ఎన్నికలు వచ్చాయంటే రకరకాల సర్వేలు వెలుగు చూస్తుంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఉండే డిమాండే వేరు. ఆయన చెప్పినవన్నీ ఇప్పటివరకూ జరుగుతూనే వచ్చాయి. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తన సర్వేను త్వరలో ప్రకటిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలోనూ చంద్రబాబును కలిసిన రాజగోపాల్ మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. అయితే మళ్లీ ఇప్పుడు చంద్రబాబును ప్రశంసించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబును ఆయన అనుభవం ఉన్న నేతగా అభివర్ణించారు. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటారంటూ కితాబు ఇచ్చారు.

lagdapati 31102018 2

చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడని, ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడని కొనియాడారు. ఇటీవల అమరావతిలో ఆయన చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. బాబును కలిసిన తర్వాత లగడపాటి మీడియాతో మాట్లాడుతూ... తాను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. అలాగే తొలిసారి సచివాలయాన్ని సందర్శించానని చెప్పారు. హైదరాబాద్‌ సచివాలయం కన్నా.. అమరావతి సచివాలయం చాలా బాగుందని, తాత్కాలిక సచివాలయమే ఇంత అందంగా ఉంటే ఇక అసలు సచివాలయం వరల్డ్‌క్లాస్‌గా ఉంటుందని ఆయన పొగడ్తలు గుప్పించారు. సచివాలయాన్ని అందంగా తీర్చిదిద్దినందుకు చంద్రబాబును అభినందించానన్నారు. అయితే లగడపాటి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించిన విషయం తెలిసిందే.

lagdapati 31102018 3

మరో పక్క వైసీపీ అధినేత జగన్ పై ఇటీవల జరిగిన దాడిని లగడపాటి రాజగోపాల్ ఖండించారు. ఆ ఘటన దురదృష్టకరమని, సీఎం, ప్రతిపక్ష నేత.. ఇలా ఎవరిపైనా దాడులు మంచివి కాదని అన్నారు. మనది ప్రజాస్వామిక దేశమని, మార్పు తీసుకురావడానికి చాలా మార్గాలు ఉన్నాయని, దాడుల వల్ల ఎటువంటి మార్పు తీసుకురాలేమని అన్నారు. జగన్ పై దాడి ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్నారని, దీనిపై ఆయన అభిప్రాయం కోరగా ఆయన బదులివ్వలేదు.

గత కొద్ది రోజులుగా, ఏపి పోలీసుల పై, ముఖ్యంగా ఇంటలిజెన్స్ పై కేటీఆర్ ఓ పేలుతున్నాడు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం మర్చిపోయి, తన రాజకీయం కోసం, ఏపి పై పడి ఏడుస్తున్నాడు. చివరకు ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసాడు. ఈ మొత్తం వ్యవహారం పై, ఏపి డీజీపీ స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు మహాకూటమి తరఫున డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలను ఏపీ డీజీపీ తోసిపుచ్చారు. ఆ ముగ్గురు తమ సిబ్బందేనని, వామపక్ష తీవ్రవాదం పై సమాచార సేకరణ కోసమే తెలంగాణకు వెళ్లారని తెలిపారు.

dgp 31102018

‘ఏపీ నిఘా పోలీసులకు తెలంగాణలో ఏం పని ఉంది’ అంటూ టీఆర్‌ఎస్‌ చేసిన విమర్శలకూ సమాధానం ఇచ్చారు. ‘ఇంటెలిజెన్స్‌ పోలీసులు దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు’ అని స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ముగ్గురు పోలీసులు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో డబ్బు పంచుతున్నారని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీ-సీఈవో రజత్‌ కుమార్‌ షైనీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇంటెలిజెన్స్‌ ఏడీజీ నుంచి సమాచారం తెప్పించుకుని తెలంగాణ సీఈవోకు డీజీపీ సమాధానం పంపించారు.

dgp 31102018

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉందని గుర్తు చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఏపీకి చెందిన కీలకమైన ఆస్తులు, వీఐపీల రక్షణకు పలు విభాగాలు పని చేస్తున్నాయి. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన కార్యకలాపాలపై రహస్య సమాచారం తెలుసుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మా విభాగాలు విధులు నిర్వహిస్తున్నాయి. అంతర్గత భద్రతపై వివరాలు సేకరించేందుకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌కు ఉంటుంది’’ అని డీజీపీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు డబ్బులు పంచారనడం అసత్యం, నిరాధారమని తెలిపారు. స్థానిక పోలీసులు కూడా దీనిపై ప్రాథమికంగా విచారణ జరిపి... ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదని నిర్ధారించారన్నారు.

