గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ పై సుప్రీంకోర్టు వచ్చే సోమవారం విచారణ జరపనుంది. 2002లో గుజరాత్‌లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ అల్లర్ల వెనుక అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, ఇతరుల కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. కాగా ప్రత్యేక దర్యాప్తు బృందం మోదీ సహా 58మందికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 2017 అక్టోబరులో గుజరాత్‌ హైకోర్టు వారికి క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సమర్థించింది. అయితే మోదీకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జాఫ్రి భార్య జకియా జాఫ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

gujarat 13112018 2

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ కూడా సిట్‌ దర్యాప్తు నివేదికను, కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 68ఏళ్ల ఇషాన్‌ జాఫ్రి 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లో జరిగిన గుల్బర్గా ఊచకోతలో చనిపోయారు. 2006లో ఆయన భార్య జకియా జాఫ్రి నరేంద్ర మోదీపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు గుల్బర్గా ఊచకోత సహా 9 అల్లర్ల కేసులను తిరిగి విచారణ జరపాలని ఆదేశించింది. 2009 ఏప్రిల్‌ 27న జకియా ఫిర్యాదును పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం సిట్‌ను ఆదేశించింది. మోదీ కుట్ర పన్నారనడానికి ఆధారాలేమీ లేవని చెప్తూ 2012 మార్చిలో సిట్‌ నివేదిక ఇచ్చింది.

gujarat 13112018 3

2008లో సిట్ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010లో మోదీని సిట్ 9 గంటలకు పైగా విచారించింది. అనంతరం, మోదీ, మరో 59 మందిపై 'ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్' లేదంటూ క్లోజర్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది. దీనిపై జాఫ్రి, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ 2012 ఫిబ్రవరి 9న మెట్రో పాలిటన్ కోర్టులో సవాలు చేశారు. మోదీకి క్లీన్ ‌చిట్ ఇవ్వడాన్ని తమ పిటిషన్‌లో ప్రశ్నించారు. అయితే సిట్ రిపోర్ట్‌ను దిగువ కోర్టు సైతం సమర్ధించడంతో, ఆ తదుపరి క్రమంలో జాఫ్రి, సెతల్వాద్ గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. 2017 జూలై 3న కేసు విచారణ పూర్తయింది. మోదీకి, ఇతరులకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. దీనిని పైకోర్టులో సవాలు చేసుకునే వీలు జాఫ్రికి కోర్టు కల్పించింది. దీంతో జాఫ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిబంధనలను దిగువ కోర్టులు పాటించలేదని, సాక్షులు సంతకం చేసిన స్టే‌ట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకోలేదని, ఈ ఘటనల వెనుక కుట్ర ఉందని జాఫ్రి ప్రతినిధులు ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త... మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కొలువుల కోలాహలం మొదలైంది. ఇటీవల ఎస్సై ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన ఏపీ పోలీసు నియామక మండలి సోమవారం సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ విభాగాల్లో కానిస్టేబుళ్లు, జైలు వార్డర్లు, ఫైర్‌మెన్‌ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 2,723 పోస్టులను భర్తీ చేయనుంది. మంగళగిరిలోని ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌, పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌లు సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసి అందులోని ముఖ్యాంశాలను వెల్లడించారు.

ap jobs 13112018

దరఖాస్తు చేసుకున్న వారందరికీ తొలుత ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తారు. వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఆబ్జెక్టివ్‌లో ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. గణితం, రీజనింగ్‌, జనరల్‌ స్టడీస్‌వంటి అంశాలతో ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో రాయాలి. ఓసీ అభ్యర్థులు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ విశ్రాంత సైనికోద్యోగులు 30 శాతం మార్కులు పొందితే తదుపరి దశకు అర్హులవుతారు. ప్రాథమిక రాత పరీక్షలో ఎంపికైన వారికి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక రాత పరీక్ష అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. కాకినాడ జేఎన్‌టీయూకు పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. మార్చినాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నారు.

ap jobs 13112018

విద్యార్హతలు.. * సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌, ఫైర్‌మెన్‌లకు: ఇంటర్మీడియట్‌లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి... * ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివి పరీక్షలు రాసుంటే సరిపోతుంది... * జైలు వార్డర్లు: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవాలి... ముఖ్యమైన తేదీలు: * దరఖాస్తుల స్వీకరణ: 12.11.2018 (సోమవారం) మధ్యాహ్నం మూడింటినుంచి ప్రారంభమైంది... * దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: 2018 డిసెంబరు 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ.. * ప్రాథమిక రాత పరీక్ష: 2019 జనవరి 6 ఆదివారం ఉదయం పదింటినుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ... * శారీరక దారుఢ్య పరీక్షలు: 2019 ఫిబ్రవరి 9- 2019 ఫిబ్రవరి 20 మధ్య... * తుది రాత పరీక్ష: 2019 మార్చి 3న దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు... * slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం నిజమే అని మరో వార్తా సంస్థ పరిశోధనలో తేలిపోయింది. ఈ కధనంతో రాఫెల్‌ డీల్‌లోని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. ధర విషయంలో దోపిడీ జరిగిందని స్పష్టంగా తేలిపోయింది. అంతా ఇంతా కాదు, ఏకంగా 40 శాతం మొత్తానికి టెండరు పెట్టినట్లు స్పష్టమైంది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘హాల్‌’ను పక్కనపెట్టి అనిల్‌ అంబానీకి మేలు చేసిన వైనం కూడా బయటపడింది. పాత, కొత్త ఒప్పందాలపై సేకరించిన కీలక పత్రాల ఆధారంగా ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ ఈ సంచలన కథనం ప్రచురించింది. 2012 ఒప్పందం ప్రకారం, దసో సంస్థ ఒక్కో రాఫెల్‌ విమానాన్ని 15.5 కోట్ల యూరోల (రూ. 1000 కోట్లు)కు అందించేందుకు ముందుకు వచ్చింది.

