దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి, భాజపాకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు తలపెట్టిన ప్రయత్నాలకు గట్టి మద్దతు లభించింది. 40ఏళ్ల రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మరీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయనకు మద్దతిచ్చారు. ఆయనతోపాటు శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరి, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌సింగ్‌, సమాజ్‌వాదీ నేతలు ములాయంసింగ్‌ యాదవ్‌, అఖిలేశ్‌లు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ ప్రత్యామ్నాయ కూటమిని నిర్మించగలిగే శక్తియుక్తులు గల నేత మీరేనని కితాబిచ్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చంద్రబాబుతో విడిగా సమావేశమై మద్దతు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం నేతృత్వంలో ప్రస్తుతం కనిపిస్తున్న పెడపోకడల నుంచి దేశాన్ని రక్షించడానికి భాజపా వ్యతిరేక కూటమిని కూడగట్టాలన్న లక్ష్యంతో దిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు ఉదయం నుంచి రాత్రి వరకు తీరికలేకుండా గడిపారు.

cbn 2112018 2

ఈ క్రమంలో భాజపాయేతర పక్షాల కూటమి ఏర్పాటుకు చేస్తోన్న ప్రయత్నాలకు మరో పార్టీ మద్దతు పలికింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కూటమిని స్వాగతించారు. అవినీతి, నిరంకుశ, విభజన శక్తులు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. భాజపాయేతర పక్షాలు ఒకేవేదిక పైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కృషిచేస్తున్న రాహుల్‌ గాంధీ, చంద్రబాబులను అభినందిస్తున్నానన్నారు. వారు చేసే ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు.

cbn 2112018 3

భాజపా హయాంలో రాజ్యాంగ, స్వతంత్ర సంస్థలు తీవ్ర సంక్షోభలో కూరుకుపోయాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సేవ్‌ నేషన్‌ పేరిట నిన్న దిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ఎన్సీపీ, ఎన్సీ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతలందరితోనూ భేటీ అయ్యారు. భాజపాకు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటే లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యతకపై ఆయన కీలక మంతనాలు జరిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ పార్టీల నేతలతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే. మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టి, మోడీ-షా చేస్తున్న ఘోరాలకు అడ్డుకట్టే వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై కూడా, మోడీని కార్నెర్ చేసే ప్రయత్నం చేసారు. అయితే ఈ విషయం పై, శుక్రవారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కాంగ్రెస్-టీడీపీ కలయికపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన బాస్ మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు అడుగులు వేస్తుంటే, పాపం పవన్ తట్టుకోలేక పోతున్నారు.

pk 02112018 2

పవన్ మాట్లాడుతూ, " సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారు. కాంగ్రెస్ టీడీపీ కలయిక కూడా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ లాగే ఉంది. చివరకు చంద్రబాబు ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వెళ్లారు. చంద్రబాబు నిన్న ట్రైలర్ వదిలారు, కాని సినిమా ఫ్లాప్ అవుతుందని అన్నారు. మా అన్న చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ నేను రాష్ట్రం కోసం మీకు మద్దతు ఇస్తే మీరు వెళ్లి అదే కాంగ్రెస్‌తో కలవడం ఎంతవరకు సమంజసం?" అని ఈ సందర్భంగా టీడీపీకి పవన్ సూటి ప్రశ్న సంధించారు. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికే తాను యాత్రలు చేస్తున్నానని... అధికారం కోసం కాదని చెప్పారు. కాని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అన్నారు.

pk 02112018 3

మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు నెరవేర్చకుండా, ఆంధ్రులని తొక్కి పడేస్తున్న మోడీ పై, చంద్రబాబు తిరగబడి, వీరోచితంగా పోరాడుతుంటే, పాపం పవన్ కళ్యాణ్ మాత్రం తట్టుకోలేక పోతున్నారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నంత వరకు, చంద్రబాబుకి మోడీని అడిగే దమ్ము లేదన్నాడు పవన్. తరువాత మోడీని బాబు చాకిరేవు పెడుతుంటే, అలా ఎందుకు అంటున్నాడు. అవిశ్వాసం టైంలో కూడా అలాగే చేసాడు. చివరకు ఏమైపోయాడో తెలియకుండా, ఒక నెల రోజులు బయటకు రాలేదు. ఇప్పుడు దేశం మొత్తం మోడీకి వ్యతిరేకం అయితే, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు, ఏకం అవుతుంటే, పాపం పవన్, జగన్, కెసిఆర్ మాత్రం తెగ బాధ పడుతున్నారు. ఎంతైనా మోడీ, వీళ్ళ బాస్ కదా, ఆ మాత్రం విశ్వాసం ఉండటం సహజం...

