చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండటమే వాళ్ళ టార్గెట్.. వారే దగ్గుబాటి దంపతులు. అందుకే మొన్న ఎన్నికల్లో భర్త వైసిపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, భార్య బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసారు. ఇద్దారు ఓడిపోయారు అనుకోండి అది వేరే విషయం. అయితే ఎన్నికల ముందు మాత్రం అటు పార్టీలకు కాని, ఇటు ఈ దంపతులకు కాని, ఇలా వేరు వేరు పార్టీల్లో ఉండటం పెద్ద ఇబ్బందిగా మారలేదు. ఇప్పుడు ఎన్నికలు అయ్యాక సీన్ రివెర్స్ కొట్టింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాని, జగన్ మాత్రం అధికారంలోకి వచ్చారు. అయితే, ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఓడిపోతే పోయాం, ఎలాగు పార్టీ అధికారంలో ఉంది కదా, మన ఇష్టం అని అనుకున్నారు. ఆయన చెప్పినట్టే నియోజకవర్గంలో అధికారులు మాట విన సాగారు. కొన్ని బదిలీలు కూడా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పినట్టే జరిగాయి. అయితే ఎక్కడ తేడా కొట్టిందో కాని, ఈ పరిణామం జగన్ కు నచ్చ లేదు.

daggubati 12102019 2

ఎన్నికల ముందు, దగ్గుబాటి పార్టీలో చేరారని, పర్చూరు వైసిపీ నేత టిడిపిలో చేరారు. అయితే ఇప్పుడు జగన్, ఆ టీడీపీ నేత రావి రామనాథంబాబుని పార్టీలోకి ఆహ్వానించి, పర్చూరు బాధ్యతలు చూసుకోమని, ఆయన మాటకు ప్రాముఖ్యత ఇవ్వాలని, అక్కడ అధికారులకు, పార్టీ నేతలకు చెప్పారు. అయితే, ఇంత జరుగుతున్నా ఈ విషయం మాత్రం దగ్గుబాటికి చెప్పలేదు. దీంతో దగ్గుబాటి, జగన్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అసలు విషయం ఏమిటో తేల్చుకోవాలని అనుకుంటున్నారు. అయితే జగన్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్న దగ్గుబాటికి అటు వైపు నుంచి షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. మీరు జగన్ తో భేటీ అయ్యే ముందు, ఒక విషయం స్పష్టం చెయ్యాలి, మీ భార్య పురందేశ్వరి వేరే పార్టీలో, మీరు ఇక్కడ కుదరదు, ఏదో ఒకటి ముందు తేల్చుకోండి అని చెప్పటం, దగ్గుబాటి షాక్ అయ్యారు.

daggubati 12102019 3

ఎన్నికలు ముందు, ఇవన్నీ తెలుసు కదా, అప్పుడు లేని ఇబ్బంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ప్రశ్నించినా, అటు వైపు నుంచి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు దగ్గుబాటి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో, జగన్ చేతిలో అవమానానికి గురయ్యాను అనే భావనలో ఉన్నారు. అయితే, పురందేశ్వరి బీజేపీ నేతగా ఉంటూ, జగన్ పరిపాలన పై విమర్శలు చెయ్యటం, తన ప్రభుత్వం పై, కేంద్రానికి ఫిర్యాదులు చెయ్యటం వంటివి జగన్ కు ఇబ్బందిగా మారిందని, అందుకే ఆమెను బీజేపీకి రాజీనామా చేస్తేనే, మీరు ఇక్కడ కొనసాగండి అంటూ, పొమ్మనలేక, పొగబెడుతున్నని, దగ్గుబాటి అర్ధమైంది. అయితే, బీజేపీ కేంద్రంలో చాలా బలంగా ఉండటం, పురందేశ్వరికి, బీజేపీ హైకమాండ్ లో మంచి పేరు ఉండటంతో, ఆమె బీజేపీ కి రాజీనామా చేసే అవకాశం లేదు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పార్టీ కి రాజీనామా చేస్తారా, జగన్ తో సయోధ్యకు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.

రెండు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటన చేసిన చంద్రబాబు, విశాఖలోని పార్టీ కార్యాలయంలో, విలేఖరులతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి ఏదో చేస్తారని, ఆయన చేతిలో రాష్ట్రాన్ని పెడితే, ఆయన చేతిలో పెట్టిన అధికారం పిచ్చోడి చేతిలో రాయిలాగా అయ్యిందని చంద్రబాబు అన్నారు. రాయితో అతనే కొట్టుకుంటాడు, ఎదుటి వాడిని కొడతాడు, ఇంకా ఎవరినైనా కొడతాడు అంటూ వ్యాఖ్యలు చేసారు. పోలీస్ వ్యవస్థ పై కూడా ఆయన విమర్శలు చసారు. కొంత మండి పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడి దిగజారి ప్రవర్తిస్తున్నారని, కొందరు మరీ బరితెగించి రాజకీయ నాయకులు లాగా చేస్తున్నారని అనంరు. త కు స్వాగతం పలికేందుకు వైజాగ్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, ఇతర నాయకులపై కేసులు పెట్టారని , ఇలాగే తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామని హెచ్చరించారు.

