రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం దీనికి సంబంధించిన విధివిధానాలను విడుదల చేసింది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్‌ ప్రారంభం కాగానే తొలి విడత మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయనుంది. కేంద్రం ప్రకటించిన పీఎం-కిసాన్‌లో కౌలు రైతుల ప్రస్తావనే లేదు. అయినా రాష్ట్రం సొంతంగా సాయం చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1,350 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పంట రుణాలతోపాటు రాయితీపై విత్తనాలు, ఎరువుల సరఫరా విషయంలోనూ ప్రభుత్వం వీరికి ప్రాధాన్యమిస్తోంది.

rayalseema 18022019

మరే రాష్ట్రంలో లేని విధంగా రూ.5వేల కోట్ల పంటరుణాలు ఇప్పించింది. రెవెన్యూశాఖ ద్వారా రుణ అర్హత కార్డులు, వ్యవసాయశాఖద్వారా కౌలుదారు పత్రాలు మంజూరు చేయించింది. ఇప్పుడు పెట్టుబడి సాయం అందించనుంది. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రమే సొంతంగా అయిదెకరాల లోపున్న రైతులకు రూ.9వేలు, అయిదెకరాల పైబడిన వారికి రూ.10వేలు ఇస్తుండగా.. సెంటు భూమి లేని కౌలు రైతులకు ఏకంగా రూ.15,000 చొప్పున ఇవ్వనుంది.రాష్ట్రంలో అధికారిక అంచనాల ప్రకారం గుర్తించిన 15.50 లక్షల మంది కౌలు రైతుల్లో సెంటు భూమి లేని వారు సుమారు 9 లక్షల వరకు ఉంటారని అంచనా. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు కేంద్ర పథకానికి అర్హులుగా గుర్తించింది. వీరందరికీ కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేల ఆర్థిక సాయాన్ని అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో మరో రూ.9 వేలను చెల్లించనుంది. మొత్తం రాష్ట్రంలో 70 లక్షల రైతు కుటుంబాలు ఉండగా కేంద్ర నిబంధనల ప్రకారం ఐదెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు 54 లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించారు. మిగిలిన 16 లక్షల మంది రైతులు ఈ పథకానికి కేంద్ర నిబంధనల ప్రకారం అర్హులు కారు.

rayalseema 18022019

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 16 లక్షల మంది రైతు కుటుంబాలను సైతం ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా వీరందరికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని కేంద్రంతో సంబం ధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. మార్చిలోగా మొదటి విడత రూ.4 వేల ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రెండు దఫాలుగా ఈ చెల్లింపులు జరపనున్నారు. రబీ, ఖరీఫ్‌ల వారీగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించనుంది. కేంద్ర సాయం పొందే రైతులకు తొలివిడతగా రూ.4 వేలను అందిస్తారు. అదే విధంగా కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు రూ. 5 వేలు తొలివిడతగా చెల్లించనున్నారు. వీరందరి ఖాతాలకు నేరుగా నగదు జమ అయిందని నిర్ధరణ అయ్యాక మార్చిలో మిగిలిన రూ.3వేలు బదిలీ చేస్తారు. ఖాతా సంఖ్యలు సరిగా లేని, వివరాలు అందుబాటులో లేని వారిని కూడా గుర్తించి వెంటనే చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో వాతావరణం రోజురొజుకూ వేడెక్కుతున్నట్లే సార్వత్రిక ఎన్నికల వేడికూడా రాజుకుంటోంది. తెలుగుదేశం పార్టీ నుండి కొంతమంది నాయకులు వలస వెళ్ళి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కండువాలు కప్పుకుంటున్న నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శనివారం పోలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈసమావేశంలో పార్టీలోని ఆశావహులతో పాటు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రికి అందిన సర్వే నివేదిక లపై ప్రధానంగా చర్చ జరిగింది. సర్వేలు, బుజ్జగింపు లపై కసరత్తు ముగించి ఈ నెలాఖరులోగా అభ్యర్థుల జాబితా ఖరారు చేసే లక్ష్యంగా పొలిట్‌బ్యూరోలో నిర్ణయాలు తీసుకుంది. అలాగే, పార్టీ విధివిధానాల పట్ల అపనమ్మకం, అసహనం వున్న నేతలకు సీరియస్‌ వార్నింగ్‌లు ఇచ్చేందుకు అధినేత చంద్రబాబు సమాయత్తం అయినట్టు తెలిసింది. అవకాశవాదులు తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సంకేతాలిచ్చారు.

