సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది కాలంగా నలుగుతున్న కేసులో, ఎన్వీ రమణ సంచలన ఆదేశాలు ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ యోగి సర్కార్, తమ వాదనలు గట్టిగా వినిపించినా, చీఫ్ జస్టిస్ బెంచ్ మాత్రం , వారి వాదనలు తోసిపుచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే, హాత్రస్ లో దళిత యువతికి జరిగిన అ-త్యా-చా-ర సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సంఘటన కవర్ చేయటానికి వెళ్ళిన కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ పై, UAPA చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. సుదీర్ఘకాలంగా ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. అయితే, గత ఏడాది కాలంగా ఈ కేసు విషయమై అతనికి న్యాయం జరగలేదు. సిద్దిక్ కప్పన్ ఆరోగ్యం బాగోక పోవటం, కో-వి-డ్ బారిన పడటంతో, మధురలోని ఒక హాస్పిటల్ లో, ఆయన్ను ఒక మంచం పై కట్టేసి, జంతువులాగా చూస్తున్నారని, కనీసం టాయిలెట్ కు కూడా వెళ్ళనివ్వకుండా, డబ్బాలు పెడుతున్నారని, సరైన ఆహరం కూడా ఆయనకు అందించటం లేదని, ఇలాగే చేస్తే అతను చనిపోయే అవకశం ఉంది అంటూ, కేరళ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ , సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఆయనకు వేసిన చైన్లు తొలగించి, సత్వరమే, మంచి వైద్యం అందించకపోతే, ఆయన చ-ని-పో-యే అవకాసం ఉందని వాదించారు. అలాగే సిద్దిక్ భార్య రైహంత్‌ కప్పన్‌ కూడా, ఈ విషయాలు అన్నీ ప్రస్తావిస్తూ, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ కూడా రాసారు. ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణకు స్వీకరించింది. తమకు బెయిల్ కంటే ముందు, హెల్త్ ఎమర్జెన్సీ ముఖ్యం అని, మంచి వైద్యం అందించాలని కోరారు.

cji 29042021 2

దీనికి స్పందించిన బెంచ్, ఆయన ఎలాంటి నేరాలు చేసారో అనేది పక్కన పెడితే, అతనికి అనారోగ్యం ఉంటే, చికిత్స అందించటం అనేది ప్రధాన బాధ్యత అని, అతనికి ఢిల్లీలోని ఒక ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే, యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వాదిస్తూ, అతనికి కరుడుగట్టిన ఉ-గ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, ఆర్ధిక ప్రయోజనాలు కూడా పొందాడని, అలాంటి వాడి పై జాలి చూపించకూడదని వాదించారు. అతను వైద్యులకు సహకరించకుండా, కులం, మతం అడ్డుపెట్టుకుని బెయిల్ కోసం చూస్తున్నారని వాదించారు. దీనికి స్పందించిన కోర్టు, మీరు చెప్తున్న ఉ-గ్ర సంస్థ పై పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిషేధం విధించలేదు కదా, అయినా అతని బ్యాంక్ లావాదేవీలు చూస్తే. 25 వేలు కూడా లేవు, దానికి వైద్యానికి ముడిపెట్టటం కరెక్ట్ కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని, కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో సుప్రీం ఇచ్చిన ఆదేశాల పై, పలువురు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కేసుని యోగి ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకున్నా, చీఫ్ జస్టిస్ బెంచ్ ఎక్కడా ఒత్తిడికి తలొగ్గకుండా, సరైనా తీర్పు ఇచ్చిందని హర్షం వ్యక్తం చేసారు.

