సోషల్ మీడియాలో వికృత ప్రచారం చెయ్యటంలో బీజేపీ ఆరి తెరిందనే విషయం అందరికీ తెలిసిందే... ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మాయ చేసి, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చెయ్యటంలో, బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.. ఇది వారి సక్సెస్ ఫార్ములా అని గర్వంగా చెప్పుకుంటారు కూడా.. ఏమి చెయ్యకపోయినా, ఆహా ఓహో అంటూ, మోడీకి బాకా కొట్టటమే కాదు, వీరికి వ్యతిరేకంగా ఉండే వారి పై వికృతమైన విష ప్రచారం చేస్తారు.. వారిని ముందుగా హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తారు.. తరువాత, వారి పై విషం చిమ్ముతారు.. ఇలాంటి సంఘటనే కర్ణాటక డీజీపీ విషయంలో జరిగింది.. కుమార స్వామి ప్రమాణస్వీకారం సందర్భంలో, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. ఆమె ఆ విషయం పై కర్ణాటక డీజేపీ పై అసహనం వ్యక్తం చేసారు...

bjp 27052018 2

ఇక ఇలాంటి విషయాలు కోసమే చూస్తున్న బీజేపీ, ఈ అంశం పై విష ప్రచారం మొదలు పెట్టింది.. మమత ఒత్తిడి మేరకు, డీజీపీ నీలమణి రాజును, కుమారస్వామి బదిలీ చేసారు అంటూ, విష ప్రచారం చేసింది బీజేపీ... పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ నాలుగు అడుగులు కూడా వెయ్యలేరా ? ఆమెకు అంత అహంకారామా అంటూ ప్రచారం చేసింది. ఈ విషయం నిజమే అనుకుని, ఎంతో మంది మమతను తిట్టారు. కాని ఆ ప్రచారం వాస్తవం కాదు. రాష్ట్ర డీజీపీ నీలమణి రాజును బదిలీ చేసినట్లు వెలువడ్డ వదంతులను కర్ణాటక హోంశాఖ తీవ్రంగా ఖండించింది. నీలమణి రాజు బదిలీ కాలేదని, అదంతా వట్టిదేనని హోంశాఖ పేర్కొంది.

bjp 27052018 3

రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా నీలమణి రాజు 2017 నవంబరులో బాధ్యతలు చేపట్టారు. 2020 జనవరి 31న ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. డీజీపీని రెండేళ్ల వరకు బదిలీ చేయకూదని నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసినా, బీజేపీ బ్యాచ్ ఇలా ప్రచారం చేసి, ఇది నిజం అని నమ్మించింది.. ఇప్పటికే బీజేపీ ఇలాంటి ప్రచారం మన రాష్ట్రంలో కూడా మొదలు పెట్టింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తిరుమల వివాదం.. ఏమి లేని సమస్యను, సమస్య ఉన్నట్టు సృష్టించి, సాక్షాత్తు వెంకన్నతోనే ఆటలు ఆడుతున్నారు.. ఇలాంటి విష ప్రచారాలు ఇంకా ఎన్నో బీజేపీ నుంచి వస్తాయి.. వీరికి వైసిపీ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, జనసేన చింతలబస్తీ బ్యాచ్ తోడు.. అందరూ కలిసి, రాష్ట్రాన్ని నాశనం చేసే పనిలో ఉన్నారు.. కులాల మధ్య గొడవలు పెట్టే పనిలో ఉన్నారు.. దేశ ప్రజలనే పిచ్చోల్లని చేసి, ఈ బీజేపీ బ్యాచ్ ఆడుకుంటుంది... మన రాష్ట్రంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం..

