ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక భాగస్వామి. అయినా సరే, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం గురించి వేస్తున్న ట్వీట్లు చూసి, ఆవేదన చెంది, ఒక సామాన్యుడిగా, పవన్ కళ్యాణ్ కు అర్ధమయ్యే బాషలో రాసారు.. ఆయన పోస్ట్ ఇదీ " పవన్ కళ్యాణ్ గారూ, నా పదవిలో ఉండి, నేనిలా రాయచ్చో లేదో నాకు తెలియదు. కానీ, ఆంధ్ర రాష్ట్ర విభజన వలన actual గా నష్టపోయిన వాళ్లలో నేనూ ఒకడిని కాబట్టి, ఆ అధికారంతో వ్రాస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ విభజించి, ఉత్తర ఆంధ్రని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలా? అసలు మీరు ట్విట్టర్ ద్వారా మీ అభిప్రాయాలు చెప్పేటప్పుడు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అని ఆలోచించరా? ఆ సమయంలో మీకేదనిపిస్తే అది వ్రాసేస్తారా? మీరు ఒక నాయకుడు సర్. మీ వెనుకాల మీ ఫాన్స్ మాత్రమే కాదు, మీరు రాజకీయ నాయకుడిగా ఏదో చేస్తారని భావించే ఇంకొందరూ వున్నారు. మీకెన్ని ఓట్లు వస్తాయి అన్నది, ఇప్పుడు, స్పెకులేషన్ మాత్రమే కాబట్టి, దాన్ని పక్కనబెట్టితే, ఆంధ్ర దేశంలో ఈ రోజు వున్న Influencers లో మీరు ఒకరు. అందు చేత మీరు ఇంకా ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి? ఇలా మీరు ఉత్తరాంధ్ర విభజన అంటూ క్యాజువల్గా వ్యాఖ్యానించడం, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మీకు శోభస్కరంగా లేదు.

ఈవేళ మీరిచ్చిన 'ప్రత్యేక ఉత్తరాంధ్ర' ట్వీట్, ఆ ప్రత్యేకం యొక్క పూర్వాపరాలు,దాని, ఆర్ధిక స్థితిగతులు, ఇక వేళ విడిపోతే, మూడు జిల్లాలుగా మనగలిగిన స్థితి, ఇటువైపు, ఆంధ్ర రాయలసీమ పరిస్థితి, ఇంకా పసిబిడ్డ అని మనం చెప్పుకుంటున్న మన ఆంధ్ర, ఇప్పుడు మళ్లీ మీరు రేకెత్తిస్తున్న, ప్రత్యేక ఉత్తరాంధ్ర కుంపటిని తట్టుకోగల శక్తి ఉన్నదా, అసలు అలాంటి పరిస్థితులు ఉన్నాయా, కొంత మంది కుహనా మేధావులు, నిరుద్యోగుల సృష్టా, ఇప్పటి వరకు, ఆ ప్రాంతంలో కూడా వినిపించని ఈ సమస్య, మీకు మాత్రమే ఎలా కనిపించింది, కనీసం పిలుపు ఇచ్చే ముందు, పది మందితో చర్చించారా, ఆర్ధిక స్థితిగతులు బేరీజు జరిగిందా, ప్రజా ఆమోదం ఉందా,........... ........ ఇవన్నీ అసలు మీరు ఆలోచించారా? లేక ఆ పిలుపు ఇస్తే passions ని పుట్టిస్తే, ఓట్లు వస్తాయని అనుకొన్నారా?