రాష్ట్రంలో కరోనా విలయతాండవానికి, ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయంతో బతకడానికి మూర్ఖుడైన మన ముఖ్యమంత్రే కారణమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. బుధవారం ఆయన తన సందేశాన్ని వీడియో రూపంలో విలేకరులకు పంపించారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ, కరోనా వస్తే ఏ ఆసుపత్రికి వెళ్లాలో తెలియడంలేదని, ఎక్కడ కరోనా చికిత్స అందిస్తున్నారో తెలియడంలేదని, చాలా ఆసుపత్రుల్లో కనీసం బెడ్లు కూడా దొరకడం లేదన్నారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో చూస్తున్నామని, మృత దేహాలను తరలించడానికి కూడా అంబులెన్సులు దొరకడం లేదన్నా రు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖమంత్రి, మూర్ఖుడైన ముఖ్యమం త్రికి ఆలోచన రావడం సిగ్గుచేటన్నారు. 16లక్షల మంది విద్యార్థులు, పది, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉందని, వారితో పాటు తల్లిదండ్రు లు, భోదనా,బోధనేతర సిబ్బంది కలుపుకొని సుమారు 40లక్షల మంది వరకు కరోనాకు గురయ్యే అవకాశముందని అయ్యన్న స్పష్టం చేశారు. 40లక్షలమందికి కరోనా వస్తే పరిస్థితి ఏమిటనే ఆలోచన ఇంగితం, ముఖ్యమంత్రికి, విద్యాశాఖమంత్రికి లేదా అన్నారు. కరోనా రెండోదశ వ్యాప్తి చాలావేగంగా, ప్రమాదకరంగా ఉందని, చిన్నపిల్లలు కూడా వైరస్ బారినపడుతున్నారన్నారు. పరీక్షలు వాయి దావేయాలని విద్యార్థులు, వారితల్లిదండ్రులు, ప్రతిపక్షపార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నా ముఖ్యమంత్రి మూర్ఖంగా ముందుకెళ్లాలని చూడటం ఏమిటన్నారు. ఎవరి మాటా వినకుండా ముఖ్యమంత్రికి ఇంతటి మూర్ఖత్వమేమిటని చింతకాయల ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్నారుల జీవితాలతో ఆటలాడటం ముఖ్యమంత్రికి తగదని, ఎవరెంత చెప్పినా వినకుండా పరీక్షలు పెట్టే తీరుతామంటున్న ముఖ్యమంత్రి తీరుపై ప్రజలంతా కూడాఆలోచన చేయాలన్నారు.

అసెంబ్లీ సమావేశాలను, తిరుపతి ఉపఎన్నిక ప్రచారాన్ని కరోనా సాకుతో రద్దుచేసుకున్న ముఖ్యమంత్రి, తాను మాత్రం కరోనాకు భయపడుతూ, ఇతరులను మాత్రం దానికి బలిచేయాలని చూడటం ఏమిటన్నారు. జగన్ రెడ్డి కరోనాకు భయపడే ప్యాలెస్ నుంచి బయ టకు రావడంలేదని, ఎటువంటి సమావేశాలు, సభలు, పర్యటనలు లేకుండా కలుగులో దాక్కున్నాడని అయ్యన్నపాత్రుడు ఎద్దేవాచేశా రు. తనప్రాణాల గురించి అంతలా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి , పిల్ల ల ప్రాణాలను మాత్రం లెక్కచేయకపోవడం ఎంతమాత్రం సరికాద న్నారు. కరోనా నిబంధనలుఅనేవి ఎక్కడా అమలుకావడంలేదని, కళాశాలలు, పాఠశాలల్లో ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. అనేకమంది ఉపాధ్యాయులు ఇప్పటికే కరోనాకు గురయ్యారని, దాదాపు 110మందివరకు చనిపోయినట్లు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయని మాజీమంత్రి తెలిపారు. అనేక రాష్ట్రాలు పరీక్షలు వాయిదావేశాయని, ముఖ్యమంత్రి ఆదిశగా ఎందుకు నిర్ణ యం తీసుకోవడంలేదన్నారు. విద్యాశాఖ మంత్రి పరీక్షల గురించి మాట్లాడుతూ, ఏం భయంలేదంటూ వెటకారంగా మాట్లాడుతున్నా డని, అటువంటి పనికిమాలిన, చేతగాని మంత్రులుండబట్టే ప్రజల పరిస్థితి ఇంతదారుణంగా తయారైందన్నారు.

