అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, వైసీపీ నేతలు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతో పాటుగా, గెలిచిన ఎమ్మెల్యేల పై బదులు తీర్చుకునే పనిలో ఉంది వైసీపీ. గెలిచిన 23 మందిని టార్గెట్ చేస్తూ, వారిని కూడా ఎమ్మెల్యే పదవిలో లేకుండా చెయ్యటానికి, సాంకేతిక అంశాలు వెతుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే, నిన్న హైకోర్ట్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇచ్చింది. ఆయన కుప్పం ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ లో, తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ, ఆయాన ఎన్నిక రద్దు చెయ్యాలి అని కోరుతూ, వైసిపీ అభ్యర్ధిగా, చంద్రబాబుతో పోటీకి దిగిన, కృష్ణ చంద్రమౌళి, హైకోర్ట్ లో ఎన్నికల పిటీషన్ వేసారు. చంద్రబాబు గెలుపును సవాల్ చేస్తూ వేసిన పిటీషన్ పై, చంద్రబాబుకు శనివారం, హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.

amaravati 29092019 2

ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు, ఇతర ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్ట్. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ శనివారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. చంద్రబాబు ఆదాయ మార్గాల ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించకుండా చంద్రబాబు గోప్యంగా ఉంచారని, ఆయన ముఖ్యమంత్రిగా పొందిన విషయాన్ని అఫిడవిట్ లో వెల్లడించలేదని అభియోగం. అలాగే కృష్ణా జిల్లా, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటుగా అప్పటి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వల్లభనేని వంశీ ఎన్నికను రద్దు చేయాలంటూ, గన్నవరం వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకటరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

amaravati 29092019 3

ఎన్నికల ప్రచారం సమయంలో వంశీ సూచన మేరకు ఆయన ప్రతినిధులు ఇంటి స్థలాల నకిలీ పట్టాలను పంచి ప్రలోభ పెట్టారని తెలిపారు. అలాగే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ చట్ట విరుద్ధంగా జరగడంతో తాను 990 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని వెల్లడించారు. అందుకే వల్లభనేని వంశీని, ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని యార్లగడ్డ హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్ట్, న్యాయమూ, వంశీతో పాటు రిటర్నింగ్‌ అధికారికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ కేసు పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. అయితే దీని పై తెలుగుదేశం నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. చిన్న చిన్న అంశాలను కూడా పెద్దగా చూపించి, ఎదో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

పేద ప్రజలు, కేవలం 5 రూపాయలకే, ఉదయం టిఫిన్, మధ్యహ్నం భోజనం, రాత్రికి భోజనం పెడుతూ, అన్న క్యాంటీన్ల పేరుతొ, చంద్రబాబు, పేదల కడుపు నింపారు. పేదలకు పెట్టేదే కదా అని తెలంగాణాలో పెట్టినట్టు, ఒక చిన్న షెడ్డు పెట్టి, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ భోజనం పెట్టలేదు. మంచి భవనం కట్టి, అన్ని సదుపాయాలు పెట్టి, సూచితో, శుభ్రంతో, భోజనం పెట్టే వారు. అయితే వైసీపీ ప్రభుత్వం రావటంతోనే, ఒక నెల ఆగి, జూలై 1 నుంచి ఈ అన్న క్యాంటీన్ లు ఆపేశారు. దీంతో పేదలు మళ్ళీ ఆకలితో అలమటిస్తున్నారు. ఒక పక్క ఇసుక లేక, పనులు లేక, డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే, 5 రూపాయలతో కడుపు నింపుకుందాం అంటే, అది కూడా లేకుండా చేసారు. అసలు అన్న క్యాంటీన్ లు ఎందుకు తీసారో ఎవరికీ అర్ధం కాలేదు. దీని పై మంత్రులు స్పందిస్తూ, అన్న క్యాంటీన్లలో అవినీతి జరిగిందని అన్నారు.

annacanteen 28092019 2

చంద్రబాబు ఈ బిల్డింగ్ ల్లో కూడా అవినీతి చేసారని, అందుకే అన్న క్యాంటీన్లు ముసేస్తున్నాం అని చెప్పారు. దీని పై బొత్సా సత్యన్నారాయణ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లు మళ్ళీ సెప్టెంబర్ 1 నుంచి తెరుస్తున్నామని చెప్పూర్. అయితే ఇప్పుడు సెప్టెంబర్ అయిపొయింది కాని, ఇంకా అన్న క్యాంటీన్ లు అయితే మొదలు కాలేదు. మరో పక్క అన్న క్యాంటీన్ భవనాలు పూర్తిగా మూసేసారు. వాటి రంగులు కూడా తీసి వేసి, తెలుపు రంగు వేసారు. కొంత మంది ఇక్కడ, మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే, అది పుకారుగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ అన్న క్యాంటీన్ భవనాలను వార్డు సచివాలయంగా మారుస్తున్నారు. గ్రామాల్లో అయితే, ఇప్పటికే ఉన్న పంచాయతీ ఆఫీస్ లను, గ్రామ సచివాలయంగా మారుస్తున్నారు.