చంద్రబాబు ఒక సీక్రెట్ సర్వే చేపిస్తున్నారు.. దీని కోసం గూఢచార శాఖ రంగంలోకి దిగింది.. ఒక పక్క ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు జరుగుతూ ఉన్నా, స్వయంగా గ్రౌండ్ లెవెల్ సర్వే ఒకటి చేపిస్తున్నారు చంద్రబాబు. ప్రజల మూడ్ ఎలా ఉంది ? ప్రభుత్వం పై ఎలాంటి అబిప్రాయం ఉంది ? లోపాలు ఏంటి ? జగన్ వైపు ఎంత మంది వెళ్తున్నారు ? పవన్ ప్రభావం ఉంటుందా ? తదితర విషయాలను తెలుసుకుని పక్కా లెక్కకు వచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. బూత్‌ల వారీ కొందరిని ఎంపిక చేసి, వారి సెల్‌నెంబర్‌లను ఇచ్చి వారి నుంచే సర్వే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని నిర్దేశించింది. దీంతో రంగంలోకి దిగిన గూఢచార శాఖ సిబ్బంది ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. అందుకు అనుగుణంగా నియోకవర్గాల వారీ సంపూర్ణ నివేదికలు కూడా సిద్ధమవుతున్నాయి.

cbn 27052018 2

మొన్నటి దాక ఐవీఆర్‌ఎస్‌ సర్వేల్లో, పార్టీ వ్యవహారాలపై ఐవీఆర్‌ఎస్‌ సర్వేలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల వారీ గుర్తించిన పార్టీ నాయకులు, సీనియర్‌ కార్యకర్తల ద్వారా ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలుసుకునేందు కు ఇటీవల ఆయన సర్వేలు చేయించారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీగా ఒక సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడవుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ సర్వేల, వారి ఎంపిక విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని సామాజిక వర్గాలు, అన్ని వయస్సుల వారు అలాగే అన్ని రంగాలకు చెందిన వారు ఉండే విధంగా ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఆ యా నియోజకవర్గాల వారీ పార్టీ ఎమ్మెల్యే, ఇన్‌చార్జి పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా గమనించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పక్షం పరిస్థితి, నాయకులపై ఉన్న అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

cbn 27052018 3

దీంతో గూఢచార శాఖ సిబ్బంది ఆయా నియోజకవర్గాల వారీ ప్రజల మొగ్గు టీడీపీకి ఏ స్థాయిలో ఉంది, వైసీపీకి ఎంత ఉంది? జనసేన ప్రభావం ఉండబోతుం దా? తదితర అంశాలను క్రోడీకరిస్తూ నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సర్వేని అత్యంత రహస్యంగా నిర్వహిస్తుండగా, వివిధ రూపాల్లో క్రమేపీ వ్యవహారం బయటకు పొక్కింది. టిడిపి నాయకుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు అవ్వక్కయ్యారు. చంద్రబాబు ఎంతో పకడ్బందీగా సర్వే చేపిస్తున్నారని తెలుసుకుని, ఆ సర్వే సమాచారం తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సర్వేని బట్టే తరువాత ఎన్నికల్లో టికెట్లు తదితర అంశాలు ముడిపడి ఉండటంతో, ఈ సర్వే ఫలితాల పై అందరికీ ఆసక్తి నెలకొంది..

గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు నేతృత్వంలో 1986లో విజయవాడ వేదికగా నేషనల్ ఫ్రంట్ అంకురార్పణ జరిగిన నేపథ్యంలో, మరోసారి ఇదే వేదికగా జరుగుతున్న మహానాడు ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని ప్రాంతీయ పార్టీలను, జాతీయ రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆనాడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం, మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ వేదిక ఒక కొత్త ఫ్రంట్ కు అంకుర్పారణ కానుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లకు ప్రత్యామన్యాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారు. తాజాగా జరిగిన తెలంగాణ మహానాడులో జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన సరికొత్త చర్చకు దారితీయడమే కాకుండా, జాతీయ రాజకీయాలపై ఒక స్పష్టత వచ్చింది.

cbn 27052018 2

గతంలో విజయవాడ నుంచి జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ చక్రం తిప్పగా, ఆదే స్పూర్తితో చంద్రబాబునాయడు మరోసారి జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో కీలక పాత్రపోషించడానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి వాజీపేయి, దేవగౌడలను ప్రధాన మంత్రులు చేసిన అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు, మరోసారి తన సత్తాను చాటుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో బీజీపీ మరోసారి అధికారంలోకి రాకుండా చూసేందుకు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. భాజపాను ఏకాకిని చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశకు అండగా నిలుస్తారనే భావంతో భాజపాతో జతకట్టిన చంద్రబాబుకు చివరకు ఆశభంగమే ఎదురైంది.