ఉపాధ్యాయ సంఘా లు చంద్రబాబునాయుడి హాయాంలో చీటికిమాటికీ గొడవలు చేసేవ ని, మరిప్పుడు ఆ సంఘాలన్నీ ఎందుకు ముఖ్యమంత్రిని నిలదీయడం లేదని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ఉపాధ్యాయులు చనిపోయినా విద్యార్థులు కరోనాకు గురవుతున్నా, తల్లిదండ్రులు భయాందోళనకు గురువుతున్నా ఉపాధ్యాయసంఘాలు ముఖ్యమంత్రిని కలిసి పరీక్షలు నిర్వహించవద్దని అడగకపోవడం ఏమిటన్నారు. ఉపాధ్యాయుల, ఆయా సంఘాలు ఒక్కసారి ఆత్మపరీశీలన చేసుకోవాలన్నారు. కేబి నెట్లో అనేకమంది సీనియర్ మంత్రులున్నారని, వారుకూడా ముఖ్యమంత్రికి చెప్పకపోతే ఎలాగని అయ్యన్నపాత్రుడు వాపోయా రు. ఏదైనా జరిగితే జరగబోయే దారుణాలకు ముఖ్యమంత్రే బాధ్యు డవుతాడనే వాస్తవాన్ని ఆయనకు అర్థమయ్యేలా మంత్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రే బాధ్యుడవుతాడని, అదేగానీ జరిగితే వారంతా ఈ మూర్ఖుడిని రోడ్డుపైనిలబెట్టే పరిస్థితి వస్తుందని మాజీమంత్రి హెచ్చరిం చారు. కాబట్టి ముఖ్యమంత్రి దీనిపై మూర్ఖత్వంతోకాకుండా మంచి తనంతో ఆలోచించాలని, పరీక్షలను వెంటనే వాయిదావేయాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా పరిస్థతి పై, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, కో-వి-డ్ నియంత్రణ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై, హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సామాజిక కార్యకర్త తోటా సురేష్ బాబు వేసిన పిటీషన్ విచారణ నేపధ్యంలో, రాష్ట్రంలో ప్రస్తుతం కో-వి-డ్ ఉన్న పరిస్థితిపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై ఎప్పటికప్పుడు ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన గదులు, బెడ్స్ సంఖ్యను డిస్ప్లే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నోటిఫై చేసిన హాస్పిటల్స్ కు సంబంధించి, నోడల్ ఆఫీసర్లు, వారి ఫోన్ నెంబర్లని కూడా ఎప్పటికప్పుడు డిస్ప్లే చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అత్యవసర మండుపు, ఆక్సిజన్ సప్లై, గదులు ఇలా ప్రతి సామాచారం, రోజు వారీ నివేదిక రూపంలో, హైకోర్టు దృష్టికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా రాష్ట్రంలో కో-వి-డ్ నిర్ధారణ పరీక్షలు వాటి సంఖ్య, ఫలితాలు, వీటి పై కూడా ధర్మాసనానికి రిపోర్ట్ ఇవ్వాలని తెలిపింది. దాదాపుగా రెండు గంటల పాటు, పిటీషనర్ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జెనెరల్ తో పాటు, ఇతర న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు.