cbn 12102019 2

తన పై అవినీతి ముద్ర వెయ్యాలని చూస్తున్నారని, రాజశేఖర్‌రెడ్డి తనపై 26 కేసులు పెట్టి ఒక్కటీ నిరూపించలేకపోయారన్నారు. ఈయన వచ్చి నాలుగు నెలలు అయినా, తన పై చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని అన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన పై కేసుల కోసం ఫైళ్లు అన్నీ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారని, ఆధారాల కోసం తవ్వండి, తవ్వండి, అంటూ చెబుతూనే ఉన్నారని, ఆయన మనస్తత్వం ఎవరికీ అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. సిగ్గు, శరం, పౌరుషం ఈ ముఖ్యమంత్రికి లేవని దుయ్యబట్టారు. ఈ సందర్భంలో, ఒక విలేఖరి, పనుగట్టుకుని చంద్రబాబుని పదే పదే, ఏదో కార్నర్ చెయ్యాలని, ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన సందర్భంలో, చంద్రబాబు అతనికి నవ్వుతూ క్లాస్ పీకారు.

cbn 12102019 3

చంద్రబాబు మాటల్లో... "చెప్పేవాడంటే అడిగేవాడికి లోకువ..దుర్మార్గులంటే భయం.. పని చేసే వాడంటే చులకన. ఒక సంఘటనలో మీ జర్నలిస్ట్స్ పని కాలేదని నన్ను అంటున్నారు. అదే Tv5, ABN ని బాన్ చెస్తే నోరు విప్పలేక పోతన్నారు. 2 లక్షలు ఫైన్ ప్రబుత్వానికేస్తే ప్రజాధనం వృధా అయినందుకే కాదు .. అటువంటి చట్ట వ్యతిరేక పనులు ఒక ప్రబుత్వం చేసినందుకు సిగ్గుపడాలి. ఏం.. చానల్స్ బాన్ కి నిరసనగా ..ప్రబుత్వ వార్తలు రాయకుండా బాన్ చెయ్యొచ్చుగా మీరు ? అలా చెయ్యటం కూడా కాదు .. కనీసం అడగను కూడా అడగలేకపోతన్నారు మీరు .. ఎందుకంటే మీకు భయం .. దుర్మార్గులంటే భయం.. పని చేసే వాడంటే చులకన. దుర్మార్గులమీద ఎవరో ఒకరు పోరాడాలి కదా ? అదే నేను చేస్తన్నా" అని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఎప్పుడూ చిన్న చూపే. ఉద్యమ సమయంలో కేసీఆర్, మనల్ని ఎన్ని తిట్టాడో అందరికీ గుర్తు ఉంది. తినే తిండి దగ్గర నుంచి, మన సాహిత్యం దాకా, అన్నిటికీ ఎగతాళి చేసారు. అయితే ఉద్యమ సమయంలో, ఉద్రేక పరిస్థితిలో చేసారులే అని సరి పెట్టుకున్నాం. కాని, రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కూడా, ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టాడు. ఆంధ్రప్రదేశ్ తో మీ రాష్ట్రం పోటీ పడుతుంది కదా, అని ఒక ఇంటర్వ్యూ లో అడిగితే, ఆంధ్రప్రదేశ్ ఒక థర్డ్ గ్రేడ్ స్టేట్, దాంతో మా రాష్ట్రాన్ని పోల్చకండి, అంటూ కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తు ఉండే ఉంటాయి. అయితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. మొన్న జరిగిన తెలంగాణా అసెంబ్లీ సమావేశంలో కూడా కేసీఆర్, అమరావతి పై తనకు ఉన్న అక్కసును కక్కారు.

kcr 12102019 2

అమరావతి అనేది ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని, దాని పై ఎలాంటి ఖర్చు పెట్టవద్దు అని నేను చంద్రబాబుకి చెప్పాను అంటూ, ఒక కధ వినిపించారు. అయితే అదే అమరావతి శంకుస్థాపనకు వచ్చి, ఈ అమరావతికి భవిష్యత్తు ఉంది, హైదరాబాద్ అంత ఎదుగుతుంది, మేము వంద కోట్లు అమరావతికి ఇద్దాం అనుకున్నాం అని చెప్పిన విషయాలు అందరికీ గుర్తు ఉన్నాయి. అయితే అమరావతి ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్న ఎవరూ స్పందించలేదు. మన రాజధానిని కించపరుస్తున్నా, వీరికి చలనం లేదు. అయితే, కేసిఆర్, అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు అంటూ, చేసిన వ్యాఖ్యల పై, చంద్రబాబు ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందించారు.

