అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియ కార్ల తయారీ పరిశ్రమ యమ స్పీడుగా రూపుదిద్దుకొంటోంది. 2019లో కార్లను ఉత్పత్తి చేసి, రోడ్డెక్కించడం లక్ష్యంగా పనులు పరుగులు తీస్తున్నాయి. శంకుస్థాపన జరుపుకొన్న ఈ రెండు నెలల్లోనే 30 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇదే ఊపు కొనసాగితే, వచ్చే ఏడాది మార్చి నాటికి పరిశ్రమ సిద్ధం అవుతుంది. రూ.13,500 కోట్లు పెట్టుబడితో ఇక్కడ భారీ కార్ల పరిశ్రమకు ‘కియ’ శ్రీకారం చుట్టింది. దీనికిగాను అవసరమైన యంత్ర సామగ్రిని కొరియా నుంచి దిగుమతి చేసుకొంటోంది. ఆ సామగ్రిని తొలుత కృష్ణపట్నం రేవుకు తీసుకొచ్చి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో పరిశ్రమ వద్దకు తరలిస్తున్నారు. ప్రస్తుతం బాడీ బిల్డ్‌షాపు యూనిట్‌, ప్రెస్‌ యూనిట్‌, అసెంబ్లింగ్‌ యూనిట్‌, పెయింటింగ్‌ షాపు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి.

kia 05062018 3

కియా పరిశ్రమలో ఉద్యోగాల కోసం ఈ నెల 10వ తేదీలోగా జిల్లాలో డిప్లమా చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం రాత్రి మంత్రి పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,500 మంది నిరుద్యోగులు మాత్రమే రిజిష్టర్ చేసుకున్నారని, ఇందులో 1,672 మంది మాత్రమే అర్హులుగా ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. తొలిదశలో 900 మంది దాకా డిప్లమో అభ్యర్థులకు శిక్షణలో చేర్చుకునే అవకాశం ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అభ్యర్థులను ఎంపిక చేస్తుందన్నారు.

kia 05062018 2

ఎంపిక పారదర్శకత, ప్రతిభ ఆధారంగా జరుగుతుందన్నారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి కేవలం 60 మంది మాత్రమే దరఖాస్తు చేశారన్నారు. ఎక్కువ మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు ఈ నెల 10వ తేదీ వరకు కలెక్టర్ గడువు పెంచారన్నారు. 18 నుంచి 25 ఏళ్లలోపు వయస్సు కలిగిన డిప్లమా పూర్తి చేసిన యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ తర్వాత కూడా ప్రతిభగల అభ్య రులకు మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కియా ఉద్యోగాలు కోసం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు http://www.kia-motors.in/web/html/india/Careers.jsp

నిత్యం అబద్ధాలతో, గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో పాటు, బీజేపీ నాయకులకు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గట్టి జర్క్ ఇచ్చారు.. మీలా అబద్ధాలు ప్రచారం చెయ్యటం కాదు, కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంభకోణం త్వరలో వెలుగులోకి రాబోతోందన్నారు. నెల రోజుల్లోనే అన్ని ఆధారాలతో దాన్ని బయట పెడతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీకి దగ్గరగా ఉండే వ్యాపార సంస్థకు లబ్ధి చేకూర్చారన్న అంశం ప్రకంపనలు సృష్టించబోతోందన్నారు. గుర్తు పెట్టుకోండి.. కచ్చితంగా ప్రకంపనలు పుట్టిస్తాం అని భాజపా నేతలను హెచ్చరించారు. కేంద్రం చేసిన కుంభకోణంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామన్నారు.

gvl 05062018 2

ఏపీ విషయంలో బీజేపీ నేతలు చెబుతున్న మాటలకు, వాస్తవంలో జరుగుతున్న పనులకు సంబంధం లేదని విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తామన్న రాష్ట్రం తీసుకోవడం లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ‘ఏపీకి ఇన్ని నిధులు ఇస్తున్నాం, ఇంత సమకూరుస్తున్నామని కేంద్రం చెబుతోంది గదా! సింపుల్ గా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కేంద్రానికి చెందిన ఐదుగురు అధికారులు, రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అధికారులను నియమించి కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణం పంచనామా చేయమనండి! లెక్క తేలిపోతుంది! ఈ విషయం పై సవాల్‌ విసిరినా జీవీఎల్‌ స్పందించలేదని కుటుంబరావు ఆరోపించారు. కేంద్రం చాలా వివక్ష చూపుతోంది..కక్ష గట్టిందనే మాట వాస్తవం! రాష్ట్రానికి అవసరమైనప్పుడు కేంద్రం నిధులివ్వాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా సరైన సమయంలో నిధులు విడుదల చేయాలి. ఇప్పటికైనా కేంద్రం తేరుకుని.. నిజాలు ప్రజలకు చెప్పాలి’ అని చెప్పుకొచ్చారు.

gvl 05062018 3

2016లో దిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడార్‌కు రూ.495 కోట్లు కేటాయిస్తే.. దేశంలో ఉన్న మిగతా వాటికి కేవలం 4.5 కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. జీవీఎల్‌ సహా భాజపా నేతలెవ్వరూ వార్డు సభ్యులు కూడా కాలేరని విమర్శించారు. తొమ్మిది నెలల్లో అద్భుతంగా భాజపా జాతీయ కార్యాలయాన్ని నిర్మించారని, ఆ స్థాయిలో ఒక్క సంస్థ అయినా నిర్మాణం అయ్యేలా ఏపీకి సహకరించారా? అని నిలదీశారు. పారిశ్రామిక కారిడార్లు, యూసీలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. పీఎంవోలో ఫైల్‌ కదలాలంటే ఆరు నెలల సమయం పడుతోందని ఆరోపించారు. ఎయిర్‌ ఏషియా వ్యవహారంలో 85శాతం పని యూపీఏ-2లో పూర్తయిందని.. ఎయిర్‌ ఏషియా వ్యవహారానికి ఆమోదం తెలిపింది మోదీ కేబినెటేనన్నారు.

