ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా, కేంద్రంలోని మిగతా మంత్రులకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గత పది రోజుల్లో, వివిధ సమస్యల పై 10 లేఖలు రాసారు. తాజాగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు పై లేఖ రసారు. మెకాన్‌ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదిక ఆధారంగా సుప్రీంలో సవరణ అఫిడవిట్‌ను కేంద్రం వెంటనే దాఖలు చేయాలని కోరుతూ సోమవారమే మోడీకి చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖ వివరాలను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. సెయిల్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇటీవల సుప్రీంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అనుకూలం కాదంటూ అఫిడవిట్‌ దాఖలు చేసిందని, ఇది ఏపీ ప్రజలకు ఆందోళనను కలిగించిందని, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ ప్రాజెక్టు వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఆర్థికంగా దన్నుగా ఉంటుందని, సుప్రీంలో వెంటనే సవరణ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

cbn 21062048 2

చంద్రబాబు పది రోజులుగా కేంద్రానికి విభజన హామీలపై లేఖలు రాస్తున్నారు. వివిధ అంశాలపై ఆయన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు లేఖలు రాస్తున్నారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభును కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా కాలుష్య నియంత్రణ మండలి, చత్తీస్‌గఢ్ పర్యావరణ సంరక్షణ బోర్డు ఇచ్చిన పనుల నిలిపివేత ఉత్తర్వులను పూర్తిస్థాయిలో ఉపసంహరించేలా మరో లేఖ రాశారు.

cbn 21062048 3

గ్యాస్ గురించి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు, తిరుమల విషయంలో పురావస్తు శాఖ కార్యాలయం మొదలు అమరావతి సర్కిల్ వరకు జరిగిన వ్యవహారాలపై విచారణ జరిపించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మకు, జీడిపప్పు పరిశ్రమ గురించి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభుకు, బకాయి వసూళ్లు, విద్యుత్ రంగం ఒత్తిడిపై మరో కేంద్రమంత్రికి, విశాఖలో పౌర విమానాల రాకపోకల సమయాలపై ఆంక్షలు విధించవద్దని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. మరి ఈ లేఖల అన్నిటి పై, కేంద్రం స్పందిస్తుందో, పక్కన పదేస్తుందో చూడాలి...

11 సిబిఐ కేసులు... 5 ఈడీ కేసులు... అన్నిట్లో A2... 16 నెలలు చిప్ప కూడు.. కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్నాడు... ప్రతి శుక్రవారం కోర్ట్ లో సంతకం పెట్టాలి... ఆర్ధిక ఉగ్రవాది అని కోర్ట్ లు బిరుదు కూడా ఇచ్చాయి.. ఇలాంటి వ్యక్తి వచ్చి, చంద్రబాబు స్థాయి నాయకుడు పై, విమర్శలు చేస్తుంటే ఏమనాలి ? ప్రధాని ఆఫీస్ లో కూర్చుని, చంద్రబాబుని జైలుకు పంపిస్తా అంటాడు, ఈ కండీషనల్ బెయిల్ పై బయట తిరిగే వ్యక్తి... గతంలో ఎన్నో సార్లు, నోటికి ఇష్టం వచ్చిన్నట్టు మాట్లాడాడు... చంద్రబాబు నాయుడు తల్లి గురించి, అసభ్యంగా మాట్లాడిన సంస్కార హీనుడు.. ఇలాంటి వ్యక్తి విమర్శలు చేస్తూ, చంద్రబాబుకి ఛాలెంజ్ విసురుతాడు.. అయితే, ఇప్పుడు ఇలాగే ఇష్టం వచ్చినట్టు వాగి, నవ్వులపాలు అయ్యాడు..

vijayasai 21062018 2

అసలు విషయానికి వస్తే.. ధర్మవరం పట్టణానికి చెందిన నాగూర్ హుస్సేన్ గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన హుస్సేన్ జిల్లాలోకి ఆయుధాలతో ప్రవేశించాడనీ, అతనిపై కేసులు పెట్టకపోగా, అధికారపార్టీ నేతల సూచన మేరకు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అతన్ని జిల్లా సరిహద్దు దాటించారనీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణపై వెంటనే జిల్లా ఎస్పీ స్పందించారు. విజయసాయిరెడ్డి పేర్కొన్న తేదీల్లో అసలు తాను దేశంలోనే లేననీ, విదేశాలకు వెళ్లానని స్పష్టంచేశారు. దీంతో వైకాపా నేతలు కూడా నాలుక కరుచుకోవాల్సి వచ్చింది.

vijayasai 21062018 3

ఇటీవల మరో సందర్భంలోనూ ఇలాగే జరిగింది. పరిటాల శ్రీరామ్‌పై కూడా వైసీపీ నేతలు నోరు జారారు. అధికారబలంతో జిల్లాలో పరిటాల శ్రీరామ్‌ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతలు చేసిన ఈ ఆరోపణలకు వైసీపీ అధిష్టానం కూడా వత్తాసు పలికింది. అయితే సరైన పరిశీలన చేసుకోకుండా ఒక పార్టీ ఇలాంటి వైఖరి తీసుకోవడంపై జిల్లాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలను తనకు ఆపాదించడంపై శ్రీరామ్‌ స్వయంగా మీడియా సమావేశంలో ఖండించారు.

మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలు విని ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోదాబెన్ షాక్‌కు గురయ్యారు. ఓ గుజరాతీ దిన పత్రికతో గవర్నర్ మాట్లాడుతూ మోదీకి వివాహం కాలేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై జశోదాబెన్ స్పందించారు. మీ మీ రాజకీయం కోసం నన్ను వాడుకుంటారా ? అంటూ బీజేపీ నేతల పై మోడీ భార్య ఫైర్ అయ్యారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్, రెండు రోజుల క్రితం ఒక కార్యక్రమంలో "మీకు ఒక విషయం తెలుసా, నరేంద్రభాయి మోదీ పెళ్లి చేసుకోలేదు, అయినా, ఆయన మహిళలు, పిల్లల బాధను అర్థం చేసుకోగలరు" అన్నారు.మోదీ 'అవివాహితుడు' అంటూ ఆనందీబెన్ చేసిన వ్యాఖ్యలపై, జశోదాబెన్ విచారం వ్యక్తం చేశారు.

modi wife 21062018 2

ఆనందీబెన్ చేసిన ఆ వ్యాఖ్యలపై, జశోదాబెన్, ఆమె కుటుంబ సభ్యులు చాలా కలత చెందుతున్నారు. "నరేంద్ర మోదీకి పెళ్లైందని అందరికీ తెలుసు, అయినా జనం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు" అని జశోదాబెన్ అన్నారు. ఆనందీబెన్ మాటలు పూర్తిగా అవాస్తవం అని జశోదాబెన్, ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. "రాజకీయాల కోసం నరేంద్రమోదీ, జశోదాబెన్ గురించి అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదు" అని జశోదాబెన్ సోదరుడు అశోక్ మోదీ అన్నారు.

modi wife 21062018 3

నరేంద్ర మోదీ 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తన వైవాహిక స్థితి గురించి ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు. 2014లో లోక్‌సభ ఎన్నికలకు ముందు తన అధికారిక అఫిడవిట్‌లో తనకు వివాహం అయ్యిందని మోదీ మొదటిసారి అంగీకరించారు. ఆయన నామినేషన్ పత్రాల్లో, జశోదాబెన్‌ను తన భార్యగా పేర్కొన్నారు. అయితే, పాన్‌కార్డ్, ఆస్తులకు సంబంధించిన ఇతర పత్రాల్లో మాత్రం ఆమె గురించి ఎలాంటి వివరాలూ ఆయన ఇవ్వలేదు. ఇంతకాలం అయినా మోదీ జశోదాబెన్‌ను తన భార్యగా స్వీకరించకపోవడం, మహిళల పట్ల ఆయనకు ఉన్న ఉదాసీన వైఖరిని సూచిస్తోందని విమర్శకులు అంటున్నారు.

బుధవారం, నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రామనారాయణరెడ్డిని విషయం ప్రస్తావనకు వచ్చింది. తనకు పార్టీలో గౌరవం లభించడం లేదని, అందువల్ల పార్టీని వీడాలనుకొంటున్నానని ఆయన చెబుతున్నారని కొందరు సీఎం దృష్టికి తెచ్చారు. ‘ఆనం రామనారాయణరెడ్డిని ఇక్కడ ఏం అగౌరవపర్చాం? ఆయన ఎందుకు అలా అనుకొంటున్నారు? నేను ఆయనకు గౌరవం ఇవ్వనిదెప్పుడు...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఆనంకు ఉన్న సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని, ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.

aanam 21062018 2

‘నేను కూడా పత్రికల్లో చూశాను. ఆయన ఎందుకలా అనుకుంటున్నారు? ఆయనకు ఎక్కడ గౌరవం ఇవ్వలేదో నాకు అర్థం కావడం లేదు. ఆయన సీనియారిటీని గౌరవించి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చాం. ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలనుకొన్నాను. కానీ అదే సమయంలో ఆనం వివేకానందరెడ్డి కూడా నన్ను కలిసి తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని కోరారు. ఇద్దరూ అడగడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వచ్చింది. అందుకే ఇవ్వలేకపోయాను. ’ అని సీఎం వారికి వివరించారు. అయినా, ఆయనకు నేను ఎక్కడా గౌరవం ఇవ్వకుండా లేనని, మన దగ్గరే గౌరవం లేదు అంటుంటే, జగన్ దగ్గరకు వెళ్తే, ఎలాంటి గౌరవం ఇస్తారో అందరికీ తెలిసిందే అంటూ, సియం అన్నారు.

aanam 21062018 3

ఇదే సమయంలో తాను టీడీపీలోనే కొనసాగుతానని ఆనం సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి చంద్రబాబుకు స్పష్టం చేశారు. పార్టీని వీడటానికి రామనారాయణరెడ్డి చెబుతున్న కారణాలు తనకు కూడా సబబుగా అనిపించలేదని... అందుకే టీడీపీలోనే ఉండిపోవాలనే నిర్ణయానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా జయకుమార్ రెడ్డిని చంద్రబాబు అభినందించారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని, ఎవరూ ఏది మనసులో పెట్టుకోకుండా, పని చెయ్యాలని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా, నాతో చెప్తే, తగు చర్యలు తీసుకుంటామని, ప్రజల మన్ననలు పొందితే చాలని చంద్రబాబు అన్నారు. ఈ సమావేశంలో మంత్రి అమర్ నాథ్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ లు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read