జగన్ మోహన్ రెడ్డికి అటు వ్యక్తిగతంగా, ఇటు ప్రభుత్వ పరంగా, ఇబ్బందులు అధికం అవుతున్నాయి. మొన్నటి దాక మా వెనుక కేంద్రం ఉంది, మా వెనుక ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ శా ఉన్నారు, మేము తీసుకునే ప్రతి నిర్ణయం వారికి చెప్పే చేస్తున్నాం అని చెప్పిన జగన్, విజయసాయి రెడ్డిలకు, ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. అయుదు రోజుల క్రిందట, జగన్ మోహన్ రెడ్డి, ప్రాధాని మోడీని కలిసి, దాదపుగా గంట సేపు, అన్ని విషయాలు చెప్పి, వినతులు ఇచ్చారు. అయితే, ప్రధాని మోడీ మాత్రం, ఏ విషయంలోనూ జగన్ కు హామీ ఇవ్వలేదు. చివరకు రైతు భరోసా ప్రారంభోత్సవానికి రమ్మని చెప్పినా, నాకు వేరే పనులు ఉన్నాయి, రావటం కుదరదు అని ప్రధాని మోడీ చెప్పారు. అయితే ఆ రోజు హోం మంత్రి అమిత్ షా తో కూడా, జగన్ మీటింగ్ ఉంది. అయితే అమిత్ షా వేరే పనుల్లో బిజీగా ఉండటంతో, జగన్ కు కుదరలేదు.

amit 11102019 2

దీంతో ఆయన ప్రధానిని కలిసి, తిరిగి విజయవాడ వచ్చేసారు. అయితే, రెండు రోజుల క్రిందట, అమిత్ షా శుక్రవారం, జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చారని, జగన్ శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారని నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి. అమిత్ షా తో పాటు, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మిగత కేంద్ర మంత్రులను కూడా జగన్ కలుస్తారాని, మీడియాకు చెప్పారు. అయితే, అనూహ్యంగా, శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం జగన్ పర్యటన రద్దు అయింది. కేంద్రమంత్రి అమిత్‌షా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, అందుకే అపాయింట్మెంట్ రద్దు అయినట్టు జగన్ కు తెలియ చేసారు. అందువల్ల ఢిల్లీ పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు. మళ్ళీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చే దాకా, జగన్ వైట్ చెయ్యాల్సిందే.

amit 11102019 3

అయితే వారంలో రెండు సార్లు అమిత్ షా, అపాయింట్మెంట్ రద్దు చెయ్యటం వెనుక మర్మం ఏమిటో అర్ధం కావటం లేదు. ఈ రోజు మేఘా పై ఐటి దాడులు, అలాగే జగన్ కేసుల పై, సిబిఐ స్పీడ్ పెంచటం, ఇవన్నీ చూస్తుంటే, జగన్ కు వ్యక్తిగతంగా ఇబ్బందికర పరిస్తితులే. రేపు సిబిఐ కోర్ట్ కనుక, జగన్ ప్రతి శుక్రవారం రావాల్సిందే అంటే మాత్రం, జగన్ పరువు మరింతగా దిగజారుతుంది. ఇక మరో పక్క, రాష్ట్రాన్ని ఆర్ధిక కష్టాలు చుట్టు ముట్టాయి. మొదటి మూడు నాలుగు నెలలు, చంద్రబాబు హయంలో వివిధ పధకాలు అట్టిపెట్టిన నిధులు ఖర్చు చేస్తే కాలం గడిపారు. ఇప్పుడు ఆదాయం పతనం అయిపోతుంది. కేంద్రం అరకోర నిధులు ఇస్తుంది, వీటి అన్నిటి పై, జగన్, అమిత్ షా తో మాట్లాడాలి అనుకున్నా, అటు వైపు నుంచి మాత్రం ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.

జగన్ గారి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజల పట్ల ఆందోళన చేస్తాం అంటేనే, భయపడి పోతుంది. నెల రోజుల క్రితం ఇసుక విషయంలో తెలుగుదేశం పార్టీ ధర్నాకు పిలుపిస్తే, ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేసారు. చంద్రబాబు చలో ఆత్మకూరు పిలుపిస్తే, ఆయన్ను బయటకు కూడా రానివ్వలేదు. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద, ఆందోళనలు చెయ్యటానికి వీలు లేకుండా 144 పెట్టరు. ఇలాగే అన్ని విధాలుగా,నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తున్నారు. తాజాగా, మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఇసుక కృత్రిమ కొరతకు నిరసనగా మచిలీపట్నం కోనేరు సెంటర్‌ వద్ద ఆయన తలపెట్టిన 36 గంటల దీక్ష చెయ్యటానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా చెయ్యటం కుదరదని, ఆయనని అరెస్ట్ చేసి, దీక్షను భగ్నం చేశారు పోలీసులు. అయితే ప్రభుత్వం తీరు పట్ల, తెలుగుదేశం పార్టీ మండి పడుతుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇలాగే అలోచించి ఉంటే , జగన్ పాదయాత్ర చేసే వారా అని ప్రశ్నిస్తుంది.

kollu 11102019 2

కొల్లు రవీంద్ర దీక్ష గురించి తెలుసుకున్న పోలీసులు, ముందుగా, కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, పోలీసుల వ్యూహం తెలుసుకుని, అప్పటికే వేరే మార్గంలో కోనేరు సెంటర్‌కు రవీంద్ర చేరుకున్నారు. అక్కడే దీక్షలో కూర్చున్నారు. అయితే వెంటనే పోలీసులు వచ్చి, అక్కడ బలవంతంగా ఆయనను అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ సమయంలో పోలీసులకు, తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. అంతకుముందు ఆయన నిరసన దీక్షకు వెళ్లకుండా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దీక్షలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో 144 సెక్షన్ విధించారు.

kollu 11102019 3

అయితే, తన దీక్ష ను భగ్నం చేసినా, తన నివాసంలోనే 36 గంటల దీక్ష కొనసాగిస్తానని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. "ఇసుక కొరతపై గాంధీ అహింసా మార్గంలో దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాము. పోలీసులు మమల్ని రాత్రి నుంచి వేధిస్తూ మా దీక్షను అడ్డుకుంటున్నారు. రెండు పోలీస్ స్టేషన్లు తిప్పి ఇంటికి‌ తీసుకొచ్చారు. జగన్ నియంతలా మారి ప్రజావ్యతిరేక విదానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక లేక అసంఘటిత కార్మికులు పస్తులుంటున్నారు. కొత్త ఇసుక పాలసీ వచ్చి నెల రోజులు గడుస్తున్నా..సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. వైసిపి నాయకులకే ఇసుక కేంద్రాల నుంచి ఇసుక తరలిపోతోంది. ప్రభుత్వానికి ఈ విషయం మా నిరసన ద్వారా చెప్పాలని చూస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ, పోలీసుల బెదిరింపులకు బయపడేది లేదు. 36 గంటల దీక్షతో ఆపేది లేదు దఫదఫాలుగా సామాన్యులకు ఇసుక చేరే వరకు మా నిరసన కొనసాగిస్తాం" అని కోల్లు రవీంద్ర అన్నారు.

కర్మ సిద్దాంతం గురించి మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనం చేసుకున్న కర్మ ఫలాలు, మనకు తిరిగి వస్తాయని. అది మంచి అయినా, చెడు అయినా. ఇప్పుడు పోలవరం విషయంలో, జగన్ ప్రభుత్వానికి అదే జరగబోతుందా, అంటే, అవును అనే సమాచారం వస్తుంది. గతంలో ప్రతిపక్ష నాయుకుడిగా ఉండగా, ఇష్టం వచ్చినట్టు పోలవరం పై ఆరోపణలు చేసి, చంద్రబాబు పై అబాండాలు వేసి, రాజకీయం చేసారు. అప్పుడు చేసిన ఆ పనులే, ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి చుట్టుకునే అవకాసం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పిలిచుకునే పోలవరం ప్రాజెక్ట్, కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇందు కోసం,బీజేపీ వ్యుహాత్మికంగా పావులు కదుపుతుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయ్యింది, ఇంత వరకు ఒక్క తట్ట మట్టి కూడా పోలవరం ప్రాజెక్ట్ లో ఎత్తింది లేదు. రివర్స్ టెండరింగ్ అంటూ, కోర్ట్ లకు ఎక్కారు.

polavaram 11102019 2

రాష్ట్ర బీజేపీ నేతలు , ఇదే అవకాసంగా తీసుకున్నారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్ ఏరియాకు వెళ్లి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ బృందం పర్యటించనుంది. అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి, ఈ నెల 13న ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి షెకావత్‌ను కలసి మెమోరాండం సమర్పించనుంది. ఈ నాలుగు నెలల్లో జగన్ ఏమి చెయ్యలేదని, అందుకే ప్రాజెక్ట్ కేంద్రమే చేపట్టాలని కోరనున్నారు. ఇందు కోసం, గతంలో జగన్ మోహన్ రెడ్డి, కేంద్రానికి రాసిన లేఖలు, విజయసాయి రెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగాలు కూడా ఇవ్వనున్నారు. గతంలో చంద్రబాబుని సాధించటం కోసం, పోలవరం ప్రాజెక్ట్ కేంద్రమే చేపట్టాలని, జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాలు రాసారు. ఇదే విషయాన్ని విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభలో చెప్పారు.

