ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని రైతాంగానికి గోదావరి జలాలను అందించే లక్ష్యంతో చేపట్టిన గోదావరి -పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడు వేల క్యూసెక్కుల గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి కాలువలోకి మళ్లించే విధంగా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. గుంటూరు జిల్లా నకిరేకల్ వద్ద గోదావరి - పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రూ.6020 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పథకాన్ని ఐదు దశల్లో పూర్తి చేస్తామన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 79 మండలాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.

penna 21112018 2

రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రెండు జిల్లాలలోని రైతులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లుగా చెక్‌డ్యాంలు నిర్మించడంతో ఈ సంవత్సరం సాగర్ ఆయకట్టు రైతులకు సకాలంలో నీరు అందడం లేదన్నారు. ఈ సమస్యలను అధిగమించి రైతాంగాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో గోదావరి -పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సంవత్సరం సాగర్ ఆయకట్టు కింద ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో 11లక్షల 90వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారన్నారు.

penna 21112018 3

రైతులు సాగుచేసిన పంటలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే ప్రకాశం -గుంటూరు జిల్లాల్లో 750 తాగునీటి చెరువులు కూడా సాగర్ నీటితో నింపామన్నారు. ఇప్పటివరకు సాగర్ నుంచి 70 టిఎంసిల నీటిని రైతాంగానికి అందించామని, మరో 21 టిఎంసిల నీరు రైతులకు అవసరం ఉంటుందని అధికారులు అంచనాలు వేశారని, ఈ నీటిని కూడా త్వరలో అందిస్తామన్నారు. ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా ఆదుకుంటామని రైతాంగానికి భరోసా ఇచ్చారు. వెలుగొండ మొదటి సొరంగం పనులు శనివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయని, పనులను పూర్తిస్ధాయిలో వేగవంతం చేసి 2019 ఫిబ్రవరి నాటికి వెలుగొండకు నీరు అందిస్తామన్నారు. రెండో సొరంగం పనులు కూడా మరో వారంరోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు రూ.5వేల కోట్లతో చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. దీనివలన 577 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. 5 లక్షల 12వేల 159 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి నేనే గెలిపించా అని, ఇప్పుడు మోసాపోయానని, కొన్ని పార్టీలకు అలాగే జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ తప్పు బట్టారు. టీడీపీ పొత్తు పెట్టుకున్నవాళ్లు ఎలా మోసపోయారో పవన్‌ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పవన్‌ ఎప్పుడు అడిగితే అప్పుడు సీఎం అపాయింట్‌‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీని వణికిస్తానని చెప్పి పవన్‌ ఫాంహౌస్‌లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. హోదా గురించి పవన్‌ ఎందుకు ఇప్పడు మాట్లాడటం లేదని లోకేశ్ ప్రశ్నించారు.

lokesh 21112018 2

రాఫెల్‌ కుంభకోణం, పెట్రోల్‌ ధరల గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు. జగన్‌కు కేసులు ఉన్నాయి కాబట్టి జగన్‌ భయపడుతున్నారన్నారు, మరి పవన్ ఎందుకు భయపడుతున్నారో అని అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా పవన్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కోడికత్తి కేసు గురించి మాట్లాడటానికి లేఖలు రాయడానికి టైం ఉందిగాని హోదా గురించి మాట్లాడేందుకు పవన్‌కు సమయం ఉండటం లేదని, కోడి కత్తి చేయించింది సీఎం అనే చెబితే ఆయన ఎలా ఫోన్‌ చేసి మాట్లాడతారని లోకేశ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ ఆస్తులపై స్పందించారు.

lokesh 21112018 3

హాయ్‌ల్యాండ్‌ విషయంలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా తమపై విచారణ ఎలా వేసుకుంటామని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన వాళ్లను నిరూపించమంటే పారిపోతున్నారని దుయ్యబట్టారు. అసలు కోర్టులో ఉన్న ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయడం సాధ్యమేనా అన్న ఆయన.. ప్రతిపక్ష నేతలు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి లోకేష్ తెరాస అధినేత కెసిఆర్ ను చూసి వ్యవసాయం చేయడం నేర్చుకోవాలని ఉందన్నారు. ఇది పొగడ్త కాదు వ్యంగ్యం అనమాట. వ్యవసాయంలో ఎకరానికి కోటి రూపాయల ఆదాయం ఎలా సంపాదించాలో తనకు తెలియడం లేదన్న లోకేష్.. కెసిఆర్ ఎలా చేసి ఎకరానికి కోటి సంపాదిస్తారో చూసి నేర్చుకోవాలని ఉందన్నారు. గతంలో తాను కూడా కొద్దిగా అగ్రివ్యాపారం చేసానని.. కానీ కోటి ఎలా సంపాదించాలో తెలియలేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయ భవనాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టిడిపి, వైసీపీ కార్యాలయాల నిర్మాణం త్వరలోనే పూర్తికానుంది. రానున్న ఎన్నికల నాటికి ఆ రెండూ కొత్త భవనాల నుంచే తమ రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. జనసేన కార్యాలయ నిర్మాణానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. టిడిపి కార్యాలయాన్ని నిర్మిస్తూ ఉండగా, వైసీపీ, జనసేన పార్టీల అధ్యక్షుల నివాస, పార్టీ కార్యాలయ భవనాలు ఒకే ప్రాంగణంలో ఉండనున్నాయి. అవి తాత్కాలిక కార్యాలయాలేనని, భవిష్యత్తులో పెద్దవి నిర్మించుకుంటామని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు పార్టీలు విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారికి అత్యంత సమీపంలోనే వీటిని నిర్మిస్తున్నాయి.

party 2112018 2

తెలుగుదేశం కార్యాలయం.. మంగళగిరికి దగ్గరలో జాతీయ రహదారికి పక్కన నాలుగు ఎకరాల విస్తీర్ణంలో తెలుగుదేశం కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో కార్యాలయం ప్రారంభించే అవకాశం ఉంది. మూడు భవనాల్ని ప్రి ఫ్యాబ్రికేటెడ్‌ విధానంలో నిర్మిస్తున్నారు. మూడు భవనాల్లో నిర్మిత ప్రాంతం సుమారు 2.50 లక్షల చ.అడుగులు. ఒకటి, మూడు భవనాలు జీ+3 విధానంలో, రెండో భవనాన్ని జీ+2 విధానంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మొదటి భవనంలో ఒక అంతస్తులో కొంత భాగం పనులు మిగిలి ఉన్నాయి. మూడో భవనంలో చివరి అంతస్తుకి శ్లాబ్‌ వేయాల్సి ఉంది. రెండో భవన నిర్మాణం గ్రౌండ్‌ లెవల్‌కి వచ్చింది. పార్టీ కార్యాలయం నుంచే వీడియో, టెలికాన్ఫరెన్స్‌లు వంటివి నిర్వహించేందుకు అవసరమైన వసతులన్నీ ఉంటాయి.

party 2112018 3

వైసీపీ... తాడేపల్లిలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయానికి, పార్టీ అధ్యక్షుడు జగన్‌ నివాసానికి వేర్వేరు భవనాలు నిర్మిస్తున్నారు. జీ+1 విధానంలో నిర్మిస్తున్నారు. ఇది పార్టీ శాశ్వత కార్యాలయం కాదని, భవిష్యత్తులో దీన్ని పార్టీ అధ్యక్షుడు క్యాంప్‌ ఆఫీసుగా వినియోగించుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తయింది. అంతర్గత పనులు జరుగుతున్నాయి. కార్యాలయ నిర్మాణం చివరి దశలో ఉంది. అన్ని హంగులతో వీటిని సిద్ధం చేసేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుంది. జనసేన కార్యాలయం, ఇల్లు... కాజ గ్రామానికి సమీపంలో జనసేన పార్టీ కార్యాలయం, పవన్‌ కల్యాణ్‌ ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇంటి పనులు జరుగుతున్నాయి. కార్యాలయ పనులు ప్రారంభించాల్సి ఉంది. రెండు ఎకరాల్ని, రెండు భాగాలుగా విభజించి మధ్యలో రోడ్డు వేశారు. రోడ్డుకి పశ్చిమం వైపు ఇంటిని... తూర్పు భాగంలో కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. జీ+1 విధానంలో నిర్మించనున్నారు. ఇక్కడ నిర్మించబోయేది పార్టీ శాశ్వత రాష్ట్ర కార్యాలయం కాదని, పవన్‌ కల్యాణ్‌ క్యాంప్‌ ఆఫీస్‌గానే అది ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.

