దేశంలో లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా అవి అధికార భాజపాకు పంటి కింద రాయిలా తయారవుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి అధికార పగ్గాలు చేపట్టిన భాజపా... ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్కొక్కటిగా స్థానాలు కోల్పోతూ వస్తోంది. గత నాలుగున్నరేళ్లలో 30 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప సమరంలో అధికార పక్షం కేవలం ఆరు సీట్లను నిలబెట్టుకొంది. 9 సొంత సీట్లను ప్రత్యర్థులకు కోల్పోయింది. ఈ మొత్తం క్రతువులో వైరి పక్షానికి చెందిన ఒక్కసీటును కూడా భాజపా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. దీంతో గత ఎన్నికల నాటి భాజపా బలం 282 కాస్తా ఇప్పుడు 273కి తగ్గిపోయింది. ఉప ఎన్నికల్లో భాజపా గెలిచిన చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల మెజార్టీ బాగా తగ్గిపోయింది.

bjp 21112018

2014 ఎన్నికలు పూర్తయిన వెంటనే వడోదర స్థానానికి ప్రధానమంత్రి రాజీనామా చేయడం, మహారాష్ట్రలోని బీడ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన గోపీనాథ్‌ ముండే ఆకస్మికంగా మరణించడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ రెండు స్థానాల్లో భాజపా 70 శాతానికి పైగా ఓట్లు కొల్లగొట్టింది. కాలం గడిచే కొద్దీ సీట్లతో పాటు ఓట్లనూ కోల్పోతూ వస్తోంది. తాజాగా శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి 2014లో యడ్యూరప్ప 3.63 లక్షల మెజార్టీతో గెలుపొందగా, ఇప్పుడు ఆయన తనయుడు బీఎస్‌ రాఘవేంద్ర మెజార్టీ 47వేలకు తగ్గిపోయింది. 2014లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన ప్రతి స్థానాన్నీ ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు నిలబెట్టుకున్నాయి. భాజపా కోల్పోయిన 9 సీట్లలో అయిదు కాంగ్రెస్‌ పార్టీకి, రెండు ఎస్పీకి, ఒకటి ఎన్సీపీకి, ఒకటి ఆర్‌ఎల్‌డీకి చిక్కాయి.

bjp 21112018

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర్‌ స్థానాలను భాజపా కోల్పోవడం సంచలనం రేపింది. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు కలిసి పనిచేయడం దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు ప్రాణం పోసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా ఉప ఎన్నిక ఫలితం దీనిని మరింత ముందుకు తీసుకెళ్లింది. జాట్‌ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన సీనియర్‌ నేత హుకుంసింగ్‌ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానం నుంచి ఆయన కూతురు పోటీపడినా మిత్రపక్షాల ఐక్యత ముందు సానుభూతి పవనాలు పని చేయలేదు.

రాష్ట్ర బీజేపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి.. పార్లమెంటు ఇన్‌చార్జులు, కన్వీనర్లు, కో-కన్వీనర్ల నియామకాల్లో పార్టీని ఏళ్ల తరబడి నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ నేతల వారసులు, కుమారులకు పదవులు ఇస్తున్నారని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ‘సేవ్‌ ఏపీ బీజేపీ’ అనే నినాదం సోషల్‌ మీడియాలో, ఫోన్లలో చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హాదా ఇస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ తర్వాత మాట మార్చిన బీజేపీపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ వాణి బలంగా వినిపించేందుకు వెంకయ్యనాయుడు లాంటి నాయకుడు లేరు. రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి వారు సంస్థాగత వ్యవహారాలపై కొంతకాలంగా మౌనం వహిస్తున్నారు.