polavaram 11102019 3

ఇప్పుడే ఇవే ఆయుధాలుగా, బీజేపీ రంగంలోకి దిగుతుంది. ఎలాగు చంద్రబాబు 73 శాతం పూర్తీ చేసారు కాబట్టి, మిగత పని తేలికగా అయిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ క్రెడిట్ ఇచ్చి, జగన్ ఆయన నాయన ఫోటో, పేరు పెట్టుకోవటానికి తప్ప, రాజకీయంగా మనకు ఎందుకు ఉపయోగపడదు అని, అందుకే మనమే ఈ ప్రాజెక్ట్ తీసుకుని, రాజకీయంగా బలపడదాం అని బీజేపీ ఆలోచిస్తుంది. అయితే ఇప్పటి వరకు, కేంద్రం చేప్పట్టిన ఏ జాతీయ ప్రాజెక్ట్, పోలవరం లాగా పురోగతి సాధించలేదు. చంద్రబాబు పట్టుబట్టి, ప్రతి వారం రివ్యూలు చేసి, 73 శాతం పూర్తీ చేసారు. మరి, ఇప్పుడు కేంద్రం తీసుకుంటే, అంత వేగంగా చెయ్యగలదా అనేది చూడాలి. ఎవరు చేసినా, ఎవరి ఫోటో పెట్టుకున్నా, ఎవరి పేరు పెట్టినా, ముందు పోలవరం ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యమని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలను శాసిస్తున్న, కాంట్రాక్టర్ అయిన మేఘా కంపెనీ పై, దేశ వ్యాప్తంగా ఐటి దాడులు చెయ్యటం పెను సంచలనంగా మారింది. మేఘా కృష్ణా రెడ్డి అటు కేసిఆర్ కి, ఇటు జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాని, మొన్న పోలవరంలో సింగల్ టెండర్ వేసి, ప్రాజెక్ట్ తీసుకోవటం కాని, ఇలా ప్రతి దాంట్లో మేఘా ఉంటుంది. అలాగే ఎన్నికల సమయంలో, మేఘా నుంచి, పెద్దిరెడ్డి కంపెనీకి అధికంగా నిధులు వచ్చాయని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రేపు కేసీఆర్ చేపట్టబోయే, గోదావరి, కృష్ణా అనుసంధానం కూడా, మేఘాకే ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అలాగే ఇప్పటికే తెలంగాణాలో ఎలెక్ట్రిక్ బస్సులు, ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్న మేఘా, ఆంధ్రప్రదేశ్ లో కూడా, దానికే ఎలెక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టు ఇస్తున్నారని, తెలుగుదేశం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

megha 1102019 2

ఒక పక్క పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్ళ వద్దు అని కేంద్రం అంటున్నా, జగన్ వెళ్లి, మేఘాకు కాంట్రాక్టు ఇవ్వటంతో కేంద్రం గుర్రుగా ఉంది. వీటి అన్నిటి నేపధ్యంల్,మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి నివాసంతో పాటుగా, ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ రోజు ఐటి దాడులు మొదలయ్యాయి. ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొంత మంది జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తున్న ప్రకారం, ఈ సోదాల్లో భారీగా అక్రమ లావాదేవీలు బయట పడ్డాయని, పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారని, ఫేక్ బిల్లులు పెట్టి వేల కోట్లు కొల్లగొట్టినట్టు తేలిందని, చెప్తున్నారు. అయితే పూర్తీ వివరాలు వస్తే కాని, ఎంత మొత్తంలో ఈ అక్రమాలు జరిగాయి అనేది తెలిసే అవకాశం ఉంది.

megha 1102019 3

మేఘా కంపెనీలో ఇరు రాష్ట్రాల ప్రముఖులు బినామీలుగా ఉన్నారని, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మేఘానే డబ్బులు సద్దిందని, రాజకీయ విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఈ ఐటి దాడులు రాజకీయంగా కూడా చూడాలని విశ్లేషకులు అంటున్నారు. కేసిఆర్, జగన్, బీజేపీ పై ఉమ్మడిగా రాజకీయ పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారనే సమాచారం రావటంతోనే, ఇలా చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. అదీ కాక ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావాల్సి ఉంది. అయితే ఈ రోజు ఈ అపాయింట్మెంట్ కాన్సిల్ అయ్యింది. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అమిత్ షా ని కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదు. అయితే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా రద్దు చెయ్యటం, మేఘా పై ఐటి రైడ్స్ చూస్తుంటే, ఎన్నికల ముందు, మాకు జరిగిన సీన్స్ గుర్తుకు వస్తున్నాయి అని తెలుగుదేశం పార్టీ అంటుంది.

Advertisements

Latest Articles

Most Read