annacanteen 28092019 3

వాటికి వైసీపీ జెండా రంగులు వేస్తున్నారు. మరో పక్క అన్న క్యాంటీన్ భవనాలకు, ఇప్పటికే తెలుపు రంగు వెయ్యటంతో, వాటిని వార్డు సచివాలయంగా మారుస్తున్నారు కాబట్టి, వాటికి కూడా వైసీపీ జెండా రంగు వేసారు. ఇప్పటికే నెల్లూరులో ఏడు అన్న క్యాంటీన్‌ భవనాలను వార్డు సచివాలయాలుగా మారుస్తూ, వాటికి రంగులు కూడా వేసేసారు. అయితే ఇవి అవినీతి బిల్డింగ్ లు అని, అందుకే దీంట్లో అవినీతి బయటకు తీసే దాకా, ఎలాంటి పనులు చెయ్యమని చెప్పి, ఇప్పుడు వార్డు సచివాలయంగా మారుస్తూ ఉండటంతో, ఇక్కడ కూడా వారికి ఎలాంటి అవినీతి దొరకలేదనే అనుకోవచ్చు. మొత్తానికి పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్ లు, చివరకు వైసీపీ రంగులు పులుముకుని, వార్డు సచివాలయం అయ్యాయి.

మెగా స్టార్ చిరంజీవి, సినిమాల్లో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో, రాజకీయాల్లోకి వచ్చి అంతే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. పార్టీ పెట్టి, కాంగ్రెస్ లో విలీనం చేసి, మంత్రి పదవి అనుభవించి, మళ్ళీ రాజకీయాలకు దూరం అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా. ఎన్నో మాటలు చెప్పి, ప్రస్తుతానికి ఒక్క సీటుతో సరి పెట్టుకుని, భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న నెలకొంది. అయితే చిరంజీవి రాజకీయాలు ఆపేసి, ఇప్పుడు సినిమాల పైనే ద్రుష్టి పెట్టారు. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి అనే భారీ సినిమా తీస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంలో, చిరంజీవి, ఈ సినిమా ప్రొమోషన్ లో బిజీగా ఉన్నారు. వివిధ భాషల్లో వస్తున్న ఈ సినిమా పై, చిరంజీవి తమిళనాడులో కూడా ఈ సినిమా ప్రమోషన్ కు వెళ్లారు. అక్కడ, ఓ తమిళ్ పత్రిక ఇంటర్వ్యూలో, రాజకీయాల పై మాట్లాడిన చిరంజీవి, అక్కడ సూపర్ స్టార్ట్ లు అయిన, రజనీకాంత్, కమల్ హాసన్ కు, రాజకీయాల పై సలహాలు ఇచ్చారు.

kamal 28092019 2

రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వద్దు అంటూ చిరంజీవి సలహా ఇచ్చారు. రాజకీయాలు అంటే టీ తాగినంత ఈజీ కాదని, సున్నిత మనస్తత్వం ఉన్న వారు, రాజకీయాలకు పనికిరారని చెప్పారు. ఎదురు దెబ్బులు తినటానికి సిద్ధపడితే, రాజకీయాల్లో ఉండండి, ఎప్పుడో సక్సెస్ అవుతారు అని చిరంజీవి అన్నారు. ఇలాగే తన రాజకీయ జీవితం గురించి, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి చెప్తూ, 2009లో తాను తిరుపతి..పాలకొల్లులో పోటీ చేస్తే సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో ఓడిపోయానని గుర్తు చేసారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సైతం తాజాగా జరిగిన ఎన్నికల్లో విశాఖ గాజువాక తో పాటుగా సొంత జిల్లాలోని భీమవరం నుండి పోటీ చేస్తే రెండు చోట్ల ఓడారని, అయితే తమ ఓటమికి డబ్బు ప్రభావమే కారణం అని చిరంజీవి అన్నారు. ఇలాంటి పరిస్థితులో రాజకీయాలు ఉన్నాయని, అందుకే తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ లు రాజకీయాలకు రావద్దు అంటూ సలహా ఇచ్చారు.

