సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య కేసు విచారణని సీబీఐ మళ్లీ మొదలు పెట్టింది. కడప నుంచి పులివెందులకు చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీశారు. పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చిన సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీయడంతో ఒక్కసారిగా ఈ కేసులో నిందితులు, అనుమానితుల్లో గుబులు మొదలైంది. పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను కూడా సీబీఐ పరిశీలించడంతో కార్యాలయానికి రాలేదని కార్యకర్తలు చెప్పడంతో సీబీఐ బృందం వెనుదిరిగింది. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని వార్తలు రావడంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఆయన దేశరాజధానిలో పెద్దలు కలిసి వెళ్లొచ్చాక అవినాశ్ రెడ్డి అరెస్టు ఆగిపోవడం యాధృచ్చికమేనా అన్న అనుమానాలు వచ్చాయి. మళ్లీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కోసం సీబీఐ రావడం, అరెస్టు ఊహాగానాలు ఊపందుకోవడంతో వైఎస్ జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లక తప్పకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.
news
సీఐడీ సునీల్ కుమార్ ని సడన్ గా తప్పించటం వెనుక ఇంత స్టొరీ ఉందా ?
ఏపీ సీఐడీని టిడిపిని వేధించే శాఖగా మార్చారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఏడీజీ సునీల్ కుమార్ ని సర్కారు సడెన్ సీఐడీని తప్పించడం కలకలం రేపుతోంది. అయితే ఇటీవలే డిజిపి ర్యాంకు ప్రమోషన్ ఇచ్చిన సర్కారు సునీల్ సేవలను మరింతగా వాడుకునేందుకు మరో కీలక పోస్టు కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏ నిర్ణయం తీసుకున్నా డీజీపీ పాత్ర కీలకం కాబట్టి, అదే దళితుడైన సునీల్ కుమార్ ని డిజిపిగా పెడితే...టిడిపి ఇరుకున పడుతుందనే వ్యూహంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ఉన్నారని ప్రచారం సాగుతోంది. డిజిపి పోస్టులో సునీల్ కుమార్ ని పెట్టి పోలీసుల్ని తాను చెప్పినట్టు వాడుకోవచ్చని, విపక్షం ఆరోపిస్తే దళిత ఐపీఎస్ ని డిజిపిని చేస్తే టిడిపికి ఇష్టంలేదని కౌంటర్ వేయొచ్చని ప్లాన్ వేసి ఉండొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. మరో పక్క సిఐడిలో సునీల్ కుమార్ నిరంకుశ తీరుకి వ్యతిరేకంగా మొత్తం సీఐడీలో ఉన్నవాళ్లంతా ఏకమయ్యారని, అలాగే సిఐఐ వ్యవహరిస్తున్న తీరుతో, ఇప్పటికే కేంద్రానికి అనేక కంప్లైంట్ లు వెళ్ళటం, అలాగే కేంద్రం కూడా సీరియస్ అవ్వటంతో, సునీల్ ని తప్పించారా అనే ప్రచారం జరుగుతుంది.
లోకేష్ పాదయాత్ర పై డీజీపీ గారి ప్రశ్నలు వింటే, చిన్న పిల్లలు కూడా నవ్వుతారు...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకి అనుమతి ఇవ్వకుండా ఇన్నాళ్లూ తాత్సారం చేసిన ఏపీ పోలీసులు, నాటకీయంగా డిజిపి పేరుతో ఒక లెటర్ పంపారు. అనుమతి కోసం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖపై స్పందించినట్టు డీజీపీ ఇచ్చిన ఆ ప్రతిలేఖలో చాలా వివరాలు కోరడంతో టిడిపి వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి జిల్లాలో పాదయాత్ర జరిగే తేదీ, స్థలం, సమయం వివరాలు తమకు ముందుగానే ఇవ్వాలని కోరారు. జిల్లాలో రూట్ మ్యాప్ లు, ఎందరు పాల్గొంటారనే వివరాలు కూడా సమర్పించాలని డీజీపీ విడుదల చేసిన ప్రకటన లేఖలో కోరారు. పాదయాత్రలో వినియోగించే వాహనాలు, వాటి నంబర్లు, రాత్రి బసచేసే ప్రాంతం , జిల్లాలో సంప్రదించాల్సిన వ్యక్తుల ఫోన్ నంబర్లుతో కూడిన వివరాలు తెల్లారేసరికి ఇవ్వాలని డిజిపి పంపిన లేఖపై టిడిపి భగ్గుమంది. చాలా మంది పాదయాత్రలు చేసినప్పుడు లేని ఈ నిబంధనలు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర జరగకుండా అడ్డుకునేందుకు పోలీసుశాఖ విశ్వప్రయత్నం చేస్తోందని, ఎట్టి పరిస్థితులు ఎదురైనా పాదయాత్ర చేసి తీరుతామంటున్నారు. దీనిపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ``ఆయన డిజిపి కాదు..కసి..రెడ్డే`` అంటూ ట్వీట్ చేశారు. టిడిపి అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా డిజిపి అడిగిన వివరాలే డిజిపిని కూడా అడుగుతూ ట్వీటేశారు. మొత్తానికి యువగళం పాదయాత్రకి అనుమతి ఇవ్వకూడదనే ఇటువంటి అడ్డగోలు సమాచారం అడుగుతున్నారనేది స్పష్టం అవుతోంది.
విజయమ్మ మాటలతో షాక్ తిన్న వైసీపీ...
నారా లోకేష్ యువగళం పాదయాత్రని అడ్డుకోవద్దని సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి వేడుకుంటోంది. ఇదేంటి కొడుకు పాదయాత్ర అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేస్తుంటే తల్లి లోకేష్ పాదయాత్ర అనుమతి కోసం ఇంతలా వేడుకుంటోందనే డౌట్ మీకు రావొచ్చు. విజయమ్మ పాదయాత్ర గురించి మాట్లాడిన అంశాలను టిడిపి సోషల్మీడియా వెలుగులోకి తెచ్చి వైసీపీని నిలదీస్తోంది. నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకోవడానికి నానా యాతన పడుతోన్న వైసీపీ సర్కారుకి విజయమ్మ వీడియో షాక్‌లా తగిలింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సరిపడక తల్లితో సహా చెల్లి షర్మిల తెలంగాణలో సెటిలైంది. అక్కడే వైఎస్సార్టీపీ పెట్టుకుంది. ఆమె పాదయాత్రని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల కారులో ఉండి నిరసన తెలిపితే, కారుతో లాక్కుపోయారు. తన కుమార్తెని పోలీసులు అలా అరెస్ట్ చేయడంపై విజయ లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలని అడ్డుకున్నట్టు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాన్నీ తాను చూడలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలుగా గుర్తింపు పొందుతాయన్నారు. ఈ వీడియోని టైమ్లీగా బయటకు తెచ్చిన టిడిపి శ్రేణులు వైసీపీ పెద్దలను ఇరకాటంలో పెట్టారు.