శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో గత ప్రభుత్వం అందరికీ ఇళ్లు వథకంలో ఎన్టీఆర్ స్వగృహా నిర్మాణాల్ని చేవ ట్టారు. ప్రభుత్వమే ఉచితంగా ఇస్తే లబ్దిదారుల జవాబుదారీతనం ఉండదనే భావంతో లబ్దిదారులను భాగస్వాముల్ని చేసింది. వారు చెల్లించాల్సిన నిధుల్ని బ్యాంకు రుణంగా అవకాశం కల్పించారు. బ్యాంకులో రుణం తీరిన తరువాత ఇల్లు స్వాధీనం చేస్తామన్నారు. ఎన్నో సర్వేలు పరిశీలనల తరువాత లబ్దిదారుల్ని ఎంపిక చేశారు. వారి నుంచి డిడిల రూపంలో సొమ్ములు కట్టించుకున్నారు. లబ్దిదారులు వారి స్తోమతను బట్టి సింగల్ బెడ్ రూం, డబుల్ బెడ్ రూంలను తీసుకునున్నారు. తాము చెల్లించాల్సిన మొత్తం డిడిలు చెల్లించారు. ఇళ్ల నిర్మాణాన్ని ఓ సంస్థకు అప్పగించారు. వారు 75 - శాతం పనులుచేసిన తరువాత ప్రభుత్వం మారింది. లబ్ధిదారుల పరిస్థితి త్రిశంకుస్వర్గంగా మారింది. పూర్తయిన ఇళ్లు కూడా ఇవ్వలేదు. శ్రీకాళహస్తి మున్సిపాలిటికి ప్రభు త్వం 6015 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో 5984 ఇళ్లను అపార్టుమెంట్ తరహాలో నిర్మించాలని టెండర్లు పిలిచారు.

నాగా ర్జున కన్స్ట్రక్షన్స్ వారికి వనుల బాధ్యతను చేపట్టారు. ఈ ఇళ్లకు గాను లక్ష రూపాయల చొప్పున సుమారు 2 వేల మంది డిపాజిట్లు చెల్లించారు. 50 వేలు డిపాజిట్ లను కూడా చెల్లించి అపార్టుమెంట్ లో సొంతింటికి ప్రయత్నించారు. మొదటి దశలో 2912 ఇళ్లు వూర్తి చేశారు. రెండవ దశలో 3099 ఇళ్లు కాగా 50 శాతం పూర్తి చేశారు. మూడోదశ ఇళ్లు మంజూరుకా లేదు. అయితే ఇళ్లను 2019 జనవరిలో అవ్పగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పూర్తయిన ఇళ్లకు వి ద్యుదీకరణ, మౌలిక సదుపాయాలు కల్పించటంలో ఆలస్యం జరిగింది. దీంతో లబ్ధిదారులు కష్టాల్లో పడ్డా రు. కొత్త ప్రభుత్వం రివర్స్ టెండర్లకు వెళ్లింది. కొత్త టెండరయ్యింది. కానీ పనులు చేపట్టలేదు. దశల వారీ సర్వేలు, లబ్దిదారుల తొలగించారు.

గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో అనరులున్నా రంటూ కొత్త ప్రభుత్వం దశలవారీ సర్వేలు చేపట్టిం ది. మొదట అనర్హుల జాబితాలో స్థానికేతరులని 122 మందిని గుర్తించింది. వారికి సమాచారం అం దించింది. వారికి వారు చెల్లించిన డిడిలు వాపసు ఇస్తామని ప్రక టించారు. తాజాగా శనివారం అందిన సమాచారం మేరకు 833 మందిని తొలగించారు. అయితే తొలగింపుకు సంబంధించి కారణా లేమిటో పేర్కొనలేదు. దాంతో స్థానిక అధికారులు తలలు పట్టు కుంటున్నారు. కేటాయించిన ఇళ్లను రద్దుచేస్తే.. లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమౌతున్నారు. నిర్మించిన ఇళ్లలోకూడా ఇంకా వెయ్యి మిగిలిపోతున్నాయి. నవరత్నాల్లో లబ్ది దారులతో భర్తీ చేయాలని యోచిస్తున్నారు. కానీ వారు వ్యక్తిగత పట్టాలు కోరుకుంటున్నారు. కానీ అపార్టుమెంట్లో వద్దంటున్నారు. దాంతో వరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

