ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఏపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని హరిజా సొసైటీకి ప్రభుత్వం ఇదివరకు ఇచ్చిన భూమిని తమకు ఇష్టం వచ్చినట్లు స్వాధీనం చేసుకోవడం కుదరదని ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ హరిజన సొసైటీకి ఇచ్చిన స్థలం 48 సంవత్సరాల క్రితందని , ఇప్పుడు ప్రభుత్వం దాన్ని అక్రమంగా స్వాదీనం చేసుకుంటుందని హైకోర్టులో హరిజన సంఘం పిటిషన్ వేసింది. నిరుపేద దళితులకు వారు వ్యవసాయం చేసుకోవడం కోసం ఇచ్చిన పొలాన్ని నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని హరిజన సంఘం హైకోర్టులో పిటీషన్ వేసింది. ఆ పిటిషన్ తరపు లాయర్ శ్రావణ్ కుమార్ తన వాదనలు కోర్ట్ లో వినిపించారు. అయితే వాదనలు విన్న హైకోర్ట్ అక్రమ పద్దతుల్లో భూమిని స్వాదీన పరచుకోవడానికి కుదరదని, ప్రస్తుతానికి ఎటువంటి ఆక్రమణలు చెయ్యద్దని కోనసీమ కలెక్టర్కు , రామచంద్రపురం తహశీల్దారుకు ఆదేశాలు జరీ చేసింది. దీని పై తదుపరి విచారణ హైకోర్ట్ 4 వారాలకు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల కబ్జా ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో రాజంపేటలోని  పోలి గ్రామంలో వైసీపీ నేత పోలి సుభారెడ్డి  కొండను సైతం మింగేశారు. ఈ వైసీపీ నేతలు ఖాళీ స్థలాలను కబ్జా చేయడమే కాకుండా, కొండలను కూడా తవ్వేసి కబ్జా చేయడంతో, అక్కడ ఉన్న ప్రజలే కాకుండా, అధికారులు సైతం విస్మయానికి గురవుతున్నారు.  రాజంపేట పోలి గ్రామంలో వైసీపీ  నేతలు కొండను సైతం తవ్వేసి  ఆక్రమించేసారు.   అక్కడ స్థానిక వైసీపీ నేత పోలి సుభారెడ్డి  ఈ కొండను తవ్వి ఏకంగా 100 ఎకరాలు కబ్జా చేయడంతో ,అక్కడ కలక్టర్ కూడా షాక్ తిన్నారు.  కబ్జా చేసిన  కొండను పరిశీలించిన కలెక్టర్ 100 ఎకరాల   కొండను తవ్వేందుకు ఎవరు  అనుమతి ఇచ్చారంటూ అక్కడి  ఆర్డీవోను ప్రశ్నించారు. అంతేకాకుండా తవ్విన గ్రావెల్ ఏమైందని కూడా కలెక్టర్ గిరీషా అధికారులను నిలదీయడంతో ఏం చెప్పాలో తోచక అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ  కబ్జా భూమిలో పాతిపెట్టిన రాళ్లను తక్షణమే తీసివేయాలని  అధికారులకు కలెక్టర్ ఆదేసాలు జారీ చేసారు. దీనితో తప్పేది లేక  వైసీపీ నేత సుభారెడ్డి కబ్జాపై ఉన్నతాధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా చూసుకుంటూ పోతే రాష్ట్రం లో ఎన్ని వందల , వేల కబ్జాలు బయటపడతాయో.

పోకిరీ సినిమాలో ప్రకాశ్ రాజ్ ``గిల్లితే గిల్లించుకోవాలి. అరవకూడదు`` అంటాడు. జగన్ రెడ్డి కూడా తాను తీసుకునే నిర్ణయాలను అంగీకరించాలి. అన్యాయం అంటూ కోర్టుకెళితే రకరకాల వేధింపులు మొదలవుతాయి.  వైసీపీ సర్కారు తలపెట్టిన బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా వున్నాయంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో బదిలీలపై వాజ్యం వేసిన 25 మంది ప్రధానోపాధ్యాయులకు ఆర్.‍జె.డి. వెంకటకృష్ణారెడ్డి  షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఏపీ ప్రభుత్వ తీరుతో ఏపీ చీఫ్ సెక్రటరీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డికి హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అధికారయంత్రాంగం పట్టించుకోలేదు. హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి పాఠశాలల ఆవరణలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు చేపట్టినట్లు పిటిషనర్లు కోర్టుకి తెలియజేశారు.  విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ సెక్రటరీ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Latest Articles

Most Read