ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అవమానం జరిగింది. హిందూపురం పర్యటనకు వచ్చిన బాలయ్య, తనకు స్కార్ట్ కల్పించాలని పోలీసులకు సమాచారం ఇచ్చినా, పోలీసులు పట్టించుకోని ఘటన, టిడిపి శ్రేణుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. నందమూరి బాలకృష్ణ, హిందూపురం వచ్చిన సందర్భంలో, బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరారు. ఒక వివాహ వేడుకలో పాల్గొనటంతో పాటుగా, నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. బాలయ్య వస్తున్నారని తెలుసుకుని, మార్గమధ్యలో, గలిబిపల్లి గ్రామస్థులు కొడికొండ చెక్ పోస్టు వద్ద, బాలయ్య కారును అడ్డుకున్నారు. లేపాక్షి-హిందూపురం మెయిన్ రోడ్డు పూర్తి చెయ్యాలని, బాలయ్య ఎదుట ఆందోళన వ్యక్తం చేసారు. దీని పై స్పందించిన బాలయ్య, అధికారులతో మాట్లాడి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని గ్రామస్తులకు నచ్చ చెప్పారు. ఇంత ఘటన జరిగినా, పోలీసులు ఎవరూ అక్కడకు రాలేదు.

balayya 26102019 2

అయితే, ఈ సంఘటన వైసీపీ నాయకులు వెనుక ఉండి నడిపించారని, స్థానిక టిడిపి నేతలు భావిస్తున్నారు. బాలయ్య పర్యటన మొత్తం, ఇలా సమస్యల పేరుతొ అడ్డుకోవాలని స్కెచ్ వేసినట్టు సమాచారం ఉందని, వైసీపీ ప్రభుత్వం ఉంటూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనులు అవ్వకుండా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ నేపధ్యంలోనే, బాలయ్య తిరిగి బెంగుళూరు వెళ్ళే సమయంలో, సెక్యూరిటీ కావలని అడిగారు. తనకు, ఎస్కార్ట్ కావాలని పోలీసులకు స్వయంగా బాలకృష్ణ ఫోన్ చేసి అడిగారు. అయినా పోలీసులు రాలేదు. అరగంట పైన వెయిట్ చేసిన బాలయ్య, చివరికి ఆయన ఒక్క‌రే తన వాహానంలో బెంగళూరు విమానాశ్ర‌యానికి వెళ్ళారు. బాలయ్య శుక్రవారం తన నివాసంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మూడు స్టేషన్లకు సమచారం అందించారు. అయినా ఎవరూ అక్కడికి రాలేదు.

balayya 26102019 3

బాలక్రిష్ణకు జరిగిన ఈ అవమానం పై టిడిపి నాయకులు, బాలయ్య అభిమానులు అసహనం వ్యక్తం చేసారు. గతంలో బాలకృష్ణ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో పెనుకొండ‌ డిఎస్పీతో పాటు సిఐలు అందరు ఉండి ప్రోటోకాల్‌ పాటించేవారు. ప్రస్తుతం ప్రోటోకాల్ పాటించకపోయినా పర్వాలేదు కనీసం విమానాశ్రాయానికి వెళ్ళే సమయంలోనైనా ఎస్కార్ట్ గా రావాడం లేదని తనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని వారు ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేనే కాదు సెల‌బ్రిటీ కూడా అని అన్నారు. ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఇవ్వక పోయినా కనీసం ఒక సెలబ్రిటీకి ఇచ్చే కనీస గౌరవం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు.

రాష్ట్రంలో ఇసుక లేక, దారుణ పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, గత అయుదు నెలలుగా పనులు లేక, తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం బ్రతకటానికి కూడా డబ్బులు లేక, అన్న క్యాంటీన్ లు లేక, తిండి లేక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ధీన పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో, భవన నిర్మాణ కార్మికులు, ప్రతి రోజు ఆందోళనలు చేస్తున్నారు. ఇసుకను వదలమని, తక్కువ రేట్ కు ఇవ్వమని, అప్పుడే పనులు మొదలవుతాయని ఆందోళన బాట పట్టారు. అయినా సరే, ప్రభుత్వం, పట్టించుకోవటం లేదు. తెలుగుదేశం పార్టీ ఇసుక పై ఆందోళనలు చేస్తుంది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ముందుగా సెప్టెంబర్ 5 అన్నారు. తరువాత వరదలు వచ్చాయని అన్నారు. వర్దలు వస్తే, రెండు మూడు జిల్లాలకు ఇబ్బంది కాని, రాష్ట్రమంతా ఇసుక కొరత ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వం మాత్రం, ఎటువంటి చర్యలు చేపట్టటం లేదు.