kamal 28092019 3

కమల్ హసన్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో, విజయం సాధిస్తుందని భావించానని, కాని ఎక్కడా గెలవలేదని చిరంజీవి అన్నారు. అయితే చిరంజీవి వ్యాఖ్యల పై, కమల్‌హాసన్‌ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి వ్యాఖ్యల పై, కమల్ మాట్లాడుతూ "గెలుపు ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల్లో చైతన్యం కోసం వచ్చానని చెప్పారు. చిరంజీవి, నాకెప్పుడూ సలహాలు ఇవ్వోద్దంటూ కమల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం వల్లే ప్రజల ఆలోచనా ధోరణి పై అవగాహన పెరిగిందని కమల్ చెప్పారు. అయితే కమల్ ఇంత ఘాటుగా స్పందించటం, చిరంజీవి సలహాలు అవసరం లేదు అని చెప్పటంతో, ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

ఏపీఎస్ ఆర్టీసీ గత వారం రోజులుగా వార్తల్లో నిలిస్తుంది. ఆర్టీసి విలీనం కోసం వచ్చే వార్తల్లో కాదు. పోలవరం రివర్స్ టెండర్ లో దక్కించుకున్న మేఘా సంస్థకు, ఆర్టీసి ఎలక్ట్రిక్ బస్సుల అద్దె టెండర్ లో, క్విడ్ ప్రోకో కింద, మేఘా సంస్థకు చెందిన కంపెనీకి కాంట్రాక్టు ఇస్తున్నారు అంటూ, ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కింది. ఇది కాక ఎండీని అకస్మాత్తుగా బదిలీ చెయ్యటం, చైర్మెన్ కు నోటీస్ ఇవ్వటం కూడా, అనుమానాలకు తావిచ్చింది. తాజగా ఈ రోజు ఆర్టీసి చైర్మెన్ గా ఉన్న వర్ల రామయ్యను, చైర్మెన్ పదవి నుంచి తప్పుకోవాలి అంటూ, ప్రభుత్వం నోటీస్ పంపించింది. మీకు నెల రోజులు గడువు ఇస్తున్నాం, ఈ లోపు మీరు తప్పుకుంటే సరి, లేకపోతే, మిమ్మల్ని మేమే తప్పిస్తాం అంటూ,ప్రభుత్వం ఆ నోటీస్ లో ఘాటుగా స్పందిస్తూ, వర్ల రామయ్యకు నోటీస్ పంపించింది. ఇప్పుడు ఇదే చర్చనీయంసం అయ్యింది.

varla 28092019 2

ఎలేక్టిక్ బస్సులు టెండర్లు ఖరారు చెయ్యాలి అంటే, ఆర్టీసి చైర్మెన్ గా ఉన్న వర్ల రామయ్య సంతకం పెడితేనే టెండర్ ఒకే అయ్యే అవకాసం ఉందనే ప్రచారం జరుగుతుంది. అందుకే టెండర్ తేదీలకు అంటే ముందే, వర్ల రామయ్యను తప్పించి, తమకు అనుకూలంగా ఉండే వారిని పెట్టుకోవటానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధం అయ్యారు. అందుకే వర్ల రామయ్యను తప్పించే పనిలో భాగంగా, ఈ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం మారిన తరువాత వర్ల రామయ్య, ఆర్టీసి వ్యవహారాలు ఏమి చూడకపోయినా, ఆయన సాంకేతికంగా ఇంకా ఆర్టీసి చైర్మెన్ గానే ఉన్నారు. అయితే, వర్ల రామయ్య దీని పై స్పందించారు. ఏప్రిల్ 26వ తేదీన నా పదవి కాలం ముగిసింది, తప్పుకోండి అంటూ నాకు నోటీస్ పంపించటం విడ్డురంగా ఉంది.

varla 28092019 3

పదవీ కాలం ముగిసిపోతే, ఇంకా నా రాజీనామా ఎందుకు, అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఆర్టీసీ ఆఫీసుకు రావడం లేదని, అలాగని రాజీనామా చేయలేదని, ప్రభుత్వం తొలగిస్తే, తొలగించుకోవచ్చని వర్ల రామయ్య అన్నారు. అయితే మూడు రోజుల క్రితం ఎండీగా ఉన్న సురేంద్రబాబును, ఉన్నట్టు ఉండి బదిలీ చెయ్యటం, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వక పోవటం, ఇప్పుడు ఆర్టీసి చైర్మెన్ గా ఉన్న వర్ల రామయ్యను టార్గెట్ చెయ్యటం, ఇవన్నీ చూస్తుంటే, ఎలేక్టిక్ బస్సుల డీల్ కోసమే, వీరిని తప్పించారని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలవరంలో తక్కువకు ఇస్తున్నాం అని చెప్పి, ఇక్కడ అధిక రేట్లకు, కట్టబెట్టే పని చేస్తున్నారని, దీని వెనుక పెద్ద క్విడ్ ప్రో కో ఉంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read