ఈ రోజు హైకోర్టులో ఏపీ లిబర్టీ అసోసియేషన్‌ అనే ప్రైవేటు ఆర్గనైజేషన్ వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. ఇందులో ప్రధానంగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా కేసులు పెరుగుతున్న తీరు పైన, దానికి సంబంధించిన చికిత్స, నిర్ధారణ పరీక్షలు, వీటి అన్నిటి పైన పిటీషనర్ పలు సందేహాలు లేవనెత్తారు. అందులో ప్రధానంగా, పిటీషనర్ లేవనెత్తిన అంశం, టెస్టులు చేసిన తరువాత, చాలా సమయం పడుతుందనే అంశం కోర్టుకు తెలిపారు. దాంతో పాటు, క-రో-నా చికిత్స అందించటానికి, కావలసిన ఆక్సిజన్ నిల్వలు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో అవసరానికి కంటే తక్కువగా ఉన్నాయని, ఇంకా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఉందనే వాదనను, పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. దీంతో కోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఎంత శాతం ఉన్నాయి, ఎంత మంది పేషెంట్లు ఉన్నారు, వారికీ ఎంత ఆక్సిజన్ అవసరం ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, భవిష్యత్తులో ఎంత అవసరం ఉంది, మీరు ఆక్సిజన్ కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు అనే అంశం పై ప్రశ్నలు సందించింది. అదే విధంగా, ఇప్పుడు ఉన్నటు వంటి, ఆక్సిజన్ ఎన్ని రోజుకు సరిపోతుందని, ఎంత మంది పేషెంట్లు ప్రస్తుతం ఆక్సిజన్ వినియోగం తీసుకుంటున్నారని అడిగింది.

hc 27042021 2

దాంతో పాటుగా, కరోనా నిర్ధారణ పరీక్షలు, ఒక రోజుకి పరీక్ష చేస్తే, ఎన్ని రోజుల్లో టెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు ? టెస్ట్ రిపోర్ట్ లేటు అయితే, ఈ లోపు అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, అతని పై పర్యవేక్షణ ఏమైనా ఉంటుందా ? ఎటువంటి చర్యలు చేపట్టారు అనే అంశం పై ప్రశ్నలు సందించింది. అదే విధంగా ఐసోలేషన్ వార్డులు ఎన్ని చోట్ల ఏర్పాటు చేసారు, మొత్తం ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా వాటిని పర్యవేక్షిస్తున్నారు అంటూ, ప్రశ్నలు సందించింది హైకోర్టు. ఈ మొత్తం వివరాలు తమకు కావాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుని రేపటికి విచారణకు వాయిదా వేసింది. మొత్తం ఈ విచారణ గంట పాటు సాగింది. విచారణలో పలు ప్రశ్నలు, ప్రభుత్వం పై సందించారు. అన్ని వివరాలు పిటీషనర్ కౌన్సిల్ కి కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణ రేపు మళ్ళీ కొనసాగనుంది. ఈ కేసులో ప్రభుత్వం తరుఫున వాదనలను, న్యాయవాది సురేష్ వినిపించారు. ప్రభుత్వం రేపు కోర్టుకి ఇచ్చే సమాధానాలు బట్టి, రేపు కోర్టు ఏమి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

సంగం డైరీ విషయంలో, ఆరోపణలు చూపించి, టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని పై ధూళిపాళ్ల హైకోర్టులో కేసు వేసారు. ఒక వైపు హైకోర్టులో ధూళిపాళ్ల వేసిన క్వాష్ పిటీషన్ నడుస్తూ ఉండగానే, సంగం డైరీ యాజమాన్య హక్కులను మారుస్తూ, ప్రభుత్వం ఒక కీలక జీవోని విడుదల చేసింది. ఈ జీవోలో కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి ధారుల సంఘానికి సంగం డైరీకి సంబంధించిన యాజమాన్య హక్కులను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. పాల ఉత్పత్తికి ఈ మూడు నెలల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా, గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ బాధ్యత వహించాలని చెప్పటం జరిగింది. ఎవరైనా సరే ఉత్పత్తికి అడ్డు పడితే వారి పై చర్యలు తీసుకునే బాధ్యతను కూడా ఆయనకు అప్పచెప్పారు. అయితే ఈ చర్య మొత్తం, రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా, ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. గుంటూరు పాల ఉత్పత్తి ధారుల సంఘానికి, ఏదైతే సంగం డైరీ యాజమాన్య హక్కులు ఇవ్వటం వెనుక, పది ఎకరాలు ట్రస్ట్ పేరుతో తీసుకున్నారని, ఇది తమ విచారణలో వెల్లడైంది కాబట్టి, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

