రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ముగిసినట్లేనని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. మార్చిలో ఏడు జిల్లాల్లో శాసనమండలి సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉన్నందున అందుకు సంబంధించిన షెడ్యూల్ నేడో, రేపో విడుదల కావచ్చని వారంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తున్నందున అక్కడి ప్రజాప్రతినిధుల పాలనకు తెరపడినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇక మిగిలిన ఆరు జిల్లాల్లో పాక్షికంగా ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయని, అయితే ప్రభుత్వ పాలన ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి నిర్ణయాలు ఏవీ తీసుకుని ప్రకటించడానికి నిబంధనలు అడ్డువస్తాయని వారు వెల్లడిస్తున్నారు.

rayalseema 18022019

మండలి ఎన్నికలు జరగని ఆరు జిల్లాల్లో అభివృద్ధి పథకాలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించడం, అవసరమైతే కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారంటున్నారు. ఈ జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ కొనసాగుతుందని అయితే నిబంధనలకు లోబడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శాసనమండలి షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని వారు గుర్తుచేస్తున్నారు. దాంతో రాష్టవ్య్రాప్తంగా పూర్తిస్థాయి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచి రాష్టవ్య్రాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రొటోకాల్ కోల్పోతారని వారంటున్నారు.

rayalseema 18022019

రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు తాజా మాజీలవుతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంకా పదవీకాలం ఉన్న శాసనమండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ప్రొటోకాల్ పరిధిలోకి రారని స్పష్టం చేస్తున్నారు. శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ముగిసినట్లేనని వారు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలంటే జూన్ నెలాఖరు వరకూ ఆగాల్సిందే. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మార్చి నెలలో జరిగే శాసనమండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఒకటి, రెండు రోజుల్లో విడుదల కానుంది. ఆ తరువాత ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు తెరపడనుంది. ఫలితంగా మే నెలాఖరు వరకూ ప్రభుత్వం నిర్ణయాలు ఏవీ తీసుకోవడానికి వీలుకాదు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ ఎన్నికలను ప్రభుత్వం ఏదో ఒక కారణం చేత వాయిదా వేస్తే తప్ప ఎన్నికలు అనివార్యం. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడినా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే మరో 45 రోజులు పాలన స్తంభించే పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా జూన్ చివరి వరకూ కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉండదు. రాష్ట్రంలో మే నెలలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కొలువుదీరేంత వరకూ వారం, పది రోజుల పాటు పాలనకు అవకాశం ఉన్నా కొత్త ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు ప్రకటనకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని విశే్లషకులు వెల్లడిస్తున్నారు.

మనం ఎంతో మంది పార్టీ మారే వాళ్ళని చూసి ఉంటాం..మారేది పదవుల కోసమే అయినా, ఎన్నో నీతి సూక్తులు చెప్తూ, నేనే అభినవ గాంధీ అన్నంత బిల్డ్ అప్ ఇస్తూ ఉంటారు. చివరకు ఆమంచి లాంటి వాడు కూడా పార్టీ మారుతూ వివేకానందుడి నీతులు చెప్తూ, నేనే అవినీతికి వ్యతిరేకంగా అందుకే అవినీతి పై పోరాటం చేస్తున్న జగన్ వద్దకు వచ్చి, అవినీతి పై యుద్ధం చేస్తా అని చెప్పాడంటే, ఛీ జీవితం అనిపించదు. అయితే, ఈ రోజు పార్టీ మారిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మాత్రం, ఉన్నది ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అయితే వెంటనే లోటస్ పాండ్ నుంచి ఆదేశాలు రావటంతో మాట మార్చారు అనుకోండి అది వేరే విషయం. జగన్ ను కలవక ముందు, జగన్ ను కలిసిన తరువాత, ఆయన మాటలు మారిపోయాయి.

ravindrababu 18022019

జగన్ ను కలవక ముందు, పార్టీ మారడానికి గల కారణాన్ని ఆయన మీడియాకు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టికెట్ ఇవ్వబోమని టీడీపీ స్పష్టం చేసిందని, అందుకే పార్టీ మారుతున్నట్లు ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో రవీంద్రబాబు స్పష్టం చేశారు. ఇంత స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నువ్వు సరిగ్గా పని చెయ్యలేదు, ప్రజలలో మీ మీద సరైన అభిప్రాయం లేదు, మీకు టికెట్ లేదు, పార్టీ కోసం పని చెయ్యండి అని చెప్తే, ఇలాంటి వాళ్ళని తన పార్టీలో చేర్చుకున్న జగన్, ఎదో సాధించినట్టు చెప్తున్నాడు. అయితే జగన్ ని కలవక ముందు మాత్రం ఉన్న మాట చెప్పేసిన రవింద్ర బాబు, జగన్ ను కలిసి వచ్చిన తరువాత ట్యూన్ మార్చారు.