నిత్యం తప్పుడు సమాచారాన్ని ఇస్తూ, కేంద్రం ఏపి ప్రజల చెవుల్లో పూలు పెడుతోందని ఆరోపించిన చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్‌, వినూత్నంగా తన చెవుల్లో కాలీఫ్లవర్‌ పెట్టుకుని నిరసన తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్‌, జగన్‌లను ముందు పెట్టుకుని నరేంద్ర మోడీ కుట్రా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి ఎంపీలు మాయ మాటలతో ప్రజలను మోసగిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలపై వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాభివ అద్ధికి అడ్డుపడుతున్న మోదీ, అమిత్‌ షాలను ప్రజలు క్షమించబోరని చెబుతూ ''ఆల్‌ పువ్వులూ ఆర్‌ స్పాన్సర్డ్‌ బై బీజేపీ'' అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు.

sivaprasad 05062018 2

2015 నుంచి రాజీనామాలంటూ వాయిదా వేస్తూ ఇప్పుడు డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చెవిలో పువ్వులు, క్యాలీఫ్లవర్ పెట్టుకుని మరీ ఎంపీ శివప్రసాద్ నిరసన తెలిపారు. కళాకారుడిగా వినూత్నరీతిలో నిరసన తెలిపానని ఎంపీ అన్నారు. మోదీ డైరెక్షన్‌లో వైసీపీ పనిచేస్తోందని ఆరోపించారు. మాయమాటలతో ప్రజలను ఎంతో కాలం మోసగించలేరన్నారు. వైసీపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ అన్నారు.

sivaprasad 05062018 3

పవన్‌, జగన్‌తో కలిసి మోదీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కుటుంబం లేని మోదీకి ప్రజల బాధలు ఏం అర్థమవుతాయని ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్‌ పరిపక్వత లేని నాయకుడని ఎంపీ వ్యాఖ్యానించారు. పవన్‌ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. స్వచ్ఛభారత్ గురించి మోదీ ఉపన్యాసాలు చెబుతారని అసలు మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలోనే శుభ్రత లేదని అన్నారు. జీవితంతో ఒక్కసారైనా చూడాలని ప్రజలు ఆశపడే కాశీలో పరిశుభ్రత మచ్చుకైనా కానరాదని ఎంపీ శివప్రసాద్ విమర్శలు గుప్పించారు.

 

ఉప ఎన్నికలతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చవి చూస్తున్న వరుస ఓటిమిలే కాని... దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా ఏకం అవ్వటమే కాని... ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతే కాని... మొత్తానికి అమిత్ షా, మోడీలు ఇద్దరూ భూమి మీదకు దిగినట్టే ఉన్నారు... మిత్రపక్షాలు అయినా, సొంత పార్టీలో సీనియర్లు అయినా డోంట్ కేర్ అని ఇప్పటి వరకు అహం ప్రదర్శించిన గుజరాత్ బ్రదర్స్, ఎట్టకేలకు వాస్తవాలు గ్రహించినట్టే ఉన్నారు.. అందుకే, దూరం అవుతున్న విపక్షాలను బుజ్జగించటానికి, ఇన్నాళ్ళు దూరం పెట్టిన సీనియర్లను మంచి చేసుకోవాటానికి అమిత్ షా బయలు దేరారు... ఇప్పటికే ‘‘మద్దతు కోసం సంప్రదింపులు’’ పేరుతో అమిత్‌ షా ప్రచారం ప్రారంభించారు. 2019లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునేలా పలువురు కీలక నేతలతో సమావేశమై మద్దతు కోరుతున్నారు.

amtishah 05062018 2

ఇందులో భాగంగానే మోదీ-షా ద్వయంపై ఒంటికాలిపై లేస్తున్న మిత్రపక్షం శివసేనను బుజ్జగించేందుకు బీజేపీ సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రేపు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో సమావేశం కానున్నారు. ఎంతోకాలం నుంచి బీజేపీతో మైత్రీబంధం ఉన్నప్పటికీ... తాజా పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అంటేనే శివసేన భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. శివసేన వ్యాఖ్యలను బీజేపీ ఇప్పటి వరకు సీరియస్‌గా తీసుకోలేదు. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి బలహీనపడుతుండడం.. అదే అదనుగా ప్రతిపక్షాలు జట్టుకడుతుండడంతో అమిత్ షా వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది.

amtishah 05062018 3

2014 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న శివసేన, బీజేపీల మధ్య... ఇటీవల పాల్ఘడ్ ఉపఎన్నికల తర్వాత విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై ప్రతిరోజూ మాటలదాడికి దిగుతున్న శివసేన... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈనేపథ్యంలో అమిత్‌షా- ఉద్ధవ్ థాకరే సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో పక్క, ఓ బెంగాలీ దిన పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్లను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని మోదీ, షా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అద్వానీ నివాసంలో ఆయనను వీరిద్దరూ కలిసినట్లు తెలుస్తోంది. మొన్నా మధ్య, అద్వానీకి కనీసం ప్రతి నమస్కారం కూడా చెయ్యకుండా మోడీ ప్రవర్తించిన తీరు, విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే...

Advertisements

Latest Articles

Most Read