తెలుగుదేశం నేతలు టార్గెట్ గా, జగన్ సర్కార్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎవరు మాట వినకపోతే, ఎవరు తమ పార్టీలో చేరకపొతే వారిని టార్గెట్ చేస్తున్నారు అంటూ, టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలు నిజం అవుతున్నాయి. ఈ కో-ర-నా సెకండ్ వేవ్ లో ప్రజలు అల్లాడిపోతుంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, టిడిపి నేతలను టార్గెట్ చేసింది. మొన్న చంద్రబాబు, నిన్న నరేంద్ర, పల్లా శ్రీనివాస్, నేడు మురళి మోహన్. అయితే వీరందరూ ప్రభుత్వం చర్యల పై న్యాయ స్థానాల్లో పోరాడుతున్నారు. వీరి పై అభియోగాలు మోపోతున్నారు కానీ,ఆధారాలు ఇవ్వలేక పోవటంతో, కోర్టుల్లో కూడా ఎదురు దెబ్బే తగులుతుంది. అయితే ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు, టిడిపి మాజీ ఎంపీ మురళి మోహన్ కు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. పోయిన ఎన్నికల్లో మురళీ మోహన్ పోటీ చేయకుండా, ఆమె కోడలుకు అవకాసం ఇవ్వగా, ఆమె ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే మురళీమోహన్ కూడా జయభేరి కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఉంది. హైదరాబాద్ తో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల జయభేరి కన్స్ట్రక్షన్స్ పేరుతో నిర్మాణాలు చేస్తూ ఉంటారు. అలాగే మంగళగిరిలో కూడా జయభేరి కన్స్ట్రక్షన్స్ పేరుతో అపార్ట్ మెంట్ ల నిర్మాణం జరుగుతుంది.

murali 27042021 2

2016 నుంచి ఆ నిర్మాణాలు మంగళగిరిలో జరిగాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని అయిన తరువాత, మంగళగిరి ప్రాంతంలో డిమాండ్ పెరగటంతో, అక్కడ నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇప్పటికే చాలా వరకు పురయ్యాయి కూడా. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రెండేళ్ళ తరువాత, అక్కడ నిర్మాణాలు చేసిన భూమి వ్యవసాయ భూమి అంటూ, జయభేరి కన్స్ట్రక్షన్స్ కు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయి అంటూ, జయభేరి కన్స్ట్రక్షన్స్ కు కోటిన్నర రూపాయలు జరిమానాగా విధించారు. ఏడు ఎకరాల్లో నిర్మాణం అయిన నిర్మాణాలు చేసిన ఈ భూమి, వ్యవసాయ భూమి అని, దాన్ని కమర్షియల్ ల్యాండ్ గా మార్చకుండా నిర్మాణాలు చేసారు అంటూ, మూడు శాతం వరకు ల్యాండ్ కన్వర్షన్ తో పాటుగా, జరిమానా కూడా విధించారు. అయితే ఈ జరిమానా పై జయభేరి కన్స్ట్రక్షన్స్ నుంచి ఎటువంటి వివరణ ఇంకా రాలేదు. ఈ జరిమానా పై కోర్టు కు వెళ్తారా ? అసలు వాస్తవాలు ఏంటి ? ఇది కూడా కక్ష సాధింపులో భాగమేనా అనేది తెలియాల్సి ఉంది.

