వైకాపా అధినేత జగన్‌ మరోసారి శవరాజకీయం మొదలు పెట్టారని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ మండిపడ్డారు. తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకొని సీఎం పీఠం ఎక్కాలని ప్రయత్నించి.. చావు దెబ్బతిన్నా జగన్‌కు బుద్ధిరాలేదని దుయ్యబట్టారు. దొంగ పత్రికతో కుల రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైకాపా శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. కొండవీడులో వ్యక్తిగత కారణాలతో రైతు కోటయ్య చనిపోతే వైకాపా నేతలు కనీసం సానుభూతి కూడా తెలపలేదన్నారు. రైతు ఆత్మహత్యను రాజకీయానికి వాడుకోవడమే వైకాపా అజెండా అని విమర్శించారు. రైతు పొలానికి, సీఎం హెలిప్యాడ్‌కు సంబంధం లేదనే విషయం వైకాపా నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. వైకాపా శవ, కుల రాజకీయాలకు త్వరలోనే ప్రజలు జవాబు చెబుతారన్నారు.

sevam 20022019 2

ఇదే విషయం పై గుంటూరు పోలీసులు కూడా స్పందించారు. రైతు ప్రాణాలు కాపాడటానికి పోలీసులు వందల మీటర్లు పరుగులు పెట్టి ఆసుపత్రికి తరలిస్తే.. వారే కొట్టి చంపారని విషప్రచారం చేస్తున్నారని, దీనిని సహించబోమని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు. ఆయన్ని కాపాడటానికి పోలీసులు పడిన కష్టాల వీడియోలు, ఫొటోలున్నాయని వివరించారు. పోలీసులే కొట్టి చంపినట్లు ఏ ఒక్కరైనా చూస్తే వచ్చి చెప్పాలని మంగళవారం విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న కొండవీడు వేడుకల సందర్భంగా రైతును పోలీసులే కొట్టి చంపారనే ప్రచారంపై ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరణ ఇచ్చారు.

sevam 20022019 3

రైతు కోటేశ్వరరావుకు 14 ఎకరాల స్థలం ఉందని, అది కొండవీడు వేడుక జరిగే ప్రాంతానికి చాలా దూరంగా ఉందని తెలిపారు. ఇందులో మూడు నుంచి నాలుగెకరాల ఖాళీ స్థలంలో అనుమతులు తీసుకొని పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటుచేశామని అన్నారు. ఈ స్థలానికి దూరంగా బొప్పాయి, కనకాంబరం, మునగ తోటలున్నాయని తెలిపారు. సోమవారం ఉదయం పదింటికి రైతు కోటేశ్వరరావు పురుగుల మందు తాగినట్టు అక్కడ గస్తీ పోలీసులకు సమాచారం అందిందని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఓ కానిస్టేబుల్‌.. కోటేశ్వరరావును భుజంపై వేసుకొని దాదాపు 700 మీటర్లు పరుగు తీశారని వివరించారు. పోలీసులంతా అప్రమత్తమై విద్యుత్‌ శాఖకు చెందిన వాహనాన్ని ఏర్పాటుచేసి ఫిరంగిపురంలోని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. దురదృష్టవశాత్తు అప్పటికే ఆ రైతు మృతి చెందాడన్నారు. ఈ దుర్ఘటన సీఎం పర్యటనకు దాదాపు నాలుగుగంటల ముందు చోటు చేసుకుందని తెలిపారు.

సినీ నటుడు నాగార్జున వైసీపీ అధినేత జగన్‌తో భేటీ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున వైసీపీలో చేరనున్నారని కొందరు, నాగార్జునకు గుంటూరు ఎంపీ టికెట్ ఖాయమైందని మరికొందరు, నాగార్జున తనకు కావాల్సిన వ్యక్తి కోసం జగన్‌ను కలిశారని ఇంకొందరు.. ఇలా మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేడు టెలీకాన్ఫరెన్స్‌లో ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన జగన్ లాంటి వ్యక్తులతో నాగార్జున భేటీ కావడం సరైంది కాదని పలువురు టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా రాజకీయ వర్గాల్లో నాగార్జున, జగన్ భేటీ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

