యాస పూర్వ వారాభిషేకాలు శాస్తోకంగా నిర్వహిస్తుంటారు. మహిళల చీర మొక్కుబడులు , పిల్లల ఉయ్యాల ఊపు మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.

ఈ ఆలయానికి ఆగ్నేయ దిశగా స్వామి వారి కళ్యాణ మండపం ఉంది. దీనిని చల్లపల్లి రాజా వారి వంశస్థులు నిర్మించారు. కళ్యాణ మండప స్థంభము మీద ఉన్న శిలాఫలకం పై శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్, బహుదూర్ చల్లపల్లి రాజా వంశస్థులు , కోయంబతూరు వాస్తవ్యులు డి. జయవర్థన వేలు , వారి ధర్మపత్తి రాజ్యలక్ష్మి దంపతులచే భక్తి పూర్వకంగా సమర్పించబడినది.

Advertisements

మహిమాన్విత పుణ్యక్షేత్రం 'మోపిదేవి' Last Updated: 11 July 2016