వైసీపీ అధినేత, ప్రతిపక్ష వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో, కోడి కత్తితో గుచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోనే అపోలో డాక్టర్ చేత ఫస్ట్ ఎయిడ్ ఇప్పించారు. జగన్ షర్టు మీద కూడా, ఒక చోట కొంచెం రక్తం ఉండటం చూసాం. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, జగన్ కు 0.5 cm length & 0.5 cm depth ఉన్న గాయం అయ్యింది. ఫస్ట్ ఎయిడ్ చేసిన వెంటనే, జగన్ హైదరాబాద్ వెళ్లారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లారు. తరువాత కొంచెం సేపటకి మళ్ళీ ఇంటి నుంచి హాస్పిటల్ కు వెళ్లారు. ఇదంతా జరగటానికి దాదాపుగా 4-5 గంటల సమయం పట్టింది.

firstaid 25102018 2

అయితే వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో 0.5 cm ఉన్న దెబ్బ, హైదరాబాద్ లో హాస్పిటల్ కి చేరేసరికి 9 కుట్లు అయ్యే గాయం అయ్యింది. అంతేనా దీనికి మరలా ICU & 24 గంటల అబ్సెర్వేషన్, గంట గంటకు హెల్త్ బులిటెన్ అంటూ హడావిడి చేస్తున్నారు. చొక్కాకి చిల్లు పడలేదు కాని, చర్మానికి తొమ్మిది కుట్లు పడ్డాయి అంటూ, సాక్షి టీవీ హడావిడి చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారో, ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారో వారికే తెలియాలి. దెబ్బ తగిలిన తరువాత కూడా, జగన్ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ నిటారుగా నడుస్తూ చక్కగా వైజాగ్ నుంచి వెళ్లారు.

firstaid 25102018 3

అయితే హైదరాబాద్ హాస్పిటల్ లో చేరగానే మాత్రం, మంచానికి అడ్డం పడి, కళ్ళు మూసేసారు. దీంతో సాక్షి ఎమోషనల్ డ్రామా మొదలు పెట్టింది. జగన్ కు ఆపరేషన్ జరిగిందని, 9 కుట్లని, 24 గంటల అబ్సెర్వేషన్లో ఉంటే కాని చెప్పలేమని, స్పెషల్ డాక్టర్స్ వస్తున్నారని, ఇలా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. అయితే, భుజానికి గాయమైతే న్యూరో డాక్టర్లు ఏం చేస్తారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇలాంటి గాయాలకు వెళ్లాల్సింది అపోలోకో, మరో జనరల్ డాక్టర్ దగ్గరకో అయితే, జగన్ మాత్రం సిటీ న్యూరో సెంటర్ కు వెళ్లారు. ఈ హాస్పిటల్ కడపకు చెందిన వారిదని, జగన్ బంధువులుదని తెలుస్తుంది. మొత్తానికి, ఇలా రక్తి కట్టిస్తున్నారు. రేపు అయినా పాపం జగన్ ని ఇంటికి పంపిస్తారో, లేక మెరుగైన వైద్యం కోసం, అమెరికా పంపించాలి అంటారో.

వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ఈ రోజు విశాఖ విమానాశ్రయంలో దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి విచారణలో ఆసక్తికర విషయాలను నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. జగన్‌ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెరుగు పడతాయని, ఆయనకు సానుభూతి వస్తుందని, జగన్‌కు అది ఉపయోగపడుతుందనే తాను దాడి చేసినట్టు పోలీసుల ఎదుట చెప్పినట్టు ఏడీసీపీ మహేంద్రపాత్రుడు వెల్లడించారు. తూర్పుగోదావరిజిల్లా ముమ్మడివరం మండలంలోని ఠానేలంకకు చెందిన శ్రీనివాస్‌ ఆరుగురు సంతానంలో ఆరోవాడని, ఆ కుటుంబానికి చెందిన ఓ సోదరుడు బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నారని తెలిపారు.

phone 25102018 2

నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఓ ఫోన్‌లో జగన్‌ ఫ్లెక్సీ ఉందని, ఆ ఫొటోను కొందరు మార్ఫింగ్‌ చేసి సీఎం, లోకేశ్‌ ఫొటోలు పెడుతున్నారన్నారు. ఇలా మార్ఫింగ్‌ చేసి ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడం చట్టవిరుద్ధమని, గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్‌పై దాడి నేపథ్యంలో కొందరు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఏడీసీపీ విజ్ఞప్తి చేశారు. నిందితుడిని విచారిస్తున్నామని పూర్తి వివరాలు ఇంకా వెలుగులో వస్తాయని చెప్పారు. శ్రీనివాస్‌ ఏడాది కాలంలో తొమ్మిది సెల్‌ఫోన్లు మార్చినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రత్యేకంగా గత మూడు నెలల్లోనే ఆరు సెల్‌ఫోన్లు మార్చినట్టు చెప్పారు. ఇప్పుడు వాడుతున్నది కూడా రెండు రోజుల క్రితమే సెల్‌ నెంబర్‌ యాక్టివేట్‌ అయిందన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు.