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వైఎస్ జగన్ ఫోన్ చేసారు. వేమూరి కనకదుర్గ మృతి పట్ల జగన్ సంతాపం తెలిపారు. రాధాకృష్ణను ఫోన్‍లో పరామర్శించారు. వేమూరి రాధాకృష్ణకు కాంగ్రెస్ నేత రాహుల్‍గాంధీ కూడా ఫోన్ చేసి పరామర్శించారు. రాధాకృష్ణకు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దిగ్భ్రాంతి - వేమూరి కనకదుర్గ ఆంధ్రజ్యోతి సంస్థల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు - ఆదర్శ గృహిణిగా ఉంటూ సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు - వేమూరి కనకదుర్గ నేటి మహిళలకు ఆదర్శం - వేమూరి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం : సీజేఐ ఎన్వీ రమణ. వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతికి సంతాపం తెలిపిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు - వేమూరి కనకదుర్గ ఆంద్రజ్యోతి సంస్థల పురోభివృద్ధికి కృషి చేశారు - ఉద్యోగుల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న చర్యలు శ్లాఘనీయం - వేమూరి కనకదుర్గ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతితో దిగ్భ్రాంతికి గురయ్యా - సంస్థ నిర్వహణ బాధ్యతలతో కనకనదుర్గ తనదైన ముద్ర వేశారు - వేమూరి రాధాకృష్ణ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

rk 27042021 2

వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతికి సంతాపం తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహనరావు, టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, వెలగపూడి రామకృష్ణ, ఏలూరి సాంబశివరావు, డోల బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, బీజేపీ నేత లంకా దినకర్, టీడీపీ నేత దేవతోటి నాగరాజు. వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతికి సంతాపం తెలిపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహనరావు, వికలాంగుల సంక్షేమ మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు - ఆంధ్రజ్యోతి ఎదుగుదలలో కనకదుర్గ రాధాకృష్ణకు అనుక్షణం తోడుగా నిలిచారు - డైరెక్టర్‍గా సంస్ధను సమర్ధవంతంగా ముందుకి నడపడానికి అహర్నిశలు కృషిచేశారు - రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి : కంభంపాటి రామ్మోహనరావు

రైతుల సహాయసహాకారాలతో, వారిప్రోత్సాహంతో, గ్రామీణ ప్రాంతానికిచెందిన మహిళాపాడిరైతుల ప్రోద్భలంతో నడుస్తున్న సంగం డెయిరీ నేడు ఒకపెద్ద పరిశ్రమగా అవతరించిందని, కంపెనీ యాక్ట్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని టీడీపీ నేత, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "సంగం డెయిరీ వ్యవహారంలో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. సంగం డెయిరీకి చెందిన పదిఎకరాల భూమిని ఒకట్రస్ట్ కు బదలాయించారని, అలా చేసేక్రమంలో డెయిరీ ఛైర్మన్ గా ఉన్న నరేంద్ర అవినీతికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు మోపడం జరిగింది. మరో అంశమేమిటంటే, కోఆపరేటివ్ సొసైటీగా ఉన్న సంగం డెయిరీని కంపెనీ యాక్ట్ లోకి తీసుకురావడానికి, తప్పుడు ధృవపత్రాలు సమర్పించి వాడుకున్నారని చెప్పి, నరేంద్రపై కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసానికి పాల్పడ్డారంటూ ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేయడం జరిగింది. ఏపీ ప్రజలకు, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. సంగండెయిరీ అనేది కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడింది. దానికింద ఉన్నభూమిలోనుంచి పది ఎకరాలను డెయిరీ మాజీఛైర్మన్ అయిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుమీదున్న ట్రస్ట్ కు బదలాయించారు. చట్టబద్ధంగానే పదిఎకరాలు బదలాయించారా....లేదా అని చూస్తే అదిఅంతా సక్రమంగా చట్టప్రకారమే జరిగినట్లు అర్థమ వుతోంది. 10, 12ఏళ్ల క్రితమే సంగం డెయిరీ కంపెనీ యాక్ట్ లోకిమారిపోయింది. అలా మారకముందు అది మ్యాక్స్ సొసైటీ పరిధిలో ఉంది. మ్యాక్స్ సొసైటీకి సంబంధించిన నో అబ్జెక్షన్ (నిరభ్యంతర పత్రము) తోనే డెయిరీ కంపెనీ యాక్ట్ లోకి మారిందని, అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని ప్రజలను నమ్మించే ప్రయత్నాలుచేస్తున్నారు. ఎవరైతే ఆసమయంలో డీసీవో (డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్) గా ఉన్న గుర్నాథం, అది ఫోర్జరీ డాక్యుమెంట్ కాదని, నో అబ్జెక్షన్ సర్టి ఫికేట్ తానే ఇచ్చానని చెప్పడం జరిగింది.

