చంద్రబాబు నాయుడుని విజనరీ అనేది ఇందుకే... 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన దేశంలో ఐటి విప్లవానికి నాంది పలికారు. హైదరాబాద్ ఐటి హబ్ అయ్యింది. తరువాత అన్ని రాష్ట్రాలు, ఐటికి ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా, చంద్రబాబు ఐటి విధానాలకు ముగ్ధులయ్యారు. మైక్రోసాఫ్ట్ అమెరికా తరువాత, మొదటి డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో పెట్టింది. టోనీ బ్లైర్, క్లింటన్ లాంటి ప్రపంచ దేశాలు అధినేతలు, హైదరాబాద్ వచ్చి మరీ చంద్రబాబు అభివృద్ధి, పరిపాలనలో ఐటి మేళవింపు చూసారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు విధానాలు మారిపోయాయి. భవిష్యత్తుని, ఇప్పుడే అంచనా వేసి, విధానాలు రూపొందించే చంద్రబాబు, ఈ సారి ఐటి మాత్రమే కాదు, వ్యవసాయానికి అధిక ప్రధానత్య ఇస్తున్నారు. అందుకే ఆయన్ను విజనరీ అనేది..

cbn 29062018 1

వ్యవసాయం లాభసాటిగా మారేందుకు పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు లాభాల పంట పండించేందుకు ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని, చంద్రబాబు గుర్తించారు. సుభాష్ పాలేకర్ తో పాటు, ఇతర ప్రముఖుల సలహాలు తీసుకున్నారు. జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. రెండు రోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్‌ మిషన్‌ మహాసభల ప్రాంగణంలో ప్రకృతి సేద్యం శిక్షణ తరగతులు పెద్ద ఎత్తున జరిగాయి. ఇందులో క్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ హెడ్ ఎరిక్ సోలెన్ కూడా పాల్గున్నారు. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అయితే, ఇప్పుడు, మన విధానాలను న్యూయార్క్ టైమ్స్ గుర్తించి కధనం రాసింది. ఎప్పుడూ చంద్రబాబు ఐటి విధానాల గురించి రాసే న్యూయార్క్ టైమ్స్, ఇప్పుడు చంద్రబాబు వ్యవసాయ విధానాల గురించి రాసింది.

cbn 29062018 1

ఇది ఆ కధనం... https://nytimes.com/2018/06/26/opinion/farming-organic-nature-movement.html ... In India, the state of Andhra Pradesh, home to 50 million people, is investing $200 million to convert its farmers to the agroecological practice known as zero budget natural farming, which uses from-the-farm nutrients to grow crops without using costly chemical fertilizers or pesticides, which can push farmers into debt. More than 100,000 farmers there are already using this method, and an estimated 500,000 farmers in 3,000 villages will have moved to this method by the end of this year, three years ahead of schedule, according to organizers. The government plans to invest $2.3 billion to expand it to six million farmers within five years.

ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ వచ్చింది. గుంటూరులో సెమి కండక్టర్ పార్క్ ఏర్పాటుకు ఇన్వెకాస్ ముందుకు వచ్చింది. ఆటోమోటివ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,బయో మెడికల్ రంగాల్లో ప్రోటోటైపింగ్,సెమి కండక్టర్ తయారీలో ఇన్వెకాస్ సంస్థ ఉంది. దేశంలోనే ప్రముఖ సెమి కండక్టర్ తయారీ కంపెనీగా ఇన్వెకాస్ కు పేరు ఉంది. ఇన్వెకాస్ రాకతో హై ఎండ్ ఉద్యోగాల కల్పన జరగనుంది. విశాఖపట్నం ఐటీ హబ్ గాను,తిరుపతి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ కేంద్రం గాను,అమరావతి తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హై ఎండ్ టెక్నాలజీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి నారా లోకేష్, అమరావతి తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హై ఎండ్ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా
ఇన్వెకాస్ మొదటి అడుగు కాబోతోంది.

invecase 290620018 2

ఈ కంపెనీని, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.. నగరంలోని విద్యా నగర్‌ 1వ లైనులో నిర్మించిన వేద ఐఐటి అండ్‌ ఇన్వేకాస్‌ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గుంటారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి మేరకు నగరంలోని విద్యానగర్‌ ఒకటో లైనులో ఏడు అంతస్థుల భవనంలో ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికే మంగళగిరికి పై డేటా సెంటర్‌ని తీసుకొచ్చి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వారం రోజుల క్రితం రాజధానిలోని రాయపూడిలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేశారు. 36 అంతస్థులలో నిర్మాణం జరగనున్న ఆ టవర్‌ ఐటీ కంపెనీలకు హబ్‌గా మారనుంది.