kanna 21112018

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ తాజాగా పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు నియమితులైన ఈ 75 మంది నుంచే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారుచేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నియామకాల్లో కొన్నిటిని పార్టీలోని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏ ప్రాతిపదికన వీరికి పదవులిచ్చారని కొందరి పేర్లను ప్రస్తావిస్తున్నారు. ఈ మేరకు కన్నాకు రాసిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వేరే పార్టీ నుంచి వచ్చిన రాష్ట్ర నాయకుడు తన సొంత లాభం చూసుకుంటున్నారని వారంతా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం.

kanna 21112018

ఎంతో మంది సీనియర్లు, సమర్థులు పార్టీలో ఉండగా అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా హ్యాండిల్‌ చేయలేని తోట సర్వారాయుడిని ఎలా కాకినాడ పార్లమెంటు కన్వీనర్‌గా నియమించారని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఉంగరాల వెంకటరమణ (చినబాబు) కన్నాకు రాసిన లేఖలో గట్టిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకుడి కుమారుడైనందుకే అర్హుడయ్యారా అని నిలదీశారు. పార్టీకి ఏ మాత్రం సేవచేయని సర్వారాయుడిని తనకన్నా పై స్థానంలో కన్వీనర్‌గా నియమించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. తనకు కేవలం పాతికేళ్ల అనుభవమే ఉందని.. ఈ బాధ్యత నిర్వర్తించేంత అనుభవం, సామర్థ్యం తనకు లేవని.. అందుచేత కో-కన్వీనర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వ్యంగ్యంగా పేర్కొన్నారు. కాగా.. తాజా నియామకాలపై ఉత్తరాంధ్రలో జిల్లా స్థాయి నాయకుడు రాజీనామాకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కోస్తాకు చెందిన మరో నేత ఫిర్యాదులతో ఢిల్లీకి బయల్దేరారు.

ఇండియాలో, ఏపినే నెంబర్ వన్ అంటే కొంత మంది రాష్ట్రంలో ఉన్న వారికి తెగ బాధ వచ్చేస్తుంది. చంద్రబాబుకి మంచి పేరు వచ్చేస్తుంది కదా, అందుకే ఆ రకమైన ఏడుపు అనమాట. ఈ వార్తా చూడగానే, ఎల్లో మీడియా అలాగే రాస్తుందిలే అంటారు. కాని, ఇండియాలోనే ఏపి నెంబర్ వన్ అని చెప్పింది, ఒకటి కాదు, రెండు కాడి అయిదు సంస్థలు. ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల సంస్థ (యూఎన్‌డీపీ), ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీయూ), పీపుల్‌ స్ర్టాంగ్‌, సీఐఐ, వీ-బాక్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తెలిపాయి.

one 21112018 2

ఇండియా స్కిల్స్‌ నివేదిక-2019 నివేదికలో, ఇవన్నీ రాసారు. ఈ వివరాలను గురువారం (22న) లఖ్‌నవ్‌లో జరిగే ‘గ్లోబల్‌ స్కిల్స్‌ సమ్మిట్‌’లో అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ సర్వే ప్రకారం ఉద్యోగాల కల్పనలో ఏపీ టాప్‌లో ఉంటే పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. నైపుణ్యాభివృద్ధిలోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఇక నగరాల విషయానికొస్తే చురుకైన విద్యార్థులు కలిగిన వారిలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే.. చెన్నయ్‌, గుంటూరు, లఖ్‌నవ్‌, ముంబై, ఢిల్లీ, నాసిక్‌, పుణె విద్యార్థులు వరసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఏపీలోని గుంటూరు, విజయవాడ, విశాఖ విద్యార్థులు ఇంగ్లి్‌షలోనూ, విశ్లేషణాత్మక ఆలోచనల్లోనూ, లాజికల్‌ సమస్యలను పరిష్కరించడంలోనూ, నడవడికలోనూ ముందంజలో ఉన్నట్లు వెల్లడైంది.

