2014 ముందు వరకు, తాగేందుకు నీళ్ళు కూడా లేని జిల్లా అది. తర తరాలుగా కరువుతో అల్లాడే జిల్లాగా పేరుంది. అలాంటి జిల్లాలో చంద్రబాబు చొరవతో, పాతాళ గంగ ఉప్పొంగింది. పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు రావటంతో, కృష్ణా జలాలు అన్నీ ఇటు వైపు మళ్ళాయి. దీంతో ఒకప్పుడు తాగటానికి నీళ్ళు లేని చోట, ఇప్పుడు బోటు షికార్ జరుగుతుంది. అనంతపురం జిల్లాలో ఎప్పుడు చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. తాగు, సాగునీటి కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలే తగువులాడుకుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిల్లో ఉన్న జిల్లాలో బోటు షికార్లు ఏమిటా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ అక్కడి దృశ్యాలు చూస్తే మాత్రం "ఔరా!'' అని మీరు ఆశ్చర్యపోక తప్పదు.

boat 03112018 2

నీటి కొరతగా పేరున్న జిల్లా అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బోటు షికారును ప్రారంభించారు. అనంతపురం నగర నడిబొడ్డు నుంచి మిడ్ పెన్నార్ దక్షిణ కాలవ పులివెందులకు వెళుతుంది. కాలువకు ఆనుకొని అనంతపురం శిల్పారామం ఉంది. తడకలేరు వాగుమీద రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌.. షార్ట్‌కట్‌లో చెప్పాలంటే ఆర్‌డీటీ సహకారంతో కోటిన్నర రూపాయలు ఖర్చుపెట్టి పెద్ద చెక్‌డ్యామ్ నిర్మించారు. హెచ్ఎల్‌సీ నీరు శింగనమల చెరువుకు ఈ చెక్‌డ్యామ్ నుంచి వెళుతుంది. ఈ నేపథ్యంలోనే అనంత ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ఓ ఆలోచన చేశారు. అనంత ప్రజలకు ఆటవిడుపునిచ్చే పిక్నిక్‌ సెంటర్లు లేవు. కనుక కొన్ని బోట్లు రప్పించి చెక్‌డ్యామ్‌లో వేయించారు.

boat 03112018 3

వీటిలో షికారు చేసే అవకాశం ప్రజలకు కల్పించారు. ఇటీవలే ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్‌ స్వరూప, డిప్యూటీ మేయర్‌ గంపన్న ఈ ఆహ్లాదకర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి బోటు షికారు చేస్తూ సెల్‌ఫోన్‌లో పరిసరాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. "ఎమ్మెల్యే మంచి ఆలోచన చేశారు. బోటు షికారు వల్ల ప్రజలకేమో ఆటవిడుపు. వసూలు చేసే రుసుము వల్ల సర్కారుకి ఆదాయం'' అంటూ కొందరు ప్రభాకర్‌చౌదరిని అభినందిస్తున్నారు. అనంతపురం వాసుల మదిని గెలిచే ఆలోచనలు చేయడం ద్వారా ప్రభాకర్‌ చౌదరి తన ఓట్‌బ్యాంక్‌ని పెంచుకుంటున్నారని పరిశీలకులు కూడా అంటున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రేమికులు, యువత ఆయన పనులను ప్రశంసిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ డైలమాలో ఉన్నారు. చంద్రబాబుని ఓడించాలానే టార్గెట్ ఇచ్చిన అమిత్ షా ఆదేశాలు ఫాలో అవుతూనే, నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తున్నాడు. జగన్ తో కలిసి, పవన్ ఎన్నికలకు వెళ్ళాలి అనేది అమిత్ షా వ్యూహం. అయితే ఇది పవన్ కళ్యాణ్ కు ఒకే అయినా, తనకు వచ్చే లాభం ఏంటి అనేది ఆలోచిస్తున్నాడు. ఒకవేళ చంద్రబాబు ఓడిపోతే, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు నాకేంటి అని పవన్ ఆలోచనలో పడ్డారు. పొత్తుల విషయం, మొత్తం అమిత్ షా నిర్ణయం పైనే ఆధారపడి ఉన్నా, జనసేన పార్టీలో కూడా ఇప్పుడు పొత్తులపై మాటామంతీ కొనసాగుతోంది. జగన్ తో పొత్తు పెట్టుకుని వెళ్తే, భవిషత్తు ఏంటి ? మనం సొంతగా వెళ్తే, ఎలా ఉంటుంది అనే చర్చ మొదలైంది. ఏది ఏమైనా, ఎవరితో ఏమి కలిసినా, చంద్రబాబుని దించాలనే టార్గెట్ పెట్టుకున్నా, పదవి పై మాత్రం పవన్ కు భారీగా ఆశలు ఉన్నాయని అంటున్నారు.