botsa 26102019 2

ఈ నేపధ్యంలో విసుగెత్తి పోయిన ప్రజలు, ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే, గుంటూరులో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణలకు చేదు అనుభవం ఎదురైంది. ఇసుక కొరతపై భవన నిర్మాణ కార్మికులు మంత్రులను నిలదీశారు. గుంటూరు పర్యటనలో డ్రైనేజి పనులు పరిశీలనకు మంత్రులు వచ్చారు. దీంతో అక్కడ ప్రజలు, వారిని అడ్డుకున్నారు. మీకు ఓటు వేశాము.. మాకు ఇసుక ఇవ్వండని కార్మికులు నిలదీశారు. మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని కార్మికులు మంత్రులతో అన్నారు. అయితే వారికి వారిస్తూ, త్వరలోనే మీ కష్టాలు తీరిపోతాయని చెప్పిన మంత్రులకు, ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురు అవ్వటంతో, సమాధానం చెప్పలేక, అక్కడ నుంచి జారుకున్నారు.

botsa 26102019 3

మరో పక్క, నిన్న గుంటూరు జిల్లాల్లో ఒకేరోజు ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పొన్నూరు మండలం మునిపల్లెకు చెందిన నాగ బ్రహ్మాజీ తాపీ మేస్త్రిగా ఉన్నారు. అయితే పనులు లేకపోవటంతో, ఆయన చాలా రోజులుగా కాళీగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో అతని భార్య, స్పిన్నింగ్ మిల్ లో ఉద్యోగానికి వెళ్తుంది. అయితే తనకు పనులు లేకపోవటం, భార్య ఉద్యోగానికి వెళ్తూ ఉండటంతో, అది తట్టుకోలేక, తను చనిపోయాడు. మరోప్ పక్క, గుంటూరు నగరంలో కోదండరామయ్యనగర్‌ 1వ లైనుకు చెందిన బేల్దారి మేస్త్రీ పడతాపు వెంకట్రావు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు ఇప్పటిదాకా వరకు రైతుల బలవన్మరణానికి పాల్పడటం చూసిన రాష్ట్రంలో కొత్తగా జగన్‌ సర్కారు అసమర్థ పాలన వల్ల భవన నిర్మాణ కార్మికులు చనిపోయే స్థితి వచ్చిందని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ అయుదు నెలల్లో, కోర్ట్ ల దగ్గర ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చంద్రబాబు సెక్యూరిటీ విషయం దగ్గర నుంచి, విద్యుత్ పీపీఏలు, పోలవరం రివర్స్ టెండరింగ్, ఇలా అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. నిన్నటికి నిన్న, రాజధాని అమరావతి విషయంలో, అసలు ఇదేమి వైఖరి, మీ వైఖరి చెప్పండి అంటూ, హైకోర్ట్ మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా జరుగుతూ ఉండగానే, ఈ రోజు హైకోర్ట్ లో, జగన్ ప్రభుత్వానికి డబల్ షాక్ తగిలింది. మొదటిగా ఇసుక విషయంలో, ప్రభుత్వ వైఖరి పై విమర్శలు వస్తున్న వేళ, ప్రభుత్వం అందుబాటులో ఉన్న ఇసుక కోసం వెళ్లి ఇబ్బందులు పడింది. అమరావతి రాజధాని కోసం, ఎల్‌అండ్‌టీ సంస్థ నిల్వ చేసిన, ఇసుక కోసం ప్రభుత్వం ముందుకు వచ్చింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్లాయిపాలెం వద్ద రాజధాని నిర్మాణాల కోసం ఎల్‌అండ్‌టీ సంస్థ నిల్వ చేసిన వేల టన్నుల ఇసుకను ప్రభుత్వం తీసుకుంది.

highcourt 25102019 2

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటంతో, వందల కొద్దీ లారీలు వచ్చాయి. అయితే, ప్రభుత్వ నిర్ణయం పై, ఎల్‌అండ్‌టీ సంస్థ తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఇక్కడ ఇసుక డబ్బులు కట్టి తెచ్చుకున్నామని, రాజధాని ఆగిపోవటంతో, ఇసుక ఉందని, డబ్బులు కట్టిన ఇసుకను ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆరోపిస్తూ, హైకోర్ట్ కు వెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇసుక స్వాధీనానికి ప్రభుత్వం జారీచేసిన మెమోలను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెన్స్ లో ఉంచి ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే ఇసుక యూనిట్లను లెక్కించాలని కోర్టు తెలిపింది. ఇక మరో కేసులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది.

highcourt 25102019 3

రిజిస్టర్డ్‌ దస్తావేజుల ద్వారా తమకు విక్రయించిన 4,731 ఎకరాల భూమిని ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారమై ఈ నెల 19న ఏపీఐఐసీ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరింది. "మూడు రిజిస్టర్డ్‌ విక్రయ దస్తావేజుల ద్వారా 4,731 ఎకరాల భూముల్ని ఏపీఐఐసీ రూ.65.07 కోట్లకు మాకు విక్రయించింది. పదేళ్ల కిందట జరిగిన విక్రయమది. ఆ భూములపై హక్కులు మాకు దఖలు పడ్డాయి. చట్టవిరుద్ధంగా వాటిని ఇప్పుడు రద్దు చేసి ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు" అని హైకోర్ట్ కు తెలిపింది. ఈ పిటీషన్ పై స్పందించిన హైకోర్ట్, తదుపరి విచారణ వరకు యధాతధ స్థితిని కొనసాగించాలని చెప్తూ, తదుపరి విచారణను నవంబర్ 29 వరకు వాయిదా వేసింది.

