మన భారత దేశం గొప్పతనం ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ప్రజాభిప్రాయంతో పని లేకుండా అయిపోతుంది. అందరూ చూస్తూ ఉండగా వేల వేల దొంగ ఓట్లు వేస్తున్నా, మీడియాలో చూపించినా, వాటి పై ఇప్పటి వరకు ఒక్క వ్యవస్థ కూడా స్పందించలేదు. ఇలా అయితే ఇక ఈ ప్రజాస్వామ్యం పై ఎవరికి నమ్మకం ఉంటుంది ? ప్రతిపక్ష పార్టీలు సరిగ్గా పోరాటం చేయటం లేదా ? లేదా తప్పు ప్రజల్లో ఉందా ? లేదా వ్యవస్థల్లో ఉందా ? ఇప్పుడు వదిలేసారు. ఇదే ఇక ప్రతి ఎన్నికలో చేస్తారు కదా ? అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చేస్తారు కదా ? ఇప్పటికే మీకు మనం దేనికి గురించి మాట్లాడుకుంటున్నామో అర్ధమయ్యే ఉంటుంది. భారత దేశ ప్రజాస్వామ్యం అపహస్యమైన తిరుపతి ఉప ఎన్నిక గురించి. తిరుపతి ఉప ఎన్నిక ఇరు పార్టీలు హోరాహోరీగా తీసుకున్నాయి. అప్పటికే వాలంటర్లతో చేయాల్సింది చేసారు, ముందు రోజు మందు, డబ్బులు సరే సరే. అయినా మరి ఎందుకు అనుమానం వచ్చిందో, ఒక పార్టీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించింది. ఇవన్నీ మీడియాలో కనిపించాయి. ఏదో ఒకటి రెండు సంఘటనలు కాదు. ఏకంగా ఒక 50 సంఘటనలు అయినా మీడియా కవర్ చేసి ఉంటుంది. ఇక వెలుగులోకి రానివి ఎన్నటి ఉంటాయో. ఇలా అనేక ఘటనలు ఆ రోజు జరిగాయి.

ec 01052021 2

ముందు రోజే పక్క నియోజకవర్గాల నుంచి జనాలను తోలుకుని వచ్చి, కళ్యాణమండపాలలో పెట్టారు. ఉదయం ఒక జాతర లాగా బయలు దేరారు. కొన్ని పార్టీలు అడ్డుకున్నాయి. ఇక లైన్ లో నుంచున్న వారి దగ్గరకు వెళ్లి, కార్డు తీసుకుని, మీ నాయన పేరు ఏంటి అంటే చెప్పలేక పోయారు, మీ భర్త పేరు అంటే చెప్పలేక పోయారు, కొంత మంది సమాధానం చెప్పలేక పరిగెత్తారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కు కొన్ని పార్టీలు ఫిర్యాదు చేసాయి. ఎన్నికల కమిషన్ వారికి వచ్చిన రిపోర్ట్ లు అన్నీ సక్రమంగా ఉండటంతో, వారు కూడా పట్టించుకోలేదు. ఇక హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్ట్ ఏమో ఇది మా పరిధిలోకి రాదు, మీకు సమయం ఉంది కాబట్టి ఎన్నికల పిటీషన్ వేసుకోండి అని చెప్పారు. ఇది సరిగ్గా ఎన్నికల కౌంటింగ్ కు రెండు రోజులు ముందు చెప్పారు. ఒక పక్క వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మీడియా కధనాలు ఉన్నాయి. దొంగ ఓట్లు పోలు అయ్యాయి అని అందరికీ తెలుసు. ఒక్క కేసు లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయటం లేదు, ఒక్క చర్య కూడా లేరు. రేపు పోలింగ్ కూడా జరిగిపోతుంది. ఈ పరిస్థితిలో, ఎన్నికల వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం ఉంటుందా ? అన్ని వ్యవస్థలు ఈ విషయం పై ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి.

కర్నూల్ లో ఘోరం జరిగింది.  కేఎస్‌ కే‌ర్ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 5గురు చనిపోయారు. అయితే ఈ ఘటనలో ప్రధాన బాధ్యులు  కేఎస్‌ కే‌ర్ హాస్పిటల్ సిబ్బంది అనే తెలుస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు వచ్చి, హాస్పిటల్ లోని అన్ని విభాగాలను పరిశీలించారు. అన్నీ పరిశీలించిన తరువాత, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క-రో-నా బాధితులతో పాటు, ఇతర రోగులు కూడా చికిత్స తీసుకుంటున్నట్టు గుర్తించారు. మూడు ఫ్లోర్లు ఉన్న హాస్పిటల్ లో, దాదాపుగా 50 మంది వరకు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు గుర్తించారు. అక్కడ ఉన్న డాక్టర్లు, సిబ్బందితో పాటు, అక్కడ రోగులు, వారి బంధువులతో కూడా అధికారులు మాట్లాడారు. అయితే ఇక్కడ అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, హాస్పిటల్ యాజమాన్యం చెప్పిందని తెలిపారు. అయితే ఇక్కడ ఆక్సిజన్ అందక 5 గురు చనిపోవటంతో, ఈ హాస్పిటల్ కు ఎలాంటి అనుమతులు లేవని తెలిసిందని, క-రో-నా వైద్యం కోసం అనుమతి ఇవ్వలేదని తెలిసిందని, లబోదిబోమన్నారు. అయితే పోలీసులు రాగానే, హాస్పిటల్ యాజమాన్యం తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డిజాస్టర్ మ్యానెజ్మెంట్ ఆక్ట్ పై, హాస్పిటల్ పై కేసు నమోదు చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లుగా కొత్తగా వస్తున్న కంపెనీలు కంటే, వెళ్ళిపోతున్న కంపెనీల లిస్టు పెరిగిపోతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి చూసి, కొన్ని కంపెనీలు వెనక్కు వెళ్ళగా, రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో కొన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి. ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితిలో, కొత్తగా పెట్టుబడులు ఆకర్షించాలి అంటే ఎంతో శ్రమించాలి. మన చిన్న రాష్ట్రం మరింతగా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంటేనే, కొత్త కంపెనీలు వస్తాయి. అయితే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. బహుసా కొత్త పెట్టుబడులతో ఓట్లు రావు అనుకున్నారో ఏమో, అప్పు చేసి పధకాలు ఖర్చు పెడితే చాలు అనుకున్నారో ఏమో కానీ, కొత్త పెట్టుబడులు తీసుకు రాక పోగా, ఉన్న వాటి పై కక్ష తీర్చుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా బ్యాటరీల ఉత్పత్తిలో అమర్​రాజా బాటరీస్ కంపెనీకి మంచి పేరు ఉంది. చిత్తూరు జిల్లాలో ఈ సంస్థకు మూడు ప్లాంట్ల వరకు ఉన్నాయి. దాదాపుగా ఆరు వేల మంది ఉద్యోగులు, ఈ కంపెనీలో ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసే దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నిద్ర పట్టేలా లేదు. నాలుగు నెలల క్రిందట, ఆ కంపెనీకి గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవటానికి ప్రయత్నాలు చేయగా, కోర్టు ఆదేశాలతో అది కుదరలేదు.

