పల్నాడులో మరొకసారి వైసిపి శ్రేణులు రెచ్చిపోయాయి. ఈసారి ఏకంగా తెలుగుదేశం సీనియర్ కార్యకర్తను, వైసిపి కార్యకర్తలు హ-త్య చేసారు.  రెండు రోజుల క్రితం వైసిపి నేతలు పల్నాడులో  చేసిన బీబత్సం మర్చిపోకముందే, ఈ రౌడీ మూక మరోసారి రెచ్చిపోయింది. నరసరావుపేటలో టీడీపీ కార్యకర్త ఇబ్రహీంను దారుణంగా  నరికి చంపారు. పల్నాడులోని  మసీదు స్థలం గురించిన విషయంలో ఇబ్రహీంపై  దా-డికి తెగించారు వైసీపీ కార్యకర్తలు. ఈ సంఘటనలో ఇబ్రహీం అక్కడికక్కడే చనిపోయాడు.  మరో తెలుగుదేశం కార్యకర్త రహమత్ అలీ  తీవ్రగాయాలతో బయటపడ్డాడు. దీనితో పెద్ద ఎత్తున  టీడీపీ నేతలు, కార్యకర్తలు హాస్పిటల్  చేరుకున్నారు.

జగన్ జన్మదినం సందర్భంగా వైసిపి లోని అంతర్గత విబేధాలు మరోసారి బయటపడ్డాయా ?. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే జగన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు వైసిపి లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొంత కాలంగా అధిష్టానం పై అసంతృప్తిని అనేక రూపాల్లో తెలియజేస్తున్నారు ఆర్కే. తన వాట్స్ ప్ ప్రొఫైల్ పిక్ గా జగన్ ఫోటో తీసి షర్మిల ఫోటో పెట్టుకోవడం అది కాస్త వైరల్ కావడం విదితమే. అంతే కాకుండా తరచూ హైదరాబాద్ వెళ్లి షర్మిల ఆమె భర్త అనిల్ లో పలుమార్లు రహస్య భేటీలు కూడా నిర్వహించారు ఆర్కే. ఇప్పుడు తాజా గా ఆయన చేసిన మరో పని వైసిపి లో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పార్టీ కి దూరంగా, జగన్ పూర్తిగా దూరం పెట్టిన షర్మిల, విజయమ్మ ఫోటోలు వెయ్యడం, భారతి ఫోటో లేకుండా పోస్టర్ లేకుండా ఈ ఫోటో ఉండటం ఇప్పుడు చర్చకు దారి తీసింది.

మంత్రి అంబటి రాంబాబు నుంచి తమకు ప్రాణ హాని ఉందని అనిల్ తల్లిదండ్రులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎంఆర్ఎప్ చెక్ ఇవ్వడానికి అంబటి రాంబాబు లంచం అడిగాారని ఆరోపణలు చేసిన దంపతులకు వైసీపీ నేతల నుంచి బెదిరింపు కాాల్స్ వచ్చాయి. నేరుగా కొందరు వైసీపీ నేతలు వచ్చి మరీ వారిని హెచ్చరించి వెళ్లారని సమాచారం. హడలిపోయిన  పర్లయ్య, గంగమ్మ దంపతులు సత్తెనపల్లి పీఎస్‍లో మంత్రి అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. తమను లంచం అడగడం నిజమని, అదే చెప్పామని అప్పటి నుంచి తమకు వైసీపీ నేతలు ఫోన్ చేసి చంపేస్తామంటున్నారని వాపోయారు. అంబటి, వైసీపీ నేతల నుంచి రక్షణ కల్పించాలని అనిల్ తల్లిదండ్రుల పోలీసులను కోరారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కొద్ది సేపటి క్రితం కన్ను మూశారు. రెండు రోజుల క్రితం, గుండెపోటుతో చంద్రమౌళి, చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన పరిస్థితి విషమించి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. చంద్రమౌళికి, ఇప్పటికే పెళ్లి నిశ్చయం అయ్యింది. గతంలో వివాదాల్లో ఉన్న కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయం అయ్యింది. పెళ్లి పనులు మీద చెన్నై వెళ్ళిన చంద్రమౌళికి గుండె పోటు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. గత మూడు రోజులు నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న తితిదే ఈవో ధర్మారెడ్డి కుమారుడు, ఈ రోజు మరణించారు.

Advertisements

Latest Articles

Most Read