శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ లో కొత్త వివాదం రేగింది. ఎస్వీబీసీ ఛానల్‌ ఛైర్మన్‌ గా ఉన్న పృధ్వీరాజ్ బాలిరెడ్డికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో తెలియకుండా విడుదల చెయ్యటం, అది ట్రోల్ కావటం ఇందుకు కారణమైంది. మొన్న జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలలోని చివరి ఘట్టంగా చక్రస్నానం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, పుష్కరిణిలో స్నానం చెయ్యటానికి, భక్తులు ఒకేసారి వచ్చి, అక్కడ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ఆ రోజు మొత్తం 24 గంటల వ్యవధిలో ఎప్పుడు స్నానం చేసినా స్వామి వారు అనుగ్రహిస్తారని, పుణ్యం వస్తుందని ఒక ప్రోమో చెయ్యాలని ఎస్వీబీసీ ఛానెల్ నిర్ణయం తీసుకుని. ఇందు కోసం వాళ్ళు వీళ్ళు ఎందుకు, నేనే పెద్ద ఆక్టర్ కదా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని, ఎస్వీబీసీ చైర్మెన్ గా ఉన్న పృధ్వీరాజ్ బాలిరెడ్డి తానే స్వయంగా రంగంలోకి దిగి, ఆ వీడియో చెయ్యాలని నిర్నయం తీసుకున్నారు.

prudvhi 14102019 2

ఈ ప్రోమో కోసం, ప్రజలకు సమాచారం ఇవ్వటానికి, తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో పుష్కరిణి నుంచి రికార్డింగ్ మొదలు పెట్టారు పృథ్వి. అయితే వివిధ భాషల్లో మాట్లాడే సమయంలో, పృథ్వి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక సార్లు చెప్పాల్సి వచ్చింది. ఉచ్ఛారణలో పొరపాట్లు దొర్లాయి. కొద్దిగా కామెడీగా కూడా చూసిన వారికి అనిపించింది. ఇంత ఇబ్బంది పడే బదులు, భాష తెలిసిన వారితో చెప్పించవచ్చు కదా, ఇంత పబ్లిసిటీ పిచ్చి ఏంటి అని ప్రజలు అనుకున్నారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు, పృధ్వీ నటించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ సీన్ గుర్తుకువచ్చింది. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసి పృధ్వీరాజ్ బాలిరెడ్డిని నవ్వులపాలు చేశారని, ఇది కావాలనే చేసారని భావిస్తున్నారు.

prudvhi 14102019 3

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో పై పృధ్వీరాజ్ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన పై కావాలని కుట్ర చేస్తున్నారని, తనను నవ్వులు పాలు చేస్తున్నారని, ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఈ వీడియోని రికార్డు చేసిన తర్వాత వీడియోను ఓఎఫ్‌సీ ద్వారా స్టూడియోకు పంపించారు. ఆ సమయంలో లేదా ఎడిటింగ్‌ చేసేటప్పుడు వీడియో బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టిటిడిలోని, విజిలెన్స్‌ లేదా పోలీసుశాఖ పరిధిలోని సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ వీడియోని లీక్ చేసిన లీకువీరులను గుర్తించాలని ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే జరగబోయే ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. పృధ్వీరాజ్ బాలిరెడ్డి కూడా విదేశాల్లో ఉన్నందున తిరిగి వచ్చిన తరువాత, ఈ విషయం పై చర్యలు తీసుకోనున్నారు.

ఇరు తెలుగు రాష్ట్రాలకి తెలిసిన ప్రముఖ కాంట్రాక్టర్‌ మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో గత మూడు రోజులుగా ఐటి సోదాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. భారీగా అక్రమాలు చేసారనే అనుమానాలు రావడంతోనే ఐటి అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఐటి సోదాలు పూర్తిగా ఢిల్లీ నుంచి వచ్చిన ఐటి బృందాల ఆధీనంలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఢిల్లీ అధికారులు హైదరాబాద్‌ చేరుకున్న తరువాతే సోదాల విషయమై హైదరాబాద్ లో ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దగ్గరి సంబంధాలు ఉండటంతోనే, ఐటి అధికారులు వచ్చే దాకా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు ఐటి వర్గాలు చెబుతున్నాయి. మేఘా కంపెనీ చేపట్టిన కాంట్రాక్టులు, రెండు ప్రభుత్వాల నుంచి వచ్చిన కాంట్రాక్టుల్లో ఉన్న బిల్లుల వివరాలు తెలుసుకుని మరీ ఐటి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.

