నగిరి ఎమ్మెల్యే రోజా, నోటి స్పీడ్ గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు పై, లోకేష్ పై రాజకీయ వ్యాఖ్యలు కాకుండా, బాడీ షేమింగ్ చేస్తూ, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. లోకేష్ ని అయితే, పప్పు పప్పు అంటూ, పదే పదే మాట్లాడుతూ, అసలు నువ్వు మంత్రిగా ఏమి చేసావ్ అంటూ అనేక సార్లు, రోజా ప్రెస్ ముందు ఇష్టం వాచినట్టు మాట్లాడటం చూసాం. ఈ నేపధ్యంలోనే రోజా ఈ రోజు పెట్టిన ఫేసుబుక్ పోస్ట్ చూస్తే, ఆమె లోకేష్ ని ఇన్ డైరెక్ట్ గా పొగిడినట్టు అనిపించింది అంటూ నెటిజెన్ లు కామెంట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత, రోజాకి మంత్రి పదవి ఇవ్వకుండా జగన్ షాక్ ఇచ్చారు. అయితే అలిగిన రోజాని బుజ్జగీస్తూ, ఆమెకు ఏపీఐఐసి చైర్మెన్ పదవి ఇచ్చారు జగన్. దీని పై కూడా అనేక విధాలుగా విమర్శలు వచ్చాయి. రోజాకి పెట్టుబడులు తెచ్చే ఏపీఐఐసి చైర్మెన్ లాంటి కీలక పదవి ఎలా ఇస్తారని, ఆమె ఇన్వెస్టర్స్ తో మాట్లాడే సామర్ధ్యం లేదు కదా అని ప్రశ్నించారు.

roja 26092019 2

అయినా ఆమెకు ఏపీఐఐసి పదవి ఇచ్చారు జగన్. ఈ నేపధ్యంలోనే ఆమె, ఈ రోజు ఒక కంపెనీకి భూమి పూజ చేసారు. అది అలాంటి ఇలాంటి కంపెనీ కాదు. టీసిఎల్ అనే పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇది చైనాలో ఒక పెద్ద కంపెనీ. అయితే ఈ కంపెనీకి ఈ రోజు భూమి పూజ చేస్తూ, రోజా ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. ఇది ఆమె పోస్ట్ "ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ TCL ఆంధ్ర ప్రదేశ్ లో 2,200 కోట్లతో తిరుపతిలో రెండు కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వచ్చింది. జగనన్న ఆశీస్సులతో APIIC ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక మొట్ట మొదటి ప్రాజెక్ట్ కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉంది." అంటూ ఆమె ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. అయితే ఆమె ఇలా చెయ్యటంతో, నెటిజెన్ లు ఒకేసారి ఆమె పోస్ట్ పై ట్రోల్స్ చెయ్యటం మొదలు పెట్టారు.

roja 26092019 3

దానికి కారణం లేకపోలేదు. టీసిఎల్ అనే కంపెనీ కోసం, అప్పటి ఐటి మంత్రి లోకేష్ ప్రత్యెక శ్రద్ధ పెట్టి, ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా, స్వయంగా చైనా వెళ్లి, వారిని ఒప్పించి, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేలా చేసారు. ఇందుకోసం, తిరుపతిలో 153 ఎకరాలు కేటాయించారు. 22 వేల కోట్ల పెట్టుబడితో, 8 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, ఈ కంపెనీ ఒప్పందం కూడా చేసుకుంది. డిసెంబర్ 20, 2018లో ఈ కంపెనీ భూమి పూజ కూడా చేసారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గున్నారు. అయితే, అప్పట్లోనే భూమి పూజ అయిపోయిన కంపెనీకి, ఇప్పుడు మళ్ళీ రోజా భూమి పూజ చెయ్యటం, అలాగే అప్పట్లో పప్పు పప్పు అని హేళన చేసిన లోకేష్ తెచ్చిన కంపెనీని, ఈ రోజు గొప్పగా చెప్తూ, మా జగనన్న ఆశీసులు అని చెప్పటం చూసి, నెటిజెన్లు రోజా పోస్ట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత పెద్ద కంపెనీ తెచ్చిన లోకేష్ పప్పు అయితే, అదే కంపెనీని ఈ రోజు తమ ఘనతగా చెప్తున్న రోజాని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు.