amar01052021 2

దీంతో ఇప్పుడు రూట్ మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చింది అంటూ, అమర్​రాజా బాటరీస్​ కు సంబందించిన ప్లాంట్స్ అన్నీ మూసేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కంపెనీ కాలుష్య నియంత్రణ చర్యలు పాటించటం లేదు అంటూ, కంపెనీ మూసేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పై, అమర్​రాజా బాటరీస్​ స్పందించింది. ఆ ఉత్తర్వులు పరిశీలిస్తున్నాం అని, తగిన రీతులో దీనికి సమాధానం ఇస్తాం అని చెప్పారు. తాము అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, తెలిపారు. అయితే అమర్​రాజా బాటరీస్​, గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ది కావటంతోనే, ప్రభుత్వం ఇలా కక్ష సాధింపుకు పాల్పడుతుందని, తెలుగుదేశం ఆరోపిస్తుంది. అమర్​రాజా బాటరీస్​ కు ఇది షాక్ కాదని, అక్కడ పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు షాక్ అని, అధిక పన్నులు ఈ కంపెనీ నుంచి తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ అని వాపోయారు.

అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని, పలు రకాలుగా వైసీపీ నేతలు హేళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు ఆవేదన, మహిళల బాధ కంటే, వీరి వెటకారం ఎక్కువ అయ్యింది. పలు సందర్భాల్లో వైసీపీ నేతలు హేళన చేసారు. ఇప్పుడు అమరావతి ఉద్యమం 500 రోజులు అయిన సందర్భంగా, ఉద్యమం చేస్తుంటే, మంత్రి బొత్సా మళ్ళీ హేళన చేసారు. 500 రోజుల ఉత్సవాలు కాకాపోతే, 1000 రోజులు ఉత్సవాలు చేసుకోండి అంటూ హేళన చేసారు. అమరావతి ఉద్యమాలు అన్నీ బోగస్ అని అన్నారు. ఉద్యమాన్ని పండుగలా జరుపుకుంటూ, మరోపక్క రైతులు బాధపడుతున్నారని చెప్పటం ఏమిటి అంటూ ద్దేవ చేశారు. అమరావతిలో పెట్టిన పరిరక్షణ సమితిని చంద్రబాబు తన బినామీల ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఏర్పాటు చేసారని అన్నారు. మూడు రాజధానుల విధానానికి ప్రజల నుంచి కూడా ఆమోదం లభించిందన్నారు. తన బినామీలకు ఎటు వంటి నష్టం రాకూ డదనే ధ్యేయంతో చంద్రబాబు పని చేస్తున్నాడన్నది అర్ధమవుతోందన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి ప్రభుత్వం ఎంతో బాధ్యతతో వుందన్నారు.

botsa 01052021 2

చంద్ర బాబు సీఎంగా వున్నప్పుడు ప్రకటించిన దానికన్నా ఎక్కువ కాలపరిమితికి కౌలు, పెన్షన్లు, పంటపరిహారం కూడా పెంచి ఇస్తున్నామని చెప్పుకొచ్చా రు. ఇచ్చిన మాట ప్రకారం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే.. కోర్టులలో సాంకేతికపరమైన అంశాలతో స్టేలు తీసుకు వచ్చి చంద్రబాబు, ఆయన అనుయాయులు అడ్డుకుంటు న్నారని ఆరోపించారు. లేకపోతే ఈ పాటికే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చి ఉండే వాళ్లమని స్పష్టంచేశారు. హైదరాబాదు పరిమితమైన చంద్రబాబు ఈ రోజు జూమ్ కాన్ఫెరెన్స్ లో చెప్పినవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ఈ సమయంలోనూ రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో అన్ని వర్గాల వారికీ, రైతులు, రైతుకూలీలు, సామాన్యులు, ఉద్యోగులకు అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి క్షణం పని చేస్తున్నామని వెల్లడించారు. అయితే మంత్రి బొత్సా వ్యాఖ్యల పై అమరావతి మహిళలు , రైతులు మండి పడ్డారు. మొదటి నుంచి మమ్మల్ని ఇలా వేధిస్తూనే ఉన్నారని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read