విశాఖ‌ప‌ట్ణణంలో ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ ఘ‌నంగా ఆరంభ‌మైంద‌ని వైసీపీ స‌ర్కారు ఊద‌ర‌గొడుతోంది. 13 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి, మంత్రుల మ‌ధ్య పెట్టుబ‌డుల ప్ర‌క‌ట‌న‌పై స‌మ‌న్వ‌యం లోపించింద‌ని స్ప‌ష్ట‌మైంది. యంగ్ డైన‌మిక్ లేడీ మినిస్ట‌ర్ విడ‌ద‌ల ర‌జ‌నీ 2 ల‌క్ష‌ల కోట్లు అని చెప్ప‌గా, సీఎం 13 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు రానున్నాయ‌ని స‌గ‌ర్వంగా చెప్పారు. అంబానీ, జీఎమ్మార్, జిందాల్ వంటి పారిశ్రామిక ప్ర‌ముఖులు హాజ‌రు కావ‌డం విశాఖ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ కి కొంత ఇన్వెస్ట‌ర్ల లుక్ క‌నిపించింది. అయితే భోజ‌నాలు, స‌మ్మిట్ కిట్ల వ‌ద్ద జ‌రిగిన తోపులాటతో ఇన్వెస్ట‌ర్లు ఇలా కొట్లాట‌కి దిగారా అనే అనుమానాలు రాక మాన‌వు. కొంద‌రైతే మెడ‌లో స‌మ్మిట్ ఎంట్రీ కార్డుతో భోజ‌నాల కోసం గొడ‌వ ప‌డ‌డం క‌నిపించింది. మ‌రికొంద‌రు ల‌డ్డూ, పింగాణీ ప్లేటు, బుక్, పెన్ను ఉన్న కిట్ల కోసం ఎగ‌బ‌డి స్టాళ్ల‌ను విర‌గ్గొట్టేశారు. వీరా ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌డానికి వ‌చ్చిన ప్ర‌తినిధులు అని అంద‌రిలో సందేహాలు మొద‌ల‌య్యాయి.  కోర్ అంటే వేదిక‌పై సీఎంతో పాటు ఆశీసులైన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌లు త‌ప్పించి కింద రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న వారిలో అత్య‌ధికులు వైసీపీ సోష‌ల్ మీడియా వాళ్లేన‌ని తెలుస్తోంది. వీరు మ‌రీ ర‌ఫ్‌గా క‌నిపిస్తున్నార‌ని చివ‌రి వ‌ర‌స‌లో పెట్టి, కొద్దిగా క్లాసుగా క‌నిపించే ఐ ప్యాక్ నార్త్ వాళ్లంద‌రినీ ముందు వ‌ర‌స‌లో కూర్చోబెట్టారు. మ‌రోవైపు ఐప్యాక్లో ప‌నిచేసే తెలుగువాళ్ల‌ని స‌మ్మిట్ కి తీసుకెళ్ల‌లేద‌ని స‌మాచారం. ఎందుకంటే వారు వీళ్లు ఇన్వెస్ట‌ర్లు కాదు, ఐ ప్యాక్ ఎంప్లాయీస్ అని నోరు జారుతార‌నే భ‌యంతో తీసుకెళ్ల‌లేద‌ని తెలుస్తోంది.

భార‌త‌దేశంలోనే ధ‌నిక సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. సీబీఐ, ఈడీ కేసులే 42 వేల కోట్ల అవినీతిపై పెట్టాయి. జ‌గ‌న్ రెడ్డి క్విడ్ ప్రోకో బిజినెస్ మోడ‌ల్ ప్ర‌పంచ ఆర్థిక‌నేరాల‌లోనూ పాఠంగా చేరింది. తండ్రి అధికార‌మే పెట్టుబ‌డిగా ల‌క్ష‌ల కోట్ల కంపెనీలు, ఆస్తుల‌కి అధిప‌తి అయిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపులో దేశ‌విదేశాల నుంచి ఇన్వెస్ట‌ర్లు వ‌చ్చి 13 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అంగీక‌రించారు. ఏపీలో వైసీపీ స‌ర్కారు, దాని అనుకూల మీడియా దీనిపై ప్ర‌చారం హోరెత్తిస్తోంది. అంబానీ, అదానీల‌ను ర‌ప్పించ‌గ‌లిగిన వైఎస్ జ‌గ‌న్ రెడ్డి త‌న కంపెనీల నుంచి ఒక్క రూపాయి కూడా ఆంధ్రాలో ఎందుకు పెట్టుబ‌డి పెట్ట‌లేద‌నేది అంతుబ‌ట్ట‌ని మిస్ట‌రీ. ఏపీలో పెడితే లాభం లేద‌నుకున్నారా? సీబీఐ, ఈడీ చెబుతున్న‌ట్టు అవ‌న్నీ సూటు కేసు కంపెనీలేనా? జగ‌న్ రెడ్డికి చెందిన సండూర్ పవర్, సరస్వతి పవర్, 3. ఆమోద ఐరన్, భారతి సిమెంట్, కార్మెల్ ఆసియా, జగతి పబ్లికేషన్స్ సంస్థ‌ల‌లో ఏ ఒక్క సంస్థ నుంచి ఏపీలో జ‌రిగిన గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌లో రూపాయి ఎంవోయూ చేసుకోక‌పోవ‌డం విస్మ‌యం గొలుపుతోంది.