సమస్యలు లేవని కాదు సర్. వుండే ఉంటాయి. కానీ ఆ సమస్య పరిష్కారానికి, ప్రత్యేక రాష్ట్రం పరిష్కారమా? ఆ సమస్యలు ఏవి, పరిష్కారించాలంటే ఏమి చేయాలి, విభజిస్తే ఎలా పరిష్కారం అవుతుంది, ఇవేవీ ఎంపిరికల్ గా చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించేద్దాం అబ్దం కేవలం బాధ్యతా రాహిత్యం మాత్రమే. మీరింకా రాయలసీమకు యాత్రగా రాలేదు. అక్కడ కూడా ఎవరో, ఒకరో ఇద్దరో, ప్రత్యేక రాయలసీమ అనక మానరు. ఇప్పుడు మీ ప్రత్యేక ఆంధ్ర చూసిన తర్వాత మరీ ఉత్సాహం వస్తుందేమో, ఆ ఇద్దరు ముగ్గురికి. అప్పుడు, 'ప్రత్యేక రాయలసీమ' పిలుపు కూడా ఇలాగే ట్విట్టర్ ద్వారా ఇచ్చేస్తారా? అటు వైపు ప్రత్యేక ఉత్తర ఆంధ్ర, ఇటు వైపు ప్రత్యేక రాయలసీమ, ఇంక, 'ప్రత్యేక గోదావరి జిల్లాలు' మాత్రమే మిగిలి ఉండేది....ఆ పిలుపు కూడా ఇచ్చేయండి....ఆంధ్ర రాష్ట్రాన్ని, నాలుగు భాగాలుగా కోసేయ్యవచ్చు..! నాలుగేళ్ళ క్రితం విడిపోయినప్పుడు, మీకసలు సంభంధం లేదు. పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి, రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో తిరిగి, ఆ ప్రాంతాన్ని 'ప్రత్యేక రాష్ట్రం' చెయ్యాలంటే...మీ అనాలిసిస్ అయినిస్టియన్ కూడా ఉండి ఉండదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, దేనికవి సముద్రంలోని దీవులు కాదు సార్..! పలు ప్రాంతాలు, భౌగోళికంగానే కాదు, సామాజికంగా, వాణిజ్య పరంగా, పరిపాలనా పరంగా, వివాహపరంగా, కుటుంబ పరంగా, వంశాల పరంగా, మనుషుల మధ్య భావావేశాలు పరంగా....ఇలా ఎన్నో రకాలుగా ముడిపడి ఉంటాయి. ఇవేవీ తెలుసుకోకుండా, పట్టించుకోకుండా, ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం అంటే, మీ ఓట్లకు కూడా అది ఉపయోగ పడదేమో సారూ...!

పైగా తెలంగాణా తో పోలిక వేరే..! నిజానికి తెలంగాణా అంటే, 1956 లో కలిసాము. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలు, నెల్లూరులు, ఎప్పుడూ, ఒక భాగమే కదా సారూ...! సమైక్యఆంధ్ర పోరాటంలో నాలుగేళ్ళ నాడు, అందరికంటే ఎక్కువ వైలెంట్ గా రియాక్ట్ అయింది.. విజయనగరం వాళ్లనే సంగతి మరచిపోయారా? కర్ఫ్యూ గుర్తులేదా? మీకిష్టమైన శ్రీశ్రీ గారు స్వర్గంలోఎక్కడున్నారో గానీ ...కన్నీళ్లు కార్చడమే కాదు, బెత్తంతో నాలుగు వాయిస్తారు.... మీ ప్రత్యేక ఉత్తరాంధ్ర ప్రతిపాదన వింటే గురజాడ నుంచి రాయప్రోలు దాకా, మిమ్మల్ని, ఇంకో నాలుగు పుస్తకాలు ఎక్కువ చదువు అంటారేమో...! సార్... ఆంధ్ర ప్రజలందరమూ, ఉత్తరాంధ్రతో కలిపి.... మీకు దణ్ణం పెడతాము. మళ్లీ విభజన చిచ్చు రగల్చకండి. మమ్మల్ని ఇలా బ్రతకనీయండి. ఇప్పటికే చచ్చి, బ్రతికి, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి నానా చావులు చస్తున్నాము రాష్ట్రమంతా....! రాష్ట్రం మొత్తం మీకు పాదాభివందనం చేస్తాము... మమ్మల్ని విడదీయద్దు.....విభజన చిచ్చు రగల్చద్దు. ....... నమస్తే .....

