బాబాయ్ వైఎస్ వివేక కేసులో, దాదాపుగా 4 ఏళ్ళకు అబ్బాయ్ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐ విచారణకు వెళ్తున్నారు. ఈ రోజు సిబిఐ విచారణకు హైదరాబాద్ వెళ్తున్నారు అవినాష్ రెడ్డి. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు అవినాష్ రెడ్డి విచారణకు వెళ్తున్నారు. ఈ విచారణ తరువాత అవినాష్ రెడ్డిని విడిచి పెడతారా , లేక అరెస్ట్ చేస్తారా అని రాష్ట్రం మొత్తం టెన్షన్ గా ఎదురు చూస్తున్న వేళ, అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐకి లేఖ రాసారు. ఈ రోజు విచారణకు వస్తున్నా అని, అయితే తన పైన ఒక వర్గం మీడియా, నా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, పనిగట్టుకుని, తనకు ఈ కేసులో సంబంధం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని లేఖలో రాసారు. ఈ కేసు తప్పుదోవపట్టించేలా వారే వార్తలు రాసారని అన్నారు. అందుకే విచారణ చాలా పారదర్శకంగా సాగాలని, తనని న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని, విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, సిబిఐని అవినాష్ రెడ్డి కోరారు. తనకు ఏ పాపం తెలియదని, కేవలం మీడియానే ఈ కేసులో ఇరికించే విధంగా కధనాలు రాసింది అని అవినాష్ రెడ్డి అన్నారు. మరి సిబిఐ ఏమి చేస్తుందో చూడాలి మరి.
news
కుప్పంలో ఘటన చూపి అచ్చెన్నాయుడు పై కేసు... పోలీసుల పై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం...
అందరూ అనుకున్నట్టే, లోకేష్ పాదయాత్ర మొదటి రోజు గడిచిందో లేదో కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టింది ఏపి ప్రభుత్వం. అయితే ఇది లోకేష్ పైన కాదు, అచ్చెన్నాయుడు పైన. నిన్న లోకేష్ పాదయత్ర సభలో, అచ్చెన్నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఆయన వైసీపీ చేస్తున్న అరచాకలకు, వారికి వంత పాడుతున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని, రూల్స్ పాటించకుండా తమని ఇబ్బంది పెడుతున్న పోలీసుల అంతు చూస్తామని అన్నారు. అలాగే నిన్న లోకేష్ కు ఇచ్చిన సెక్యూరిటీ పై కూడా అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. 500 మంది భద్రత ఇచ్చామని చెప్తున్నారని, ఎక్కడున్నారని, వారంతా దె** తిని పడుకున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన పోలీసులు అచ్చెన్నాయుడు పై కేసు నమోదు చేసారు. అచ్చెన్నాయుడు రెచ్చగొట్టే ప్రసంగం చేసారు అంటూ, పోలీసులు కేసులు పెట్టారు. దీంతో తెలుగుదేశం నేతలు మండి పడుతున్నారు. నోరు తెరిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు పోలీసులని బూతులు తిడుతున్నా కేసులు ఉండవు అని, తమ ఆవేదన చెప్తుంటే, తమ పై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్రలో ఉన్న బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్...
ఈ రోజు ఉదయం కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టటానికి, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. బాలయ్య, తారకరత్న లోకేష్ తో కలిసి నడక మొదలు పెట్టారు. అయితే కొద్ది దూరం నడిచిన తరువాత తారకరత్న సోమ్మసిల్లి పడిపోయారు. అందరూ వడదబ్బ అనుకున్నారు కానీ, చివరకు అది గుండెపోటు అని తేలింది. నడుస్తూ నడుస్తూ పడిపోయిన తారకరత్నను హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. బాలయ్య స్వయంగా హాస్పిటల్ కు వెళ్ళి, అక్కడ పరిస్థితితులు చక్కబెట్టారు. యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు గుండెనొప్పిగా తేల్చి, ఒక స్టంట్ వేసారు. తారకరత్నకు ప్రమాదం లేదని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇక తారకరత్న విషయం తెలిసి, బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసారు. కళ్యాణ్ రాం కూడా బాలయ్యకు ఫోన్ చేసి, తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అవసరం అయితే బెంగుళూరు తరలించాలని సూచించారు.
తారకరత్న విషయంలో కీలకమైన అప్డేట్.. అర్ధరాత్రి బెంగుళూరు తరలింపు...
నిన్న ఉదయం లోకేష్ పాదయాత్రలో పాల్గుని, గుండె నొప్పితో కుప్పకూలిన తారకరత్నని, నిన్నటి నుంచి కుప్పంలో డాక్టర్ లు ట్రీట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. పల్స్ లేకుండా హాస్పిటల్ కు వచ్చిన తారకరత్నకు, పల్స్ తెప్పించతంలో కుప్పం డాక్టర్ లు సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి వైద్యులు తారకరత్నకు వైద్యం అందిస్తూ, కాపాడుతూ వచ్చారు. మరింత మెరుగైన చికిత్స అవసరం అని, కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో చంద్రబాబు కర్ణటక ముఖ్యమంత్రితో మాట్లాడారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయాలని కోరారు. నందమూరి కుటుంబ సభులు, తారకరత్న భార్య అందరూ చర్చించి, తారకరత్నను బెంగుళూరు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో, బెంగళూరులోని నారాయణ హృదయాలయానికి తరలించారు. కుప్పం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉండగా, కేవలం గంటన్నర సమయంలోనే చేరుకున్నారు. అంబులెన్స్ లోని, ఐసీయూలో కూడా వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. బెంగుళూరుకు చేరుకున్న వెంటనే, తారకరత్నకు డాక్టర్ ఉదయ్ అండ్ టీం చికిత్స మొదలు పెట్టారు. మరి కాసేపట్లో హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని తెలిసింది.