టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై దా-డు-ల-కు కుట్రలు జరుగుతున్నాయా? ఆయనకి ప్రాణహాని తలపెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారా? జరుగుతున్న వరస సంఘటనలతో కేంద్ర నిఘా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా బహిరంగ సభలో టిడిపి జాతీాయ అధ్యక్షుడు చంద్రబాబు లక్ష్యంగా రాయితో దా-డి చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసులు లైట్ తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు బస్సుపై చెప్పులతో దా-డి చేశారు. దీనిపై నాటి డిజిపి భావప్రకటన స్వేచ్ఛ అంటూ కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన గూండాలతో దా-డికి దిగారు. ఇదేమో చంద్రబాబుకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లారని జోగి రమేష్ పై కేసు కూడా పెట్టలేదు. నందిగామ ప్రాంతానికి చంద్రబాబు పర్యటనకి వెళ్లారు. అక్కడా పూలు మాటున రాళ్లు విసిరారు. విసిరిన వైసీపీ కార్యకర్తల్ని సాక్ష్యాలతో సహా టిడిపి పట్టి పోలీసులకు పంపితే, వారిపైనా కేసు లేదు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుపై దా-డులకు పదేపదే పాల్పడేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, కేసులు నమోదు చేయకుండా వైసీపీ కనుసన్నల్లో పనిచేసే పోలీసులు నీరుగారుస్తుండడంతో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

cbn 17122022 2

ఈ నేపథ్యంలో చంద్రబాబు భద్రతపై కేంద్ర నిఘా వర్గాల ఆందోళన వ్యక్తం చేశాయి. భద్రత పెంచాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. చంద్రబాబు పర్యటనలకలు పోటెత్తుతున్న జన ప్రభంజనం మాటున దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేశాయి. కేంద్రం నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన ఎన్ఎస్‌జీ టీమ్ అప్రమత్తమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఎన్ఎస్‌జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్, ఎన్ఎస్‌జీ సిబ్బంది మరోసారి వచ్చి పరిసరాాలు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. చంద్రబాబు ఛాంబర్, ప్రచార రథాలను ఎన్ఎస్‌జీ బృందం పరిశీలించింది. చంద్రబాబు ప్రచార సమయంలో రాత్రిపూట బస చేసే బస్సును ఎన్ఎస్‌జీ టీమ్ అణువణువూ చెక్ చేసింది. ప్రచార రథంపై 6 అడుగుల గ్లాస్ ఫ్రూఫ్ ఏర్పాటు చేయాలని పార్టీ సిబ్బందికి ఎన్ఎస్‌జీ సూచించింది. అనంతరం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఎన్ఎస్‌జీ పరిశీలించింది.

మాచర్లలో వైసీపీ శ్రేణులు నిన్న విధ్వంసం చేయటమే కాదు, ఏకంగా లూటీలు కూడా చేసారు. పూర్వపు రోజుల్లో, ఇలాంటి లూటీలు చుసి, ప్రస్తుతం ప్రశాంతమైన బ్రతుకు బ్రతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఈ వార్త నిజంగా ఒక పీడకల లాంటి వార్తే. నిన్న టిడిపి ఇదేమి కర్మ కార్యక్రమం చేస్తుంటే, వైసీపీ శ్రేణులు రెచ్చిపోవటం, అక్కడ నుంచి మాచర్ల మొత్తం మారణ హోమం చేయటం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు, టిడిపి నేతల ఇళ్ళల్లోకి వెళ్లి లూటీలు కూడా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ నేతల ఇళ్ళ పై దా-డి సమయంలో దోపిడీకి పాల్పడ్డారు వైసీపీ శ్రేణులు. టీడీపీ నేత ఇంటి లాకర్ పగలగొట్టి రూ.లక్ష నగదు, 15 సవర్ల బంగారం ఎత్తుకెళ్ళారు. అలాగే, పావనీ అపార్ట్ మెంట్‍లో ఇద్దరు టీడీపీ నేతల ఇళ్లు ధ్వంసం చేసి, బంగారం దొంగతనం చేసారు. తమ జీవితంలో ఇంతటి దుర్మార్గులను చూడలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పల్నాడు జిల్లాలో మాచర్ల పట్టణం నివురుగప్పిన నిప్పులా ఉంది. నిన్నటి వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండతో ప్రజల్లో భయాందోళనలో ఉన్నారు. టీడీపీ ఆఫీస్‍తో పాటు పార్టీ నేతల ఇళ్లు, వాహనాలు ధ్వంసం చేసాయి వైసీపీ శ్రేణులు. వైసీపీ నేతలు నిప్పు పెట్టడంతో టీడీపీ ఆఫీస్ పూర్తిగా కాలిపోయింది. టీడీపీ నేతలకు చెందిన పదికి పైగా వాహనాలు ధ్వంసం చేసి రెండు వాహనాలకు నిప్పు పెట్టాయి వైసీపీ శ్రేణులు. మాచర్లలో అదనపు పోలీసుల మోహరించారు. ప్రస్తుతం మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతుంది.

నిన్న మాచర్లలో వైసీపీ చేసిన విధ్వంసంతో, నేడు టిడిపి  చలో మాచర్లకు పిలుపుచ్చింది. ఈ రోజు మాచర్ల వెళ్లి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేయలని ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిన్నే డీఐజీకి ఫోన్‍లో చంద్రబాబు  నిరసన తెలియజేసారు. మాచర్ల ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ కూడా రాసారు. ఈ మంటలు ప్రభుత్వాన్ని దహించడం ఖాయమంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. ఇక మాచర్ల ఘటనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే యోచనలో టీడీపీ ఉంది. ఈ రోజు మాచర్ల పర్యటనకు టీడీపీ నేతలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు.  టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల వద్దకు పోలీసులు వచ్చారు. మాజీమంత్రి నక్కా ఆనంద్‍బాబు, టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్ల వద్ద పోలీసులు పహారా పెట్టారు. టీడీపీ నేతలు పల్నాడు వెళ్తారనే సమాచారంతో ముందస్తు ఆంక్షలు విధిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read