ఈనెల 20 నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, బీటెక్‌ రవి- ఇద్దరూ కడపలోని జడ్పీ ప్రాంగణంలో దీక్షకు దిగారు. వైద్యపరీక్షలు నిర్వహించిన రిమ్స్‌ వైద్యులు.. ఇద్దరి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు హెచ్చరించారు. ప్రధానంగా బీటెక్‌ రవి పరిస్థితి బాగోలేదని వివరించారు. పరిస్థితిని అంచనా వేసి తదనుగుణ చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మంత్రి గంటా శ్రీనివాసరావును కడపకు పంపించారు. ఆయన బుధవారం ఉదయం నుంచి జిల్లా ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. చివరగా పోలీసులు 6 గంటల సమయానికి రవి దీక్షను భగ్నం చేశారు. అయితే సీఎం రమేష్‌ దీక్ష ఇంకా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో, ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు, రకరకాల పద్ధతిలో కేంద్రం పై ఒత్తిడి తీసుకువవచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

modi 28062018 2

ఇందులో భగంగా, ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, రమేష్ చేస్తున్న దీక్ష, రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష ప్రధానికి తెలపటానికి, ఆయన అపాయింట్‌మెంట్‌ అడిగారు తెలుగుదేశం ఎంపీలు. అయితే, అయితే అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రధాని తిరస్కరించారు. ప్రధాని మిమ్మల్ని కలిసేందుకు టైం లేదని, ఇప్పుడు అపాయింట్‌మెంట్ కుదరదు అంటూ మన ఎంపీలకు తేల్చి చెప్పారు. దాంతో కాసేపట్లో ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలు సమావేశంకానున్నారు. ఉక్కుశాఖ మంత్రిని మరోసారి కలిసి, చంద్రబాబు రాసిన లేఖను టీడీపీ ఎంపీలు అందజేయనున్నారు.

modi 28062018 3

మరో పక్క కడపలో దీక్ష చేస్తున్న శిబిరం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. మంత్రులు, నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నేత జగన్‌పై దుమ్మెతి పోశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో జనాలు దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. కడప నారాయణ జూనియర్‌ కళాశాల, జమ్మలమడుగు ఎస్వీ కళాశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు భారీగా హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. తెదేపా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగాయి. మధ్యాహ్నం నుంచి దీక్షాశిబిరానికి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీక్షాశిబిరానికి ఇరువైపులా రెండు అంబులెన్స్‌లు ఉంచడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠలో అటు కుటుంబీకులు, ఇటు కార్యకర్తలు, శ్రేణులుండిపోయారు. సాయంత్రం సుమారు 200 మంది పోలీసుల వరకు శిబిరం వద్దకు చేరుకుని పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన బీటెక్‌ రవిని అంబులెన్స్‌లోకి చేర్చి రిమ్స్‌కు తరలించారు.

కడపలో ఉక్కుపరిశ్రమ కోసం సాగుతున్న ఉద్యమాల నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియని గాలి హఠాత్తుగా ఉక్కు పరిశ్రమను తానే నిర్మిస్తానని, అవకాశం తనకే ఇవ్వాలని రెండేళ్లలో పూర్తిచేస్తాననంటూ చెప్పడంతో. ప్రజా సొమ్ము మళ్లీ ఎక్కడగాలి పాలు అవుతుందోనన్న ఆందోళన ప్రజలను వేధిస్తోంది. బిజెపితోనూ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అడ్డంపెట్టుకుని అప్పట్లో కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కుపరిశ్రమ స్థాపనకు అనుమతిని పొందాడు. ఈ మేరకు ప్రభుత్వం ఎకరా రూ. 18,500 చొప్పున దాదాపు 10760 ఎకరాలను బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌కు అప్పగించింది.

