చంద్రబాబుని సాధించాలి అంటే వాళ్లకు ఉన్న ఒకే ఒక పిల్ల కేసు ఓటుకి నోటు కేసు. అయితే ఇది తెలంగాణా ఏసిబి నుంచి, ఎప్పుడు ఈడీ చేతిలోకి వెళ్లిందో కాని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, ఇప్పుడు మరోసారి ఈడీని రంగంలోకి దించారు. కోడి కత్తి కేసు పై ఎన్ఐఏ చేతులు ఎత్తేయటంతో, ఇప్పుడు ఈ కేసు పట్టుకుని చంద్రబాబుని ఎలా అయినా దీంట్లో దోషిగా చూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో నిన్న రేవంత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

revanth 21022019

ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌ భుజాలపై తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చాలని మోదీ చూస్తున్నారు. ఈడీ అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కేసీఆర్‌, మోదీ ఒత్తిడితో ఈడీ అధికారులు పనిచేస్తున్నారు. కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోంది. చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ విచారణ ఉంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హైకోర్టు కొట్టేసిన కేసును తిరగదోడుతున్నారు. మంగళవారం నుంచి అడిగిన ప్రశ్నలే అడిగి వేధిస్తున్నారు.’’ అని అన్నారు. ఈడీ అధికారుల గురి అంతా ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపైనే ఉందని, ఆయన్ని లక్ష్యంగా చేసుకుని తనను వేధిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

revanth 21022019

కేసీఆర్‌, మోదీలు కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, హైకోర్టు తీర్పులకు భిన్నంగా ఈడీని ఉసిగొల్పారని ధ్వజమెత్తారు. అడిగిన ప్రశ్నలనే తిరిగి అడుగుతూ ఈడీ అధికారులు తనను వేధింపులకు గురి చేశారన్నారు. విచారణ ముగిశాక రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబును ఈ కేసులో ఇరికించే లక్ష్యంతో ఈడీ అధికారుల ప్రశ్నలున్నాయి. కేసులు పెట్టడం ద్వారా నన్ను వేధించాలని కేసీఆర్‌ చూస్తున్నారు. ఇప్పటికే నాపై 66 కేసులున్నాయి. అందులో ఇదొకటి. ఇవేవీ న్యాయస్థానాల్లో నిలబడవు. ఇది రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. కేసుల విచారణకు సహకరిస్తూనే కేసీఆర్‌పై పోరాటం కొనసాగిస్తా. పార్లమెంటు ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా’ అని పేర్కొన్నారు.

ఏపీ పై మరోసారి కుట్ర జరుగుతోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నవారిని, ఎమ్మెల్యేలు, ఎంపీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది దారుణమైన కుట్రని దీని వల్ల నష్టపోతామని చంద్రబాబు చెప్పారు. టీఆర్ఎస్‌తో అంటకాగే వైసీపీ వాళ్లు ఏపీలో గెలిస్తే నీళ్లు కూడా రావన్నారు. అరవై ఏళ్ల శ్రమను హైదరాబాద్‌లో వదిలేసి వచ్చామని, విభజన తర్వాత అండగా ఉంటామన్న కేంద్రం మాట తప్పిందని చంద్రబాబు ఆరోపించారు. ‘‘తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేలను, ఎంపీలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారు. లేకుంటే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామంటున్నారు. మీ బెదిరింపులకు మేం బెదరం! ఒకవేళ ఎవరైనా వాళ్ల బెదిరింపులకు లొంగి రాష్ట్రంలో సమస్యలు సృష్టించాలని చూస్తే సహించేదిలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

cbn 21022019

నవ్యాంధ్రపై మరో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు బుధవారం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, విపక్ష నేత జగన్‌ పేర్లను ప్రస్తావించకుండానే పరోక్ష విమర్శలు చేశారు. ‘‘తెలంగాణలో పది ఎకరాలున్న నాయకుడిని, కాలేజీలు ఉన్న మరో నాయకుడిని, ఫంక్షన్‌ హాలు ఉన్న నాయకుడిని బెదిరిస్తున్నారు. కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని, రాజకీయ నాయకుల్ని, పార్టీలు మారమని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అవసరమైతే హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను వదులుకుంటాం.. కానీ ఆత్మాభిమానం వదులుకోం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

