అధికారంలో లేకపోతేనే ఈ వైసీపీ నాయకులని ఆపలేకపోతున్నాం, పొరపాటున అధికారంలోకి వస్తే, వీళ్ళు చేసే అరాచకాలకు హద్దే ఉండదేమో. అక్కడ ఎమ్మల్యే అనిల్ కుమార్ ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే. అతన్ని చూసుకుని, ఈ అనుచరగణం రెచ్చిపోతుంది. మూడు రోజుల క్రితం ఓ టీచర్ పై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్‌కు అయిదేళ్లు జైలు శిక్ష పడిన విషయం మర్చిపోక ముందే, ఇప్పుడు వైసీపీకి చెందిన మరో కార్పొరేటర్‌ టూరిజం హోటల్లో బీభత్సవం సృష్టించాడు. ఏకంగా హోటల్‌ రిసెప్షనిస్టు పై తప్ప తాగి దాడి చేసి గాయపరిచారు.

nellore 18112018 2

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, వైసీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్‌ రాజశేఖర్‌ శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కొండాయపాళెం గేటు సమీపంలో ఉన్న ఏపీ టూరిజం హరిత హోటల్‌లో ఇద్దరు ఉంటామని చెప్పి 318 నంబరు గల గదిని తీసుకున్నారు. గదిని అద్దెకు తీసుకునే సమయంలో హోటల్‌ సిబ్బందికి ఇవ్వాల్సిన గుర్తింపు కార్డులు మళ్లీ ఇస్తామని చెప్పడంతో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హోటల్‌ రిసెప్షనిస్టు అయిన షేక్‌ షాకీర్‌ కార్పొరేటర్‌ ఉన్న గదికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో గదిలో ఎనిమిది మంది ఉండటంతో అంతమంది ఉండేందుకు టూరిజం అధికారులు ఒప్పుకోరని కార్పొరేటర్‌కు తెలియజేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేటర్‌ రాజశేఖర్‌ రిసెప్షనిస్టు షాకీర్‌ను హోటల్‌ పైఅంతస్తు నుంచి కొట్టుకుంటూ కిందకు తీసుకువచ్చాడు.

nellore 18112018 3

కార్పొరేటర్‌ అయిన తనకే ఎదురు చెబుతావా అంటూ దుర్భాషలాడుతూ రిసెప్షన్‌ కేంద్రం వద్ద ఉన్న నోటీసు బోర్డును తీసుకుని అతనిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో షాకీర్‌ దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఎస్సై పూర్ణచంద్ర రావు హోటల్‌కు చేరుకుని దాడికి సంబంధించిన వివరాలను సేకరించారు. శనివారం కూడా పోలీసులు హోటల్‌ వద్దకు చేరుకుని వివరాలు ఆరా తీశారు. హోటల్‌లో ఉన్న సీసీ కెమేరా ఫుటేజీలను పరిశీలించగా, అందులో పూర్తి సమాచారం కనపడింది. కార్పొరేటర్‌ రాజశేఖర్‌, తేజ, మరో ఆరుగురు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై పూర్ణచంద్ర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

జగన్ కోడి కత్తి గుచ్చుడు కేసు, రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ రోజు జగన్‌, ఆయన పీఏకు విశాఖ కోర్టు నోటీసులు జారీ చేసింది. దాడి ఘటన సమయంలో జగన్‌ ధరించిన చొక్కాను ఈ నెల 23లోగా దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తులో చొక్కా కీలకమని కోర్టులో దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయం పై ఇప్పటికే హైకోర్ట్ లో కూడా వాదనలు జరుగుతున్నాయి. విమానాశ్రయంలో దాడికి సంబంధించిన దర్యాప్తునకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రక్తం మరకలున్న చొక్కా ఇంత వరకూ దర్యాప్తు అధికారులకు అందజేయలేదని చెప్పారు.