ఈ రోజు ఉదయం నుంచి ఒక వార్తా హల్ చల్ చేసింది. జగన్ నివాసంలో, ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందంతో భేటీ అయ్యారు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక వైసీపీ మైనస్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో హడావిడి చేసాయి. 13 మంది పారిశ్రామకవేత్తల బృందం, జగన్ మోహన్ రెడ్డిని కలిసింది, ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు అంటూ ఓ ఊదరగొట్టారు. ఈ ప్రచారం చూసి, సామాన్య ప్రజలు కూడా, ఇంకేముంది, జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు అంత స్పీడ్ గా, పెట్టుబడులు తీసుకువస్తున్నారు, ఏమో అనుకున్నాం, జగన్ కూడా పెట్టుబడులు తేవటంలో దూసుకుపోతున్నారు అని అందరూ అనుకున్నారు. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడులు తెస్తున్నారని, ఒక పక్క ఆర్ధిక మాంద్యం ఉన్నా, జగన్ సాధించారని అందరూ అనుకున్నారు.

lokesh 26092019 2

దీనికి సంబంధించి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇక్కడే అసలు గుట్టు అంతా బయట పడింది. తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఈ విషయం పై పూర్తీ ఆధారాలతో బయట పెట్టారు. ఆ ఆధారాలు చూసి అందరూ అవాక్కయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అనుకుంటే, జగన్ తన వ్యాపారాల గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ సెటైర్లు పేలాయి. ఇంతకూ విషయం ఏమిటి అంటే, లోకేష్ బయట పెట్టిన మొదటి ఆధారం, "Sophie Sidos" అనే ఆవిడ జగన్ ని కలిసిన ట్వీట్. జగన ఇంట్లో కలిసి దిగిన ఫోటో ట్వీట్ చేసారు. ఆవిడ ఎవరు అంటే, Vicat అనే ఫ్రెంచ్ సిమెంట్ కంపెనీకి అధిపతి. ఈ Vicat అనే కంపెనీ, జగన్ మోహన్ రెడ్డి భార్య కంపెనీ అయిన భారతీ సిమెంట్స్ లో ప్రధాన వాటాదారు.

lokesh 26092019 3

ఇలా వారి వ్యాపార భాగస్వామిని తీసుకోవచ్చి, రాష్ట్రంలో పెట్టుబడులు అంటూ డబ్బా కొడుతున్నారని, ఇది ఏ రకమైన క్విడ్ ప్రోకోనో అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇది నారా లోకేష్ చేసిన ట్వీట్. "YS Jagan Mohan Reddy గారి విజన్ నచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్ నుంచి పెట్టుబడుల బృందం ఒకటి వచ్చిందని సొంత మీడియాలో సొంత డబ్బా కొడుతుంటే తుగ్లక్ పాలనలో విజన్ ఏంటబ్బా అని ఆశ్చర్యపోయాం. తీరా ఆరాతీస్తే ఆ వచ్చిన వాళ్ళు fondationlouisvicat అనే సంస్థ ప్రతినిధులు. ఆ సంస్థ గురించి తెలుసుకుంటే అసలు సంగతి బయటపడింది. ఆ సంస్థలో మన జగన్ గారి భారతి సిమెంట్ ఒక భాగస్వామి. అంటే వచ్చింది జగన్ గారి చుట్టాలే. మరో క్విడ్ ప్రో కో లాంటిదేదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అబ్బో ఏం విజన్!" అంటూ ట్వీట్ చేసారు.

తెలుగుదేశం పార్టీ ఒక పక్కన మమ్మల్ని టార్గెట్ చేసారు, రాజకీయంగా వేధిస్తున్నారు అని ఆరోపిస్తున్నా, జగన్ ప్రభుత్వం మాత్రం, రాజకీయ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే కోడెల, చింతమనేని, కూన రవి కుమార్, సోమిరెడ్డి, ఇలా అనేక మంది సీనియర్ నేతల పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇవేమన్నా అవినీతి కేసులు, మర్డర్ కేసులా అంటే, రాజకీయ ప్రేరేపితమైన ఎస్సీ ఎస్టీ కేసులు. ఇందులో అరెస్ట్ చేస్తే, బెయిల్ తొందరగా రాదనీ, ఈ సెక్షన్ వాడి, తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ ను, ఇదే ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ చేసారు. ఇప్పుడు మరో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పై, అదే ఎస్సీ ఎస్టీ కేసు వాది, అరెస్ట్ చేసారు. అది కూడా 2014లో కేసును తిరగదోడి, ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేసి, తీసుకువెళ్ళారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీస్ కూడా ఇవ్వకుండా, ఒకేసారి వచ్చి తీసుకు వెళ్ళిపోయారు.

kodumuru 26092019 1

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న డి.విష్ణువర్ధన్‌రెడ్డిని నిన్న సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులో 2014లో ఆయన పై ఎస్పీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదును, ఇప్పుడు తిరగదోడి వచ్చి అరెస్ట్ చేసారు. ఆ ఫిర్యాదు మేరకు, విష్ణువర్ధన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు బుధవారం స్థానిక ప్రకాశ్‌నగర్‌లోని స్వగృహంలో ఉన్న ఆయన ఇంటికి ఒకేసారి వచ్చి, అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన తరువాత ఆయన్ను కర్నూలు టు టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన్ చేపట్టాయి. . కనీసం నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

kodumuru 26092019 1

విష్ణువర్ధన్‌రెడ్డి అరెస్టును తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. "తెలుగుదేశం నాయకులను వైసిపి టార్గెట్ చేయడంపై మండిపాటు. పవిత్రమైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఆత్మకూరులో 150దళిత కుటుంబాలను నెలల తరబడి గ్రామ బహిష్కారం చేసినా చర్యలు లేవు. వారి తరఫున పోరాడుతున్న తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎస్సీలకు న్యాయం చేయాలని పోరాడే టిడిపి నేతలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడంకన్నా దారుణం ఇంకోటి లేదు. టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు 12మందిపై అక్రమ కేసులు బనాయించారు. అచ్చెన్నాయుడిపై ఒకే అంశంపై తాడేపల్లిలో, టెక్కలిలో 2కేసులు పెట్టారు. మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ,ఎస్టీ అక్రమ కేసు బనాయించారు. 43ఏళ్ల క్రితం అంశంపై సోమిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారు. బెందాలం అశోక్, బాల వీరాంజనేయ స్వామి, కరణం బలరామ్, కూన రవికుమార్ తదితరులపై అక్రమంగా కేసులు పెట్టారు. కుటుంబరావు భూమి 37ఏళ్ల అంశంపై సుప్రీంకోర్ట్ స్టేటస్ కో ఆదేశాలున్నా ప్రహరీగోడలు కూల్చేశారు. 19 తప్పుడు కేసులు పెట్టి కోడెలను బలితీసుకున్నారు. వైసిపి ప్రభుత్వ వేధింపులకు అంతేలేకుండా పోయింది. వైసిపి నేతల అరాచకాలను ప్రజలే నిరసించాలి. మేధావులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు వీళ్ల ఆగడాలను ఖండించాలి." అని చంద్రబాబు అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి, తన తదుపరి భారీ బడ్జెట్ సినిమా, సైరా నరసింహారెడ్డి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయాన అనేక చోట్ల ప్రమోషన్లు చేస్తూ , సినిమాని ప్రోమోట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన ఆనంద వికటన్ అనే ఒక ప్రముఖ తమిళ్ మ్యాగజైన్ కి ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలతో పాటుగా, ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేసారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వైఫల్యంగా గురించి వ్యాఖ్యలు చేసారు. డైరెక్ట్ గా చెప్పకపోయినా, తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమలహాసన్ లకు తన సూచనగా, జనసేన, పవన్ కళ్యాణ్ వైఫల్యం గురించి చెప్పారు. అయితే ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో, అటు పవన్ కళ్యాణ్ కి కూడా ఇవే సూచనలు ఇన్ డైరెక్ట్ గా చేసారా అని ఫాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

chiranjeevi 26092019 2

చిరంజీవి మాట్లాడుతూ, "నేను రజనీకాంత్, కమలహాసన్ లకు ఒకే సలహా ఇస్తున్నా, మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి. ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని సలహా ఇస్తున్నా. నేను పార్టీ పెట్టాను, నా తమ్ముడు పార్టీ పెట్టాడు, మా ఇద్దరినీ ఈ కులం, ధనమే ఓడించాయి. ఓటమి, అవమానాలు, ఇలాంటివి అందరూ పేస్ చెయ్యాల్సిందే. కాని నా లాంటి సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఇది ఎదుర్కోవటం కష్టం. నా లాంటి వాడే రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టె పరిస్థితి. ఇలాంటివి నా వళ్ళ కాదు." అంటూ తాను, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓడిపోవటానికి కారణాలు చెప్తూ, రాజకీయాల్లోకి రావద్దు అంటూ, చిరంజీవి చెప్పుకొచ్చారు.

chiranjeevi 26092019 3

కమలహాసన్ ఇప్పటికే మక్కల్ నీధి మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ త్వరలోనే తన పార్టీని ప్రకటించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన మిత్రులిద్దరికీ చిరంజీవి ఈ మేరకు సలహా ఇచ్చారు. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి, చివరకు కాంగ్రెస్ లో కలిపేసారు. తన కేంద్ర మంత్రి పదివి పోగానే, రాజకీయాలకు దూరం అయిపోయి, మళ్ళీ సినిమాలు తీసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టి, ఎన్నో మాటలు చెప్పి, మొన్నటి ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే తెచ్చుకున్నారు. అటు చిరంజీవి పార్టీ వల్ల కాని, ఇటు పవన్ పార్టీ వల్ల కాని, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దెబ్బ పడి, అప్పట్లో వైఎస్ఆర్, మొన్న జగన్ గెలిచిన సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read