విజయవాడ రాజకీయాలే కాక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఒక కుదుపు కుదిపిన అంశం, వంగవీటి రాధా కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. రంగా వర్ధంతి సందర్భంగా గుడ్లవల్లేరు మండలంలో రంగా విగ్రహావిష్కరణ చేసిన సమయంలో, తన హ-త్యకు రెక్కీ నిర్వహించారని, తనని భయపెట్టి లొంగ దీసుకోవాలని అనుకుంటే, అది జరగని పని అని అన్నారు. బెదిరింపులకు లొంగను అని, దేనికైనా రెడీ అని రాధా వ్యాఖ్యలు చేసారు. అయితే రాధా చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. రాధా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారు అనే చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా రాధా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పటికీ అధిష్టానంతో మంచిగానే ఉన్నారు. చంద్రబాబు తూర్పు నియోజకవర్గంలో రాధాను సెట్ చేయటానికి కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో రాధా చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే రాధా వ్యాఖ్యల పై చర్చ జరుగుతూ ఉండగానే, కొడాలి నాని, జగన్ తో మాట్లాడి, రాధా కు 2+2 గన్‌మెన్ల సెక్యూరిటీ కేటాయిస్తున్నాం అని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడానని, వెంటనే ఆయన సెక్యూరిటీ ఇచ్చారని కొడాలి నాని చెప్పారు. అయితే రాధా నిన్నటి నుంచి అందుబాటులో లేరు.

radha 28122021 2

ఈ రోజు బయటకు వచ్చిన రాధా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్లను తిరస్కరించారు. 2+2 గన్‌మెన్లను సెక్యూరిటీ అవసరం లేదని, వారిని వెనక్కి తిప్పి పంపించారు. గన్‌మెన్లు తనకు అవసరం లేదని అన్నారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇది జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం అని చెప్పినా, రాధా తిరస్కరించటంతో, ఈ స్కెచ్ వెనుక వైసీపీ నేతలే ఉన్నారా అనే చర్చ జరుగుతుంది. అయితే మరో పక్క, వైసీపీ నేత దెవినేని అవినాష్ అనుచరుడు అలాగే వైసీపీ నేత అయిన అరవ సత్యం పోలీసులు అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నిన్న అరవ సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే పోలీసుల విచారణలో అరవ సత్యం స్పృహ తప్పి పడిపోయారు. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ గా అరవ సత్యం ఉన్నారు. దేవినేని అవినాష్ అనుచరుడు కావటంతో, ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. పోలీసులు మాత్రం, ఈ అరెస్ట్ ధృవీకరించలేదు.

తమిళనాడు సియం స్టాలిన్‌ చేస్తున్న పనిని తెలుగుదేశం పార్టీ అభిమానులు సోషల్ మీడియా లో వీపరీతంగా పొగిడేస్తున్నారు. స్టాలిన్‌ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనే ఇప్పుడు స్టాలిన్ కూడా చేయడంతో  తమ అధినేత చేసిన పని అందరికి స్ఫూర్తిదాయకం అని తెలుగు తమ్ముళ్ళు మంచి జోష్ లో ఉన్నారు. ఎందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ని  తెలుగుదేశం శ్రేణులు పొగుడుతున్నరంటారా? ఎందుకంటే ఈ మధ్యే  తమిళనాడు సియం స్టాలిన్ సీఎం డాష్ బోర్డ్ ను స్టార్ట్ చేసారు. తమ ప్రభుత్వం పాలనలోని  ముఖ్యమైన విషయాలను తనే స్వయంగ సమీక్షిస్తారని తెలిపారు. తెలుగు దేశం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సీఎం డాష్ బోర్డును మొదలు పెట్టి ఎంతో పారదర్శకమైన పాలన అందించారో తెలిసిందే. చంద్రబాబు పాలన అందరి ముఖ్య మంత్రులకు ఆదర్శమని, అన్ని రాష్ట్రాలు, కేంద్రం కూడా ఇది ఇంప్లెమెంట్ చేయాలి అంటూ, రాష్ట్రపతి కూడా కొనియాడారు. చంద్రబాబు స్పూర్తితితో మరికొన్ని రాష్ట్రాలు కూడా డాష్ బోర్డును మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాయి అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎన్నో రాష్ట్రాలు మా చంద్ర బాబు చేసిన పనిని స్పూర్తిదాయకంగా తీసుకుంటుంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అమలులో ఉన్న డ్యాష్ బోర్డు ని పక్కన పడేశారని వాపోతున్నారు.