sangam 27042021 2

విస్తృత ప్రజా ప్రయోజనాల దృశ్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వులు ఒక కుట్ర పూరితంగా ఇచ్చిందని, కుట్రతో ఉత్తర్వులు ఇచ్చారని, రైతులు కానీ, పాల ఉత్పత్తి ధారులు కానీ, ఇప్పటికే సంగం డైరీ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. సంగం డైరీ యాజమాన్య హక్కులను బదిలీ చేస్తూ, అకస్మాత్తుగా ఈ ఉత్తర్వులు ఇవ్వటం, ఒక వైపు కోర్టులో కేసు ఉన్నా కూడా, ఈ ఉత్తర్వులు ఇవ్వటం అనేది, కుట్ర పూరితం అని వారందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒక వైపు గుంటూరు జిల్లాకు చెందిన ఉన్నాతాధికారులు అక్కడకు చేరుకోవటంతో, అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకే ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఒక వేళ హక్కులు ట్రాన్స్ఫర్ చేయకపోతే కనుక, పాల ఉత్పత్తి ఆగిపోతుంది కాబట్టి, ఈ నిర్ణయం తీసుకున్నాం అని ప్రభుత్వం చెప్తున్నా, దీని వెనుక కుట్ర ఉందని, రైతులు, పాల ఉత్పత్తిధారులు వాపోతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో, దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. తమకు నచ్చని వారిని టార్గెట్ చేయటం కోసం, ఒక ఫేక్ బ్యాచ్ పని చేస్తూ ఉంటుంది. ఫేక్ చేయటం, బురద చల్లటం, ప్రత్యర్ధులను అల్లరి చేయటం, ఈ ఫేక్ బ్యాచ్ పని. అయితే ఈ ఫేక్ బ్యాచ్, తమకు నచ్చని రాజకీయ నాయకులనే కాదు, తమకు ఇష్టం లేని వ్యక్తుల ని కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టు లో ఏకంగా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా ఎన్వీ రమణ కూడా చేరారు. జస్టిస్ ఎన్వీ రమణకు ఎలాంటి ట్విట్టర్ ఎకౌంటు లేదు. అయితే ఆయన చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున, ఆయన పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా ఓపెన్ అయ్యింది. చాలా మంది అది నిజమే అనుకుని ఫాలో అయ్యారు. అయితే తాజాగా అజిత్ దోవల్ ని పొగుడుతూ, ఆ ఖాతా నుంచి ఒక ట్వీట్ రావటం, అది వైరల్ అవ్వటంతో, విషయం జస్టిస్ ఎన్వీ రమణ ఆఫీస్ వరకు వెళ్ళింది. వెంటనే వారు ఈ ఫేక్ ఖాతా పై ఫిర్యాదు చేసారు. ముందుగా ట్విట్టర్ ఆ ఖాతాను తొలగించింది. అయితే ఈ ఫేక్ ఖాతా క్రియేట్ చేసింది ఎవరు అనే విషయం పై, ఎంక్వయిరీ కొనసాగుతుంది. మొత్తానికి, ఈ ఫేక్ బ్యాచ్, ఏకంగా ఈ దేశ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాని కూడా టార్గెట్ చేసారు అంటూ, ఎంత బరి తెగించారో అర్ధం చేసుకోవచ్చు.

వైసీపీ శ్రేణులకు రఘురామకృష్ణం రాజు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులకు కంటిలో నలుసులా మారిన రఘురామరామ రాజు, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు చేయాలి అంటూ, కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అక్రమఆస్తుల కేసులో 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్న జగన్, 16 నెలలు జైల్లో ఉండి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ ని అడ్డు పెట్టుకుని, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, ఇప్పటికే అనకే మందికి పదవులు కూడా ఇచ్చారని, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి, విచారణ వేగవంతం చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు సిబిఐ కోర్టులో, పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిటీషన్ ఫైల్ అవ్వకుండా, కొన్ని కుట్రలు జరిగాయి అంటూ రఘురామరాజు ఆరోపించారు కూడా. అయినా ఆయన పట్టు వీడకుండా, పిటీషన్ ఫైల్ చేసారు. అయితే ఈ పిటీషన్ అసలు విచారణకు కూడా రాదని, ఇది విచారణ అర్హత కూడా కాదు అంటూ, వైసీపీ శ్రేణులు వాదించాయి. అయితే రఘురామ రాజు మాత్రం, అనుకున్నది సాధించారు. కోర్టు ఈ పిటీషన్ విచారణకు తీసుకునేలా, కోర్టుని ఒప్పించగలిగారు. అంతా పక్కాగా, పిటీషన్ ఉండటంతో, సిబిఐ కోర్టు రఘురామరాజు వేసిన పిటీషన్ ని విచారణకు స్వీకరించింది.

rrr 27042021 2

దీని పై రఘురామ రాజు స్పందించారు. ఆయన మాట్లాడుతూ " మీ అందరికీ ఒక శుభవార్త. ఇప్పుడే సిబిఐ కోర్టు, జడ్జి గారు ఆర్డర్స్ ఇచ్చారు. ఏదైతే మొన్న జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటీషన్ నేను వేయటం జరిగిందో, ఆ పిటీషన్ విచారణ అర్హత ఉందా లేదా అన్న దాని మీద, ఈ రోజు తీర్పు ఇస్తారాని మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఆశించినట్టుగానే, నేను వేసిన పిటీషన్ కు విచారణ అర్హత ఉందని చెప్పి, ఈ రోజు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇస్తారు. సిబిఐకి కూడా ఇస్తారు. వారిని కౌంటర్ ఫైల్ చేయమని అడుగుతారు. చూద్దాం. ముందు టెక్నికల్ గా కొన్ని క్లారిఫికేషన్స్ అడిగితే, మడిచి పెట్టుకోమన్నారు. ఇప్పుడు తీరాందా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, రాస్కల్స్. మాట జారే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నోటికి వచ్చినట్టు వాగకండి. ఏమైంది ఇప్పుడు ? ముందు ఉంది ముసళ్ళ పండుగ. ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, మా పార్టీ కోసం, నేను ఈ పోరాటం చేపట్టాను." అని రఘురామరాజు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read