jagan 03112018 2

"2014 నాటి ఎన్నికల్లో మద్దతు ఇచ్చి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. ఇక మనం ఎప్పుడు ఎదగాలి?'' అని జనసేన నేతలు కొందరు పవన్‌కల్యాణ్ వద్ద వాదన లేవదీశారని తెలిసింది. పైగా వైసీపీకి మద్దతిస్తే.. జగన్ గనుక సీఎం పీఠం ఎక్కితే వచ్చే టర్మ్‌ కూడా మనకి కష్టమవుతుందనీ, మనకి ప్రతిపక్ష పాత్రే మిగులుతుందనీ కొందరు జనసేన నేతలు వాదిస్తున్నారు కూడా. స్వయంగా పోటీచేసి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటే కర్నాటకలో జేడీఎస్ మాదిరిగా ఏపీలో చక్రం తిప్పవచ్చునన్నది మెజారిటీ జన సైనికులు, పార్టీ నేతల వాదనగా ఉంది.

jagan 03112018 3

ఈ వాదనపైనే ఇప్పుడు జనసేనలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. పవన్ కూడా ఒంటరిగా పోటీ చేసి, కుమారస్వామి లాగా జాక్ పాట్ కొడదాం అనుకుంటున్నా, ఆయన చేతిలో ఏమి లేదు. అంతా అమిత్ షా ఇష్ట ప్రకారం జరగాలి. ఇటీవల విజయవాడలో జనసేన రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఆ పార్టీ మరో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులు రాబోయే ఎన్నికలలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారా అని పవన్‌ని ప్రశ్నించగా, "తర్వాత మాట్లాడదాం'' అంటూ దాటవేశారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ లో, విజయవాడ ఇంటర్నేషనల్ టెర్మినల్‌ సిద్ధమైంది. ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాల పనులు పూర్తయ్యాయి. సెంట్రలైజ్డ్‌ ఏసీ, చక్కటి ఇంటీరియర్‌తో రూపుదిద్దుకున్న ఈ టెర్మినల్‌ దేశ, విదేశీ ప్రయాణికులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడి గోడలపై కృష్ణాజిల్లా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యంతోపాటు వివిధ దేశాల నుంచి వచ్చేవారికి అమరావతి గురించి అర్థమయ్యేలా చక్కటి చిత్రాలను ఏర్పాటుచేశారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.5కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమా ణాలకు అనుగుణంగా దీన్ని ఆధునీకరించింది.

gannavaram 03112018 2

ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లు, చెకిన్‌ కౌంటర్లు, ప్రయాణికులు, సందర్శకుల ప్రీ వెయిటింగ్‌ రూం, సెక్యూరిటీ చెకింగ్‌, ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలు, పాసింజర్స్‌ సిట్టింగ్‌ ఏరియా, వీఐపీ లాంజ్‌ వంటివి డిపార్చర్‌ బ్లాక్‌లో ఉన్నాయి. ప్రవేశద్వారం వద్ద ఒకటి, భద్రత తనిఖీ విభాగం లోపల రెండు చొప్పున బ్యాగేజీ చెకింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణికుల బ్యాగేజీ చెకిన్‌, కన్వేయర్‌ బెల్ట్‌, పాసింజర్‌ వెయిటింగ్‌ హాల్‌, కస్టమ్స్‌ చెకిన్‌ పాయింట్స్‌ అరైవల్‌ బ్లాక్‌లో ఉన్నాయి. ఈ బ్లాక్‌ బయటి గోడల మీద వేయించిన ఉండవల్లి గుహలు, కొండపల్లి బొమ్మలు, ప్రకాశం బ్యారేజీ, కూచిపూడి నృత్యాలు వంటి ఆర్ట్‌ పెయింటింగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇమిగ్రేషన్‌ సిబ్బందికి, కస్టమ్స్‌ విభాగానికి అవసరమైన చాంబర్లను సిద్ధం చేశారు. సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తయిన ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన పాసింజర్‌ లాబీ(సిట్టింగ్‌ ఏరియా)కి అనుబంధంగా అనేక సదుపాయాలు కల్పించారు. చంటిపిల్లలకు పాలు పట్టడానికి, ప్రార్థన చేసుకోవడానికి, స్మోకింగ్‌ కోసం ప్రత్యేకంగా చాంబర్లు ఏర్పాటు చేశారు.