విశాఖ‌ప‌ట్నం ఏజెన్సీ ప్రాంతంలో జోరుగు సాగుతున్న గంజాయి తోట‌ల సాగుపై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అధికారులు క‌ళ్లుగ‌ప్పి ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం మ‌ధ్య‌లో ఎలాంటి అనుమానం రాకుండా వేలాది ఎక‌రాల్లో సాగుతున్న అక్ర‌మ గంజాయి సాగును కూక‌టివేళ్ల‌తో స‌హా పెకలించి వేయ‌డానికి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. గంజాయి తోట‌లు ఎక్క‌డ సాగు చేస్తున్నా వాటిని ఇట్టే ప‌సిగ‌ట్టి తొల‌గించేలా ప్ర‌భుత్వం డ్రోన్ నిఘా క‌ళ్ల‌తో మ‌న్యం అట‌వీ ప్రాంతాల‌ను జల్లెడ ప‌డుతోంది. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సంస్థ డ్రోన్లను ఉప‌యోగించి మ‌న్యం ప్రాంతంలో గంజాయి తోట‌ల‌ను గుర్తించే ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. నాలుగు మండలాల్లోని అట‌వీ ప్రాంతంలో గంజాయి తోట‌ల‌ను గుర్తించే ప‌నులు చేప‌ట్టారు.

araku 2112018 2

అందులో భాగంగా పాడేరు, హుకుంపేట‌, పెద‌బ‌య‌లు, మంచిగిప‌ట్టు మండ‌లాల్లో గంజాయి తోట‌లు జోరుగా సాగుతున్న‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. ఇక్క‌డ అక్ర‌మార్కులు ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతాల్లో ఎవ‌రికీ అనుమానం రాకుండా వందలాది ఎక‌రాల్లో గంజాయి తోట‌ల‌ను సాగు చేస్తున్న‌ట్లు గుర్తించారు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఎవ‌రూ రావ‌డానికి వీలు లేనటువంటి ప్రాంతాల‌ను ఎంచుకుని వీరు ఈ తోట‌ల‌ను సాగు చేస్తున్నారు. ఇలాంటి తోట‌ల‌ను కూడా డ్రోన్ల సాయంతో గుర్తించి వాటిని ధ్వంసం చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో సాగు చేస్తున్న గంజాయితోట‌ల వ‌ద్ద‌కు ఇత‌రులు ప్ర‌వేశించ‌గానికి కూడా వీలు లేనంత‌గా స్మ‌గ్ల‌ర్లు గంజాయిను సాగు చేస్తున్నారు. ఇలాంటి తోట‌ల‌ను కూడా ఆర్టీజీఎస్ డ్రోన్ల సాయంతో గుర్తించి అక్క‌డికి వెళ్లి ఆ తోట‌ల‌ను ధ్వంసం చేయ‌డానికి మార్గాలు క‌ల్పిస్తోంది.

araku 2112018 3

ఇకపై నిరంత‌ర నిఘా… ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై ఇక మీదట డ్రోన్ల‌తో నిరంత నిఘా కొన‌సాగించ‌నున్నారు. ఇందుకోసం ఆర్టీజీఎస్‌ సంస్థ ఎక్సైజు, పోలీసుల‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తోంది. అనుమానిత ప్రాంతాలు, మండ‌లాల్లో డ్రోన్ల‌ను నిరంత‌రంగా ఉప‌యోగించి గంజాయి సాగును ఉక్కుపాదంతో అణ‌చివేస్తున్నారు. ఇప్ప‌టికే గంజాయి తోట‌ల ధ్వంసం ప‌నులు ఏజెన్సీ ప్రాంతంలో చేప‌ట్టారు. స్థానికుల స‌హ‌కారం తీసుకోవ‌డంతో పాటు, నిఘా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్ట‌ప‌రచి, డ్రోన్ల స‌ర్వేతో గంజాయి తోట‌ల సాగును గుర్తించి వాటిని పూర్తిగా నిర్మూలించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read