జాతీయస్థాయిలో భాజపాయేతర కూటమి ఏర్పాటుకుగాను విపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఆదివారం ఒక రూపు తీసుకోనుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ద్రావిడ దిగ్గజ నేతల విగ్రహాల ఆవిష్కరణ, అనంతరం జరిగే బహిరంగ సభ ఇందుకు వేదిక కానుంది. నగరంలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ఆవరణలో డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు. వీటి ఆవిష్కరణ కార్యక్రమంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు తెదేపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పశ్చిమ్‌ బంగ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సహా సీపీఐ, సీపీఎం తదితర పార్టీల జాతీయ నేతలు పాల్గొననున్నారు.

stalin 16122018 2

ఈ నెల 10న దిల్లీలో భాజపాయేతర పార్టీలు సమావేశం అయ్యాయి. మరుసటి రోజు వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మూడు చోట్ల కాంగ్రెస్‌ అధికారాన్ని చేజిక్కించుకోవడం తదితర పరిణామాలతో దిల్లీ సమావేశానికి హాజరు కాని బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు సానుకూల సంకేతాలు కూడా ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం అన్నాదురై, కరుణానిధి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో జాతీయ నేతలు ఎవరెవరు పాల్గొంటారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

stalin 16122018 3

2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆదివారం నాటి కార్యక్రమాలు భాజపాయేతర కూటమికి ఒక రూపం తీసుకురానున్నాయి. ఈ కూటమికి తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చొరవ తీసుకోవడం, దానికి అనుగుణంగా దిల్లీ సమావేశానికి స్పందన రావడం, రాష్ట్రాల ఎన్నికల ఫలితాల జోష్‌... ఇలా పరిణామాలన్నీ కూటమికి బలం చేకూరుస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు నాలుగైదు నెలలే సమయం ఉండటంతో వైఎంసీఏ మైదానంలో జరగనున్న సభలో కూటమి ఏర్పాటుపై మరింత స్పష్టత రానుంది. ఈ సభను ఒక విధంగా విపక్షాలు తమ బలం, ఐక్యతను చాటుకునేందుకు వేదికగా చేసుకోనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఆయన్ను జగన్ తో సమానం చెయ్యాలి, అవినీతి మారక అంటించాలి అనే అతి పెద్ద కుట్ర ఢిల్లీ లెవెల్ లో జరగటం, దానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాత్రదారులు మనం రోజు చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు పై విషం చిమ్మటం కోసం పోటీ పడటం, చంద్రబాబు అవినీతి పరుడుగ ముద్ర వెయ్యటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చెయ్యటం, చివరకు విపి అవ్వటం, ఇదే తంతు... ఇన్ని ఆరోపణలు, ఇంత హంగామా చేసి చివరకు ఒక్క రూపాయి అవినీతి ఇప్పటి వరకు ప్రూవ్ చెయ్యలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లడటం, ప్రజల్లో ఏవో అపోహలు కలిగించటం, చెప్పిందే చెప్తే ప్రజలు నిజం అని నమ్ముతారేమో అని ఆశ...

ramaro 16122018 2

కొన్ని రోజుల క్రిందట, రాజకీయ కక్షతో కొంత మంది, లోకేష్ పై సిబిఐ విచారణ కోరుతూ, హైకోర్ట్ కు వెళ్తే, అక్కడ కోర్ట్ కొట్టేసిన విషయం చూసాం. తరువాత రేవెంత్ రెడ్డి మీద పెట్టి, చంద్రబాబుని ఇరికించే ప్రయత్నం చేసారు. దొంగ ఎకౌంటు నెంబర్లు ఇచ్చి, అక్కడ వేల కోట్లు ఉన్నాయి అంటూ, మీడియాలో లీక్ లకు కారణమైన హైదరాబాద్ లయార్ ఇమ్మనేని రామారావు, ఇప్పుడు అదే స్ట్రాటజీతో చంద్రబాబు మీద పడ్డాడు. చంద్రబాబు, లోకేశ్‌, బ్రాహ్మణి, భువనేశ్వరిలకు చెందిన 20 కంపెనీల వ్యవహారాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపించాలని, వారి కంపెనీలకు యూఐఎన్‌ నెంబర్లు కేటాయించాలంటూ హై కోర్ట్ కి వెళ్లారు. అయితే ఈ పిటీషన్ పై కోర్ట్ ఘాటుగా స్పందించింది.

ramaro 16122018 3

హెరిటేజ్‌ గ్రూపు కంపెనీలపై పిటిషన్‌ దాఖలు చేయడంలో మీకేం సంబంధమని పిటిషనర్‌ అయిన న్యాయవాది ఇమ్మనేని రామారావును శనివారం ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. ఈ పిటిషన్‌ పై విచారించడం వల్ల వ్యక్తిగతంగా ఏం ఉపశమనం కోరుకుంటున్నారంది. ఒకవేళ ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం అయితే దాని కారణాలేమిటో చెప్పి తగిన ఫోరంలో సవాలు చేయవచ్చని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తగిన నిర్ణయం చెప్పాలంటూ విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లో వ్యక్తిగత ప్రయోజనం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. లేదని న్యాయవాది సమాధానం చెప్పడంతో మరి రిట్‌ పిటిషన్‌ ఎందుకు దాఖలు చేశారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకవేళ ప్రజాప్రయోజనం ఉందనుకుంటే తగిన వేదికను ఆశ్రయించవచ్చని, దీనిపై ఓ నిర్ణయానికి రావాలంటూ విచారణను వాయిదా వేశారు.

ఈ రోజు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్‌ చేశారు. పెథాయ్‌ తుపాను దృష్ట్యా రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు చర్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని చర్యలు తీసుకున్నామని, సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. మరోవైపు తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. శ్రీహరి కోటకు 720 కి.మీల దూరంలో పెథాయ్‌ తుపాను కేంద్రీకృతమైంది. కాకినాడ - విశాఖ మధ్య ఈ తుపాను ఈ నెల 17న తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

governer 15122018

గంటకు 16కి.మీల వేగంతో తీరంవైపు తుపాను కదులుతోంది. ఈ తుపాను గమనాన్ని ఏపీ సర్కార్‌ ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్‌ జాగ్రత్తగా గమనిస్తోంది. అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. తుపాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆర్టీజీఎస్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్‌ నుంచి తుపాను జాగ్రత్తల సందేశాలను జారీ చేస్తున్నారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజలకు నింతరం హెచ్చరికలు పంపుతున్నారు. తుపాను సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్‌లో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.

governer 15122018

తుఫాను పరిస్థితిని ఎదుర్కొనటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక కాల్ సెంటర్ నుంచి తుఫాన్ కు సంబంధించిన సందేశాలు జారీ చేస్తున్నారు. ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజలకు నిరంతరం హెచ్చరికలు జారీ అవుతున్నాయి. మత్స్యకారుల పడవలన్నీతీరంలోనే నిలిచిపోయాయి. తుఫాను నేపధ్యంలో ధాన్యపు కొనుగోలు కేంద్రాల్ని రాత్రిపూట కూడా పనిచేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్దంగా వుండాలని ఆదేశించారు. ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునేటా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

దవళేశ్వరం కట్టేటప్పుడు మనం లేము... శ్రీశైలం ఆనకట్ట కట్టేటప్పుడు మనం లేము... బెజవాడ ప్రకాశం బేరేజ్ కట్టేటప్పుడు మమనం లేము.. కానీ పట్టిసీమ, పోలవరం, అమరావతి, ఇవి కట్టేటప్పుడు మమనం ఉన్నాము.. అద్భుతాలు ఆవిష్కిరాం జరుగుతూ ఉంటే, మనం కాళ్ళ ముందే చూస్తున్నాం... సర్ధుడైన నాయకుడు వుంటే ఎంత క్లిష్టమైన పనైనా సాధ్యం అని నిరూపిస్తున్నారు.. ఈ రాష్ట్రానికి చెంద్రబాబు ఎందుకు అవసరమో పోలవరం పరుగులే ఒక ఉదాహరణ ... నవ్యాంధ్ర జల, జీవ నాడి పోలవరం ప్రాజెక్టు కొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. 23 గంటల్లో 16,368 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసింది. దీంతో చైనా త్రీగోర్జెస్‌ ప్రాజెక్టు రికార్డును నవయుగ సంస్థ అధిగమించింది.

polavaram 16122018 2

స్పిల్‌వేలో 4,268 క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌లో 12100 మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసింది. శనివారం ఉదయం 8.45 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు కాంక్రీట్‌ పనులు పూర్తి చేసింది. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వాతవరణం అనుకూలించదని, ఈ రికార్డు కొన్ని రోజులు వాయిదా వేద్దాం అనుకున్నా, ఒక రోజు ముందే రంగంలోకి దిగి, ఈ రికార్డు సృష్టించారు. పోలవరం కాంక్రీటు పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో... రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, పాత ధరలకే ఈ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే పోలవరం కాంక్రీటు పనులు పరుగులు తీయడం మొదలైంది.

polavaram 16122018 3

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. అయితే ఈ రికార్డు ని జూన్ నెలలోనే పోలవరం అధిగమించింది. కేవలం 16 గంటల్లో 8వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేసి జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టింది. మళ్ళీ పోయిన నెల 11వేల 289 క్యూబిక్ మీటర్లతో మరో రికార్డు నెలకొల్పింది. అయితే తన రికార్డును తానే, మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు అధిగమించింది. చైనాలోని త్రీగోర్జెస్‌ రికార్డును కూడా అధిగమించారు. ఇదే స్థాయిలో కాంక్రీట్‌ పనులు కొనసాగిస్తే పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తవుతుందని, ప్రపంచ రికార్డు కూడా బద్దలవుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్‌ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల అనుకున్న ప్రకారం, వచ్చే జూన్ నెలకు సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read