hc 28042021 2

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థతి చాలా దారుణంగా ఉందని, బెడ్ల విషయంలో కావచ్చు, బాధితులకు పరీక్షలు, ఫలితాలు రావటానికి సమయం పట్టటం, ఈ లోపు చాలా మందికి వైరస్ అంటటం లాంటివి జరుగుతున్నాయని, పిటీషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆసుపత్రులు వద్ద కూడా చికిత్స అందించేందుకు ఇబ్బందులు పడుతున్నారు, బెడ్లు దొరకటం లేదు, అంబులెన్స్ ల లోనే, వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది, ఇలాంటి పరిస్థితిలో కో-వి-డ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుందని, అదే విధంగా చికిత్సకు సంబంధించి, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తుందని, ప్రభుత్వం ఆదేశాలు అమలు కావటం లేదని, ప్రైవేట్ హాస్పిటల్ లో దోపిడీ జరుగుతుందని, హైకోర్టు కు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరగా, స్పందించిన హైకోర్టు, కొన్ని కీలక సూచనలు ప్రభుత్వానికి చేయటమే కాకుండా, ప్రతి రోజు , రోజు వారీ నివేదిక, తమకు ఇవ్వాలని, రోజు వారీ సమీక్ష చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కో-వి-డ్ ఉద్ధృతి దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయించారు. విద్యార్థుల తరపున న్యాయపోరాటం చేస్తున్నాం అని, పరీక్షలు వద్దు, ప్రాణాలే ముద్దు అని తల్లిదండ్రులు చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. గత పది రోజులుగా, నారా లోకేష్ ఈ సమస్య పై ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు. వరుస పెట్టి, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మీటింగ్ లు పెట్టారు. అయినా ప్రభుత్వం దిగి రాక పోవటంతో, న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. ఇక ఇదే విషయం పై, ఈ రోజు ఉదయం టిడిపి అధినేత చంద్రబాబు కూడా మాట్లాడారు., "విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రికి ప్రాణాలు తీసే హక్కు లేదు. బలవంతంగా పరీక్షలు పెట్టే హక్కు లేదు. జరగబోయే పరిణామాలన్నింటికి వారిదే బాధ్యత. పరీక్షల నిర్వహణ వల్ల ఎవరూ చ-ని-పో-ర-ని, క-రో-నా ఎవరికీ సోకదని రాసివ్వగలరా? పరీక్షల నిర్వహణ సరికాదు. వైరస్ ను కంట్రోల్ చేసి పరీక్షలు పెట్టమనండి. బెడ్లు కూడా దొరికే పరిస్థితి లేదు. అందరూ వద్దన్నారు కాబట్టి పరీక్షలు పెడుతున్నారు. వితండవాదంతో రాష్ట్రాన్ని తగులబెడుతున్నారు. 20 రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు లేదా వాయిదా వేశారు."

exams 28042021 2

"కేంద్రం కూడా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను రద్దు చేశారు. అందరికంటే వీరు మేథావులా? నాడు-నేడుతో వ్యవస్థలను విధ్వంసం చేశారు. స్కూల్స్ ఓపెన్ చేసి దాదాపు 130 మంది ఉపాధ్యాయులు చ-ని-పో-యేం-దు-కు ఈ ప్రభుత్వం కారణమైంది. పిల్లలు సైతం క-రో-నా భారిన పడి వాళ్లు ఇంటిలో ఉన్నా పెద్దలపై కూడా ప్రభావం పడేలా ఈ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుంది. కేంద్రప్రభుత్వ సంస్థలన్నీ పరిక్షలను వాయిదా వేస్తే ఇక్కడ మాత్రం 10 వ తరగతి, ఇంటర్ పరిక్షలను పెడుతామంటున్నారు. విధ్యార్ధుల ప్రాణాలకు ఈ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా? ఈ ప్రభుత్వ చేతగానితనంతో, అసమర్ద నిర్ణయాలతో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు. అన్ని రాజకీయ పార్టీలు, విధ్యార్ధులు, తల్లిదండ్రలు పరిక్షలను వాయిదా వేయాలని కోరుతుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత మొండితనం? ప్రాణం ఉంటేనే చదువులు, ప్రాణం ఉంటేనే పరిక్షలు. ప్రాణం లేకపోతే ఎవరికి చదువులు చెబుతారు? ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. " అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read