ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన అమరావతి రైతులు, రేపు కేంద్రం దగ్గర తమ గళం వినిపించడానికి సిద్దం అవుతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రేపు ధర్నా చేయడానికి అమరావతి రైతులు సన్నద్ధం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ, అమరావతి రైతులు డిల్లీలో నిరసన చేయాల నిర్ణయించుకున్నారు. ఈ రోజుతో రాజధాని విషయంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 3 సంవత్సరాలు పూర్తవడంతో, ధరణికోట నుంచి ఎర్రకోటకు అనే పేరుతో ఢిల్లీ నడి బొడ్డున నిరసనలు చేయాలని అమరావతి రైతులు నిర్ణయించుకున్నట్లు , మీడియాకు తెలిపారు. దీనికోసం ప్రత్యేక ట్రైన్ లో 1800 మంది రైతులు ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. ఈఅమరావతి రైతులఉద్యమానికి పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన మద్దతును తెలిపారు. అంతే కాకుండా కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీలోచేస్తున్న అమరావతి రైతులు ధర్నాలో పాల్గొననున్నారు.
news
ధట్ ఈజ్ చంద్రబాబు... ప్రారంభ వేడుకలకు ప్రధాని, ముగింపుకు చంద్రబాబు
ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిసినెస్(ఐఎస్బీ) ఆవిర్భావ ముగింపు వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ ఐఎస్బీ ప్రారంబించి 20 ఏళ్ళు పూర్తవడంతో, వారు చేస్తున్న ఈ వేడుకల్లో చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా పోల్గోననున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదారాబాద్ లో ఐఎస్బీ క్యాంపస్లో 20 సంవత్సరాల ఆవిర్భావ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఐఎస్బీలోని విద్యార్థులతో జరిగే ముఖాముఖి చర్చలో చంద్రబాబు పాల్గొననున్నారు.
విశాఖ వచ్చి, జగన్ పాలన పై సంచలన వ్యాఖ్యలు చేసిన అనిల్... అవాక్కయిన వైసీపీ...
పోయిన ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయండి, మీ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి అంటూ, తన మత ప్రసంగాలలో చెప్పిన బ్రదర్ అనిల్ కుమార్, ఇప్పుడు మారిన పరిస్థితితుల్లో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి పేరు చెప్పక పోయినా, ఏపి ప్రభుత్వం అంటూ, తాను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేసారు. సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గుంటున్న బ్రదర్ అనిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న విశాఖలో సభలో పాల్గున్నారు. రేపు గుడివాడలో కూడా ఒక సభ పెట్టుకున్నారు. ప్రార్ధన ప్రసంగంలో, రాజకీయం మిక్స్ చేసి, తన బావ ప్రభుత్వం పై, విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైసీపీ ప్రచారం చేసుకుంటున్న పధకాలను టార్గెట్ చేసారు. స్వార్ధం కోసం ఇచ్చే పధకాలకు ప్రజలు దూరం జరగాలని, దేవుడు మనకు వేరే పధకాలు ఇచ్చాడని, వీళ్ళు ఇచ్చే పధకాల కోసం కాకుండా, తమతమకు స్వశక్తితో ఎదగాలి అంటూ, వైసీపీని టార్గెట్ చేసారు.

ఇది ఒక్కటే కాదు, మరో పెద్ద మాట కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో బ్రతకటానికి ఇబ్బంది పడుతున్న ప్రజలు, పక్క రాష్ట్రాలకు వెళ్లి బ్రతికితే ఎంతో బాగుటుంది అనే అభిప్రాయానికి వచ్చారని అన్నారు. ఇక అప్పులు గురించి కూడా మాట్లాడుతూ, మీ ప్రభుత్వం అప్పులు చేస్తుందా లేదా ? పుట్టబోయే మీ పిల్లల పేరిట కూడా అప్పు పెట్టేంత అప్పులు చేసారని దారుణంగా విమర్శించారు. అలాగే ప్రభుత్వాలు కక్షలతో వ్యవహరించకూడదని, ప్రత్యర్ధులతో కూడా ప్రేమగా ఉండాలని అనిల్ కుమార్ అన్నారు. ఎక్కడ జగన్ మోహన్ రెడ్డి పేరు ఎత్తకపోయినా, వైసీపీ పేరు ఎత్తకపోయినా, ప్రభుత్వం ప్రభుత్వం అంటూ, తాను చెప్పాలని అనుకున్నది మొత్తం చెప్పేసారు. గతంలో జగన్ గెలుపుకు, బ్రదర్ అనిల్ ప్రసంగాలు కూడా ఉపయోగపడ్డాయని విశ్లేషకులు చెప్తూ ఉంటారు, తనకు ఉన్న పాస్టర్ నెట్వర్క్ ద్వారా అయన జగన్ గెలుపుకి సహకరించారు. ఇప్పుడు మాత్రం, నెమ్మదిగా జగన్ పాలన పై వ్యతిరేకంగా మాట్లాడుతూ, ప్రసంగాలు చేస్తున్నారు.
2023లో పెద్ద పండుగలన్నీ ఆదివారమే.. ఎన్ని సెలవలు మిస్ అయ్యమో చూడండి...
వచ్చే సంవత్సరం 2023కి సంభందించిన పండుగలు, నేషనల్ హాలిడేస్ ను ప్రకటిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది వచ్చే రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ పండుగల తేదీల్లో కొన్ని మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి నెలలో వచ్చే 14, 15, 16 తేదీన వచ్చే సంక్రాంతి సెలవులను సాధారణ సెలవులగా ప్రభుత్వం పేర్కొంది. ఆ తరువాత మార్చిలో వచ్చే ఉగాది సెలవును 22తేదీన ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సారి వచ్చే భోగీ, సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి రెండో శనివారం, ఆదివారం వచ్చాయని ఏపి ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఈ 2023 లో దాదాపు 23 రోజులను సాధారణ సెలవు రోజులుగా పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది.