"ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సన్ రైజ్ స్టేట్ కాదు, సన్ షైన్ స్టేట్... ప్రపంచం భారత వైపు చూస్తుంటే... భారతకు వచ్చిన వారు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడాలి! అపార వనరులు, వ్యాపార నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఉన్న నవ్యాంధ్రకు రండి! పెట్టుబడులు పెట్టండి!"... ఇది వివిధ సందర్భాలో పారిశ్రామిక వర్గాలకు చంద్రబాబు ఇచ్చిన మెసేజ్... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు విశ్లేషించుకుని, ముఖ్యమంత్రి పరిపాలనా దక్షత, మన రాష్ట్ర పాలసీలు నచ్చి, గత ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల పంట పండింది...అయితే ఈ సమ్మిట్ల పై జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లాంటి విపక్ష నేతలు ఎంతో అవహేళనగా మాట్లాడటం చూసాం.. ఇప్పుడు విశాఖ భాగస్వామ్య సదస్సు ఫలితాలు కనిపిస్తున్నాయి.

cii 25052018 2

మొదటిదశలో 18 సంస్థలతో రూ.2955.52 కోట్ల పెట్టుబడులు పెట్టటానికి కంపనీలు రెడీ అయ్యాయి. డీపీఆర్‌ అందించిన వీరికి, సింగలి విండో పోర్టల్ ద్వారా తదుపరి అనుమాతలు ఇస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్య మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో దేశ, విదేశాలకు చెందిన వివిధ పారిశ్రామిక సంస్థలు పలు రంగాల్లో రూ.4.39 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో పరిశ్రామిక రంగంలో చేసిన ఒప్పందాలు సాకారమయ్యేలా గత రెండు నెలలుగా అధికారులు యత్నిస్తున్నారు. 60 పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి మూడు విడతలుగా నిర్వహించిన సమావేశాలకు 40 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

cii 25052018 3

మొదటి విడతగా 18 సంస్థలతో పెట్టుబడులు పెట్టించేలా రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), విద్యుత్తు, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ), కర్మాగారాల, పరిశ్రమలశాఖల నుంచి తదుపరి అనుమతులిచ్చేలా ఉన్నత స్థాయి సమావేశం ఆదేశాలిచ్చింది. మొదటి విడతలో ముందుకొచ్చిన సంస్థల్లో అత్యధికం విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఏపీఐఐసీ తరఫున వీరందరికీ స్థలాల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పెట్టుబడుదారుల్లో కొందరు పారిశ్రామికవాడల్లో భూములు, స్థలాలను పరిశీలించాయి.

పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర అంటూ మొదలు పెట్టిన దగ్గర నుంచి అన్నీ కన్ఫ్యూషనే... ముందుగా తిరుపతి వచ్చారు... ఎప్పుడు ఎక్కడ బస్సు యాత్ర మొదలు పెడతారో సస్పెన్స్... చివరకు విశాఖలో తేలారు... అక్కడ విషయం అయితే చింతలబస్తీ దేవ్ బ్యాచ్ హడావిడి అంతా ఇంతా కాదు.. మా పవన్ ఉండే బాత్ రూమ్ చూసారా అంటూ, అవి కూడా పుబ్లిసిటీకి వాడుకున్నారు.. పవన్ ఇలాంటి చోటే బస చేస్తారు అని చెప్పారు.. తీరా చూస్తే గత నాలుగు రోజులు నుంచి, శ్రీకాకుళంలో ఒక పెద్ద రిసార్ట్ లో బస చేసారు.. యాత్ర మొదలు అయ్యింది.. బస్సు యాత్ర కాస్త, కార్ యాత్ర అయ్యింది.. ఎటు నుంచి, ఎటు వెళ్తుందో తెలియదు... మొత్తానికి మూడు రోజులు అలా పూర్తి చేసి, గత రెండు రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు... రెస్ట్ అంటే పవన్ కు రెస్ట్ కాదండి, అలా అంటే వారికి కోపం వస్తుంది.. పవన్ చాలా ఫిట్ గా ఉన్నారు, ఆయన పక్కన ఉండే బౌన్సర్లకు ఫిట్ నెస్ లేక, గాయాలు అయ్యాయి...