cbn 27052018 3

విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల అమలు విషయంలో తాత్సారం చేయడంతో పాటు, రాష్ట్రానికి రావాల్సిన న్యాయబద్దమైన నిధుల విడుదలలో కూడా కేంద్ర మొండి వైఖరి వ్యవహరిస్తుందంటూ ఇప్పటికే బిజెపి ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. నాలుగేళ్లగా విభజన చట్టంలో పొందుపరిచన అంశాలను అమలు చేయాలని కోరుతూ 20 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రధాని మోడీ పెడచెవిన పెట్టారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి బాసటగా నిలుస్తామని చెప్పి, మోసం చేయడమే కాకుండా తెదేపా పై ఎదురుదాడికి తెగబడటంతో ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా, మిత్రబంధాన్ని సైతం వదులుకున్నారు. ఆనాటి నుంచి రాష్ట్రాల హక్కులు, నిధుల విషయంలో స్వరాన్ని పెంచడంతో పాటు కేంద్రం పై విమర్శనాస్త్రాలను సంధిస్తువస్తున్నారు.

అయితే నాలుగేళ్లు గడిచిన మిత్ర ధర్మం పాటించని భాజపాపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో రాష్ట్రంలో ధర్మపోరాట దీక్షలు చేపట్టడంతో పాటు సభలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వస్తున్నారు. మరోవైపు తాజాగా జరిగిన కర్నాటక ఎన్నికల్లో సైతం అక్కడ సిరపడిన తెలుగువారిని బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చి, జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశారు. అక్కడి తెలుగువారు కూడా సానుకూలంగా స్పందించి బీజేపీ అభ్యర్థులను మట్టికరిపించి ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయం పై తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అన్ని ప్రాంతీయ పార్టీల దృష్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పై పడింది. దీనిని ఒక అవకాశంగా భావించిన చంద్రబాబు వారందరిని ఒకే వేదిక పై తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,తృణముల్ పార్టీ అధినేత మమతబేనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్తో ఈ దిశగా చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న మహానాడులో జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించాల్సిన తీరు పై సవివరంగా చర్చించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబునాయుడు ఆ మహానాడు వేదికగా ప్రకటించనున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించనున్నదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రారంభోన్యాసం చేశారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. విభజన హామీలు నేరవేర్చమంటే, మన రాష్ట్రం పై ఇంత కుట్ర చేస్తున్నారని చెప్పారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆభరణాల అంశంలో కొనసాగుతున్న వివాదం వెనుక భాజపా కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు భాజపా తెరవెనుకు కుట్ర పన్నుతోందన్నారు. తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నించిందని... ప్రజా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గి నాలుక కరుచుకుందని తెలిపారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవరైనా మట్టి కరవాల్సిందేనని అన్నారు.

cbn 27052018 2

బీజేపీ ప్రభుత్వంలో మాటలు ఎక్కువ.. పనులు తక్కువ అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమే అని ఎద్దేవా చేశారు. మోదీ పథకాలతో ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే నోట్ల రద్దుకు మద్దతు పలికామని, కానీ ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగే దౌర్భాగ్యం దాపురించిందని చంద్రబాబు అన్నారు. జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడిందన్నారు. ప్రధాని మోదీ చర్యలతో పాలన గాడి తప్పిందని విరుచుకుపడ్డారు.

cbn 27052018 3

దేశంలో బీజేపీ కలుషిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తూ ఆడియో టేపుల ద్వారా అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. విలువల గురించి బీజేపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడులో శశికళకు పట్టిన గతి పడుతుందని విపక్షనేతకు భయమని... అందుకే హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. దిగజారి పోయి, తిరుమల పై కుట్రలు పన్నుతున్నారని, వెంకన్న జోలికి వస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read