cbn 21022019

పోలవరంపై సుప్రీంకోర్టులో కేసులు వేసిన వారితో రాష్ట్రంలో ఉన్న కొన్ని పార్టీలు లాలూచీ పడుతున్నాయని పరోక్షంగా వైసీపీపై మండిపడ్డారు. ఇటువంటి వారిని గెలిపిస్తే నవ్యాంధ్రకు నీళ్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. ‘‘మనలో మనకు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు. పక్కనున్న తమిళనాడు, కర్ణాటకతో ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ ప్రభుత్వంతోనే సమస్యలు వస్తున్నాయి’’ అని అన్నారు. కొండవీడులో రైతు ఆవేశంలో ఆత్మహత్య చేసుకుంటే, దానిని పోలీసులపై నెట్టేయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీని అభివృద్ధి పర్చుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీతో స్నేహం చేశామని... ఆ పార్టీ నమ్మించి మోసం చేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయనందునే కేంద్రంతో విభేదించామని తెలిపారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెదేపా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా..పార్టీ మారే అంశంపై త్రిమూర్తులు స్పష్టత ఇవ్వలేదు. కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తెదేపాను వీడి వైకాపాలో చేరే ముందు త్రిమూర్తులుతో భేటీ అయ్యారు. తాజాగా మంత్రి తలసానితో హైదరాబాద్‌లో త్రిమూర్తులు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

talasani 202022019

తలసాని మాట్లాడుతూ ‘‘ఏపీలో నా పర్యటన కొనసాగుతాయి. నేను పర్యటిస్తుంటే చంద్రబాబుకు భయమెందుకు. నాకు అక్కడ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారు. నా నియోజకవర్గంలో ప్రచారం చేసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేసిన చంద్రబాబుపై కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితం.’’ అని అన్నారు. మరో పక్క, ఒక హాట్ న్యూస్, హల్ చల్ చేస్తుంది. తెలంగాణ లో స్థిరపడ్డ ఆంధ్ర కి చెందిన పారిశ్రామిక వేత్తలను టార్గెట్ గా తెరాస పావులు కదుపుతుంది. అత్యధిక పారిశ్రామిక వేతలు తెలుగు దేశం సింపటైజర్స్ అవ్వగా వారి అందరిపై ఈడీ, ఇన్కమ్ టాక్స్ ఉపయోగించటానికి రంగం సిద్ధం చేసిన తెరాస అధినేత కెసిఆర్.

talasani 202022019

ఈ కోవ లో తెలుగు దేశం వైపు ఉన్న పారిశ్రామిక వేతలని భయభ్రఅంతులకి గురిచేసి వారిని వైస్సార్సీపీ కి సపోర్ట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గెలుపే ద్యేయంగా కుట్ర రాజకీయాలకి తేర తీస్తున్నారు. ఈ నెల 27,28 తారీకులలో భారీ ఎత్తున ఐటీశాఖ ఆంధ్ర పారిశ్రామిక వేతలపై దాడులు చేయబోతున్నట్టు సమాచారం. తెలుగు దేశం లో ఉన్న క్రియాశీలక నేతలని కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ ఆస్తుల మీద దాడి చేసి తద్వారా పార్టీ ని వీడేలా ప్రణాళికలు తెరాస అధినేత రూపొందిస్తున్నారు. హెరిటేజ్ సంస్థల కార్యకలాపాల్ని తెలంగాణ లో ఆపి వేయటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం.

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ సస్పెన్షన్‌పై మార్చి 11లోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశించింది. కాగా దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమాని శివకుమార్.. 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆ పార్టీని జగన్‌కు అప్పగించారు. అప్పటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్, గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగుతున్నారు. శివకుమార్ మాత్రం వైసీపీలో క్రియా శీలక కార్యకర్తగా కొనసాగారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మద్దతివ్వడాన్ని శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు.

notice 202022019

దీంతో వైఎస్ జగన్.. శివకుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్.. ఆ పార్టీ తనదని, తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నేనే స్థాపించాను. నేను స్థాపించిన పార్టీలోనే నాకు అన్యాయం జరుగుతోంది. నాకు న్యాయం చేయండి’ అని శివకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివ కుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి టీఆర్‌స్ ను ఓడించాలని శివకుమార్‌ పిలుపునివ్వడం వైసీపీ అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో పాటు ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. దాని పై ఆయన ఒక వినతిపత్రాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందచేశారు.

notice 202022019

నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నోటీస్‌ పంపలేదు. నా వివరణ కోరలేదు. అన్యాయంగా బయటకు పంపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిపై చర్య తీసుకొనే అధికారం న్యాయబద్ధంగా ఎవరికీ లేదు. అయినా తీసుకొన్నారు. దీనిపై విచారణ జరిపి వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా నా పదవిని పునరుద్ధరించాలి. తుది నిర్ణయం జరిగే వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా హోదాను పునరుద్ధరించాలి. నాకు న్యాయం చేయాలి’ అని శివకుమార్‌ తన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్, జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు పంపించింది. మరి దీని పై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read