చంద్రబాబు సృష్టించిన ఒక అద్భుతం పట్టిసీమ.. అయినా రైతులు ఓడించారు అనుకోండి అది వేరే విషయం... రాష్ట్రం ఏర్పాటు కాగానే, కృష్ణా నుంచి నీరు రాదని గ్రహించి, వెంటనే పట్టిసీమ నిర్మాణం పూర్తి చేసి, ప్రత్యక్షంగా కృష్ణా డెల్టాకు, పరోక్షంగా రాయలసీమకు నీరు ఇచ్చేలా రికార్డు సమయంలో, పట్టిసీమ పూర్తి చేసారు. నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చే పరిస్థితి లేదు, పోలవరానికి కేంద్రం సహకరించదు అని గ్రహించి, చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. దానికీ తగ్గట్టే 4 ఏళ్ళలో 240 టిఎంసీ దాకా నీళ్ళు ఎత్తి పోసి, రైతులను ఆదుకున్నారు. ఇక్కడ కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీరు ఇవ్వటంతో, రాయలసీమకు శ్రీశైలం నుంచి వచ్చే నీరు మళ్ళించారు. ఇలా చంద్రబాబు ఎంతో ముందు చూపుతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి రైతులకు అండగా నిలిచారు. అయితే అప్పట్లో జగన్ ఈ ప్రాజెక్ట్ ను వ్యతిరేకించారు. అవగాహన లేకుండా పట్టిసీమ వేస్ట్ అంటూ వాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావటంతో, పట్టిసీమ నీటిని వదిలితే, తమ వాదన తప్పు అవుతుందని, చంద్రబాబు సృష్టించిన ప్రాజెక్ట్ కరెక్ట్ అని ఒప్పుకోవాల్సి వస్తుంది అని, పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేదు.

ప్రతి సారి జూన్ మొదటి వారంలో చంద్రబాబు నీళ్ళు వదిలే వారు. దీంతో రైతులు వానల కోసం చూడకుండా, పనులు చేసుకునే పరిస్థితి కల్పించారు. తుఫానుల కాలం నాటికి, పంట చేతికి వచ్చేది. దీంతో తుఫాను బారిన కూడా పంటలు పడకుండా ఉండేది. కాని, ఇప్పుడు జూన్ నాలుగవ వారం వస్తున్నా పట్టిసీమ నుంచి నీళ్ళు లేవు. మరో పక్క ఎప్పుడూ లేని విధంగా, జూన్ చివరకు వస్తున్నా వర్షాలు లేవు. దీంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిల్లో ఉండి పోయారు. ఎగువన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కూడా పెద్దగా వర్షాలు లేకపోవటంతో ఈ ఏడాది కృష్ణానదికి వరద ప్రవాహం ఉండదు అనే చెప్పాలి. అప్పుడు ఇక తాగు నీటికి కూడా రాష్ట్రంలో దిక్కు ఉండదు. దీంతో ఇప్పుడు రైతులు అందరూ జగన్ వైపు చూస్తున్నారు. రాజకీయ కక్షలు పక్కన పెట్టి, పట్టిసీమ నుంచి నీటిని వదలాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అని, పట్టిసీమను నమ్ముకుని 13 లక్షల ఎకరాల రైతులు పంట వెయ్యటానికి సిద్ధంగా ఉంటే, జగన్ ప్రభుత్వం చేసిన పనితో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. మరో పక్క అధికారులు మాత్రం, గోదావరిలో ప్రవాహం ఇంకా పెరగాలని, అప్పుడు ప్రభుత్వం ఆదేశిస్తే, పట్టిసీమను వదులుతాం అని అంటున్నారు. మరి పట్టిసీమ వాడతారా, లేక పట్టిసీమ నీళ్ళు లేకుండా రైతులకు ఎక్కడ నుంచి అయినా నీళ్ళు తెచ్చి, జగన్ ప్రభుత్వం ఇస్తుందో వేచి చూడాలి.

