మన రాష్ట్రాన్ని దేశం గుర్తిస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది. కాని, మహా మేధావులు అయిన జగన్, పవన్ మాత్రం, మన రాష్ట్రంలోని యువతలో విష భీజాలు నాటుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి మా కడపను నిర్లక్ష్యం చేస్తున్నాడు, మొత్తం అమరావతికే చేస్తున్నాడు అంటాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావలి, అన్నీ అమరావతికి దోచిపెడుతున్నారు అంటాడు. ఈ మూర్ఖుల మాటలు ఎలా ఉన్నా, దేశం మాత్రం, కడపకు ఏమి చేసారు, ఉత్తరాంధ్రకు ఏమి చేసారో గుర్తిస్తుంది. దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నీతిఆయోగ్‌ ప్రారంభించిన ‘ఆకాంక్షిత జిల్లాల’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఒకరిని చూసి ఒకరు అభివృద్ధి చెందేందుకు వీలుగా పెట్టిన ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలు మంచి ముందడుగు వేశాయి.

niti 30062018 2

ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండునెలల్లో జిల్లాలు స్వయంగా సమర్పించిన సమాచారం ఆధారంగా వాటి పురోగతిని లెక్కించి నీతిఆయోగ్‌ శుక్రవారం కొత్తగా 108 జిల్లాలకు డెల్టార్యాంకులు విడుదల చేసింది. ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం-జలవనరులు, ఆర్థిక సమ్మిళితం-నైపుణ్యాభివృద్ధి-మౌలికవసతులు అనే ఐదు రంగాల్లో అభివృద్ధి ఆధారంగా ర్యాంకులు కేటాయించినట్లు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ పేర్కొన్నారు. ఈ రెండునెలల్లో సాధించిన రాష్ట్రాల పురోగతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. గత రెండునెలల్లో బాగా పురోగతి సాధించిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయనగరం 4, కడప 5, విశాఖపట్నం 14 ర్యాంకులో నిలిచాయి.

niti 30062018 3

విజయనగరం, కడప, విశాఖపట్నం జిల్లాలు ‘విద్యాపరంగా’ మంచి పనితీరు కనబరిచి 1, 4, 5 ర్యాంకులు సాధించాయి. ‘ఆర్థిక సమ్మిళిత పురోగతి’లో విశాఖపట్నం జిల్లా రెండో ర్యాంకు సాధించింది. అన్ని విభాగాలూ కలిపి చూస్తే 17.5% మార్కులతో విజయనగరం నాలుగు; 14.9% మార్కులతో కడప ఐదు; 11% మార్కులతో విశాఖపట్నం 14వ ర్యాంకు సాధించాయి. బేస్‌లైన్‌ ర్యాంకింగ్‌లో ఒకటోస్థానంలో నిలిచిన విజయనగరంజిల్లా గత రెండునెలల్లో సాధించిన పురోగతిలో నాలుగోస్థానాన్ని ఆక్రమించింది. ఇదివరకు నాలుగులో ఉన్న కడప ఇప్పుడు ఐదులో; 13లో ఉన్న విశాఖపట్నం 14వస్థానంలో నిలిచాయి.

పక్కా ఇళ్ల నిర్మాణాల్లో భారీ లక్ష్యం పెట్టుకున్న గృహ నిర్మాణశాఖ రెండో విడత సామూహిక గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేసింది. జులై 5న మూడు లక్షల ఇళ్లకు ఒకేసారి సామూహిక గృహప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిచేసుకున్న ఇళ్ల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎన్నికల నాటికి 10 లక్షల కొత్త ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందులో ఇప్పటి వరకు 4 లక్షల పైచిలుకు లక్ష్యాన్ని పూర్తి చేసింది. గతేడాది అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా తొలివిడతలో లక్ష ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు.

housing 30062018 1

అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తయిన మరో 3 లక్షల ఇళ్లకు ఇప్పుడు గృహప్రవేశాలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణశాఖ విజయవాడలో పెద్దఎత్తున సభ నిర్వహించనుంది. సీఎం చంద్రబాబు సభలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. మొత్తం 662 మండలాల్లోని 12,755 గ్రామ పంచాయతీలు, 119 పట్టణ ప్రాంతాల్లోని 2,073 వార్డుల్లో గృహప్రవేశాలు చేయించనున్నారు. గత అక్టోబరు నుంచి ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్ల సంఖ్య 3,00,306 ఉండగా, గృహప్రవేశాల రోజుకు ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని గృహనిర్మాణశాఖ అంచనా వేస్తోంది. కాగా, ఎన్నికల సమయానికి ఇంకా సుమారు 6లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

housing 30062018 2

ఇన్ని ఇళ్ళు, ఇంత మంది లబ్ధిదారులు ఉన్నా, ఎక్కడా రూపాయి అవినీతి ఉండదు.. ప్రతిపక్షాలకు ఇవి అబద్ధం అని చెప్పే అవకశం ఉండదు. ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా రూపాయి అవినీతికు తావు ఉండదు. మొత్తం డబ్బులు బ్యాంకు ఎకౌంటు లో పడతాయి. అంతే కాదు, మొత్తం ప్రక్రియ అంతా, ప్రతి స్టేజ్ రియల్ టైం లో ఆన్లైన్ లో ఉంటుంది. మీరు చూడండి... పైసా అవినీతి లేకుండా, పేద వాడికి ఎలా లబ్ది చేకురుస్తున్నారో...ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in//NTRNutanaGruhaPravesam.do ఇక్కడ మీ జిల్లా, ఊరు సెలెక్ట్ చేస్తే, మీ ఊరిలో ఎవరికి ఈ ఇల్లు ఇచ్చారు... వారి పేరు, గృహప్రవేశం చేసిన ఫోటోలు వస్తాయి... మరిన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in/gruhapravesaluReport.do . ఇలా ప్రక్రియ అంతా ఆన్లైన్ లో ఉంటుంది. అవినీతి అనే ఆస్కారం అసలు ఉండదు.

జపాన్‌ దిగ్గజ సంస్థ ‘టోరే’ రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో మెగా టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ ప్లాంట్‌ను స్థాపించేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును రూ.1000 కోట్లతో చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 11న శంకుస్థాపనకు ముహూర్తం కూడా నిర్ణయించారు. టోరే అధ్యక్షుడు అకిహిరో నిక్కాకుతోపాటు రాష్ట్ర మంత్రులు లోకేశ్‌, అమర్నాథరెడ్డిలు ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రపంచంలోని వెయ్యి భారీ పరిశ్రమల్లో ఒకటిగా టోరేకు గుర్తింపు ఉంది. ఈ సంస్థను 1926లో ప్రారంభించారు. మన దేశంలోని గురుగావ్‌లో సేల్స్‌, చెన్నైలో టోరే వ్యాపార కార్యాలయాలు ఉన్నాయి.

japan 30062018 2

ఆ సంస్థ మన దేశంలో ఒక మెగా టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుండటం మాత్రం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టులో పరిశుభ్రత, ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను అత్యాధునిక సాంకేతికత సాయంతో తయారు చేస్తారు. వీటిలో పిల్లలు, పెద్దలు వినియోగించే డైపర్స్‌ కీలకమైనవి. శ్రీసిటీలో స్థాపించే టోరే ప్లాంటులో 165 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తారు. ఇప్పటికే ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్‌, కింబర్లీ క్లార్క్‌, యూనీచార్మ్‌ వంటి సంస్థలు డైపర్ల తయారీలో ఉన్నాయి. వీటికి టోరే ఉత్పత్తులు గట్టి పోటీ ఇస్తాయని మార్కెట్‌ పరిశీలకులు భావిస్తున్నారు.

japan 30062018 3

చిత్తూరు జిల్లాలో తూర్పున పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీస్తోంది. సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో ఏర్పాటు చేసిన శ్రీసిటీ పారిశ్రామికవాడ అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచింది. వివిధ దేశాలకు చెందిన పలు బహుళజాతి సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. తూర్పు మండలాలు పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతం. చక్కని రవాణా వ్యవస్థ, నీటివనరులతో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉంది. ఇప్పటికే సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో శ్రీసిటీ పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. పలు బహుళజాతి సంస్థలతో పాటు దేశీయ కంపెనీలు కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. శ్రీసిటీలో ఇప్పటికే సుమారు వంద వరకు పరిశ్రమలు ఏర్పాటై పని ప్రారం భిం చాయి. ఈ పరిశ్రమల ద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

జీవితం ఎవరినీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది అని ఒక సినిమా డైలాగ్ ఉంది... అది నిజ జీవితంలో, పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే డైలాగ్... ఒక పద్ధతిగా జీవితం బ్రతకకుండా, డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, ఏ రోజుకైనా బ్రతుకు బస్ స్టాండ్ అవుతుంది. దానికి మరో ఉదాహరణ ఈ సంఘటన... ఈ ఫొటోలో... కటకటాల వెనుక దీనంగా నిల్చున్నది ఎవరో ఊహించారా? ‘సమరసింహా రెడ్డి’ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా నిర్మాతగా ఒక వెలుగు వెలిగి... ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా నెగ్గిన చెంగల వెంకట్రావు! హత్యకేసులో శిక్షపడిన ఖైదీగా ఉన్న ఆయన అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

changala 30062018 2

మలేరియా బాధితులను పరామర్శించేందుకు వచ్చిన కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌... అక్కడే ఖైదీలు చికిత్స పొందే విభాగాన్ని పరిశీలించారు. అందరు ఖైదీల్లాగానే చెంగలను పలకరించారు. అయితే... ఆయన సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అని తెలుసుకుని ఒకింత ఆశ్చర్యపోయారు. చెంగల వెంకట్రావు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీచేసి పరాజయం పాలయ్యారు.

changala 30062018 3

2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో బీచ్‌ మినరల్స్‌ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవలో ఒక మత్సకారుడు మరణించాడు. ఇందుకు చెంగల వెంకట్రావు,ఆయన మద్దతుదారులే కారణమంటూ రెండో వర్గం కేసు పెట్టింది. దాదాపు పదేళ్లపాటు కేసు విచారణ కొనసాగింది. చివరకు గత ఏడాది మే 24న అనకాపల్లి జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టు చెంగల సహా 21 మందికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. చెంగల జైలుకు వెళ్లక తప్పలేదు. ఓడలు బండ్లు కావడమంటే ఇదే..

Advertisements

Latest Articles

Most Read