nagarjuna 20022019

దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ హైదరాబాద్ కేంద్రంగా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. దేశ ప్రయోజనాల కోసమే కేంద్రస్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు. రాష్ట్రాల్లో ఎవరి బలాల మేరకు వాళ్లు పోటీ చేస్తారని చెప్పారు. ఏపీకి ద్రోహం చేసి నేటికి ఐదేళ్లు అని... నమ్మకద్రోహాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని నేతలను ఆదేశించారు. ప్రత్యేక హోదా సహా మిగిలిన ఐదు హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఆర్ధికలోటులో నాలుగో వంతు కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాత్ర చేస్తోందని, రాష్ట్రంలో ఆ పార్టీ విషయంలో మనం స్పష్టతతో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

nagarjuna 20022019

దేశ ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర స్థాయిలో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో రాజకీయ లబ్ధి దాగి ఉందా? అనే అనుమానం దేశవ్యాప్తంగా బలపడుతోందని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే భాజపా రిమోట్ కంట్రోల్‌లో ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా నేతల్లో చాలా వరకూ గొడవలు లేకుండా ఎవరి పరిధిలో వారు పని చేసుకుంటున్నారని కితాబిచ్చారు. పేదల సంక్షేమానికి అందరూ కలిసి రావాలని సీఎం పిలుపునిచ్చారు. పనిచేసే వారికే ప్రజా దీవెనలు ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 20... సరిగ్గా ఈ రోజుకు ఏపీకి ద్రోహం చేసి 5 ఏళ్లు అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. నమ్మక ద్రోహానికి ఐదో వార్షికానికి నిరసనలు జరపాలని సూచించారు. 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి 5 ఏళ్లు అయ్యిందని, ప్రత్యేక హాదాతో సహా మిగిలిన 5 హామీలు గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీ ఇవ్వలేదని, వెనుకబడిన జిల్లాలకిచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారని ఆక్షేపించారు. భాజపా నమ్మక ద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు. జాతీయస్థాయిలో భాజపాయేతర పార్టీలతో కలిసి పనిచేస్తామని మరోమారు స్పష్టం చేశారు.

ఏపీ భవన్‌ క్యాంటిన్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చారు. రాహుల్‌కు టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు ముందు రాహుల్‌ ఏపీ భవన్‌ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 22న తిరుపతిలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ చేపట్టింది. ఈ యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఈ నెల 19 నుంచి 13 జిల్లాల్లో ప్రత్యేకహోదా భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా 22న రాహుల్‌గాంధీ వస్తున్న సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అమలు చేస్తానని ప్రధాని మోడీ మాట ఇచ్చి తప్పిన ప్రాంతమైన తిరుపతిలోనే రాహుల్‌ ప్రత్యేకహోదా భరోసా యాత్ర లో పాల్గొననుండడం విశేషం.

rahul 19022019 2

ఇక ఎన్ని కలు సమీపిస్తున్న వేళ.. ప్రజల్లోకి చొచ్చు కు వెళ్లేందుకు గాను కాంగ్రెస్‌ సమస్త అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర విభజన పాపాన్ని మూట గట్టుకున్న కాంగ్రెస్‌ 2014లో మట్టికరచింది. అప్పటితో పోలిస్తే ఇపుడు కొంతమేర పరిస్థితి మెరుగుపడిందన్న విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధానిగా రాహుల్‌గాంధీ తొలి సంతకం ఏపీకీ ప్రత్యేక హోదాపైనే ఉంటుందని స్వయంగా రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ ప్రకటనను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కాంగ్రెస్‌ కొంతమేర ముందుకు వెళ్లింది. ఇదే క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర పేరుతో మంగళవారం నుంచి బస్సు యాత్ర చేపట్టనుంది.

rahul 19022019 3

ఈ సందర్భంగా 13 జిల్లాల నుంచి కాంగ్రెస్‌ నేతలు అనంతపురానికి ఇప్పటికే చేరుకున్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 13 రోజుల పాటు 13 జిల్లాల్లో నిర్వహించనున్న ఈ యాత్ర మార్చి 3వ తేదీన ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. మొత్తం 2251 కిలోమీటర్ల పొడవునా జరుగనున్న ఈ యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 22వ తేదీన తిరుపతి రానున్నారు. రాహుల్‌ రాక సందర్భంగా 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా మడకశిరలో ప్రారంభమయ్యే భరోసా యాత్రకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమన్‌చాందీ, కర్ణాటక మంత్రి శివకుమార్‌ , ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్‌తో పాటు ఏపి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా హాజరవుతున్నారు.