kcr 12102019 3

ఓపెన్ మ్యగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చంద్రబాబు స్పందిస్తూ, "కేసీఆర్, మా అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, ఆయనకు ఇలా అనటం చాలా ఈజీ. నేను 1995లో సియంగా ఉండగా, హైదరాబాద్ ని డెవలప్ చెయ్యటం, ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఉంటె, ఈ రోజు తెలంగాణాకు ఇంత ఆదాయం వచ్చేదా ? హైదరాబాద్ ఆదాయంతోనే కదా తెలంగణా నడుస్తుంది. ఇప్పుడు కేసిఆర్ కు ఆ ఆదయమే కదా, ఫ్రీ గా పని చేసుకునేలా చేస్తుంది. నేను ప్రజల భవిష్యత్తు గురించి, తెలుగు రాష్ట్రాల ప్రగతి గురించి అలోచించి పని చేస్తున్నా. హైదరాబాద్ ఈ స్థాయిలో ఎదగడంలో నా పాత్ర ఉంది. అలాగే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాగా, ఆంధ్రప్రదేశ్ కు కూడా, ఒక సిటీ కావాలని, అమరావతి ప్లాన్ చేసాం. కాని అమరావతిని అందరూ కలిసి, ఆదిలోనే చంపేస్తున్నారు" అంటూ చంద్రబాబు కేసీఆర్ వ్యాఖ్యల పై స్పందించారు.

ప్రముఖ కాంట్రాక్టర్, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రీతి పాత్రుడు అయిన, మేఘా కృష్ణా రెడ్డి ఇంటితో పాటుగా, దేశ వ్యాప్తంగా 34 చోట్ల ఏకకాలంలో ఐటి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న నిన్న వేకువజామున మొదలైన ఐటి దాడులు, నిర్విరామంగా, 42 గంటలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఐటి టీంలు వస్తూ, వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు మేఘా కృష్ణా రెడ్డి ఇంటి ముందు, కొంత మంది సీఆర్పీఎఫ్ ఫోర్సు ఉండటం గమనార్హం. సహజంగా, ఐటి రైడ్స్ సమయంలో, లోకల్ పోలీస్ సహాయం తీసుకుంటారు. అయితే ఇక్కడ ఐటి టీమ్స్ కూడా ఢిల్లీ నుంచి వచ్చాయి. ఇక్కడ బలగాలు కూడా, మొత్తం సీఆర్పీఎఫ్ ఉన్నారు. మరో పక్క, తెలుగు మీడియాలో ఒక్కటంటే ఒక్క వార్తా కూడా ఈ విషయంలో వెయ్యటం లేదు. నిన్న దాడుల విషయం పై, రెండు మూడు చానెల్స్ బ్రేకింగ్ వేసి ఆపేశాయి. ఇక ఆ తరువాత, ఈ విషయంలో వార్త అనేది లేదు.

raids 12102019 2

ఒక చిన్న ఉద్యోగి ఏసిబి రైడ్స్ లో దొరికితేనే, రచ్చ రచ్చ చేసే తెలుగు మీడియా, ఇంత పెద్ద ఎత్తున రైడ్స్ జరుగుతుంటే, అసలు స్పందించటం లేదు. కారణం ఏమిటో కాని, ఈ విషయంలో మాత్రం, తెలుగు మీడియా సైలెంట్ గా ఉండి పోయింది. మొదటి రోజు తనిఖీల్లో, సంస్థకు చెందిన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు, ల్యాప్ ట్యాప్ లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు, వాటి పై విశ్లేషణలు జరుపుతున్నారు. నిపుణులు అవన్నీ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ దాడులు, ఇంకా ఎంత సేపు కొనసాగుతాయి అనేది చూడాల్సి ఉంది. సహజంగా, ఎక్కడ రైడ్స్ జరిగినా, ఒక రోజులు అయిపోతాయి. ఇక్కడ మాత్రం రెండు రోజులుగా, అదీ నిర్విరామంగా, సీఆర్పీఎఫ్ భద్రత మధ్య, ఢిల్లీ టీమ్స్ సోదాలు చేస్తున్నాయి.

raids 12102019 3

నిన్న కొంత మంది జాతీయ మీడియా ప్రతినిధులు, పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు, ఫేక్ బిల్స్ గుర్తించారని, ట్వీట్ చేసారు. అయితే, ఇప్పుడు అసలు లోపల ఏమి జరుగుతుంది ? ఏది అక్రమం ? ఏది సక్రమం ? అని చెప్పే వారే లేరు. మరో పక్క మేఘా సంస్థ మాత్రం నిన్న ఉదయం, ఇదంతా రొటీన్ అని దీనికి కవరేజ్ అవసరం లేదని, ఒక ప్రకటన ఇచ్చాయి. రొటీన్ అయితే, ఇలా రెండు రోజులు నుంచి, ఒక ప్రముఖుడి ఇంట్లో, సీఆర్పీఎఫ్ బద్రత నడుమ, ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్స్ సోదాలు చెయ్యల్సిన అవసరం ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సమాచారం తెలుగు మీడియా ఎందుకు రిపోర్ట్ చెయ్యటం లేదు ? ఇంత పెద్ద సెన్సేషన్ జరుగుతుంటే, మీడియా ఎందుకు నోరు కట్టేసుకుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. సోదాలు ముగిసిన తరువాత అయినా, ఐటి అధికారులు కాని, మేఘా కృష్ణా రెడ్డి కాని, ఈ విషయంలో క్లారిటీ ఇస్తారేమో ఆశిద్దాం.

Advertisements

Latest Articles

Most Read