విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఆయన పేరు చెప్తే, ముందుగా గుర్తుకు వచ్చేవి సర్వే ఫలితాలు... ఆయన ఏదన్నా సర్వే చేసారు అంటే, అది నిజం అయ్యి తీరుతుంది అని అనేక సార్లు రుజువు అయ్యింది. అందుకే సోషల్ మీడియాలో అన్ని పార్టీల వారు, లగడపాటి సర్వే అంటూ, రాస్తూ ఉంటారు. అయితే వీటిని అనేకసార్లు ఖండించారు లగడపాటి. నేను ఏదైనా సర్వే చేస్తే, మీడియా ముందుకు వచ్చి చెప్తా అని, ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దు అని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ లగడపాటి సర్వే అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. రాజగోపాల్‌ ఓ వారం కిందట ముఖ్యమంత్రి చంద్రబాబును వెలగపూడి సచివాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా, లగడపాటి సర్వే రిజల్ట్స్ ఇవ్వటానికి చంద్రబాబు వద్దకు వచ్చారనే పుకార్లు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే, లగడపాటి సర్వే వివరాలు ఇవ్వలేదు అని, కొన్ని సూచనలు చేసారని సియం పేషీ నుంచి వార్తలు వస్తున్నాయి.

lagadapati 14062018 2

రాష్ట్రంలో టీడీపీకి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నది టీడీపీ క్యాడర్‌ నమ్మకమని ..ఇదే అంశం జనంలోకి కూడా వెళ్లిందని చెప్పినట్లు తెలిసింది.. పార్టీని రక్షించుకోవాలని.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే పార్టీ క్యాడర్‌ మహానాడుకు తరలివచ్చిందని లగడపాటి విశ్లేషించారట.. రాజధాని అమరావతి...పోలవరం నిర్మాణాలను పూర్తి చేయాలంటే చంద్రబాబు మరోసారి అధికారం చేపట్టాలన్న భావన ప్రజల్లో క్రమేణా వస్తున్నదని లగడపాటి ప్రైవేట్ చర్చల్లో చెబుతున్నారు... అయితే తెలుగదేశం పార్టీ ప్రజాప్రతినిధులపై కొన్ని ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించే విధంగా తెలుగుదేశం పనిచేయాల్సి ఉంటుందని, చంద్రబాబుపై ఉన్న సానుభూతి, రాష్ర్టం బాగుపడాలనే సెంటిమెంట్ ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతను అధిగమిస్తుందని లగడపాటి విశ్లేషిస్తున్నట్లు తెలిసింది.

lagadapati 14062018 3

ఈ సారి ఓట్లు, కులాల పోలరైజేషన్ ఎక్కువగా ఉంటుందని, బీజేపీ పై పెరుగుతున్న వ్యతిరేకత చంద్రబాబుకు అనుకూలంగా మారుతుందని పరిశీలకులు చెబుతున్నారు. పట్టణాల్లో తెలుగదేశంపార్టీకి బాగున్నప్పటికీ, పల్లెల్లో మాత్రం కొంత డల్‌గా ఉందని, ఇప్పుడిప్పుడే పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని, రోడ్లు, డ్రైనేజిలో, వ్యవసాయానికి నీరు, ఇవన్నీ పల్లెల్లో ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని, ఇలాగే పాజిటివ్ ఫీల్ కంటిన్యూ అయితే, పల్లెల్లో కూడా సంపూర్ణంగా తెలుగుదేశం వైపు మొగ్గే అవకాసం ఉంటుంది అని, అదే సమయంలో కులాల మధ్య కుంపట్లు పెట్టే కుట్రను జాగ్రత్తగా ఎదుర్కోవాలని, లగడపాటి, చంద్రబాబుకు చెప్పారని సమాచారం..

మొన్నటి వరకు బహిరంగ వేదికల పై, మీడియా ముఖంగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ చేసిన అన్యాయాన్ని నిలదీసిన చంద్రబాబు, ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సాక్షిగా, నిలదీయటానికి రెడీ అవ్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కేంద్రం చేసిన అన్యాయంపై నీ తి ఆయోగ్‌ సమావేశంలో నిలదీయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రానికి వివిధ కేంద్ర పథకాల కింద వచ్చిన నిధులు.. వాటిలో జరిగిన అన్యాయం.. వ్యవసాయం, విద్య, వైద్య తదితర రం గాల్లో కేంద్రం చేసిన సాయం తదితర వివ రాలన్నీ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రధాని మోదీ, అ న్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం ఈ నెల 16న ఢిల్లీలో జరగనుంది. అయితే అదే రోజు రంజాన్ కావటంతో, తేదీ మార్చమని ఇప్పటికే చంద్రబాబు కోరినా, కేంద్రం నుంచి స్పందన లేదు.

modi 14062018 2

ఈ సమావేశంలో రాష్ట్రం తరపున ఏయే అంశాలు లేవనెత్తాలన్న దానిపై చంద్రబాబు బుధవారమిక్కడ సచివాలయంలో ఉన్నతాధికారులు, కొందరు శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కేంద్రం నుంచి వైదొలగిన అనంతరం ప్రధాని మోదీకి చంద్రబాబు ఎదురుపడనున్న సమావేశం ఇదే. నీతి ఆయోగ్‌ రాజ్యాంగబద్ధ సంస్థ అని, కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీకి దాన్ని ఏర్పాటు చేశారని, దానిపై కేంద్రం పెత్తనం తగదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేస్తారని సమాచారం. రాష్ట్రాలకు పన్నుల ఆదాయాన్ని నీతి ఆయోగ్‌ స్వతంత్రంగా పంపిణీ చేయాలని, కానీ కేంద్రమే నిబంధనలు విధించి దానిప్రకారమే చేయాలని చెప్పడాన్ని ఆయన తప్పుబడతారు.