ఏపీ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం చ‌దువు పెద్ద‌గా లేదు కానీ క‌బ్జాల విష‌యంలో అన‌కొండ‌ని మించిపోతాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇట్టినా ప్లాంటేష‌న్ కంపెనీకి చెందిన‌ వంద‌ల ఎకరాలు కారు చౌక‌గా కొట్టేశాడ‌ని హోరెత్తిపోయింది. జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు క‌నీసం విచార‌ణ కూడా జ‌ర‌ప‌లేదు. అయితే కేంద్ర ఆదాయ ప‌న్నుశాఖ మాత్రం మంత్రిపై ఓ క‌న్ను వేసింది. గ‌తంలోనూ కార్మిక‌శాఖ మంత్రిగా బెంజ్ కారు లంచంగా తీసుకున్నార‌నే టిడిపి ఆధారాలో స‌హా బ‌య‌ట‌పెట్టింది. అయినా మంత్రిపై చ‌ర్య‌లు శూన్యం. తాను లాగేసుకున్న భూముల‌ను తిరిగి ఇచ్చేస్తాన‌ని కొద్దిరోజుల క్రితం మంత్రి ప్ర‌క‌టించారు. ఈ భూముల కొనుగోలులో జ‌రిగిన భారీ డ‌బ్బు లావాదేవీల‌పై ఐటీ శాఖ గ‌తంలో నోటీసులు ఇచ్చింది. దీనిని మంత్రి ప‌ట్టించుకోలేదు. దీంతో రెండోసారి ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. ఇట్టినా భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఈనెల 17 లోపు త‌మ ముందు హాజ‌రై వివరణ ఇవ్వాలని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. ఏప్రిల్ 3న జ‌రిగే వీడియో కాన్ఫరెన్సుకి త‌ప్ప‌క‌ హాజరుకావాలని జయరాం, ఆయన భార్యకు ఐటీ నోటీసులు జారీ చేసింది. మంత్రి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఇట్టినా ప్లాంటేషన్ పేరుతో రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి కార్య‌క‌లాపాలు ఆరంభించ‌లేదు. ఇది ప‌సిగ‌ట్టిన మంత్రి ఇట్టినా కంపెనీలో ఓ వాటాదారుడిని లైనులో పెట్టుకుని అక్ర‌మంగా భూములు లాగేసుకున్నార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ఇట్టినాకి చెందిన‌ 450 ఎకరాల భూమిలో వందెకరాలు కొన్నది వాస్తవమేనని మంత్రి గుమ్మనూరు జయరాం కూడా అంగీకరించారు. వీటిని తిరిగి రైతులకు మార్కెట్‌ ధర ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తానని చెప్పారు.

విశాఖ కేంద్రంగా జ‌రిగిన గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి రోజే 13 ల‌క్ష‌ల‌కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ పెట్టుబ‌డుల ద్వారా 6 ల‌క్ష‌ల మందికి ఉద్యోగావ‌కాశాలు వ‌స్తాయ‌ని తెలిపారు. వివిధ రంగాల‌కు చెందిన కంపెనీల‌తో చేసుకున్నామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. ఈ కంపెనీల‌లో చాలా వ‌ర‌కూ జ‌గ‌న్ రెడ్డి బినామీలు, ఆయ‌న అక్ర‌మాస్తుల కేసుల్లో ఉన్న‌వాళ్లు, ఆయ‌న బంధువులు, ఆయ‌న పార్టీ వాళ్లే కావ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ఏపీలో టిడిపి స‌ర్కారు ఉన్న‌ప్పుడు ఎంవోయూ చేసుకున్న చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ గ్రీన్ కో...ఇటీవ‌ల దావోస్ వెళ్లి టిడిపి హ‌యాంలో చేసుకున్న ఒప్పందాల‌నే మ‌ళ్లీ చేసుకుంది. తాజాగా విశాఖ‌లోనూ మ‌రోసారి ఎంవోయూ చేసుకోవ‌డం అనుమానాస్ప‌ద పెట్టుబ‌డులు అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇండోసాల్ ఎంవోయూ రూ.76,033 కోట్లు చేసుకున్నామ‌ని చెప్పారు. ఇది జ‌గ‌న్ రెడ్డి స‌న్నిహితుల  కంపెనీ. జ‌గ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల కేసులో ఉన్న విజ‌య‌సాయిరెడ్డి వియ్యంకుడు కంపెనీ అరబిందో గ్రూప్‌ రూ.10,365 కోట్లు పెట్టుబ‌డి క‌ట్టుక‌థేన‌ని ప్ర‌చారం సాగుతోంది. సీఎంకి చెందిన కంపెనీ అని పేరుప‌డిన  షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ.8,855 కోట్లు పెట్టుబడి అంటేనే జ‌నం విర‌గ‌బ‌డి న‌వ్వుతున్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన చాలా కంపెనీలు వారి బినామీలు, క్విడ్ ప్రోకో కేసులలో ఉన్న‌వారేన‌ని స్ప‌ష్టం అవుతోంది. మ‌రికొన్ని కంపెనీలు వైసీపీకి చెందిన‌వారివ‌ని టాక్ వినిపిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read