invecase 290620018 3

తాజాగా గుంటూరు నగరానికి తొలిసారిగా ఐటీ కంపెనీని తీసుకురాబోతోన్నారు. ఇందులోనూ వందల సంఖ్యలో సాఫ్టువేర్‌, హార్డ్‌వేర్‌ ఉద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. 24 వేల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నిర్మించిన వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు ఒకే టవర్‌లో కార్యకలాపాలాను ప్రారంభించనున్నాయి. బెంగుళూరు,అమెరికా పర్యటనల్లో భాగంగా పలు మార్లు ఇన్వెకాస్ ప్రతినిధులతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి నారా లోకేష్ ఒప్పించారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి తదితర వివరాలు ప్రకటిస్తారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ పల్లెబాట పట్టారు. ఏ హడావిడి లేకుండా, ఏ ప్రచారం లేకుండా, ప్రజల మధ్యకు వెళ్లారు. అందులో భాగంగా చినమత్తూరు మండలం, దిగువపల్లి తండా గ్రామంలో పల్లె నిద్ర చేశారు. గురువారం తెల్లవారుజామున నిద్రలేచి దినచర్యలో భాగంగా వ్యాయామం చేశారు. సినిమాల్లో తాము చేసే ఫీట్లకు శారీరక దృఢత్వం ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో బాలయ ముఖాముఖి చర్చలు జరిపారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అంతా విస్తృత పర్యటనలకు బాలకృష్ణ సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా బుధవారం ‘మూడు రోజుల పల్లె నిద్ర’కు శ్రీకారం చుట్టారు.

balayya 28062018 2

తొలిరోజు చిలమత్తూరు మండలం చాగలేరు ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం దిగువపల్లె ఎస్టీ తాండాలో బాలకృష్ణ పల్లెనిద్ర చేశారు. అంతకు ముందు ప్రజల నుంచి వినతులు అందుకొన్నారు. గ్రామానికి రహదారి, దేవాలయం మంజూరు, సామాజిక భవనం ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. గ్రామంలో అందరూ నిరుపేదలేనని భూముల్ని లేపాక్షినాల్జెడ్‌ హబ్‌కు తీసుకోవడంతో వలసలు తప్పలేదన్నారు. ఉపాధి మార్గం చూపాలని కోరారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ భూములు ఈడీ చేతుల్లోకి వెళ్లడంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.

balayya 28062018 3

ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు, నేరుగా వారి వద్దకే వెళుతున్నట్టు ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తెలుగు ప్రజలకు అండగా ఉంటూ ముందుకు తీసుకెళుతున్నారన్నారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా ప్రజల వద్దకే వచ్చానని తెలిపారు. మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొనేందుకు వస్తారని, మోసపోవద్దని, అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకోమని ప్రజలకు సూచించారు. కడప ఉక్కు కర్మాగారం, పారిశ్రామిక నడవా, విశాఖ రైల్వేజోన్‌, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు అందించాల్సి ఉండగా అడ్డుచెబుతూ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. రాజీనామా పేరిట వైకాపా నేతలు డ్రామాలు ఆడుతున్నారని, కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడంలేదన్నారు. గత పాలకులు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకొని దోచేశారన్నారు.

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ గత తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఆరోగ్యం పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాకబు చేశారు. ఈ మేరకు ఆయన కోల్‌కతా రాజ్‌భవన్‌ నుంచి కడప జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సీఎం రమేశ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, తన ఆరోగ్యం దినదినం క్షీణిస్తున్నా, పట్టు సడలకుండా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని రమేశ్‌ తేల్చి చెబుతున్నారు. ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖమంత్రి బీరేంద్రసింగ్‌ ఆయనతో 15 నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడి దీక్ష విరమించాలని కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేయాలని మంత్రిని కోరిన విషయం తెలిసిందే.

venkayya 28062018 2

మరో పక్క, అమెరికా నుంచి వచ్చిన సీఎం రమేష్ ఫ్యామిలీ డాక్టర్ రాజాతల్లూరి రమేష్ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదని ఐసియూలో పెట్టి చికిత్స చేయాల్సిన స్టేజీలో వున్నారని చెప్పారు. ఇంకా దీక్ష కొనసాగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ రాజాతల్లూరి చెప్పారు. దీంతో టీడీపీ నేతలు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. కాగా సీఎం రమేష్‌తోపాటు దీక్ష చేపట్టి ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోగ్యం క్షీణించడంతో నిన్న ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

venkayya 28062018 3

రాష్ట్ర ప్రభుత్వానికి 9 అంశాలతో మెకాన్ సంస్థ.. అదే విధంగా కేంద్రం కూడా 9 అంశాలపై క్లారిటీ కావాలని కోరింది. అందులో 7 అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. ఇంకా 2 అంశాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వలేదంటూ నిన్న బీరేంద్ర సింగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న మెకాన్ సంస్థ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖలో రెండు అంశాలకు క్లారిటీ ఇవ్వాలని కోరింది. అందులో లాండ్, లింకేజి విషయంలో స్పష్టత రావాలని కోరింది. మెకాన్ లేఖకు సమాధానంగా ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం సమాధానం రాసింది. లాండ్‌కు సంబంధించి పూర్తి వివరణ ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read