ఒక పక్క వైసీపీ, మాకు అధికారం ఉంది, మేమే గెలుస్తాం అంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో హడావిడి చేస్తుంటే, తెలుగుదేశం అంతే ధీటుగా స్పందిస్తుంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పందిస్తూ, మేము విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నాం, ఎంత మంది మంత్రులు రాజీనామా చేస్తారో రెడీగా ఉండండి అంటూ వైసీపీకి ఛాలెంజ్ చేసారు. కేశినేని మాట్లాడుతూ, "విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుంది. 75 శాతం సీట్లు గెలవబోతున్నాం. ఎంత మంది మంత్రులతో రాజీనామా చెపిస్తాడో చూస్తాం. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారు. జగన్ స్వార్థం కోసం మూడు రాజధానులు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలు నాశనం అవ్వాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నాడు. సీపీఐ టీడీపీ కలిసి పోటీ చేస్తుంది. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్, విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నాం. కేసులకు భయపడి..జగన్ బీజేపీ కి అమ్ముడు పోయాడు. 22 మంది ఎంపీలతో caa కి అనుకూలంగా ఓటు వేయించాడు. కేంద్రం మెడలు వంచుతా అని..కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నాడు. రాష్ట్రాన్ని బీజేపీ కి తాకట్టు పెట్టారు. ప్రతి ఒక్కరు జగన్ కి బుద్ధి చెప్పండి...స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ లు టీడీపీ గెలుస్తుంది. నిజంగా ప్రజలు నీ పక్షాన ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలి. ఓటమి భయంతో జగన్ అభ్యర్థులపై కేసులు పెట్టిస్తున్నారు" అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు.

జగన్‌ పాలనలో అన్నీ నల్ల చట్టాలు, నల్ల జీవోలు, బ్లాక్ డేలే నని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియకు, ప్రభుత్వానికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ అనేది ఈసీ పరిధిలోని అంశమన్న ఆయన..66 మండలాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి అరాచక పాలన రాష్ట్రంలో గతంలో లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నిలదీశారు. 2020 ఆర్డినెన్స్ 2 ఒక నల్ల చట్టమన్న యనమల.. ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణలే జగన్ చీకటి పాలనకు నిదర్శనాలన్నారు.

ఏదో వంకచూపి గెలిచిన అభ్యర్ధులపై కక్ష సాధించడానికే ఈ సవరణ చేశారని యనమల ఆరోపించారు. పోటీ చేసేవాళ్లను భయపెట్టడం, ప్రతిపక్షాల అభ్యర్ధులను పోటీకి రాకుండా చేసేందుకే ఈ చీకటి ఆర్డినెన్స్ దొడ్డిదారిన తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్డినెన్స్ చెల్లదన్న ఆయన....తెలుగుదేశం పార్టీ దీనిపై న్యాయస్థానంలో సవాల్‌ చేస్తుందన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికలను వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదని స్పష్టంచేశారు. 8 జెడ్పీటీసీ, 345 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఏ విధంగా వాయిదా వేస్తారని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెదేపా నేతలను వైకాపాలో చేర్చుకుంటున్నారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. ఎంతమందిని తీసుకెళ్లినా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ పాత్ర ఉందని ఆరోపించి... ఇప్పుడు రిలయన్స్‌కు సంబంధించినవారికే రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారని అశోక్‌బాబు ప్రశ్నించారు.

 

అధికారంలో ఉంటూ, స్థానిక సంస్థలకు హుషారుగా వెళ్తూ, ప్రతిపక్షాన్ని తోక్కేద్దాం అనుకుంటున్న వేళ, వైసీపీకి ఆదరిపోయే షాక్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టం వచ్చినట్టు, వైసీపీ రంగులు వెయ్యటం పై, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పుని ఈ రోజు ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న పంచాయతీ భవనాలకు వైసీపీ రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలకు, పార్టీ రంగులను, 10 రోజుల్లోగా తొలగించాలని, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ కొత్త రంగులు వెయ్యాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను, తమకు రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. అలా చెయ్యని పక్షంలో, సిఎస్ ను బాధ్యలుగా చేస్తామని, హైకోర్ట్ స్పష్టం చేసింది. అలాగే ఆగష్టు 2019లో ఈ రంగుల పై ఇచ్చిన జీవోని కూడా హైకోర్ట్ కొట్టేసింది.

court 10032020 2

గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్, ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు పై దాదాపుగా, 2 నెలల నుంచి వాదనాలు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో ఈ కేసు పై వాదనలు ముగిసిన తరువాత, కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసి, ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది. అయితే ఇక్కడ ఏకంగా ఛీఫ్ సెక్రటరీతో పాటుగా, ప్రిన్సిపల్ సెక్రటరీని బాధ్యులను చేస్తూ, కోర్ట్ ఇచ్చిన తీర్పు పై, అధికార వర్గాల్లో సంచలనంగా మారాయి. ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపధ్యంలో, 10 రోజుల్లో అన్ని పంచాయతీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఇలా రంగులు మార్చటం కుదురుతుందా లేదా, ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు అధికారులకు టెన్షన్ పట్టుకుంది.