modi 14062018 3

1971 జనాభా లెక్కలను కాకుండా, తాజా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు న ష్టం జరుగుతుందని స్పష్టం చేస్తారు. జనాభా ని యంత్రణను సమర్థంగా అమలుచేసి, బాగా పని చేసిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని గట్టిగా చెబుతారు. విభజన అంశాలు, కేంద్ర ప్రాజెక్టులకు అందిస్తున్న నిధులతో నివేదిక అందించాలని, అవసరమైన జిల్లాలకు ప్రత్యేక సహాయం అందుతున్న తీరుపై నీతి ఆయోగ్ చర్చనీయాంశాల్లో ఉందని, అందువల్ల సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. నీతి ఆయోగ్ గత సమావేశపు కార్యప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుకు కేంద్రం నుంచి ఏమేరకు సహకారం అందుతుందో తనకు సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు ఏమేరకు వినియోగించాం, ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాలి? అనే వివరాలను, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలు జరుగుతున్న కేంద్రపథకాల తాజా స్థితిని చంద్రబాబు సమీక్షించారు.

కేంద్రం కోర్ట్ లో మరో కీలక ప్రాజెక్ట్ ఉంది.. గన్నవరంలో నిర్మించే హెచ్‌సిఎల్ కంపెనీకి అనుమతి ఇప్పుడు కేంద్రం చేతిలో... మరి కేంద్రం ఏమి చేస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ వద్ద రూ. 408.48 కోట్లతో నెలకొల్పనున్న ప్రత్యేక ఆర్థిక మండలికి (సెజ్) అనుమతి ఇవ్వాలని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కేంద్రాన్ని కోరింది. ఇక్కడ ఐటి, ఐటి ఆధారిత సేవల సంస్థలను నెలకొల్పేందుకు సెజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌సిఎల్ పేర్కొంది. ఈ ప్రతిపాదనను వాణిజ్య శాఖ పరిశీలిస్తోంది. ఈ నెల 1వ తేదీన వాణిజ్య అంతరంగిక బోర్డు సమావేశమవుతోంది. ఈ బోర్డు సమావేశానికి వాణిజ్య శాఖ కార్యదర్శి రీతా టియోటియా అధ్యక్షత వహిస్తారు. సుమారు 10.43 హెక్టార్లలో సెజ్‌ను ఏర్పాటు చేయాలని హెచ్‌సిఎల్ ప్రతిపాదనలు సమర్పించింది.

hcl 14062018 2

హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చెందిన 27 ఎకరాల్లో ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ చెట్ల తొలగింపు, నేల చదును పనులను సంస్థ ముమ్మరం చేసింది. ఈ పనులు ఒక కొలిక్కి రాగానే సెజ్‌లో భాగంగా ప్రాజెక్టును ఏర్పాటకు, కేంద్రానికి దరఖాస్తు చేస్తుకుంది. టవర్‌ నిర్మాణ పనులు పూర్తి కావటానికి ఎంత లేదన్నా ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆగకుండా తక్షణం కార్యకలాపాలు ప్రారంభించటానికి వీలుగా హెచ్‌సీఎల్‌ సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. ఒక వైపు టవర్‌ నిర్మాణ పనులతో పాటే మరోవైపు ‘మేథ’ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది.

hcl 14062018 3

కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి.. దాదాపు వెయ్య మంది వరకు, ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాసం ఉంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్‌ ప్రణాలికలు రూపొందిస్తుంది... మరి ఇప్పుడు కేంద్రం చేతిలో ఉన్న ఈ సెజ్ అప్రూవల్, వస్తుందో లేదో అన్న టెన్షన్ తో ప్రభుత్వం ఉంది.

ఏపీ ఎన్ఆర్టీ కృషి ఫలించింది. ప్రవాసాంధ్రులు ఎంతగానో ఎదరు చూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతోంది. రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించే ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌’ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. 33 అంతస్తుల ఈ టవర్‌ను ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ నిర్మిస్తోంది. పూర్తిగా ప్రవాసాంధ్రుల పెట్టుబడితో, వారి కోసమే నిర్మిస్తున్న టవర్‌ ఇది. రాయపూడి సమీపంలో నిర్మించే ఈ భవనం ముందు ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ 40 దేశాలకు చెందిన జాతీయ పతాకాలతో ఒక పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్‌ శాశ్వతంగా ఉంటుంది.

apnrt tower 14062018 2

9 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో 50 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ భవనం ఆకృతుల్ని కొరియాకు చెందిన స్పేస్‌ గ్రూప్‌ సంస్థ ఇప్పటికే రూపొందించింది. అమరావతిని ప్రతిబింబించేలా ఆంగ్ల అక్షరం ‘ఎ’ ఆకారంలో ఆకృతి ఉంటుంది. రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసిన గ్లోబ్‌లో రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ ఉంటుంది. 120 దేశాల్లోని ప్రవాసాంధ్రుల ఉనికికి చిహ్నంగా గ్లోబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవికుమార్‌ వేమూరు తెలిపారు. ఈ భవనంలో 8 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుందని, 100 కంపెనీల ఏర్పాటుకు వీలుంటుందని వెల్లడించారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

apnrt tower 14062018 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఏపీ అభివృద్ధికి పాటు పడుతున్న ఎన్ఆర్టీ.. నూతన రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ నిర్మించాలని దాదాపు రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే కొన్ని అడ్డకుంలు ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో వాటిని అధిగమించి ఇప్పుడు ఐకానిక్ టవర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. విదేశీ హంగులతో, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోయే ఈ ఐకానిక్ టవర్ అమరావతికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Advertisements

Latest Articles

Most Read