rayalseema 18022019

పార్టీపట్ల నమ్మకం లేనివారు పార్టీని వీడి గౌరవంగా వెళ్ళవచ్చని, పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని గతంలో పలు సందర్భాల్లో అధి నేత చంద్రబాబు హెచ్చరించారు. అయితే ఈ రోజు జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో, ఇదే విషయం స్పష్టం చేసారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అందరి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని, ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైందని నేతలతో సీఎం అన్నారు. ఉత్తమ బృందాన్ని ఎంపిక చేస్తున్నామని చెప్పారు. అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. ఎంతటి వారైనా సరిగ్గా పని చేయని వారు ఉంటే, వారిని తప్పించేస్తున్నా అని తెగేసి చెప్పారు. మొహమాటమే లేదని, సిఫార్సులు కూడా పట్టించుకోనని, ప్రజాభిప్రాయం లేని వారికి సీటు ఇచ్చే పని లేదని చెప్పారు.

rayalseema 18022019

వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళిపొండి అంటూ నిర్మొహమాటం చెప్పటంతో, అందరూ అవాక్కయ్యారు. చంద్రబాబు ఇంత ఖటినంగా మాట్లాడటంతో నేతలు కూడా అవాక్కయ్యారు. మరో పక్క, వలసల కారణంగా పార్టీ ప్రతిష్టకు ఎటువంటి భంగం కలుగకుండా అప్రమత్తతో వ్యవహరించాలని అధిష్టానం భావిస్తున్నది. ప్రజలలో ఎటువంటి సందేహాలకు తావులేకుండా ప్రగతి, సంక్షేమ పథకాలపై పెద్దెత్తున ప్రచారం చేసేలా నేతలకు దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో వ్యవస్థాగత లోపాలను, అసమ్మతి జ్వాలలను కట్టడి చేసేందుకు తగిన వ్యూహాన్ని ఖరారు చేసారు. గడచిన నాలుగున్నరేళ్లలో తెలుగుదేశంపార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లయితే పార్టీకి పరాజయం అనేది ఉండదన్న ఉద్దేశంతో నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు.

నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా మారిన విజయవాడ నగరం బైపాస్‌ రహదారికి కేంద్రం మోకాలడ్డుతోంది. కేవలం 47 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. గతంలో నిర్మించు, నిర్వహించు, అప్పగించు(బీఓటీ) కింద అప్పగించిన ప్రాజెక్టుకే ఏదోరకంగా వంకలు పెడుతోంది. జాతీయ రహదారి నెం16 విస్తరణ పనుల్లో భాగంగా విజయవాడ బైపాస్‌ రహదారితో పాటు కృష్ణా నదిపై వంతెన నిర్మాణం పనులను బీఓటీ ప్రాజెక్టు కింద ఎన్‌హెచ్‌ఏఐ మంజూరు చేయగా దీన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గామన్‌ ఇండియా దక్కించుకుంది. ఆ ప్రకారం గుంటూరు జిల్లా చినకాకాని నుంచి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు ఆరు వరసల రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది.

rayalseema 18022019

చిన్నఅవుట్పల్లి నుంచి గొల్లపూడి వరకు బైపాస్‌ రహదారి, కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేయాలి. ఈ క్రమంలో చిన్నఅవుట్పల్లి వద్ద పనులను ప్రారంభించి గామన్‌ ఇండియా మూడేళ్ల తర్వాత తాము చేయలేమంటూ చేతులెత్తేసింది. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ దీన్ని ఈపీసీ కింద చేపట్టాలని నిర్ణయించి నాలుగు ప్యాకేజీలుగా విభజించింది. బైపాస్‌ రహదారి, కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం డీపీఆర్‌ అందించేందుకు ఏడు సంస్థలు గత జులైలోనే ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు (బిడ్లు) సమర్పించాయి. కానీ ఈ బిడ్లనే ఖరారు చేయకపోవడం విశేషం. వివరణలు పంపినా మళ్లీ తాజా అంచనాలు అంటూ దస్త్రాలను తిప్పి పంపుతున్నారు. దీనిపై ఎంపీలు పలుసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది.