వైస్ వివేకా హ-త్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సిబిఐ కీలక నిందితుడిగా భావిస్తుంది. ఆయన్ను అదుపులోకి తీసుకున్న సిబిఐ, కోర్టు ఆదేశాలు ప్రకారం రిమాండ్ కు తరలించింది. కడప సెంట్రల్ జైలుకి పంపిన తరువాత ఎక్కువ శాతం కడప రిమ్స్ హాస్పిటల్లోనే గడిపినట్టు అర్ధం అవుతుంది. ఈ విషయం బెయిలు పిటీషన్ రద్దు చేసేటప్పుడు మేజిస్ట్రేట్ కు, సిబిఐ ఈ పాయింట్ కూడా యాడ్ చేసి తమ వాదనలు వినిపించింది. అయితే అప్పట్లోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసులో ప్రధాన నిందితుడుని కోర్ట్ అనుమతి లేకుండా రిమ్స్ కు ఎలా తరలిస్తారని, అనారోగ్య కారణాలు ఏమైనా ఉంటే రూల్స్ ప్రకారం జైలు సూపరేండెంట్ ద్వారా వెళ్ళాలని, అన్నిటి కంటే ముందు కోర్ట్ అనుమతి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. అయితే ఎవరి అనుమతి తీసుకోలేదని సిబిఐ ఆ పాయింట్ ను కోర్టుకు, చెప్పగా మేజిస్ట్రేట్ దాని మీద ప్రశ్నించారు. మొన్న బెయిలు పిటీషన్ రద్దు అయినప్పుడు కూడా కోర్ట్ అనుమతి లేనిదే ఎక్కడికీ వెల్లకూడదని చెప్పటం జరిగింది. మళ్ళీ ఆయన్ను రిమ్స్ కు తీసుకుని వెళ్ళారు. మరో వైపు రిమ్స్ అధికారులు శంకర్ రెడ్డికి మరో ఆపరేషన్ అవసరం అవుతుందని చెప్తున్నారు. ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నప్పుడు ఒక సర్జరీ జరిగిందని ఆయన వర్గీయులు చెప్తున్నారు.

viveka 28122021 2

ఆ తరువాత సిబిఐ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి, పదే పదే అనారోగ్య కారణాలు చెబుతూ తరచూ రిమ్స్ లో జాయిన్ అవ్వటం చేస్తున్నారు. అంత కీలక నిందితుడు కోర్ట్ అనుమతి లేకుండా పదేపదే రిమ్స్ లో పోలీసులు ఎలా పెడతారని కూడా సిబిఐ అభ్యంతరం చెప్పటం జరిగింది. మరో వైపు రిమ్స్ అధికారులు శంకర్ రెడ్డికి మరో ఆపరేషన్ అవసరం అవుతుందని చెప్పారు. ఆర్థ్రో కు సంభంధించే కాకుండా మరో ఆపరేషన్ అవసరం అవుతుందని రిమ్స్ వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు సర్జరీ చెయలన్నా కూడా కోర్ట్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సిందే. అయితే జైలు సూపరిడెంట్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు శంకర్ రెడ్డి కోర్ట్ అనిమతి తీసుకున్నారని ఆయన్ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ రోజే కోర్టు ముందు హాజరు పరుస్తామని, పులివెందుల కోర్ట్ లో మేజిస్ట్రేట్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడతారని చెప్పటం జరిగింది. అయితే అసలు సర్జరీకి కోర్ట్ అనుమతి ఇంచ్చిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ సర్జరీ చేస్తే మళ్ళి రెస్ట్ కోసం అంటూ ఇంకొన్ని రోజులు హాస్పటల్ లో ఉండాల్సి వస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పై, ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాసం ఉంది.

హిందూపురం ఎమ్మెల్యే ,హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి దగ్గర కొంత సేపటి క్రితం వైసిపి, టిడిపి కార్యకర్తల నినాదాలతో ఉద్ద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. డంపింగ్ యార్డు వివాదంతో ఇరువర్గాలు బహిరంగంగా సవాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఇరు వర్గాలు సవాళ్ళు ,ప్రతి సవాళ్ళు విసురుకోవడంతో ఈ వివాదం ముదిరింది. నందమూరి బాలకృష్ణ ఇల్లు చౌడేస్వరం కాలనీలో ఉంటుంది. ఆ కాలనీ వెనుకు వైపు మోత్కుపల్లిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసారు. ఆ
డంపింగ్ యార్డు దగ్గర వ్యర్ధలన్నింటిని కుడా కాల్చివేయడంతో ఆ ప్రాంతం అంత కూడా దుర్వాసన రావడంతో పాటు పొగ చుట్టూ కుంటోంది. ఈ డంపింగ్ యార్డ్ కారణంగానే ఈ ప్రాంతం అంత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నరంటూ టిడిపి కి చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టటం జరిగింది. దీనికి ప్రతి సవాలుగా వైసిపికి సంబంధించి వారు కూడా అభివృది పై తాము చర్చకు సిద్దంగా ఉన్నామని, రెండు సంవత్సరాలుగా తాము ఏమి అభివృది చేశామనే దాని పైన పోస్ట్ పెట్టారు. దీనితో ఇరువర్గాల మధ్య సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టుకుంటూ వివాదం ఏర్పడింది. దీని పైన ఈ రోజు చర్చకు సిద్దమంటూ చెప్పారు. అందులో బాగంగానే వైసిపి శ్రేణులు పదుల సంఖ్యలో బాలకృష్ణ ఇంటికి వచ్చి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో వైపు టిడిపి కార్యకర్తలు కూడా ఒక్కసారిగా బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చిఇరు వర్గాలను చెదరగొట్టారు.

Advertisements

Latest Articles

Most Read