గుర్నాథాన్ని అరెస్ట్ చేయించిన ప్రభుత్వం నేడు ఆయన్నికోవిడ్ కు గురయ్యేలా చేసింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తానే ఇచ్చాను, అది ఫోర్జరీ డాక్యుమెంట్ కాదని గుర్నాథం చెప్పాకకూడా, నరేంద్రకుమార్ ఫోర్జరీ చేశాడని, ఛీటింగ్ చేశాడని ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారు? పదిఎకరాల బదలాయింపు జరిగిం దంటున్న అభియోగాల్లో కూడా వాస్తవం లేదు. భూమిని ట్రస్ట్ కు బదలాయించినప్పుడు 2003లో సంగండెయిరీ ఛైర్మన్ గా నరేంద్ర లేడని గుర్తించాలి. ఈ విధంగా అసత్యాలు, అబద్ధపు ఆరోపణలతో కావాలనే నరేంద్రను అరెస్ట్ చేశారని స్పష్టమవుతోంది. ఇటీవల ఆ నియోజకవర్గం లో జరుగుతున్న అక్రమమైనింగ్ సహా, రాజధాని భూముల వ్యవహరంలో ప్రభుత్వం ఆరోపించిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను నరేంద్ర మీడియాముఖంగా సమర్థంగా తిప్పికొట్టారు. తాను ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డట్టు ప్రభుత్వం నిరూపించాలని ఆయన సవాల్ చేస్తే, ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాధానం లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవకతవకలను, దుశ్చర్యలను, అసత్యపు ఆరోపణలను నరేంద్ర ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడనే ఆయనపై కక్ష కట్టారని తేలిపోయింది. తెలుగుదేశంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని కూడా ఆయనపై ప్రభుత్వం కక్ష పెంచుకోవడానికి ఒక కారణం. ఏసీబీ వారికి ఎవరూ ఫిర్యాదుచేయలేదు, ఎవరికైతే సంగం డెయిరీతో, సంస్థ ఆస్తులతో సంబంధంలేదో వారు ఫిర్యాదుచేస్తే అరెస్ట్ చేయడం దుర్మార్గం. భూమి బదలాయింపునకు సంబంధించిన ప్రతి అంశాన్ని నేడు హైకోర్టు ముందుంచడం జరిగింది. దానికి సంబంధించిన ఏ అంశాన్ని ఏసీబీ పరిగణనలోకి తీసుకోలేదు.

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి, మరో మూడేళ్ళ పాటు, సియం పదవిలో ఉంటారని అనుకోవటం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉన్నయి అని, ప్రభుత్వం కూడా హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని అన్నారు.  కరోనా నియంత్రణపై ప్రభుత్వ యంత్రాంగానికి శ్రద్ధ లేదని అన్నారు.  కేవలం భవనాలు కూల్చివేత, షాపుల తొలగింపుపై దృష్టిపెట్టారని అన్నారు. విద్యార్థులకు పరీక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. మూడేళ్లపాటు జగన్ సీఎంగా ఉంటారని అనుకోవడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాత్రి పూట కర్ఫ్యూ అనేది తుగ్లక్ చర్య అని అన్నారు. విశాఖపై దృష్టిపెట్టి మందుల కొరత లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.  ఔషధాలపై మూడు నెలలు జీఎస్టీ లేకుండా చూడాలని విష్ణుకుమార్ రాజు అన్నారు. అయితే రఘురామకృష్ణ రాజు, సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ పిటీషన్ విచారణకు తీసుకుందని చెప్పిన కొద్ది సేపటికే, విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు.

Advertisements

Latest Articles

Most Read