megha 13102019 2

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టు పనులు దక్కించుకున్న మేఘా కంపెనీ, ఇతర చోట్ల కూడా కొన్ని కాంట్రాక్టు పనులు దక్కించుకుంది. ఫోర్బ్స్ మాగజైన్ ప్రచురించే కుబేరుల్లో ఒకరుగా మేఘా ఎదిగారు. అయితే, అతి తక్కువగాబ ఈ కంపెనీ, ముందస్తు పన్నులు చెల్లించింది. భారీ కాంట్రాక్టులు చేస్తున్న ఈ కంపెనీ ఇంత తక్కువగా ఎలా పన్నులు చెల్లిస్తుందనే అనుమానాలతో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో, పలు కీలక లావాదేవీల ఆధారాలు దొరకడంతో పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మీడియా సంస్థలు, ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీల్లో మేఘా కష్ణారెడ్డి పెట్టుబడులు పెట్టారు. టివి 9 కొనుగోలు వ్యవహారం, పోలవరం రివర్స్‌ టెండర్లు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటి లావాదేవీలపైనా ఐటి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

megha 13102019 3

మేఘా ఇంటి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్ తదితర వస్తువులను అధికారులు బయటకు తీసుకు వెళ్లారు. ఇక మరో పక్క, ఐటి సోదాల్లో హవాలా రూపంలో వచ్చిన డబ్బులతో లావాదేవీలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తుండటంతో, రేపు ఈడీ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో పక్క, ఈ ఐటి దాడులు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి ఇంటికి రావడం సంచలనంగా మారింది. మీడియాకు కనపడకుండా మంత్రి జాగ్రత్త పడినా, మీడియా కవర్ చేసింది. ఇక మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా, అక్కడే మకాం వేసారు. కృష్ణారెడ్డి ఇంటి పక్కనే మకాం వేసి, ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితి, జరుగుతున్న విషయాల పై ఆరా తీసినట్లు తెలిసింది. మేఘా కృష్ణారెడ్డి ఇంటి వద్ద కేంద్ర బలగాలు మోహరించడం విశేషం. తెలంగాణా రాష్ట్ర పోలీసులను సైతం మేఘా ఇంట్లోకి అనుమతించలేదు.

అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని జగన్ మోహన్ రెడ్డి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ కక్షలు ఎక్కడ దాకా వెళ్ళాయి అంటే, చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా కూల్చేస్తాం అనే దాకా వెళ్ళాయి. ప్రజా వేదికను రాత్రికి రాత్రి పడగోట్టేసారు. ప్రతిపక్ష నేతకు, ప్రభుత్వం ఇవ్వాల్సిన విధిలో భాగంగా, ప్రజావేదికను తన ఆఫీస్ గా ఇవ్వమని, చంద్రబాబు అడగటంతో, రాత్రికి రాత్రి, ప్రజా వేదిక కూల్చేసారు. దాని తరువాత, చంద్రబాబు ఇంటి పైన పడ్డారు. అదిగో కూల్చేస్తున్నాం, ఇదిగో కూల్చేస్తున్నాం అంటూ వార్నింగ్లు మీద వార్నింగ్లు ఇచ్చి, ప్రతి రోజు అది ఒక వార్తలాగా చేసి, వేరే సమస్యలకు కవరేజ్ లేకుండా చేసారు. ఇప్పుడు ఇది పాత వార్త అయిపోవటం, కోర్ట్ లో ఈ కేసు ఉండటంతో, ఇప్పుడు కొత్త వార్త కోసం, కొత్త కక్ష కోసం చూస్తూ, కొత్త టార్గెట్ ఫిక్స్ చేసారు.