businessstandarad 13112018 2

18 రాఫెల్‌ విమానాలను ఫ్రాన్స్‌లోనే తయారు చేసి ‘రెడీ టు ఫ్లై’ దశలో భారత్‌కు అప్పగిస్తారు. మరో 108 విమానాలను బెంగళూరులోని ‘హాల్‌’లో తయారు చేసేందుకు వీలుగా దసో, థేల్స్‌, స్నెకా సంస్థలు పరికరాలను, పరిజ్ఞానాన్ని అందిస్తాయి. అదే విమానం! అవే నిబంధనలు! అయితే.. ఒకేసారి 36 కొనేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. వీటికి 7800 కోట్ల యూరోలు చెల్లించేలా 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే... సగటున ఒక్కో విమానం విలువ 21.7 కోట్ల (రూ. 1600 కోట్లు) యూరోలు. నాలుగేళ్లలో ఒక్క విమానం విలువ రూ.600 కోట్లు పెరిగిపోయింది. అంటే.. రాఫెల్‌కు మోదీ సర్కారు 40 శాతం అదనపు ధర చెల్లిస్తోంది. ఇది... ‘‘నిజానికి మా డీల్‌లో 9 నుంచి 20 శాతం ధర తగ్గుతోంది. పాత ఒప్పందంలో ఆయుధాలు, స్పేర్‌ పార్టులు, నిర్వహణ గ్యారెంటీ వంటివి లేవు’’ అని రక్షణ మంత్రి నిర్మలా, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.

businessstandarad 13112018 3

కానీ... వీరు చెప్పింది పచ్చి అబద్ధాలని ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ తేల్చింది. ధరలో మార్పు మాత్రమే కాదు... రాఫెల్‌ డీల్‌లో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అది.. హాల్‌ స్థానంలో అనిల్‌ అంబానీకి చెందిన ‘రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌’ రంగ ప్రవేశం. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో రాఫెల్‌ డీల్‌పై ప్రకటన చేయడానికి కేవలం 10 రోజుల ముందే ఈ సంస్థ పుట్టింది. కాగా.. రాఫెల్‌ కొనుగోలుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో సుప్రీం కోర్టుకు సమర్పించింది. మరో 16 పేజీల్లో ఇతర వివరాలను అందించారు.

దేశంలో బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఆయా పక్షాల నేతలను కలుస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు.. అదే క్రమంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 19న కోల్‌కతా వెళ్లనున్నట్లు తెలిసింది. నిజానికి మమతతో ఎప్పటికప్పుడు ఆయన ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలను ఏకం చేసే పనిపై తొలిసారి ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం కూడా అక్కడ జరిగిన పరిణామాలను ఆమెకు వివరించారు.

mamatha 13112018 2

అయితే కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభమయ్యాక నేరుగా ఆమెను కలువడం సాధ్యపడలేదు. ఢిల్లీలో పలు పార్టీల నేతలను.. కర్ణాటక, తమిళనాడులో అక్కడి ముఖ్య పార్టీల నేతలను మాత్రమే కలిశారు. దరిమిలా మమతతో ముఖాముఖి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై 19న వీరిద్దరూ చర్చిస్తారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు, సానుకూలతలపై మంతనాలు జరుపుతారు. కాగా.. జనవరి 18న గానీ, 19న గానీ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని మమత నిర్ణయించారు.

mamatha 13112018 3

ఆ ర్యాలీకి అన్ని బీజేపీయేతర పార్టీలను పిలవాలని యోచిస్తున్నారు. దీనిపైనా ఇరు నేతలు చర్చిస్తారు. ఢిల్లీలో ఈ నెల 22న జరపతలపెట్టిన బీజేపీయేతర పక్షాల విందు సమావేశంపైనా మాట్లాడుకుంటారు. మరోవైపు.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలన్నీ ఉమ్మడి ర్యాలీలు ఏర్పాటుచేయాలన్న కాంగ్రెస్‌ ప్రతిపాదన పై ఢిల్లీలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. భాజపాయేతర పార్టీలను సంఘటితం చేసే ప్రక్రియలో మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీని అత్యంత కీలకమైనదిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వామపక్ష నేతలతోనూ మంతనాలు జరిపారు. వారికి బద్ధశత్రువైన మమతాబెనర్జీతో ఆయన భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisements

Latest Articles

Most Read