pk 25052018 2

వారికి గాయాలు అయ్యాయి అని, అందుకే కొత్త వారు వచ్చే దాకా రెస్ట్ అన్నారు... రెండో రోజు ఏమో, ఆ గాయాలు అయినవారి పరిస్థితి ఇంకా బాగు పడలేదు అందుకే, రెండో రోజు కూడా రెస్ట్ అన్నారు.. అదేంటి కొత్త వారు వస్తున్నారు అన్నారు కదా అంటే, అటు నుంచి సమాధానం లేదు, ఇక్కడ కూడా కన్ఫ్యూషన్... సరే, రెండో రోజు ఇవాల్టితో ముగిస్తుంది అనగా, సడన్ గా 24 గంటలు దీక్ష అని ప్రెస్ నోట్ ఇచ్చారు.. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి, రేపు సాయంత్రం 5 గంటల వరకు, ఉద్దనం సమస్య పై, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిరసనగా, దీక్ష చేస్తున్నారని, చెప్పారు.. సరే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఏదైనా సమస్య పై ఒత్తిడి తెస్తే అందరికీ మంచిందే... అక్కడ ప్రభుత్వం, మేము ఎన్నో చేసాం అంటూ, ఎంత చెప్తున్నా, పవన్ మాత్రం వినిపించుకోకుండా, దీక్ష చేస్తున్నారు... సరి ఇక్కడ దాకా ఎవరూ తప్పు బట్టటానికి లేదు...

pk 25052018 3

అసలు సమస్య ఎక్కడ వచ్చింది అంటే, పవన్ దీక్ష చేస్తున్న విధానం పై వచ్చింది.. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి, రేపు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ రిసార్ట్ లోనే దీక్ష చేస్తారని, ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.. సరే, దీక్ష అంటే, జనాల మధ్య ఉంటుంది కదా అనుకున్నారు... కాని, ఎవరికీ ఎంట్రీ లేదు.. కనీసం మీడియాకు కూడా... మీడియా అదేమిటి అని అడిగితే, మేమే వీడియో తీసి కొన్ని బైట్స్ పంపిస్తాము అని చెప్పారు... అచ్చం సినిమా షూటింగ్ లాగా అన్న మాట.. ఇది అయిపోయిన తరువాత, రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ హాఫ్ మాత్రం ప్రజల మధ్యలో ఉంటుంది అని చెప్పారు.. మొత్తానికి రిసార్ట్ దీక్ష అనే కొత్త కాన్సెప్ట్ తో, ప్రభుత్వం మెడలు వంచటానికి, రిసార్ట్ నుంచే కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు...

అసలు సర్కారీ బడి అంటే ఎలా ఉంటుంది...మొండిగోడలు...పెచ్చులూడే భవనాలు...అరకొర సదుపాయాలు...వసతుల లేమి...ఉపాధ్యాయుల లేమి...ఇవీ సాధారణంగా ఏ ప్రభుత్వ పాఠశాలను చూసినా కనిపించే సమస్యలు...కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలు నెమ్మదిగా, సకల సౌకర్యాలతో...సమస్త సదుపాయాలతో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలుగా మారుతున్నాయి... ఇప్పటికే డిజిటల్ తరగతులతో ఒక విప్లవం సృష్టించిన ప్రభుత్వం, ఆ ఫలితాలతో, పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా కూడా చేస్తుంది.. దీంతో సామాన్య ప్రజలకు కూడా ప్రైవేటు స్కూల్స్ కాకుండా, మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ వైపు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. ప్రైవేటు స్కూల్స్ దీటుగా, మేము కూడా చదువు చెప్తున్నాం అంటూ, ప్రభుత్వ స్కూల్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి.

schools 25052018 2

విశాఖపట్నంలో ఒక ఆసక్తికర పరిణామం కనిపించింది. పదో తరిగతి ఫలితాలు వస్తే చాలు, కార్పొరేట్ స్కూల్స్ హడావిడి ఏంటో చూస్తున్నాం... తమ స్టూడెంట్స్ కు జీపీఏ వివరాలతో ప్రచారాన్ని హోరేత్తిస్తారు.. అయితే ఇప్పుడు, మంచి ఫలితాలు సాధించిన ప్రభుత్వ స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్ తరహాలోనే ప్రచారాన్ని చేస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలో తమ విద్యార్ధులు సాధించిన జీపీఏ వివరాలతో విశాఖపట్నంలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యాజమాన్యం ఒక పెద్ద ఫ్లెక్షి ఏర్పాటు చేసింది.. ఇది చూసిన ప్రజలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోతున్నారు...