court 17112018 2

అంతే కాదు, సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద వాంగ్మూలం ఇవ్వడానికీ నిరాకరించారని తెలిపారు. దాడిలో గాయపడ్డ జగన్‌ను విమానంలో ప్రయాణించేందుకు ఎలా అనుమతించారు? అలా అనుమతించే ముందు మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారా? దానిని ఎవరు జారీ చేశారు? రక్తపు మరకలు అంటిన జగన్‌ చొక్కాను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అసలు... సీఐఎ్‌సఎఫ్‌ నిబంధనలు ఏం చెబుతున్నాయి? వీవీఐపీ లాంజ్‌లో దాడి జరిగితే సీఐఎ్‌సఎఫ్‌ ఏం చేస్తోంది?... అంటూ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ కె.లక్ష్మణ్‌పై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని... సీఐఎ్‌సఎఫ్‌ నివేదిక, ఎయిర్‌పోర్టు అథార్టీ నిబంధనలు వివరించాలని ఆదేశించింది. అలాగే... సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద ఏపీ పోలీసులకు జగన్‌ వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

court 17112018 3

ఒక పక్క హై కోర్ట్ లో ఇవన్నీ జరుగుతూ ఉండగానే, ఇప్పుడు విశాఖ కోర్ట్ కూడా, దాడి ఘటన సమయంలో జగన్‌ ధరించిన చొక్కాను ఈ నెల 23లోగా దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు జగన్ ఆడుతున్న నాటకాలు బట్టబయలు కానున్నాయి. అసలు ఇప్పటి వరకు ఆ చొక్కా, దర్యాప్తు అధికారులకు ఇవ్వకపోవటం వెనుక ఎదో తేడా ఉందని, అందరూ అనుకుంటున్న వేళ, కోర్ట్ కీలక ఆదేశాలు ఇవ్వటంతో, జగన్ ఏమి చేస్తారో చూడాలి. కోర్ట్ ఆదేశాలు ప్రకారం, ఆ చొక్కా దర్యాప్తు అధికారులకు ఇస్తారో, లేక ఆ చొక్కా పారేసాను, ఉతికేసాను, లేకపోతే, ఏపి పోలీసులకు ఇవ్వను, తెలంగాణా పోలీసులకు, మోడీ పోలీసులకే ఇస్తాను అని జగన్ అంటారో చూడాలి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మాట్లాడారు. కేంద్రం చేతిలో పావుగా మారిన సిబిఐ అనుమతి ఉపసంహరణ రద్దు నిర్ణయం పై ఆరా తీశారు. శుక్రవారం చంద్రబాబు నిర్ణయాన్ని మె సమర్థించింది. తరువాత ఆంధ్రప్రదేశ్ సీఎంవో అధికారులతో బెంగాల్‌ సీఎంవో అధికారులు మాట్లాడారు. తరువాత సీబీఐకి సాధారణ అనుమతులు రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కార్ కూడా జీవో జారీ చేసింది. మమతా బెనర్జీ కూడా ఏపీ తరహా నిర్ణయమే తీసుకున్నారు. సీబీఐకి 1989లో లెఫ్ట్‌ సర్కారు మంజూరు చేసిన ‘జనరల్‌ కన్సెంట్‌’ను శుక్రవారం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

mamtha 17112018 2

దిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం కింద పనిచేసే సీబీఐ అధికార పరిధి దిల్లీ వరకే ఉంది. ఇతర రాష్ట్రాల్లో ప్రవేశించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సమ్మతి అవసరం. పశ్చిమబెంగాల్‌లో ఇలాంటి అనుమతి ఆదేశాలను 1989లో నాటి వామపక్ష ప్రభుత్వం జారీ చేసింది. తాజాగా శుక్రవారం సాయంత్రం మమతాబెనర్జీ వాటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇక పై న్యాయస్థానం ఆదేశించిన కేసుల్లో తప్ప, సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం కోల్‌కతాలో నిర్వహించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సీబీఐ, ఆర్‌బీఐ వంటి కీలక సంస్థలను నాశనం చేస్తోందనీ, వాటి పనితీరును మార్చేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు.

mamtha 17112018 3

సీబీఐకి అనుమతుల ఉపసంహరణపై స్పందిస్తూ అలాంటి నిబంధనల్ని ఉపయోగించుకోవడం తమకు అవసరం లేకపోయినా, భాజపా సీబీఐ తదితర సంస్థల్ని తమ రాజకీయ ప్రయోజనాల్ని, ప్రతీకారం తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటుండటం వల్ల ఆ పని చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. విగ్రహాల్ని ఏర్పాటు చేసే భాజపా లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓ విగ్రహంలా అవుతుందని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన భాజపాను అధికారం నుంచి దించివేయాలన్నారు. భాజపా తమ రాజకీయ ప్రయోజనాల కోసం పేర్లను మార్చేసే ప్రక్రియలో ఉందన్నారు. భాజపాకు ఇప్పుడు మందిర్‌, ఎన్‌ఆర్‌సీ, విగ్రహం, మతరాజకీయాలు అనే నాలుగే అజెండాలు ఉన్నాయన్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా రథయాత్రను రావణయాత్రగా మమత అభివర్ణించారు.