ఏదైనా రాష్ట్రంలో అధికార వర్గాలు అన్నిటికీ బాస్ ఛీఫ్ సెక్రటరీ. ముఖ్యమంత్రికి సమానంగా ఉండే స్థాయి ఛీఫ్ సెక్రటరీది. ఒక్క రాజకీయ జోక్యం తప్పితే, ఛీఫ్ సెక్రటరీకి అన్ని అధికారాలు ఉంటాయి. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా, ఏ అధికారికైన, ఐఏఎస్ కైనా, షోకాజ్ నోటీస్ ఇచ్చి, వివరణ కోరే అధికారం ఛీఫ్ సెక్రటరీకి ఉంది. అయితే ఇంతటి అధికారాలు ఉన్న ఛీఫ్ సెక్రటరీ ఉణికినే ప్రశ్నించే ఉత్తర్వులు వచ్చాయి. ఛీఫ్ సెక్రటరీ, స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఇలా సిఎస్ స్థాయి అధికారులకు కూడా, షోకాజ్ నోటీస్ ఇచ్చే అధికారాన్ని తనకు దఖలు చేస్తూ, జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరిట గురువారం అర్దారాత్రి విదులైన జీవో చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శితో పాటుగా, సీఎం ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ జారీ చేసిన జీవో, ప్రకారం, అటు సియం, ఇటు నేను, ఇక మధ్యలో ఎవరికీ సంబంధం లేదన్నట్టుగా, చీఫ్‌ సెక్రటరీనే ఛాలెంజ్ చేసే విధంగా, ఉత్తర్వులు వెలువడ్డాయనే అభిప్రాయం కలుగుతుంది.

chief secretary 26102019 2

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన ఈ జీవో 128 పై అధికార వర్గాల్లో, తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌ బిజినెస్‌ రూల్స్‌కు సవరణలు చేయటం పై, అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ సవరణ, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. బిజినెస్‌ రూల్స్‌ సవరణ చేసే సమయంలో, కేబినెట్‌ ఆమోదం తర్వాత గవర్నర్‌కు పంపించాలని, గవర్నర్ ఆమోదం తరువాతే చీఫ్‌ సెక్రటరీ మాత్రమే ఈ మేరకు జీవో ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ జీవో మాత్రం చీఫ్‌ సెక్రటరీ వద్దకు వెళ్లిన దాఖలాలు లేవని అంటున్నారు. అదీ కాక, ఇది గవర్నర్ ద్వారా జరగాల్సిన ప్రక్రియ అని కూడా అంటున్నారు. బిజినెస్‌ రూల్స్‌కు, అనుబంధ వ్యాఖ్యాన్ని పెట్టాలంటే, సియం ఆదేశాలు సరిపోతాయని, కాని నియమావళి పూర్తిగా మార్చేస్తే, ముందుగా గవర్నర్ ఆమోదం తప్పనసరి అని చెప్తున్నారు.

chief secretary 26102019 3

అయితే ఇప్పుడు ఒక ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి, చీఫ్‌ సెక్రటరీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసే అధికారం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా చర్చ జరుగుతుంది. జగన్ ఆదేశించినా, జీవోలు జారీ అవ్వటం లేదని, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, గురువారం కొంత మంది అధికారులతో సమావేశం అయ్యారు. అయితే ఆర్ధిక శాఖ క్లియరెన్స్‌ కోసమే, జీవోలు ఆగిపోయాయని, సమాధానం చెప్పారు అధికారులు. అయితే ఈ సమాధానం పై సంతృప్తి చెందని, ప్రవీణ్ ప్రకాష్, అప్పటికప్పుడు సిబ్బందిని పిలిపించుకుని అర్ధరాత్రి సమయంలో బిజినెస్‌ రూల్స్‌ సవరించేశారు. దీని ప్రకారం, సీఎం లేదా ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు , ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సెక్రటరీలకు వెళ్లే ఫైళ్లను 3 కేటాగిరీలుగా విభజించారు. అయితే టైంకి జీవో జారీ కాకపొతే, సంబంధిత స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సెక్రటరీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి తగు చర్య తీసుకునేలా జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీని (ప్రస్తుతం ప్రవీణ్‌ ప్రకాశ్‌) సీఎం ఆదేశించవచ్చు. బిజినెస్‌ రూల్స్‌కు చేసిన తాజా సవరణలు చీఫ్‌ సెక్రటరీ ఉనికినే ప్రశ్నించేలా ఉన్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read