అమెరికాలో ఆంధ్ర తేజం విగ్రహమై అలరించనుంది. తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకం అన్న నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు సంఘం వారు కథానాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎడిషన్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు ఎడిసన్ మేయర్ సామ్ జోషి అంగీకరించారు. అమెరికాలోని ఓ నగరంలో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు కానున్న మొట్ట మొదటి విగ్రహం ఎన్టీఆర్ దే.  నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటుకు నిధులు, స్థలం ఎంపిక, అనుమతులు సాధించడం వంటివన్నీ పూర్తి అయ్యాయి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు, తెలుగు భాష వికాసానికి, మన సాహిత్యం, కళలు భావితరాలకు అందించడానికి ఎనలేని సేవలు అందించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కలని సాకారం చేసిన అసోసియేషన్ ప్రతినిధులను ప్రవాస తెలుగువారు అంతా అభినందిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ  అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల నెల్లూరు జిల్లాలో  పర్యటించనున్నారు.  డిసెంబర్  28వ తారీఖున  కందుకూరులో, 29న కావలిలో, 30వ తారీఖున  కోవూరు ప్రాంతాల్లో చంద్రబాబు  పర్యటించనున్నారు.  "ఇదేం ఖర్మ-రాష్ట్రానికి"అనే  కార్యక్రమంలో చంద్రబాబు  పాల్గొంటారని పార్టీనేతలు చెబుతున్నారు. ఈ సంభందిత ప్రాంతాల్లో జరిగే  రోడ్‍షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అంతే కాకుండా ఈ మూడు రోజులు  చంద్రబాబు ఉదయం వివిధ వర్గాలతో సమావేశం అవుతారని టిడిపి నేతలు స్పష్టం చేసారు. కర్నూల్ , గోదావరి జిల్లాల్లో, చంద్రబాబు టూర్ సూపర్ సక్సస్ కావడంతో ,టిడిపి మరింత జోష్ తో నెల్లూరు పర్యటనకు సిద్దం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు యువత ఆత్మహ-త్య-లు పెరిగిపోతున్నాయని కేంద్రం పార్లమెంట్ లో లెక్కలతో సహా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్  గిరిజనులపై దా-డు-లు  కూడా  రోజురోజుకు ఎక్కువతున్నట్లు పార్లమెంట్లో  గణాంకాలతో సహా కేంద్రం వెల్లడించింది. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గిరిజనులపై జరుగుతున్న దాడుల, కేసులు తగ్గుముఖం పడుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పెరిగినట్లు కేంద్రం స్పష్టం చేసింది. 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్  అకృత్యాలకు సంబంధించి 330 కేసులు ఫైల్ కాగా.. 2021 సంవత్సరంలో  361 కేసులు నమోదు అయ్యాయి. ఇంకోవైపు యువత ఆ-త్మహ-త్య-లు కూడా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నాయి. 2019 సంవత్సరంలో 6,465 మంది ఆత్మహత్యలు చేసుకుంటే , అది  2021 కి  8,067కు గణనీయంగా పెరిగిపోయిందని కేంద్రం తేల్చి చెప్పింది. మొత్తానికి మన రాష్ట్రం, అభివృద్ధి లో ముందజలో లేకపోయినా , హ-త్య-లు, ఆ-త్మ హ-త్య-ల్లో మాత్రం కేంద్ర స్థాయిలో రికార్డులు కైవసం చేసుకుంది.

గడపగడపకు కార్యక్రమాల్లో, వైసిపి నేతలను  ప్రజలు రోజుకొక చోట చెడుగుడు ఆడుకుంటున్నారు. నిన్న కోనసీమ జిల్లాలో మంత్రి విశ్వరూప్‍ గడప గడప కార్యక్రమం లో పాల్గొన్నారు. మాత్రి విశ్వరూప్ కు ఓ మహిళ చుక్కలు చూపించింది. కోనసీమలో జరిగిన  అల్లర్ల విషయంలో  తన కొడుకుని అక్రమంగా  అరెస్ట్ చేయించారని మంత్రిని నిలదీసింది. దాని వల్ల తన కొడుకు ఉద్యోగం పోయిందంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది.  ఎందుకు తన కొడుకుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మంత్రిని నిలదీసింది.  మీ వైసీపీ జెండాలు మోసినందుకే తన కొడుక్కి ఇలాంటి కష్టం  వచ్చిందంటూ, వెంటనే  తమ కుటుంబానికి  న్యాయం చేయాలంటూ వైసిపి మంత్రి విశ్వరూప్ని ఆ మహిళా గట్టిగా నిలదీసింది...

Advertisements

Latest Articles

Most Read