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మో‌హన్‌రెడ్డితో టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున భేటీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌‌కు వెళ్లిన నాగార్జున.. సుమారు అరగంటకు పైగా జగన్‌‌తో భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరీ ముఖ్యంగా వైసీపీ తరఫున గుంటూరు ఎంపీగా నాగార్జున పోటీ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే భేటీ అనంతరం నాగ్ మీడియాతో మాట్లాడుకుండానే వెళ్లిపోయారు. ప్రస్తుతం జగన్-నాగ్‌ భేటీ అటు ఏపీ రాజకీయాల్లో.. ఇటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

galla 19022019

అయితే ఈ భేటీపై.. ఫస్ట్ టైం నాగార్జున పెదవి విప్పారు. వైఎస్ జగన్ మా కుటుంబ సన్నిహితుడని.. మర్యాద పూర్వకంగానే కలిశానని ఆయన స్పష్టం చేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని నాగ్ మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ను విజయవంతంగా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు నాగార్జున చెప్పారు. తాను ఎవరికో టికెట్ ఇప్పించాలని జగన్‌ను కలిశానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ఆయన కొట్టి పారేశారు. ఎవరికో టికెట్ ఇవ్వాలని సంప్రదించాల్సిన అవసరం తనకు లేదని నాగార్జున చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే భేటీ అనంతరం వచ్చిన పుకార్లకు నాగ్ ఫుల్‌‌స్టాప్ పెట్టేశారని చెప్పుకోవచ్చు.

galla 19022019

అయితే అంతకు ముందు, మీడియా ఈ విషయం పై గల్లాను ప్రశ్నించింది. " నాగార్జున నాకు మంచి స్నేహితుడు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు నాతో అనలేదు. జగన్‌ను ఎందుకు కలిశారో కూడా నాకు తెలియదు. ప్రత్యర్థులు ఎవరైనా పోటీ ఎప్పుడూ ఉంటుంది. అమ్మ పోటీ చేసిన 4 ఎన్నికలు చూశాను.. కానీ ఈసారి జరగబోతున్న ఎన్నికలు పూర్తిగా భిన్నం. ఏపీ ప్రభుత్వంపై నెగటివ్‌ ఓటు లేదు.. పూర్తి పాజిటివ్‌ ఓటు ఉంది. అభ్యర్థుల ఎంపికలో సీఎందే తుది నిర్ణయం" అని గల్లా జయదేవ్‌ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే ప్రత్యర్థులు ఎవరైనా సరే తాను మాత్రం పోటీ చేసి తీరుతానని గల్లా పరోక్షంగా వ్యాఖ్యానించారు. మరో పక్క, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, ‘నార్నె’ సంస్థల అధినేత నార్నె శ్రీనివాసరావు ఇటీవలే వైసీపీ అధినేత జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. వైసీపీలో ఆయన చేరతారని, గుంటూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈ విషయమై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ని మీడియా ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ తరపున మీపై నార్నె శ్రీనివాసరావు పోటీ చేస్తారని చెబుతున్నారని..’ అని అడగగా, ‘ఎవరినైనా రానీయండి. నేను మొదటిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేసింది, ‘విన్నింగ్ సీటు, విన్నింగ్ ప్లేస్’ అని రాలేదు. గుంటూరు అంటే మా మామగారి ఊరు... కాబట్టి ఇక్కడికి వచ్చాను ఎన్నికలు ఎక్కడైనా కష్టంగానే ఉంటాయి. ముందు నుంచి కష్టపడితేనే గెలుపు వస్తుంది’అని జయదేవ్ చెప్పుకొచ్చారు.

Advertisements

Latest Articles

Most Read