tdp 13102019 1

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర కార్యాలయం మీద కన్ను పడింది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి నవంబరు 3 తేదీ, ఆదివారం సాయంత్రం 7.19 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సాక్షిలో అది అక్రమా నిర్మాణం అంటూ కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. భవన నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల 65 సెంట్లను కేటాయించగా ఒక రైతుకు చెందిన భూమిని కూడా ఆక్రమించుకున్నారని, పైగా పక్కనే ఉన్న వాగును పూర్తిగా పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని సాక్షి కధనం రాసింది. అంతే కాకుండా రెండు బేస్‌మెంట్‌లు, మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని మూడు బేస్‌మెంట్‌లు, నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

tdp 13102019 1

అయితే ఇలా జగన్ గారి సాక్షిలో కధనం రావటంతో, జగన్ గారి ప్రభుత్వం స్పందించింది. ఇది అంతా అక్రమం అని తేల్చేసి, నోటీసులు కూడా ఇచ్చేసారు. గత శుక్రవారం అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్‌ రామ్‌ప్రసాద్‌ నోటీసులు జారీ చేసిన ఏడు రోజులలోపు ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పై ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నారు. కొసమెరపు ఏంటి అంటే, చంద్రబాబు అధికారంలో ఉండగా, ఇదే తాడేపల్లిలో జగన్, ఒక పెద్ద ఇల్లు, దాని పక్కనే ఒక పెద్ద పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. పాపం చంద్రబాబుకి, ఇలాంటి కక్షసాధింపు రాజకీయం తెలియదు కదా. ఏదో ఒక లింక్ పట్టుకుని, వేధించాలని అప్పుడు ఆయన అనుకుని ఉంటే ? చూద్దాం, ఇది ఎన్ని మలుపులు తిరిగుతుందో.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య, కరెంట్ యుద్ధం జరుగుతూనే ఉంది. కేంద్రం చెప్పినా వినకుండా, చంద్రబాబుని ఇరికిద్దాం అనుకుని, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తాను అంటూ జగన్ చేస్తున్న పని, కేంద్రానికి తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఈ నేపధ్యంలోనే, కేంద్ర ఇంధన మంత్రి ఆర్కే సింగ్‌ మరోసారి, జగన్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు, ఎన్నికల్లో గెలుపు కంటే ఈ దేశం, మీ రాష్ట్ర భవిష్యత్‌ ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటూ వెళ్తే దేశంలో, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని, ఈ మాత్రం ఈ ప్రభుత్వానికి తేలియాదా అని ప్రశ్నించారు. విద్యుత్ కంపెనీలతో ఇప్పటికే ఒప్పందాలను చేసుకున్నారని, వాటిని ఇప్పుడు సమీక్షిస్తాం అంటే, ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెడతారా అని హెచ్చరించారు. విద్యుత్‌ ఇస్తున్న కంపెనీలకు రాష్ట్రాలు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా విద్యుత్‌ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

jagan 1310201 2

ఉచిత విద్యుత్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూనే, పరిశ్రమల పై అధిక విద్యుత్‌ చార్జీలు విధించడం పై అసహనం వ్యక్తం చేసారు. సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, పునరుత్పాద విద్యుదుత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్ర ప్రభుత్వ పీపీఏల సమీక్ష నిర్ణయాన్ని తొలి నుండి తప్పుబడుతున్నారు. ప్రధానికి, అమిత్ షా ద్రుష్టికి కూడా ఈ విషయం తీసుకువెళ్ళారు. మరో పక్క కోర్ట్ లు కూడా ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఒక పక్క రాష్ట్రం, కేంద్రం మధ్య ఈ విషయంలో యుద్ధం నడుస్తున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్ర ఇంధన మంత్రి ఆర్కే సింగ్‌కు లేఖ రాసారు.

jagan 1310201 3

పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో కేంద్రం బాధ్యతను తాము తలకెత్తుకుని మోస్తున్నామని, ఇది తమకు భారంగా ఉందని, కొంత భారాన్ని కేంద్రమే భరించాలని ఆ లేఖలో కోరారు. దేశం మొత్తమ్మీద ఏటా 60 వేల మిలియన్‌ యూనిట్ల పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగిస్తుంటే, అందులో ఒక్క ఆంధ్రలోనే 15 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను మేం వినియోగిస్తున్నామని మంత్రి బాలినేని వివరించారు. ఈ లేఖ ద్వారా పునరుత్పాదక విద్యుత్‌ విషయంలో, ఆంధ్రప్రదేశ్ సుముఖంగా లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ప్రపంచం మొత్తం, పునరుత్పాదక విద్యుత్ వైపు వెళ్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, మేము ఇంకా బొగ్గు మాత్రమే వాడతాం అనే ధోరణిలో ఉండటం, నిజంగా ఆశ్చర్యం.

Advertisements

Latest Articles

Most Read