 

దేశంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు చొరవ తీసుకున్న దగ్గర నుంచి, దేశ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఆయన పని ఆయాన చూసుకుంటుంటే, చంద్రబాబుని టార్గెట్ చేసి మరీ, ఆయన్ను కెలికి మరీ, తన్నించుకుంటున్నారు. దీంతో చంద్రబాబు కూడా నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి మరీ శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మళ్ళీ రేపు గురువారంనాడు మరోసారి ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ‘సేవ్‌ నేషన్‌’ పేరుతో భాజపాయేతర పార్టీలన్నింటనీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గురువారం దిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలను చంద్రబాబు కలుసుకుంటారు.

rahul 31102018 2

జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఐక్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి న్యూఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ పర్యటనలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు కూటమి పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని వ్యవస్థలని నాశనం చేసిన మోడీ పై పోరాటం చెయ్యటంలో, అన్ని విపక్షాలు కలిసి రావట్లేదాని అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలితో కొన్ని పార్టీలు దూరం అవుతున్నాయి. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి, అందరినీ ఒక తాటి పై తీసుకురానున్నారు. మరో పక్క, ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారితో కలిసి వెళ్లేందుకు ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది.

rahul 31102018 3

ఈ రోజు మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో లంచ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసిన చంద్రబాబు వారితో కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌తో భేటీ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రేపటి దిల్లీ పర్యటనలో చంద్రబాబు రాహుల్‌ను కలిసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భాజపాయేతర కూటమి ఏర్పాటుపై వడివడిగా అడగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలోనే ఆయన రాహుల్‌తో భేటీ కానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా తదితరులతో భేటీ కానున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా ఈ భేటీ కీలకం కానుంది. అలాగే, భాజపాయేతర కూటమి ఏర్పాటుపైనా రేపు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్, హైకోర్టులో పిటిషన్‌ వేసారు.. తన కేసుల పై బెయిల్ కోసమో, లేక స్టే ఆర్డర్ కోసమో కాదు. విశాఖ విమానాశ్రయంలో తన పై జరిగిన దాడి ఘటనలో వైఎస్‌ జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. తన పై జరిగిన హత్యాయత్నం ఘటన పై ఈ రోజు కోర్ట్ లో పిటీషన్ వేసారు. తన పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం వల్లె హత్యాయత్నం జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజకీయంగా కేసు ధర్యాప్తు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

jagancourt 31102018 2

హత్యాయత్నం ఘటన పై కేంద్ర ధర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేని స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని జగన్‌ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటీషన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ డీజీపీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రులు, డీజీపీ బాధ్యతారహితంగా మాట్లాడారని, అందుకు సంబంధించి వీడియో క్లిప్పింగులను కూడా జగన్ పిటీషన్ లో జతచేశారు.

jagancourt 31102018 3

మొత్తం 11 పేజీల కాపీని కోర్టుకు అందజేశారు. ఆపరేషన్ గరుడ పేరుతో తనపై కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. సినీ నటుడు శివాజీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడని, తనపై దాడి జరుగుతుందని శివాజీ ముందే చెప్పారని, తనను హత్య చేసి ఆపరేషన్ గరుడలో భాగమంటూ చిత్రీకరించాలని చూస్తున్నారని పిటీషన్ లో జగన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ గత గురువారం విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కూర్చొని ఉండగా,సెల్ఫీ నెపంతో వచ్చిన శ్రీనివాసరావు అనే యువకుడు జగన్‌ పై కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తి, వైసీపీకి వీరాభిమాని కావటంతో, కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read