ఎన్నికల్లో ఓడిపోగానే, చంద్రబాబు పై మిత్రపక్షాలు అయిన బీజేపీ, వైసీపీ ఎలా కక్ష తీర్చుకుంటున్నాయో ప్రతి రోజు చూస్తున్నాం. జగన్ ఒక విధంగా దెబ్బ కొడుతూ, అవమానాలు చేస్తుంటే, బీజేపీ మరో రకంగా చంద్రబాబుని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిపోయినా, దేశంలో ఒక్క మీడియాకు ఈ చర్య పై స్పందించలేదు. ఎక్కడ మా మీద పడతారో అని, ఏ రాజకీయ పార్టీ కూడా ఇది తప్పు అని మాట్లాడ లేదు. అయితే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఈ సమయంలో చంద్రబాబుకు బాసటగా నిలిచారు. మోడీ చేస్తున్న విధానాల పై మండిపడ్డారు. బీజేపీ బ్రాండ్‌ తో చేసే రాజకీయాల్లో అన్నీ సరైనవై అయిపోతాయాని మాయావతి అన్నారు. నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను, బీజేపీ తమ పార్టీలో విలీనం చేసుకోవడం పై శుక్రవారం ఆమె ట్విటర్‌లో తీవ్రంగా స్పందించారు. బీజేపీ వ్యవస్థలను ఎలా దిగజారుస్తుందో, ఇదే నిదర్శనం అని అన్నారు.

ఆమె స్పందిస్తూ, ‘గురువారమే రాష్ట్రపతి ప్రసంగం జరిగింది. ప్రభుత్వం చెయ్యబోయే పనులు, ప్రాధాన్యతలు చెప్పి, రాష్ట్రపతి చేత ఎన్నో హామీలిచ్చారు. కానీ అదే రోజు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను ఫిరాయింపు చేసేలా ప్లాన్ చేసింది. ఆ నలుగురు ఎంపీలలో, ఇద్దరిని అవినీతిపరులు అంటూ గతంలో ఆరోపణలు చేసారు. ఇప్పుడు వారు కూడా ఆ పార్టీలో చేరారు. చేరగానే వారు పాల కంటే స్వచ్ఛంగా మారిపోయారు’ అని ట్విట్టర్ ద్వారా ఎద్దేవాచేశారు. తమదైన స్టైల్ లో చేస్తున్న రాజకీయాల్లో బీజేపీ పార్టీకి జరుగుతున్న అన్ని విషయాలు ఎంతో నుకూలంగానే కనపడుతున్నాయని అన్నారు. ఇది ఇలా ఉంటే, తెలుగుదేశం పార్టీ ఎంపీలు నలుగురు బీజేపీ పార్టీలో చేరటమే కాకుండా తమ పార్టీని విలీనం చేస్తున్నట్లుగా ఇచ్చిన తీర్మాన లేఖను ఇప్పటికే రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆమోదించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పడుతుంది.

నిన్న నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ లో చేరిన తరువాత, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉండాలి కాని, ఇక్క వెరైటీగా తమ ప్రత్యర్ధులతో కలిసి భోజనాలు చెయ్యటం వింతగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నలురుగు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో పాటు, విజయసాయి రెడ్డి కలిసిపోయి, భోజనాలు చేస్తున్న ఫోటోలు ఫోటోలు ఇంటర్నట్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకులు కలవటం, ప్రత్యర్ధి పార్టీల వారితో కలిసి ఫోటోలు దిగటం ఇవన్నీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అయితే బీజేపీలో చేరిన గంటలోనే, సీఎం రమేష్, సుజనా చౌదరిలు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యారు. నేటి రాజకీయం ఇదే అంటూ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చంద్రబాబు, జగన్ మధ్య ఎలాంటి రాజకీయ వైరం ఉందో, అలంటి రాజకీయ వైరం, సియాం రమేష్, విజయసాయి రెడ్డి మధ్య ఉంది. అయితే, ఇప్పుడు వీళ్ళు అవేమి లేవు అన్నట్టు, కలిసి భోజనాలు చెయ్యటం, సామాన్య ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అయితే వీళ్ళు, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వ్యవహారాన్ని విజయసాయిరెడ్డే దగ్గర ఉంది పర్యవేక్షించారా అనే చర్చ ఇంటర్నెట్ లో జరుగుతుంది. దీనికి రెండు రోజుల ముందు జరిగిన సంఘటన కూడా ఇప్పుడు చర్చలోకి వస్తుంది. రెండు రోజుల క్రితం లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా విజయసాయిరెడ్డి, సీఎం రమేష్‌లు పక్కపక్కనే కూర్చుని రెండు గంటల పైగా మాట్లాడుకోవటం కనిపించింది. మొన్నటి వరకూ ఉప్పు, నిప్పులా ఉన్న రమేష్, విజయసాయి రెడ్డి, దాదాపుగా రెండు గంటలకుపైగా మాట్లాడుకోవటం పెద్ద సంచలనేమే అయ్యింది. అయితే ఇది పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిన్న వీరు పార్టీ మారటంతో, ఈ స్కెచ్ అంతా విజయసాయి రెడ్డి స్కెచ్ అని అర్ధం అవుతుంది. మిత్రపక్షంగా ఉన్న బీజేపీని బలోపేతం చేయడంతో పాటు, విపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే ప్లాన్ విజయసాయిరెడ్డి అమలు చేసారనే ప్రచారం జరుగుతుంది.