one 21112018 3

ఏపీ యువతకు ఉద్యోగ కల్పన కోసం పలు అంతర్జాతీయ, జాతీయ ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏటా 3 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అందిస్తోన్న ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ చక్కటి ఫలితాన్ని అందిస్తోందని సర్వేలో వెల్లడైంది. ఎంబీఏ కంటే ఇంజనీరింగ్‌ విద్యార్థులే రాష్ట్రంలో ఎక్కువగా, త్వరగా ఉద్యోగాలు పొందగలుగుతున్నారని తేలింది. వాస్తవానికి యూఎన్‌డీపీ, ఏఐసీటీయూ, సీఐఐ, ఏఐయూ, పీపుల్స్‌ స్ట్రాంగ్‌, వీ-బాక్స్‌ సంస్థలు గతేడాది నిర్వహించిన సర్వేలో ఏపీ టాప్‌-10లో నిలిచింది. ఈ ఏడాది మాత్రం ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం దక్కించుకుంది.

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా హామీని నెరవేరుస్తానన్న హామీ ఏమైందని కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఈ హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో పోలవరం తుది అంచనాలను త్వరితగతిన ఆమోదించాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లు రాష్ట్ర ఖాతాలో వేసినట్లే వేసి వెనక్కి తీసుకున్నారని.. ఈ నిధులు ఏమయ్యాయని నిలదీసింది. మళ్లీ తిరిగి ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. వాటిని తక్షణం విడుదల చేయాలని కోరింది. రాష్ట్ర పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి మంగళవారం లేఖ పంపించింది. 

reply 26112018 2

రాష్ట్ర విభజన నాటికి రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుగా లెక్క తేలిందని, దీనిలో రూ.3,979 కోట్లే ఇచ్చిన కేంద్రం.. మిగతా నిధులనూ విడుదల చేయాలని అందులో పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను రాష్ట్రంలో స్థాపించేందుకు అనుమతులు ఇచ్చారని.. కానీ భవన నిర్మాణాలకు నిధులు విడుదలలో జాప్యం జరుగుతోందని గుర్తుచేశారు. విదేశీ సాయంతో నడిచే ప్రాజెక్టులు(ఈఏపీలు)కు భారీగా సాయం అందిస్తామన్న కేంద్రం.. కేవలం రూ.15కోట్లు ఇచ్చి సాయం చేసినట్లు చూపిస్తోందని తెలిపారు. లేఖలోని మరిన్ని అంశాలు... స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తే ప్రత్యేక హోదా/ప్యాకేజీ ప్రయోజనాలు కల్పిస్తామని.. ఇందుకు రాష్ట్రం సహకరించడం లేదని గతంలో ఆరోపించిన కేంద్రం.. తన నోట్‌లో ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు?

 

reply 26112018 3

వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్న అంశంపైనా ఎందుకు సమాధానమివ్వలేదు? విభజన తర్వాత నవ్యాంధ్రకు ఏర్పడిన రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటులో ఇంకా రూ.12 వేల కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ మొత్తాన్ని ఇస్తామని, ఇచ్చేది లేదని గానీ స్టేటస్‌ నోట్‌లో స్పష్టత ఇవ్వలేదు. రెవెన్యూ లోటు కోసం రూ.3979 కోట్లే ఇచ్చామని చెప్పింది. మిగిలిన మొత్తంపై మీ నిర్ణయమేంటి? రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై లేనిపోని కొర్రీలు వేస్తూ తుది అంచనాలను ఆమోదించకుండా కాలహరణం చేస్తున్నారు. రాష్ట్ర తాగునీరు, సాగునీరు సమస్యను తీర్చే పోలవరం నిర్మాణానికి కేంద్రం అనుకూలమో కాదో కేంద్రం తేల్చాలి. రాష్ట్రానికి జాతీయ విద్యాసంస్థలు మంజూరు చేశారు సరే.. వాటి నిర్మాణానికి నిధులు ఎందుకివ్వడం లేదు? అందుకు కారణాలేంటో స్పష్టంగా చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read