gannavaram 03112018 3

టెర్మినల్‌ ముందు, వెనుక చక్కటి ల్యాండ్‌స్కేపింగ్‌తో గార్డెన్‌, విశాలమైన రహదారి, సెంట్రల్‌ డివైడర్‌ , రోడ్డుకిరువైపులా గ్రీనరీని అభివృద్ధి పరిచారు. అంతర్జాతీయ టెర్మినల్‌ దగ్గర పటిష్ఠ భద్రత కల్పించారు. సాధారణ సెక్యూరిటీతో పాటు పోలీసు సిబ్బంది, ఎస్‌పీఎఫ్‌ బలగాలను కూడా మోహరించా రు. భద్రతపరంగా ఎయిర్‌పోర్టును దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. కస్టమ్స్‌ విభాగం వెనుక వీఐపీ లాంజ్‌కు వెళ్లే మార్గంలో అమరావతి ఊహాచిత్రం కనువిందు చేస్తుంది. ఖరీదైన సోఫాసెట్లు, టీపాయ్‌లతో ఈ లాంజ్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. మువ్వన్నెల జెండాలో ఏపీ మ్యాప్‌, అందులో గౌతమ బుద్ధుడు, కృష్ణానది, ప్రకాశం బ్యారేజీ, దుర్గగుడి, తెలుగుతల్లి విగ్రహం చిత్రాలు కనిపించేలా ఏర్పాటు చేశారు. పక్కనే కూచిపూడి నృత్యభంగిమ చిత్రం కూడా ఆకర్షిస్తుంది. లాంజ్‌ గోడలపై రాజధాని ప్రణాళికలకు సంబంధించిన చిత్రాలను ఉంచారు.

ఒకే ఒక్క కీలక నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ స్ధాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు కేంద్ర బిందువు కాగలిగారు. బీజేపీయేతర పార్టీల మధ్య అనుసంధానాన్ని సాధించగలిగిన సమన్వయకర్తగా ఇతర పార్టీల విశ్వాసం సంపాదించగలిగారు. బీజేపీయేతర పార్టీలకు కొందరు సీనియర్‌ నేతలకు ప్రధాని పదవి పై కన్నుంది. పెద్ద పార్టీగా కాంగ్రెస్‌ కూడా ఆ పదవిని బలంగా కోరుకుంటోంది. దీంతో ఇతర పార్టీల సీనియర్‌ నేతలను పోటీదారులుగా పరిగణించి అనుమానంగా చూసే వాతావరణం నెలకొంది. ఈ పార్టీలు ఒక తాటిపైకి వచ్చేందుకు, పరస్పరం కలిసి పనిచేయడానికి ఉన్న అడ్డంకుల్లో ఇదీ ఒకటిగా పరిణమించింది.

delhi 03112018 2

ప్రతిపక్షాల ఐక్యతకు చొరవ తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాక, దీనిపై కూడా స్పష్టత ఇవ్వాలని భావించారు. ప్రధాని పదవికి రేసులో లేనని మిగిలిన పార్టీల అధినేతలకు ఆయన ముందుగానే చెప్పేస్తున్నారని సమాచారం. నా రాష్ట్రం నాకు ముఖ్యం, నా రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం, ప్రధాని పదవి కాదు, అని చంద్రబాబు తేల్చి చెప్పేస్తున్నారు. ‘నేను రేసులో లేను. నాకు నా రాష్ట్రం ముఖ్యం. కొత్త రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను దానిని విడిచి రాను. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా వాటి నుంచి దేశాన్ని కాపాడేందుకు బీజేపీయేతర పార్టీలను ఒక తాటిపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. దేశాన్ని కాపాడాలి. ప్రజాస్వామాన్ని కాపాడాలి అన్నది నా నినాదం. ఇది మనందరి ఉమ్మడి నినాదం కావాలి. ఎవరో ఒకరు పూనుకోవాలి కాబట్టి నేను ముందుకొచ్చాను. అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయడానికి నా వంతు సహకారం అందించడం వర కే నా పాత్ర’ అని ఆయన వారికి చెబుతున్నారు.

delhi 03112018 3

తనను ప్రధాని అభ్యర్థి అని గానీ లేదా జాతీయ కన్వీనర్‌ అని గానీ ఎక్కడా చెప్పవద్దని, ప్రచారం కూడా చేయవద్దని వారికి గట్టిగా సూచించారు. రేసులో చంద్రబాబు లేరని తెలిశాక ఇతర పార్టీల నేతలు బాగా స్పందిస్తున్నారని అంటున్నారు. 1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో చంద్రబాబు దానికి కన్వీనర్‌గా వ్యవహరించారు. భిన్న ధ్రువాలైన అనేక పార్టీలతో మాట్లాడి సమన్వయం చేయగలిగిన నైపుణ్యం ఆయనకు ఆ సమయంలో అలవడింది. దేవ గౌడ, గుజ్రాల్ లను, అందరినీ ఒప్పించి ప్రాధానులుగా చేసిన చరిత్ర చంద్రబాబుది. తరువాత వాజ్ పాయి హాయంలో ఎన్డీఏను కూడా చంద్రాబబే సమర్ధవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read