ravindrababu 18022019

టీడీపీని వీడి వైసీపీలోకి చేరగానే చీరాల ఎమ్మెల్యే ఆమంచి, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీ అధినేత చంద్రబాబుపైన, ఆ పార్టీపైన తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు వైసీపీలో చేరగానే టీడీపీలో కులాధిపత్యం పెరిగిపోయిందంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు అదే బాటలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా చంద్రబాబుపై, టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు.ఒక సామాజిక వర్గానికి మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం మేలు చేస్తోందని, చంద్రబాబు వద్ద ఒక్కో కులానికి ఒక్కో ఆర్మీ ఉంటుందని విమర్శించారు. జగన్ ని కలవక ముందు మాత్రం, నాకు సీటు రావటం లేదని చెప్పారు, అందుకే జగన్ దగ్గరకు వచ్చాను అని చెప్పి, లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చి, ఇలా నీతులు చెప్తున్నాడు.

ఏ పని చేసవాడు ఆ పని చెయ్యాలి... ఆధ్యాత్మికం ముసుగు వేసుకుని, పొలిటికల్ బ్రోకర్ పనులు చేస్తే, ఈ దేశం ఇలాగే ఏడుస్తుంది. కేసీఆర్, జగన్ లకు ఆస్థాన స్వామి ఒకడు ఉన్నాడు. సరదా పీఠం అని వైజాగ్ లో పెట్టుకుని, కేసీఆర్ ని ఏపి రాజకీయాల్లో తీసుకు రావటం, జగన్ కి సహాయం చెయ్యటంలో, పొలిటికల్ బ్రోకర్ పాత్ర పోషిస్తున్నాడు ఈ స్వామి. ఆయన ఏమి చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని వారికి సహాయం చేసే క్రమంలో, మళ్ళీ తిరుమల పేరుతో రచ్చ లేపే ప్రయత్నం చేసి, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన కేసు పెడతా అనేంతగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. మొన్న బీజేపీ నేతలు తిరుమల పై పెద్ద కుట్ర చేసి, శబరిమల వివాదం లాగా, ఇక్కడ కూడా చేసి, రాష్ట్రంలో అశాంతికి ప్లాన్ చేసారు. అయితే, రాష్ట్రంలో వారి పాచిక పార లేదు. అంతా సద్దుమణిగింది అన్న టైములో , స్వామి మళ్ళీ ఎంటర్ అయ్యారు.

swaroopa 18022019

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో పాలన లోపభూయిష్టంగా మారిందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ధ్వజమెత్తారు. ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటికి సంబంధించిన ప్రతి ఆధారం తన వద్ద ఉందని త్వరలో వాటిని మీడియా ముందు పెడతానన్నారు. తితిదే అధికారులు, ముఖ్యమంత్రిపైన కేసు పెడతానని తెలిపారు. వారిపై కోర్టులో కూడా కేసు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి రావడానికి కారణం తాను దగ్గర ఉండి నిర్వహించిన రాజశ్యామల యాగమేనన్నారు. గుంటూరు నగరం గోరంట్లలోని శ్రీపద్మావతి అండాళ్‌ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి రిలీజియన్‌ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారస్థాయికి చేరిందని ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం త్వరలో ఏపీలో రాజశ్యామల యాగం చేస్తానని తెలిపారు.

swaroopa 18022019

మీకు రాజకీయాలు ఎందుకండీ? మీది ఆధ్యాత్మిక ఆశ్రమామా లేక రాజకీయ నాయకులకి కాంట్రాక్టు పద్ధతిలో యాగాలు చేసి పెట్టే కాంట్రాక్ట్ సంఘమా? వారికి యాగం చేసి పెడతా... వీళ్ళకి యజ్ఞం చేసి పెడతా అంటూ.....! టీటీడీలో భూములు అన్యాక్రాంతం అన్నారు. ఆధారాలు వుంటే ఇచ్చేయండి పబ్లిక్ కి. లేదంటే మీరే కేసు పెట్టండి. లేదంటే కోర్టులో కేసు వెయ్యండి. అంతే కానీ త్వరలో మీడియాకు ఇస్తాను లాంటి రాజకీయ మాటలు ఎందుకండీ? ఆర్నెల్లు సావాసం చేస్తే వారు - వీరు, అవుతారంట. రాజకీయులతో కలిసి... వారేమి ఆధ్యాత్మికత మీ దగ్గర నేర్చుకున్నారో తెలియదు కానీ, మీరు మాత్రం ఫక్తు రాజకీయులు అయిపోయారు.

ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఈ రోజు సర్ప్రైజ్ ఇచ్చారు చంద్రబాబు ! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు సోమవారమే తొలివిడత సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది. ఆదివారం జరిగిన భేటీలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం రాష్ట్రంలోని సుమారు 50 లక్షల రైతుల కుటుంబాలకు వారి బ్యాంకుల్లో వెయ్యి రూపాయల చొప్పున నగదు జమ కానుంది. అలాగే ఈ పథకానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఆదివారం జారీ చేసింది. అన్నదాత సుఖీభవలో భాగంగా కౌలు రైతులకు కూడా రూ.15వేలు ఆర్థిక సాయం చేయనుంది. వాస్తవానికి మార్చి నెలలో తొలివిడత డబ్బు వేయాలని అనుకుంది. కానీ, సత్వరమే కొంతసొమ్మును వారి ఖాతాల్లో వేసేయాలని నిర్ణయించింది. దీనికోసం ఆదివారం కూడా రాష్ట్ర సర్కారు కసరత్తు చేసింది. బ్యాంకర్లతో మాట్లాడింది.

farmres 18022019 1

ఈ పథకం కింద డబ్బు ఇచ్చేందుకు అవసరమైన సర్దుబాటు చేసి, బ్యాంకర్లను కూడా సంసిద్ధం చేసింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద షరతుల్లేకుండా పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఐదెకరాలలోపు రైతులకు మాత్రమే సాయం అందించేందుకు పథకం ప్రకటించింది. అయితే రాష్ట్రం మాత్రం ఐదెకరాలకు మించి ఉన్న రైతులకూ సాయం అందిస్తామని చెప్పింది. ఐదెకరాల లోపున్న రైతులకు రూ.6వేలు కేంద్రం ఇస్తే.. రాష్ట్రం మరో రూ.9వేలు ఇస్తుంది. అదే సమయంలో ఐదెకరాలకు మించి భూమి ఉన్న రైతు కుటుంబాలకు రూ.10వేలు ఇవ్వనుంది. అయితే ఉదయం నుంచి రైతుల ఖాతాలో డబ్బులు పడుతూ ఉండటంతో, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

farmres 18022019 1

ఈ పథకం కింద కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యమైన కానుక ప్రకటించింది. సన్న, చిన్నకారు రైతులతో సమానంగా కౌలు రైతులకూ రూ.15వేలు ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. కౌలు రైతులకు ఈ మొత్తాన్ని 2019 ఖరీ్‌ఫలోపే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కౌలు రైతులు 15.35లక్షల మంది ఉన్నారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 2018-19లో మొత్తంలో ఎల్‌ఈసీ, సీఈసీ, రైతుమిత్ర, జాయింట్‌ లయబులిటీ గ్రూపుల కింద 11.20లక్షల మంది రైతులకు వివిధ బ్యాంకులు పంట రుణాలిచ్చాయి. ఈ ఏడాది పంట రుణం తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలన్నింటికీ పెట్టుబడి సాయం అందించే అవకాశం ఉందని అదికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివారం విడుదల చేసిన ‘అన్నదాత-సుఖీభవ’ పథకం ఉత్తర్వుల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ పథకం కింద ఐదెకరాలలోపు రైతులకు ఇచ్చే రూ.6వేలకు రాష్ట్రం మరో రూ.9వేలు కలిపి రూ.15వేలు, పెద్ద రైతులకు రూ.10వేలు, కౌలురైతులకు రూ.15వేలు ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని కిస్తీల వారీగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(నేరుగా నగదు బదిలీ) విధానంలో రైతుల ఖాతాలకు జమ చే యనున్నారు. ఇందులో మొదటి కిస్తీ కింద రూ.4వేలు చొప్పున వచ్చే (మార్చినెల)లోనే జమ చేయనున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా రూ. వెయ్యి సోమవారం నాడే రైతుల ఖాతాల్లోకి వేయాలని నిర్ణయించింది.

Advertisements

Latest Articles

Most Read