rayalseema 18022019

కొర్రీలు వేయడం వెనుక రాష్ట్రంతో కేంద్రం అనుసరిస్తున్న ఘర్షణ వైఖరే కారణమని అధికారులు అనధికారికంగా అంగీకరిస్తున్నారు. చెన్నై నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరానికి రాకుండా ఈ బైపాస్‌లో విశాఖకు వెళ్లేందుకు అనువుగా ఉంటాయి. అలాగే హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలకు అనువుగా ఉంటుంది. నగరంలో ట్రాఫిక్‌ భారం తగ్గే అవకాశం ఉంది. విజయవాడ బైపాస్‌ లేకపోవడం వల్ల గన్నవరం, గూడవల్లి, నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత రెండు నెలల్లోనే 10 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క ఏడాదిలో ఈ గ్రామాల్లో జరిగిన ప్రమాదాల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

నేనే సియం నేనే సియం అంటూ, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులతో, 16 నెలలు జైల్లో ఉండి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తి ఈ దేశంలో, ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే ఎవరన్నా ఉన్నారా అంటే, అది మన ఖర్మకు మన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. కోర్ట్ లు కూడా, ఆర్ధిక ఉగ్రవాది అని సంభోదించాయి అంటే, మనోడి పవర్ అలాంటిది మరి. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉంటూ, అనునిత్యం మన రాష్ట్ర నాశనం కోసం, రాష్ట్ర ద్రోహులతో చేతులు కలిపి, నేను సియం అవుతా అంటూ తిరుగుతున్నాడు. అంటే ఈయన సియం అయ్యి, మన రాష్ట్రం మొత్తం తీసుకువెళ్ళి, కేసీఆర్ చేతిలో, మోడీ చేతిలో పెడతాడా ? అసలు ఈ మనిషికి నిజంగా రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా ?

rayalseema 18022019

ఇలాంటి చర్చలు జరుగుతూ ఉండగానే, తాజాగా జగన్ మోహన్ రెడ్డికి కోర్ట్ కి విధించిన ఆంక్షలు చూస్తే, ఇలాంటి వాడా మన నేత అని సిగ్గు పడాలి. విషయానికి వస్తే, జగన్‌మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తె దగ్గరకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ నెల 18 నుంచి మార్చి 15 మధ్య పది రోజుల పాటు జగన్ లండన్‌లో పర్యటించేలా ఏడాది కాలపరిమితితో పాస్‌పోర్టు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే, లండన్‌లో జగన్ పర్యటించే ప్రదేశాలు, ల్యాండ్‌ఫోన్, సెల్ నంబరు, ఈ-మెయిల్, ఫ్యాక్స్ నంబర్లను కోర్టుతోపాటు సీబీఐ అధికారులకు సమర్పించాలని ఆదేశించింది.

rayalseema 18022019

అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 నిందితుడు కాగా, ఏ2 నిందితుడైన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అయితే ఇన్ని ఆంక్షలు కోర్ట్ విధించింది అంటే, వీళ్ళు ఈ దేశానికి ఎంత ప్రమాదకారులో ఆలోచించండి. సొంత కూతురు దగ్గరకు వెళ్ళాలన్నా, కోర్ట్ పర్మిషన్ ఇస్తే కాని వెళ్ళలేని వ్యక్తి, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా ? అప్పట్లో బెయిల్ కోసం, సమైఖ్యంద్ర ఉద్యమం సోనియా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి, బయటకు వచ్చి ఆ ఉద్యమం నీరు కార్చాడు. ఇప్పుడు మళ్ళీ జైలుకు వెళ్ళకుండా ఉండటానికి, ప్రత్యెక హోదా ఉద్యమం తాకట్టు పెట్టి, కనీసం ఒక్క విభజన హమీ గురించి కూడా మోడీని నిలదియ్యలేని వ్యక్తి, ఈ రాష్ట్రానికి అవసరమా ?

Advertisements

Latest Articles

Most Read