మొన్నటి దాక తెలుగుదేశం పార్టీ డేటా దొంగతం చేసిందని, వైసీపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆధార డేటా మొత్తం తెలుగుదేశం పార్టీ దొంగతనం చేసింది అంటూ, హడావిడి చేసారు. అయితే ఇప్పుడు అదే వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ చేసిన డేటా దొంగతనం ఏమో కానీ, ఇప్పుడు మాత్రం వైసీపీ అధికారంలోకి అదే పని చేసినట్టు అర్ధమవుతుంది. గ్రామాల్లో వాలంటీర్లను నియమిస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అయితే అవన్నీ వైసీపీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చే స్కెచ్ వేసారు. దీని కోసం, వైఎస్‌ఆర్‌విలేజ్‌ సేవక్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్సైటు మొదలు పెట్టారు. వాలంటీర్లగా ఉండాలి అనుకువే వారు ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలంటూ వెబ్‌సైట్‌ మొదలు పెట్టారు. ఇది సోషల్ మీడియాలో కూడా వైసీపీ వెరిఫైడ్ ఎకౌంటు నుంచి కూడా పోస్ట్ చేసారు. దీంతో అందరూ ఇదే ప్రభుత్వం వెబ్సైటు అనుకుని రిజిస్టర్ అవ్వటం మొదలు పెట్టారు. వైసీపీ కార్యకర్తలు కాకుండా, సామాన్యులు కూడా దీంట్లో రిజిస్టర్ అయ్యారు.

అయితే ఈ వెబ్సైటులో ధరకాస్తు ఫిల్ చేసే సమయంలో, పేరుతో పాటు కీలకమైన ఆధార్‌ వివరాలను కూడా సేకరించారు. ఆధార నెంబర్ ఎంటర్ అవ్వగానే, డీటెయిల్స్ వచ్చేయటంతో ఇదో సంచలనంగా మారింది. ఒక పార్టీ పెట్టిన ప్రైవేట్‌ వెబ్‌సైట్ల ద్వారా ఆధార్‌ వివరాలు సేకరించడం అనేది చట్టానికి విరుద్ధం. ఇది కూడా డేటా చోరీ కిందకే వస్తుంది. అయతే ఈ విషయం నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో, వైఎస్‌ఆర్‌విలేజ్‌సేవక్‌ అనే వెబ్‌సైట్‌ ను వెంటనే తొలగించారు. అయితే ఈ వెబ్సైటుతో మాకు సంబంధం లేదు అంటూ వైసీపీ ప్రకటించింది. కాని, ఇదే వెబ్సైటు అంటూ వైసీపీ వెరిఫైడ్ సోషల్ మీడియా పేజి లో ఉండటం మాత్రం గమనార్హం. అయితే ఇప్పుడు ఈ వెబ్సైటు వివాదం పెద్దది కాక ముందే తెలివిగా, వైసీపీ ఆ వెబ్సైటు తొలగించింది. నిన్నటి నుంచి పార్టీ ఫిరాయింపులు అంశం వార్తల్లో ఉండటంతో, ఈ విషయం పై అటు ప్రతిపక్షం తెలుగుదేశం కూడా పట్టించుకోలేదు. దీంతో, ఈ అంశం నుంచి వైసీపీ తెలివిగా బయట పడింది.

Advertisements

Latest Articles

Most Read