తెలుగు ప్రజలను అవమానిస్తే, అణచివేయాలని చూస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో.. 80వ దశకంలో నందమూరి తారక రామారావు నిరూపించారు. జాతీయ రాజకీయాలను శాసించగల దమ్ము తెలుగోడికి ఉందని చాటిచెప్పారు. ఆ తర్వాత 90వ దశకంలో మరోసారి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సత్తాఏంటో చూపించింది. తాజాగా బుధవారం ఢిల్లికి చేరుకున్న చంద్రబాబు ఫ్రంట్‌ కార్యాచరణను ప్రారంభించారు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్న బీజేపీయేతర పార్టీల నేతలతో వరుస భేటీలు జరిపారు. దేశ రాజకీయాల్లో ఉద్ధండులైన శరద్‌పవార్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, అఖిలేష్‌, ఏచూరి, మాయావతి, మమతాబెనర్జీలతో ప్రత్యేకంగా చర్చించారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలుసుకున్నారు. దేశాన్ని రక్షించుకుందాం.. కలిసి రండి అంటూ విపక్ష పార్టీలకు పిలుపునిచ్చి కాషాయపార్టీలో చంద్రబాబు ప్రకంపనలు సృష్టించారు.

ccbn 02112018 2

మొదటి నుంచి సైద్ధాంతిక విభేదాలతో ఉప్పు, నిప్పుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలిపి... దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది పలికాయి. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విభేదాలను పక్కన పెట్టాయి. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు... రాహుల్ గాంధీ, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, ఫరుక్ అబ్దుల్లా, తదితర నేతలతో కలసి సరికొత్త రాజకీయ సమీకరణకు తెర లేపారు. ఈ నేపథ్యంలో, అన్ని పార్టీలు కలసి బీజేపీని ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మహాకూటమిలో 15 పార్టీలు ఉండనున్నాయి. అవేమిటంటే... కాంగ్రెస్, టీడీపీ, ఎన్సీపీ, ఆర్జేడీ, బీఎస్పీ, ఎస్పీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, జేడీఎస్, తృణమూల్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, డీఎంకే, లోక్ దళ్. ఈ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తూ, జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటయింది. సేవ్ ది నేషన్.. సేవ్ డెమోక్రసీ.. పేరుతో కూటమి రూపుదిద్దుకుంటోంది.

ccbn 02112018 3

దేశాన్ని గట్టెక్కించాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాలన్నా బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీకి, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యామ్నాయ కూటములేవీ సఫలం కాలేకపోయాయని, వికటించిన ఆ ప్రయోగాల నుంచి నేర్చుకున్న అనుభవంతోనే కూటమికి ఏర్పాటు కోసం చొరవ చూపుతున్నానని చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో తాను ఇప్పటికే శరద్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, మాయావతి వంటి నేతలను గత శనివారం ఢిల్లికి వచ్చినప్పుడు కలిశానని, గురువారం నాటి రెండవ పర్యటనలో శరద్‌ పవార్‌, రాహుల్‌ గాంధీతోపాటు అజిత్‌ జోగి, అరుణ్‌ శౌరిని కలిశానని ములాయం సింగ్‌ యాదవ్‌, కుమారస్వామి, మమతా బెనర్జీ సహా పలువురితో సంప్రదింపులు చేస్తున్నానని తెలిపారు. బీజేపీని ఓడించడం కోసం అందరినీ ఏకతాటికి మీదికి తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ కూటమికి నేతలెవరూ లేరని, అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలిపారు. తొలుత అందరం కలిసి కూర్చుని మాట్లాడు కుంటామని, ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని అన్నారు.

అది అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం! అంతంత మాత్రంగా కురిసే వర్షాలు! అప్పుడప్పుడు మాత్రమే పండే పంటలు! ఎకరం పొలం ధర రెండు లక్షలు పలికితే గొప్ప! ఇప్పుడు... అవే భూములు బంగారంలా మారాయి! ఐదు... పది... ఇరవై ముప్పై దాటి ఎకరం రూ.50 లక్షలకు బేరాలు సాగుతున్నాయి. ఇదంతా... దక్షిణ కొరియాకు చెందిన ‘కియ’ కార్ల కంపెనీ రాక మహిమ! కియతోపాటు... దానికి అనుబంధ పరిశ్రమలు భారీ ఎత్తున తరలి రావడం ఖాయం కావడంతో అనంతపురం జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. అమ్మవారిపల్లె ప్రాంతంలో కియ పరిశ్రమకు 600 ఎకరాలను కేటాయించారు. ‘కియ’ కంపెనీ హ్యుండయ్‌కి మాతృ సంస్థ. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కార్ల కంపెనీ ఇది. కర్ణాటక, తమిళనాడుతో పోటీపడి మరీ ఈ పరిశ్రమను చంద్రబాబు సర్కారు రాష్ట్రానికి రప్పించింది.

kia 02112018 2

కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.13,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ వల్ల 20 వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగనుంది. అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ రావడం ఓ వరమని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పెనుకొండ మండలం ఎర్రమంచిలో ఏర్పాటవుతున్న కియా పరిశ్రమను గురువారం ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 జనవరి 29న ట్రయల్‌ కారు తయారు చేసి ఇస్తామని కియా ప్రతినిధులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.

kia 02112018 3

ప్రస్తుతం పరిశ్రమలో కారు బాడీ ప్రెస్సింగ్‌ యూనిట్‌ పనులు 98.3 శాతం, బాడీ తయారీ యూనిట్‌ పనులు 99.2శాతం, పెయింటింగ్‌ యూనిట్‌ 95 శాతం, ఇంజిన్‌ యూనిట్‌ 95శాతం, అసెంబుల్డ్‌ యూనిట్‌ 95.8 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. జనవరిలో ముఖ్యమంత్రి మొదటి కారును ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో మెగా పరిశ్రమలే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఓ ఎంఎస్‌ఎంఐ పార్కు (స్మూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇప్పటికే 35 నియోజకవర్గాలను గుర్తించినట్లు వివరించారు.

Advertisements

Latest Articles

Most Read