schools 25052018 3

అలాగే కాజులూరులో కూడా, ఒక మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల ఎదురుగా, ప్రభుత్వ స్కూల్స్ లో చేర్చమంటూ ఉన్న ఫ్లెక్షి ఆకట్టుకుంటుంది. ఆ గట్టునేమో, ఇరవై వేల ఖర్చు అంటూ, ప్రైవేటు స్కూల్స్ లో అయ్యే ఖర్చు అంతా వేస్తూ, మరో పక్క, ఈ గట్టునెమో నాణ్యమైన విద్య అంటూ, ప్రభుత్వ స్కూల్స్ లో అన్నీ ఫ్రీ గా ఇస్తారు, నాణ్యమైన విద్య కూడా ఉంటుంది అంటూ, వేసిన ఫ్లెక్స్ కూడా ఆకట్టుకుంది. ఒక పధ్ధతి ప్రకారం, గత రెండేళ్లుగా ప్రభుత్వం, గోవేర్నేమేంట్ స్కూల్స్ విషయంలో చాలా మార్పులు తీసుకువస్తుంది. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాసులు, సమస్త సదుపాయాలతో, ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా తీర్చి దిద్దితూ, గాడిన పెడుతూ, మంచి ఫలితాలు సాధిస్తున్నారు... ఇవన్నీ చూస్తుంటే ఈ మధ్య వచ్చిన సినిమాలో సీన్ గుర్తు వస్తుంది కాదా... అది సినిమా, ఇది చంద్రబాబు పరిపాలన...

కర్ణాటకలో కాంగ్రెస్ ను దించేసి, ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చేసిన పనులు, ఇప్పుడా పార్టీని లోక్ సభలో మైనారిటీలో పడేశాయి. కర్ణాటకలో చేసిన రాజకీయాలతో ఇప్పటికే పరువు పోగొట్టుకున్న ఆ పార్టీ, ఇప్పుడు మరింత ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం బీజేపీ లోక్ సభలో కనీస మెజారిటీకి ఒక్క స్థానం తక్కువలో ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో 282 ఎంపీ సీట్లల్లో గెలిచి సొంతంగా బలమున్నా, భాగస్వామ్య పక్షాలతో కలసి ప్రభుత్వం ప్రారంభించిన బీజేపీ ఎంపీల సంఖ్య ఇప్పుడు 272కు తగ్గపోయింది. మొత్తం 544 మంది సభ్యులుండే లోక్ సభలో సగానికి ఒకటి ఎక్కువగా... అంటే 273 మంది బలముంటే సాధారణ మెజారిటీ ఉన్నట్టు. బీజేపీ ఎంపీలు యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్యలు రాజీనామా చేయగా, ఆ స్థానాలను బీజేపీ కోల్పోవడంతో బీజేపీకి బలం తగ్గడం మొదలైంది.

modi 25052018 2

బీజేపీ ఎంపీల మరణంతో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆపై తమ పార్టీ ఎంపీ కీర్తీ ఆజాద్ ను బీజేపీ సస్పెండ్ చేసి మరో స్థానాన్ని కోల్పోయింది. ఇక ఆ తరువాత 'కర్నాటకం' మొదలైంది. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలయిన యడ్యూరప్ప, శ్రీరాములు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. ఎంపీలుగా ఉంటే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో బల పరీక్షలో పాల్గొనే అవకాశం లేదు. ఇదే సమయంలో సీఎంగానూ ప్రమాణ స్వీకారం కుదరదు. దీంతో యడ్యూరప్ప, శ్రీరాములు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే వాటిని ఆమోదించినట్టు కూడా లీకులు వచ్చాయి. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

modi 25052018 3

బల పరీక్ష అయితే జరగలేదుగానీ, యడ్యూరప్ప సీఎం పదవిని పోగొట్టుకున్నారు. ఇక శ్రీరాములుతో తన రాజీనామాను వెనక్కు తీసుకుంటున్నట్టు లేఖ రాయించాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తనకున్న అధికార బలంతో యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను వెనక్కు తీసుకుంటే, ఎమ్మెల్యేలుగా పనికిరారు. అంటే కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగాలి. ఇప్పటికే మోదీపై ఎంపీల్లో వ్యతిరేకత ఉంది. శతృఘ్నసిన్హా వంటి అసంతృప్తులతో పాటు రిజర్వ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎంపీలు మోదీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా లేరు. పైగా నరేంద్ర మోదీకి 2014లో ఉన్న అనుకూలత ఇప్పుడు లేదు. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా శ్రీరాములు, యడ్యూరప్ప రాజీనామాల వ్యవహారం సాగుతోంది. వారి రాజీనామాలను ఆమోదిస్తే సభలో బీజేపీ బలం 272 మాత్రమే అవుతుంది.

Advertisements

Latest Articles

Most Read