jagan 28062018 2

బ్రాహ్మిణికి ముడి ఖనిజం సరఫరా కోసం ఓబులాపురంలో కేటాయించిన గనుల నుంచి అక్రమంగా ఖనిజాన్ని తరలించారన్న కేసులో 2009లో గనులను సీజ్‌ చేయడంతో పాటు గాలిజనార్ధన్‌ రెడ్డితో పాటు పలువురు ఐఎఎఎస్‌ అధికారులు సైతం జైలు పాలయ్యారు. దాదాపు 5.20 కోట్ల టన్నులకుపైనే అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కేవలం జిల్లా పరిధిలో మాత్రమే దాదాపు రూ. 500 కోట్లకు పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది. ప్రజల సొమ్ము కొల్లగొట్టి తిరిగి అదే పరిశ్రమను నిర్మిస్తానని ముందుకు రావడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం అటు పరిశ్రమ స్థాపన లేక ఇటు ఉద్యోగం రాక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.

jagan 28062018 3

గాలి జనార్థన్‌రెడ్డిని హఠాత్తుగా తెరముందుకు తెచ్చి బిజెపి తన రాజకీయ ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. ఏళ్లతరబడి నోరుమెదపని గాలి జనార్థన్‌రెడ్డి ప్రస్తుతం తనకే పరిశ్రమ నిర్మాణ పనులు అప్పగించాలని చెప్పడం వెనక బిజెపి హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఉక్కు ఉద్యమాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పరిశ్రమను ప్రకటిస్తే ఇతర పార్టీల జాబితాల్లో చేరుతుందని, గాలి జనార్ధన్‌రెడ్డి ద్వారా నిర్మించడం వల్ల బిజెపి ఖాతాలో జమచేసుకోవచ్చన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా, ఉక్కు పరిశ్రమ పై, ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. మొత్తానికి అందరూ కలిసి, పెద్ద ప్లానే వేసారు.

చంద్రబాబు ప్రభుత్వం టాప్ గేర్ లో ఉంది... ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్.. రెండూ బాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది... పేదలకు ఇల్లు కట్టిస్తున్నాం అని ప్రభుత్వాలు చెప్పటం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం... కాని అవన్నీ పేపర్ లోనే ఉంటాయి.. బయట కనిపించవ్... కాని చంద్రబాబు ఇల్లు లేని ప్రతి పేదవాడికి, ఇల్లు కాట్టిస్తున్నారు.. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన మూడు లక్షల ఇళ్లలో జులై 5న సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని బుధవారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ గృహ ప్రవేశాలుంటాయన్నారు.

housing 28062018 1

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇంతవరకు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా గత ఏడాది అక్టోబరులో లక్ష సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామని, నాలుగేళ్లలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మొత్తం 5.61 లక్షల ఇళ్లను నిర్మించామని మంత్రి తెలిపారు. ఒక్కపైసా అవినీతికి తావులేకుండా ఒకే రోజు లక్ష నూతన గృహాల ప్రారంభోత్సవం చరిత్రాత్మకమైనదని మంత్రి అన్నారు. ఎవరైనా సరే మంజూరులో కానీ, బిల్లు ఇచ్చే సందర్భంలో లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలా ఎక్కడైనా జరిగితే 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తమ దృష్టికి తేవాలని కోరారు.

housing 28062018 3

ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా రూపాయి అవినీతికు తావు ఉండదు. మొత్తం డబ్బులు బ్యాంకు ఎకౌంటు లో పడతాయి. అంతే కాదు, మొత్తం ప్రక్రియ అంతా, ప్రతి స్టేజ్ రియల్ టైం లో ఆన్లైన్ లో ఉంటుంది. మీరు చూడండి... పైసా అవినీతి లేకుండా, పేద వాడికి ఎలా లబ్ది చేకురుస్తున్నారో...ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in//NTRNutanaGruhaPravesam.do ఇక్కడ మీ జిల్లా, ఊరు సెలెక్ట్ చేస్తే, మీ ఊరిలో ఎవరికి ఈ ఇల్లు ఇచ్చారు... వారి పేరు, గృహప్రవేశం చేసిన ఫోటోలు వస్తాయి... మరిన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in/gruhapravesaluReport.do . ఇలా ప్రక్రియ అంతా ఆన్లైన్ లో ఉంటుంది. అవినీతి అనే ఆస్కారం అసలు ఉండదు.

Advertisements

Latest Articles

Most Read