phone 25102018 3

డీజీపీ ఆదేశాల మేరకు సిట్‌ ఏర్పాటు చేశామన్నారు. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న నాగేశ్వరరావు, సీఐలు ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించే పనిలో ఉన్నారని చెప్పారు. నిందితుడి ఇంటిని సోదాలు చేస్తున్నామని, దర్యాప్తుకు ఆటంకం కల్గించని విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ను విచారించేందుకు ఓ ఏసీపీ హైదరాబాద్‌కు వెళ్లారని తెలిపారు. వాస్తవానికి జగన్‌.. ప్రథమ చికిత్స అనంతరం ఈ మధ్యాహ్నం ఒంటిగంట విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారని, ఆయనను విచారించి పూర్తి వివరాలను తెలుసుకుంటామని తెలిపారు. దాడి సందర్భంలో అక్కడ ఉన్న కార్యకర్తలు, అక్కడ పనిచేస్తున్నవారిని విచారించనున్నట్టు ఏడీసీపీ స్పష్టంచేశారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో దాడి చేసి, జగన్ బుజం పై గుచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైజాగ్ లో ఫస్ట్ ఎయిడ్ చేసి, అంతా బాగానే ఉందని, జగన్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నుంచి, ఇంటికి కూడా వెళ్ళిపోయారు. అయితే, ఏమైందో ఏమో, మళ్ళీ జగన్ హైదరాబాద్‌‌లో సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన భుజంపై కత్తి గాయమైందని, ప్రాథమికంగా శస్త్రచికిత్స చేసినట్టు వెల్లడించారు. గాయం 3 నుంచి 4 సెం.మీల లోతులో కండరానికి దెబ్బ తగిలిందని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ హెల్త్ బులెటిన్‌ను డాక్టర్లు గురువారం సాయంత్రం విడుదల చేశారు.

jagan health bulliten 25102018 2

జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్యాహ్నం శాంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు వచ్చారని, దాడి చేయడంతో భుజం కండరానికి గాయం అయ్యిందని చెప్పారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, 9 కుట్లు పడ్డాయని డాక్టర్లు తెలిపారు. జగన్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు. జగన్ ఇవాళ హాస్పిటల్‌లోనే ఉంటారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. కత్తికేమైనా విషపూరితమైన పదార్థం ఉందా అనే అనుమానంతో నమూనాలను పరీక్షలకు పంపామని తెలిపారు. జగన్‌కు తొమ్మిది కుట్లు వేశామని, ఆయన ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. వైద్య నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతానికి జగన్‌ ధైర్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

jagan health bulliten 25102018 3

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్‌పై దాడిని ఖండిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కానీ ఘటనను రాజకీయంగా పులిమి లబ్ధి పొందాలనుకుంటే ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని ఆయన చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. "దాడి చేసిన మనిషి దొరకకపోతే విమర్శించొచ్చు. ఆ వ్యక్తి వైసీపీ అభిమాని అని చెబుతున్నా టీడీపీని విమర్శిస్తున్నారు. మీ విమర్శలను స్వీకరిస్తాం.. కానీ దాడి చేసిన వ్యక్తి మాత్రం వెనకేసుకురాం. మీ అభిమాని మిమ్మల్ని ఎందుకు పొడిచాడో తెలియదు. ఆ విషయం దర్యాప్తులో తేలుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని వైసీపీ, జనసేన, బీజేపీ, టీఆర్ఎస్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి’’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

కేంద్రం సీబీఐపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చిందని, కేంద్రం వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. గురువారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ భయాలను సృష్టించేలా ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. రోజు విడిచి రోజు ఐటీ దాడులు చేస్తున్నారని, దొంగ వ్యాపారం చేసేవారు ఏపీలో లేరని ఆయన అన్నారు. ఐటీ అధికారులకు స్వాగతం చెప్పి.. ఇక్కడ ఏం జరుగుతుందో వివరంగా చెబుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

cbn 25102018 2

రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం సీబీఐని భ్రష్టుపట్టించిందని, నిబంధనల్ని కాలరాసి మోదీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. తప్పులు బయటపడతాయనే భయంతో సీబీఐ డైరెక్టర్‌ను మార్చారని సీఎం విమర్శించారు. చివరికి సీబీఐపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. కేంద్రం వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. సీబీఐలో జరుగుతున్న పరిణామాలు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

cbn 25102018 3

వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇచ్చి మరీ వెనక్కు తీసుకుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని... ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. పైగా ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నారని, పోలవరం నిధులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. స్మార్ట్‌ సిటీల వల్ల రాష్ట్రానికంటే కేంద్రానికే ఎక్కువ ఆదాయం వస్తుందని, కేంద్రం పట్టణాల అభివృద్ధికి నిధులు అరకొరగానే ఇస్తోందని చంద్రబాబు విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read