చాలా రోజులు తరువాత, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, బహిరంగ సభలో మాట్లడారు. కోడి కత్తి గుచ్చుడు దాడి తరువాత, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు జగన్. వైజాగ్ లో కోడి కత్తితో 0.5 cm దాడి చేపించుకున్న తరువాత, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు జగన్. హైదరాబాద్ వెళ్ళగానే 0.5 cm గాయం కాస్తా 9 cm గాయం అయ్యి, కుట్లు కూడా పడ్డాయి. అంతే మనోడు మంచానికి అడ్డం పడుతూ స్టిల్స్ ఇచ్చి, లోటస్ పాండ్ కు వెళ్ళిపోయాడు. దాదపు 20 రోజుల తరువాత మళ్ళీ వచ్చాడు. వచ్చినా ఎక్కడా బహిరంగ సభల్లో మాట్లాడాలేదు. ఈ రోజు విజయనగరంలో బహిరంగ సభలో మాట్లాడుతూ, చంద్రబాబు నామస్మరణ చేసారు.

jagan 17112018 2

ఈ రోజు జగన్ విజయనగరంలో మాట్లాడారు.. "అగ్రిగోల్డ్‌కు సంబంధించిన విలువైన ఆస్తులన్నింటిని కూడా పక్కనబెడుతున్నారు. వీటన్నింటినీ చంద్రబాబు, ఆయన బినామీలు, ఆయన కుమారుడు లోకేశ్ గారు పూర్తిగా కాజేస్తున్నారు. ఓవైపు అగ్రిగోల్డ్ ఆస్తులను తగ్గిస్తూ.. బాధితుల జీవితాలతో ఆడుకుంటూ చివరకు అగ్రిగోల్డ్‌లో అత్యంత విలువైన భూమి హాయ్ ల్యాండ్. ఇది అగ్రిగోల్డ్‌కు చెందినది కాదంటూ డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు నాయుడుగారు, ఆయన పోలీసులు, సీఐడీలతో తన బినామీలకు అమ్ముకునే కార్యక్రమం చేపడుతున్నారు" అంటూ జగన్ విమర్శలు గుప్పించారు.

jagan 17112018 3

దీనికి లోకేష్ ట్విట్టర్ లో స్పందిస్తూ, ఇలా స్పందించారు... "స్కీమ్ లు, స్కాంలు జగన్ మోడీ రెడ్డి కి వెన్నతో పెట్టిన విద్య. జైల్ లో ఉండే మీరు, మీ అన్న వేసిన గాలి ప్లాన్ లకి ఎంత మంది బలైపోయారో మర్చిపోయారా? అగ్రిగోల్డ్ స్కాం జరిగింది, అక్రమంగా డిపాజిట్లు సేకరించింది మీ మహామేత హయాంలో కాదా? హాయ్ ల్యాండ్ ప్రారంభించింది మీ మహామేత సహచరులు కాదా? చిత్త శుద్దిగా బాధితులకు న్యాయం చెయ్యాలి అని ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే కొంత మంది బాధితులకు సహాయం చేసాం. బాధితులకు న్యాయం జరగకుండా కోడి కత్తి డ్రామా లా అగ్రిగోల్డ్ యాజమాన్యం డ్రామా వెనుక ఉన్న వారి గుట్టు కూడా త్వరలోనే బయట పెడతాం. దోచుకున్న లక్ష కోట్ల లో ముందు అగ్రిగోల్డ్ వాటా గా వచ్చిన డబ్బును బాధితులకు పంచండి జగన్ మోడీ రెడ్డి గారు."

Advertisements

Latest Articles

Most Read