court 10032020 3

అయితే ఇదే విషయం పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ, ఇదేమీ పెద్ద విషయం కాదు అనే విధంగా రెండు రోజుల క్రితం మాట్లాడారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో, పార్టీ రంగులు ఉన్న బిల్డింగ్ లో ఎలా ఓటు వేస్తారు అని అడగ్గా, వేసిన రంగులు సంగతి వదిలేసి, కొత్తగా ఏమి రంగులు వెయ్యకుండా చూస్తాం అంటూ, సమాధానం ఇచ్చారు. అయితే, హైకోర్ట్ మాత్రం, ఇందుకు భిన్నంగా, ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాలకు, పార్టీ రంగులు ఎందుకు , మీ ఫోటో ఎందుకు, అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తరుపు లాయర్ వాదిస్తూ, అది పార్టీ రంగు కాదు అని చెప్పటంతో, వైసీపీ పార్టీ జెండాను మాకు ఇవ్వండి అంటూ కోర్ట్, చెప్పటం కూడా మనం వాదనలు సమయంలో విన్నాం. ఇప్పుడు 10 రోజుల్లో ఆ రంగులు తొలగించమని కోర్ట్ తీర్పు ఇచ్చింది.

రాష్ట్రంలో శాంతిభద్రతల విషయమై ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. హైకోర్ట్ లో ఇప్పటికే, రెండు సందర్భాల్లో, ఏకంగా డీజీపీ నే వచ్చి మాకు సమాధానం చెప్పాలి అంటూ కోర్ట్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కేంద్రం కూడా, రియాక్ట్ అయ్యింది. నెల రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ చేసిన రౌ-డీ చర్యల పై నివేదిక సమర్పించాలి అంటూ, ఏపీ హోంశాఖ కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తమకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి అంటూ, కేంద్రం కోరింది. కాకినాడ ఘటనలో రెచ్చిపోయిన రౌడీల పై చర్యలు తీసుకోవాలని, యు.వెంకటరమణ కేంద్ర హోం శాఖకు లేఖ రాసారు. ఈ లేఖ పై స్పందించిన కేంద్రం, ఈ విషయంలో మేమే డైరెక్ట్ గా వచ్చి విచారణ చెయ్యలేం అని, పోలీసు, శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశాలని, అందుకే ఈ విషయం పై రాష్ట్ర హోం శాఖ విచారణ చెయ్యాలంటూ ఆదేశాలు ఇచ్చింది. జరిగిన విషయం పరిశీలించి సరైన చర్యలు తీసుకోని, ఏమి చేసారు అనేది తమకు నివేదిక పంపాలని ప్రథమ కార్యదర్శి అశోక్‌కుమార్‌ రాష్ట్రానికి చెప్పారు.

kakinada 10032020 2

‘‘మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లను కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బహిరంగంగా, అసభ్య పదజాలంతో దూషించారు. పవన్‌ అభిమానులు క్షమాపణలు కోరడానికి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లగా వారిని రౌ-డీ-లు కొ-ట్ట-డం-తో పాటు రా-ళ్లు విసురుతూ తరిమేశారు. కాకినాడలో జరిగిన రౌ-డీ-ల ఆగడాలపై తూర్పుగోదావరి ఎస్పీ నుంచి నివేదిక తెప్పించుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’’ అంటూ, కేంద్ర హోంశాఖకు యు.వెంకటరమణ లేఖ రాసారు. ఇక మరో ఘటనలో, గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు విచారణ ప్రారంభించారు. క్రికెట్ బెట్టింగ్ వివాదంలో కొందరిని అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణపై అభియోగం ఉంది. 

kakinada 10032020 3

వ్యవహారంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో దిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఇవాళ గుంటూరుకు వచ్చారు. చేబ్రోలు పోలీసులతోపాటు సీసీఎస్ పోలీసుల నుంచి కేసు వివరాలు సేకరించారు. అలాగే ఎస్పీ రామకృష్ణను కూడా రహస్యంగా విచారించారు. అక్రమం నిర్బంధం వ్యవహారంపై ఆరా తీశారు. దీనిపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించగా నిర్బంధం నిజమేనని తేలింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో నిందితులను నిర్బంధించింది సీపీఎస్ పోలీసులే అయినా... ఎస్పీ ఆదేశాల మేరకే ఇలా చేశారని పిటిషనర్లు ఆరోపించారు. ఐపీఎస్ అధికారి కావటంతో ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారించాలంటూ రెండు వారాల క్రితం ఆదేశాలు జారీచేసింది.

Advertisements

Latest Articles

Most Read